
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డిని ప్రకటించగా, బీజేపీ ఒప్పుకుంటే జమ్మలమడుగులో పోటీకి సిద్ధమని భూపేష్‌రెడ్డి అంటున్నారు.
బీజేపీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పేరును బీజేపీ అధిష్టానం పరిశీలన చేస్తోంది. పార్టీ అధిష్టానంతో ఇప్పటికే ఆదినారాయణ చర్చలు జరిపారు. జమ్మలమడుగు సీటును వదులుకుంటే టీడీపీకి మరో సీటు పెరగనుంది.
ఇదీ జరిగింది..
కాగా, కడప పార్లమెంట్ బలిపీఠం ఎక్కించేందుకు టీడీపీ నానా హైరానా పడింది. అభ్యర్థి ఎంపికకు పలు రకాలుగా కసరత్తు చేసింది. క్రమం తప్పకుండా ఐవీఆర్‌ఎస్ ఫోన్ సర్వేలు నిర్వహిస్తూ రోజుకొక పేరు తెరపైకి తెచ్చింది. ఎట్టకేలకు జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపేష్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.
అసెంబ్లీ టికెట్ ఆశించిన భూపేష్‌ను ఏకంగా ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనుక కుయుక్తుల మంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరైనా సరే, ఓటమి ఎదుర్కోవాల్సిన సీటుకు భూపేష్‌ను ఎంపిక చేయడం వెనుక ఆదినారాయణరెడ్డి తెరవెనుక వ్యూహం పన్నినట్లు సమాచారం.
ఇదీ చదవండి: నాడు తండ్రి.. నేడు తనయుడికి ‘ఆది’పోటు