
ఢిల్లీ : వైఎస్సార్‌సీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ ధర్మాసనం విచారణ జరపనుంది.
మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో సీఐడీ నమోదుచేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ మిథున్‌రెడ్డి గత నెలలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్‌పై విచారణ జరిగే సమయంలో ఏపీ సీఐడీ తరుఫు న్యాయవాది మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ హైకోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్‌రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని చెప్పారు. దీంతో, మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ తరుణంలో ఎంపీ మిథున్‌రెడ్డి సుప్రీం కోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.