
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయావతి ఈసారి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడం లేదు. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగకపోయినా, మాయావతి తన సొంత పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని మిశ్రా వివరించారు.