
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆంధ్రప్రదేశ్ రానున్నారు. విశాఖపట్నంలోని పూడిమడక వద్ద ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు 8వ తేదీ సాయంత్రం 5.30గంటలకు శంకుస్థాపన చేయనున్నట్టు సోమవారం ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
అలాగే.. రూ.19,500 కోట్లతో విశాఖపట్నంలో చేపట్టనున్న సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం, అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, తిరుపతి జిల్లాలో చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద చేపట్టనున్న కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా (కేఆర్‌ఐఎస్ సిటీ)లకు మోదీ శంకుస్థాపన చేస్తారని ప్రధాని కార్యాలయం పేర్కొంది.