నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Published Sun, Apr 27 2025 12:12 AM | Last Updated on Sun, Apr 27 2025 12:12 AM

నిర్మ

నిర్మల్‌

ఎండ.. జాగ్రత్తలే అండ..!
ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరింది. అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. – 08లో

సిరాల పూర్తయ్యేనా..?

సిరాల ప్రాజెక్టు పనుల్లో వేగం కనిపించడం లేదు. రెండేళ్లలో నాలుగు పంటలు కోల్పోయిన ఆయకట్టు రైతులు ఈయేడైనా పంట లు సాగు చేయాలనుకుంటున్నారు.

IIIలోu

ఆదివారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

IIలోu

పశువులకు

ఎల్‌ఎస్‌డీ టీకాలు

లోకేశ్వరం: జిల్లాలోని పశువుల్లో ప్రాణంతరమైన లంపీ స్కిన్‌ వ్యాధి వెలుగు చూసింది. దీరిపై ‘సాక్షి’లో శనివారం(ఏప్రిల్‌ 26న) కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జిల్లా పశువైద్యాధికారి మహమ్మద్‌ బలిక్‌ హైమద్‌ పశువులకు టీకాలు వేయాలని ఆదేశించారు. దీంతో మండల పశువైద్య సిబ్బంది లోకేశ్వరం మండలంలోని ధర్మోర, పంచగుడి గ్రామాల్లో పర్యటించారు. పశువులకు, లేగదూడలకు ఎల్‌ఎస్‌డీ టీకాలు వేశారు.

నిర్మల్‌: వేసవి సెలవులు వచ్చాయంటే.. ఒకప్పుడు పిల్లలు ‘చలో..’అంటూ అమ్మమ్మ, నాన్నమ్మల ఇళ్లకు వెళ్లేవాళ్లు. అక్కడే నెలరోజులు ఎంజాయ్‌ చేసేవాళ్లు. గల్లీలో ఉన్న పిల్లలంతా కలిసి ఆడేవాళ్లు. అమ్మమ్మతాతయ్యలు ఎంత చెప్పినా.. చెట్లకిందే రోజంతా గడిపేవాళ్లు. ఇక రాత్రిళ్లు తాతయ్య దగ్గర అడిగి కథలు చెప్పించుకునేవారు. ఉమ్మడి కుటుంబాల్లో దాదాపు రెండు నెలలు అలా.. గడుపుతూ బంధాలు, అనుబంధాలతోపాటు పెద్దల నుంచి ఎన్నో బుద్ధులనూ నేర్చుకునేవారు. కానీ.. ఇప్పుడు జమానా మారిపోయింది. సెల్‌ఫోన్‌ చేతిలోకి వచ్చాక పిల్లలకు అదే ప్రపంచమైపోయింది. ఊళ్లకు వెళ్లే మాట అటుంచి, తమ ఇళ్లల్లో ఉన్నా.. తల్లిదండ్రుల మాటలు వినకుండా సెల్‌లోనే లీనమైపోతున్నారు. ఇలా విలువైన సెలవులను ‘సెల్‌’పాలు చేయకుండా.. చాలామంది తల్లిదండ్రులు సద్వినియోగం చేసే యోచన చేస్తున్నారు. ఇందుకు సమ్మర్‌ క్యాంప్‌లు, ప్రత్యేక కోచింగ్‌లూ తోడ్పడుతున్నాయి. ఈనేపథ్యంలో చాలామంది పిల్లలు సైతం.. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న తపన చూపిస్తున్నారు.

‘వేసవి’ ప్రయోజనాలెన్నో..

