
సుమారు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యానగరిలోని భవ్యమైన ఆలయంలో రామ్‌లల్లా కొలువయ్యాడు. తాజాగా ఒక ముస్లిం దేశంలోని హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధం అయ్యింది. ఈ నెల ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఆలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో నిర్మితమయ్యింది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 13న అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ప్రవాస భారతీయులు పాల్గొనే ‘హలో మోదీ’ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14న యూఏఈ రాజధాని దుబాయ్‌లోని బీఏపీఎస్‌లో నిర్మితమైన హిందూ దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ప్రధాని మోదీ యూఏఈ పర్యటనపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ ‘హలో మోదీ’ కార్యక్రమానికి వేలాది మంది తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
యూఏఈలోని 150 భారతీయ కమ్యూనిటీ సొసైటీలు సంయుక్తంగా ‘హలో మోదీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. యూఏఈలో మూడేళ్ల వ్యవధిలో ఈ ఆలయాన్ని రాజస్థాన్, గుజరాత్‌లకు చెందినవారు నిర్మించారు. ఫిబ్రవరి 13న షేక్ జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ప్రవాస భారతీయుల సమావేశం నిర్వహించనున్నట్లు యూఏఈ రాయబారి తెలిపారు.
2020 నివేదిక ప్రకారం యూఏఈలో 35 లక్షలమంది ప్రవాస భారతీయులు ఉన్నారు. పురాతన, పాశ్చాత్య శిల్పకళల కలయికతో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు.