
జమ్మూ: పహల్గాం ఉగ్ర దాడితో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదల ఏరివేతే లక్ష్యంగా కార్యకలాపాల్ని ముమ్మరం చేస్తోంది ఇందులో భాగంగా అనుమానిత ఉగ్రవాదుల స్థావరాల్ని గుర్తించి, బాంబులతో నేలమట్టం చేస్తోంది. శనివారం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ తడ్వా ఇంటిని భద్రతా బలగాలు బాంబులతో ధ్వంసం చేశాయి.
గత మంగళవారం (ఏప్రిల్22న) పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడికి పాల్పడ్డ ముష్కరులు, వారి మద్దతు దారుల్ని గుర్తించే పనిలో పడ్డాయి భారత భద్రతా బలగాలు. పనిలో పనిగా ఉగ్రవాదుల ఇళ్లను, స్థావరాల్ని గుర్తిస్తున్నాయి. ఈ తరుణంలో 48 గంటల నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న కీలక ఆపరేషన్‌లో భారత భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురు ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం కల్పించిన వారి స్థావరాల్ని గుర్తించాయి.

#BREAKING: House of Lashkar-e-Taiba terrorist Farooq Ahmed Tadwa destroyed. Tadwa a resident of Narikoot Kalaroos, Kupwara (North Kashmir) is, now in Pakistan and works with the Pakistan Army to target innocent civilians in Kashmir. pic.twitter.com/O5v4Xnrio5
— Tejinder Singh Sodhi (@TejinderSsodhi) April 26, 2025
పీవోకేలో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ తడ్వా
శనివారం సముద్రమట్టానికి 5,300 మీటర్ల ఎత్తులో ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతమైన కుప్వారా జిల్లా కలరూస్ ప్రాంతాన్ని భద్రతాబలగాలు జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ తడ్వా ఇంటిని గుర్తించాయి. బాంబులతో ధ్వంసం చేశాయి.
60 ప్రాంతాల్లో దాడులు
అటూ శ్రీనగర్‌లోనూ ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం శ్రీనగర్‌లో ఏకకాలంలో 60కి పైగా ప్రాంతాల్లో జమ్మూకశ్మీర్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగ అధికార ప్రతినిధులు వెల్లడించారు. తాము జరిపిన దాడుల్లో వెపన్స్ సీజ్ చేయడం,కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం, డిజిటల్ డివైజ్‌ల గుర్తింపు, దేశ భద్రతకు విఘూతం కలిగించేందుకు వినియోగించే వస్తువుల్ని, వాటి ఆధారాల్ని సేకరించినట్లు చెప్పారు.
అలాంటి వారిని ఉపేక్షించబోం
ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ పోలీసులు ఉగ్రవాదానికి మద్దతిచ్చే అన్నీ వ్యవస్థల్ని గుర్తించి వాటిని నిర్విర్యం చేస్తున్నాం. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వారికి, దేశ భద్రతకు విఘూతం కలిగించే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు.