
రాంచీ: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఎట్టకేలకు విడుదలయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బెయిల్ లభించడంతో దాదాపు అయిదు నెలల శిక్ష అనంతరం శుక్రవారం సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చారు.
కాగా మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ ముక్తిమోర్చ కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన బిర్సా ముండా జైల్లో ఉన్నారు. అరెస్టుకు కొన్ని గంటల ముందే ఆయన నాటకీయ పరిణామాల నడుమ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. నూతన సీఎంగా చంపాయి సోరెన్ బాధ్యతలు చేపట్టారు.