
న్యూఢిల్లీ: భారత్, ఇండోనేసియాల మధ్యనున్నది కేవలం భౌగోళికరాజకీయం సంబంధం కాదని ప్రధాని మోదీ చెప్పారు. రెండు దేశాలది వేల ఏళ్లుగా పెనవేసుకుపోయిన బంధమని చెప్పారు. రెండు దేశాల భిన్నత్వంలో ఏకత్వమనే సంప్రదాయం కొనసాగుతోందని తెలిపారు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో సనాతన ధర్మ ఆలయంలో ఆదివారం జరిగిన మహా కుంభాభిషేకం సందర్భంగా వర్చువల్‌గా ప్రధాని మోదీ ప్రసంగించారు.
జకార్తాలోని మురుగన్ ఆలయంలో అభిషేక ఉత్సవాల్లో పాలుపంచుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఇండోనేసియా ప్రజలు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. స్కంధ షష్ఠి కవచం ప్రజలను అన్ని వేళలా కాపాడాలని ఆకాంక్షించారు. మురుగన్ ఆలయంలో తిరుప్పుగల్ శ్లోకాలతో పూజలు కొనసాగాలన్నారు. ‘మనమంతా మురుగన్, శ్రీరాముడు, బుద్ధుని సంబం«దీకులమని చెప్పారు.