పిల్లల కోసం గణితం, ఇంగ్లిష్‌ వంటి కోచింగ్‌ క్లాసులతోపాటు స్విమ్మింగ్‌, కరాటే, కిక్‌బాక్సింగ్‌, థైక్వాండో, క్రికెట్‌, డ్యాన్స్‌, హ్యాండ్‌రైటింగ్‌, చెస్‌, బ్యాడ్మింటన్‌, డ్రాయింగ్‌, యోగా వంటి ఆటలనూ నేర్పే క్లాసులు జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఏడాదంతా పాఠశాలలో గడిపినట్లు సాధారణ దినచర్యలా కాకుండా ఇవి పిల్లలు నిమగ్నమై, వినోదభరితంగా నేర్చుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇక ఇలాంటి వాటివల్ల చాలా ప్రయోజనాలూ ఉన్నాయి.

● వేసవి శిక్షణలో భాగంగా ఏదైనా ఒకటి నేర్చుకోవాలన్న తప్పన పిల్లల్లో వచ్చిందంటే.. ముందుగా వారు సెల్‌/టీవీ స్క్రీన్‌ల నుంచి దూరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది.

● శిక్షణ కార్యక్రమాల్లో పిల్లలు జట్టుగా నేర్చుకునేందుకు లేదా ఆడేందుకు అవకాశం ఉంటుంది. వీటివల్ల సమూహంగా ఉండటం, ఐక్యంగా పనిచేయడం అలవడుతుంది. సమర్థవంతంగా కమ్యూనికేట్‌ చేయడం, బాధ్యతలను పంచుకోవడం, ఉమ్మడి లక్ష్యాల సాధన నేర్చుకోవడానికి దోహదపడుతుంది.

● ఎప్పుడూ ఇల్లు, స్కూల్‌కే పరిమితమయ్యే పిల్ల లకు ఈ వేసవిలో శిక్షణ శిబిరాలు సామాజిక నైపుణ్యాలనూ మెరుగుపరుస్తాయి. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన తోటివారితో కలిసి ఆడట, నేర్చుకోవడం వల్ల సామాజిక నైపుణ్యత మెరుగవుతుంది.

● కరాటే, స్విమ్మింగ్‌, డ్యాన్స్‌, హ్యాండ్‌రైటింగ్‌, మ్యాథమెటిక్స్‌.. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడమనేది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒకరిపై ఆధారపడే గుణాన్ని క్రమంగా దూరం చేస్తుంది.

● ఎప్పుడూ సెల్‌/టీవీల కృత్రిమ తెరల ముందు గడిపే పిల్లలు ప్రకృతిలో, నలుగురితో గడిపే అవకాశం లభిస్తుంది.

● వేసవిలో ఇంటిపట్టునే టీవీ/సెల్‌ చూస్తూ.. స్నా క్స్‌ తింటూ గడిపేస్తే ఏం లాభం ఉండదు. ఏదో ఒక శిక్షణలో జాయిన్‌ అయితే.. మానసిక వికాసంతోపాటు శారీరక శ్రమకూ అవకాశం ఉంటుంది. దీంతో పిల్లలు ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు.

● చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లల టాలెంట్‌ ఏంటో వేసవిలో నేర్చుకునే విషయాలతోనే తెలుస్తుంది. వారిలోని ప్రతిభ, ఆసక్తులను కనుగొనవచ్చు. వారికంటూ ఓ దినచర్య ఏర్పడుతుంది. ఈ సెలవులు పిల్లల సృజనాత్మకతను వెలికి తీయడానికీ చాలా ఉపయోగపడతాయి.

పేరిణి నేర్పిస్తున్నాం..

వేసవి సెలవులను పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి. జిలా కేంద్రంలోనే విజయ హైస్కూల్‌లో సమ్మర్‌క్యాంప్‌ ద్వారా పేరిణి నృత్యాన్ని నేర్పిస్తున్నాం. పిల్లలు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. – రజిత, డ్యాన్స్‌ టీచర్‌

క్రికెట్‌.. నా ఫేవరెట్‌ గేమ్‌..

నాకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ఈసెలవుల్లో బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండూ నేర్చుకుంటున్నా. నాన్న సాయికృష్ణ నన్ను రోజూ క్రికెట్‌ కోచింగ్‌ సెంటర్‌కు తీసుకెళ్తున్నారు.

– పూదరి శ్రేయాస్‌, నిర్మల్‌

టేబుల్‌టెన్నిస్‌ ఎంచుకున్నాడు..

ఏడాదంతా చదువులతో గడిచిపోతుంది. ఈసెలవుల్లో మా త్రినయన్‌కు ఏదైనా ఆట నేర్పాలనుకున్నాం. తను వినూత్నంగా టేబుల్‌టెన్నిస్‌ ఎంచుకుని నేర్చుకుంటున్నాడు.

– రేవంత్‌, నిర్మల్‌

కూచిపూడి నేర్చుకుంటోంది..

మాపాప ఆనందికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే తాను కొంత కూచిపూడి నేర్చుకుంటోంది. ఈ సెలవుల్లో పూర్తిసమయం డ్యాన్స్‌కే కేటాయిస్తోంది.

– దాసరి మౌనిక, నిర్మల్‌

న్యూస్‌రీల్‌

చదువులకు అదనంగా..

నేర్పుతుంది ఆనందంగా..

తల్లిదండ్రులకూ ఇప్పుడే తీరిక

హాలీడేస్‌ సద్వినియోగమిలా..

ఎన్నో నేర్పిస్తున్నారు..

ఒకప్పటికి.. ఇప్పటికి జిల్లాలోనూ చాలా మార్పువచ్చింది. ఏదైనా ఆట నేర్చుకోవాలన్న, పాట నేర్చుకోవాలన్నా.. గతంలో ఏ నిజామాబాదో, హైదరాబాదో వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడిక్కడే.. అన్నీ నేర్పిస్తున్నారు. భరతనాట్యం, కూచిపూడి, పేరిణి వంటి కళలనూ నేర్పేవాళ్లు ఉన్నారు. నిర్మల్‌, భైంసాలో అరకొరగా పూల్స్‌ ఉన్నా.. స్విమ్మింగ్‌ కూడా నేర్చేసుకోవచ్చు. ఇక క్రికెట్‌ కోసం పదుల సంఖ్యలో బాక్స్‌క్రికెట్‌లు, రెండు మూడు కోచింగ్‌ కేంద్రాలూ నిర్మల్‌లో ఏర్పాటయ్యాయి. వెస్ట్రన్‌ డ్యాన్స్‌, కరాటే గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ప్రతీ ఏరియాలో ఈ సమ్మర్‌ స్పెషల్‌ కోచింగ్‌ కేంద్రాలు వెలిశాయి. ఇవి కాకుండా చాలామంది పిల్లలు ఆన్‌లైన్‌లో చెస్‌, హ్యాండ్‌రైటింగ్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ స్కిల్స్‌ నేర్చుకుంటున్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ తరఫున.. జిల్లావ్యాప్తంగా వివిధ ఆటలకు సంబంధించిన వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు.

స్విమ్మింగ్‌, కరాటేకు పంపిస్తున్నా..

వేసవిని వృథా చేయకుండా మా పిల్లలు శష్విక్‌, కార్తికేయలకు స్విమ్మింగ్‌, కరాటే క్లాసులకు పంపిస్తున్నాం. ఉదయం ఈత, సాయంత్రం కరాటే నేర్చుకుంటున్నారు.

– రాకేశ్‌, నిర్మల్‌

నిర్మల్‌1
1/7

నిర్మల్‌

నిర్మల్‌2
2/7

నిర్మల్‌

నిర్మల్‌3
3/7

నిర్మల్‌

నిర్మల్‌4
4/7

నిర్మల్‌

నిర్మల్‌5
5/7

నిర్మల్‌

నిర్మల్‌6
6/7

నిర్మల్‌

నిర్మల్‌7
7/7

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement