
ఢిల్లీ: సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
సోమవారం సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్థివాల, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం విచారించింది. విచారణలో భాగంగా సీఐడీ దర్యాప్తుకు హాజరయ్యామని మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది అభిషేక్ సింగ్వి, నిరంజన్ రెడ్డిలు తెలిపారు.
మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ సిఐడి దాఖలు చేసిన కౌంటర్‌పై.. కౌంటర్‌ను పరిశీలించి రిజైన్డర్ దాఖలు చేసేందుకు మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు సమయం కోరారు.
ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్థివాల, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దని ఆదేశించింది.