
పామును చూస్తేనే మనం వణికిపోతాం.. తెలిసీ తెలియని వయసులో ఓ చిన్నారి పాముకు చుక్కలు చూపించాడు. పాము తోకను పట్టుకుని దాన్ని ఇంట్లోకి తీసుకువచ్చి అందరినీ భయపెట్టాడు. ఇది చూసి కుటుంబ సభ్యులు భయపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. ఒక బుడతడు ఏకంగా పాముతో ఆడుకున్నాడు. దానిని చేతితో పట్టుకుని ఇంటి లోపలకు తెచ్చేందుకు ప్రయత్నించాడు. అది చూసి కుటుంబ సభ్యులు దడుచుకున్నారు. ఈ క్రమంలో నేలపై కూర్చొన్న వారు ఒక్కసారిగా పైకి లేచి దూరంగా పరిగెత్తారు. గట్టిగా అరుస్తూ భయపడిపోయారు. అలాగే పామును లోపలకు తీసుకురావద్దని, బయటకు తీసుకెళ్లాలంటూ బాలుడికి సైగలు చేస్తూ గట్టిగా అరిచారు.
ఇంతలో ఓ వ్యక్తి ఆ బాలుడి మరో చేయి పట్టుకుని పాముతో సహా అతడిని ఇంటి బయటకు తీసుకెళ్లాడు. దీంతో, ప్రమాదం తప్పింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఈ ఘటనకు ఇంటి పెద్దల నిర్లక్ష్యాన్ని కొందరు విమర్శించారు. జంగిల్ బుక్ విలేజ్ బుక్‌గా మారిందని కామెంట్స్ చేశారు.
ఈ వీడియో చూస్తే ఖంగు తింటారు..
నేడు(జూలై 16న) వరల్డ్ స్నేక్ డే.. ఈ సందర్భంగా పలువురు పాములకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే, ఓ నెటిజన్ షాకింగ్ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోకు తోక పట్టుకుని పామును జడ్జ్ చేయకండి అంటూ కామెంట్స్ పెట్టారు.
Never Judge a snake by it's tail ?
— Jude David (@judedavid21) September 6, 2021
@Pendrive_Baba pic.twitter.com/ytet6ps7bg
ఇది కూడా చదవండి: వివాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య..