
న్యూఢిల్లీ: ఉత్తరభారతానికి భారత వాతావరణశాఖ(ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. జూన్ 23-25 తేదీల మధ్య అధిక ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని తెలిపింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం 40కిపైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది.
పశ్చిమతీరంలో భారీ వర్షాలు పడే అవకాశముందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న నాలుగైదు రోజుల్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర,గోవాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. వెస్ట్‌బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బిహార్‌లలో భారీ వర్షాలతో పాటు బంగాళాఖాతం నుంచి బలమైన గాలులు వీయనున్నాయని వెల్లడించింది.