
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఈ నెల 13న వాషింగ్టన్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారని సోమవారం అధికారులు తెలిపారు. సాధ్యమైనంత త్వరలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన జరిపేందుకు చర్చలు సాగుతున్నాయని విదేశాంగ శాఖ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
ట్రంప్ రెండోసారి అమెరికా పాలనాపగ్గాలు చేపట్టాక ఇది ప్రధాని మోదీ మొట్టమొదటి అమెరికా పర్యటన కానుంది. ఫ్రాన్సులో రెండు రోజుల పర్యటనను ముగించుకుని ఆయన వాషింగ్టన్ వెళతారని చెబుతున్నారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టాక జనవరి 27వ తేదీన ప్రధాని మోదీ ఆయనతో ఫోన్‌లో సంభాషించారు.