‘మహువా’ పై వేటు క్రికెట్‌లో ఆ రూల్‌ లాంటిదే: కార్తీ చిదంబరం | Karti Chidambaram Interesting Comments On Mp Mahua Expulsion | Sakshi

‘మహువా’పై వేటు క్రికెట్‌లో ఆ రూల్‌ లాంటిదే: కార్తీ చిదంబరం

Published Sat, Dec 9 2023 7:33 AM | Last Updated on Sat, Dec 9 2023 8:48 AM

Karti Chidambaram Interesting Comments On Mp Mahua Expulsion - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.మహిళా ఎంపీపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఇదే విషయమై కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం ఆసక్తికరంగా స్పందించారు. మహువాను బహిష్కరించడాన్ని క్రికెట్‌లో టైమ్‌ అవుట్‌ పద్ధతితో పోల్చారు.

‘మహువాపై ఒక ఫిర్యాదు వచ్చింది.దీనిపై లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ విచారణ జరిపింది. ఆమెను సభ నుంచి బహిష్కరించాలని కమిటీ నివేదిక ఇచ్చింది. అనంతరం ఆమెను బహిష్కరించారు. ఇదంతా చూస్తుంటే విచారణ ఏదో కంటి తుడుపు చర్యలా కనిపిస్తోంది’ అని కార్తీ వ్యాఖ్యానించారు.

‘రెండువారాల క్రితం వరల్డ్‌ కప్‌ జరిగింది.అందులో ఒక మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మ్యాథ్యూస్‌ను బంగ్లాదేశ్‌ ప్లేయర్‌ షకీబ్‌ టైమ్‌ అవుట్‌ చేశాడు.ఇది ఆట నిబంధనల్లో భాగమే కావచ్చు. కాని దీనిని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఒప్పుకోలేదు. ఆట స్ఫూర్తికి విరుద్ధమని వారంతా అభిప్రాయపడ్డారు. మహువా విషయంలోనూ ఇదే జరిగింది. ఒక ఒంటరి మహిళను అవమానించారు. ఇది ప్రజలు ఒప్పుకోరు. ఆమెను మళ్లీ భారీ మెజారిటీతో లోక్‌సభకు పంపిస్తారు’అని కార్తీ చెప్పారు.

కాగా, పార్లమెంట్‌లో అదానీ గ్రూపుపై ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందాని నుంచి మహువా నగదు, బహుమతులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఏకంగా తన పార్లమెంట్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను హీరానందానికి ఇచ్చారని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే మహువాపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పీకర్‌ ఆమెపై విచారణకు ఎథిక్స్‌ కమిటీకి సిఫారసు చేశారు. విచారణజరిపిన ఎథిక్స్‌ కమిటీ మహువానున లోక్‌సభ నుంచి బహిష్కరించాలని నివేదిక ఇచ్చింది.ఈ సిఫారసును లోక్‌సభ శుక్రవారం వాయిస్‌ ఓట్‌తో ఆమోదించడంతో మహువా సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. 

ఇదీచదవండి..ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement