
కేంద్రంతో యుద్ధం చేస్తున్నట్లు టీఆర్‌ఎస్ నాటకాలు ఆడుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు.
సాక్షి, హైదరాబాద్: కేంద్రంతో యుద్ధం చేస్తున్నట్లు టీఆర్‌ఎస్ నాటకాలు ఆడుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు. ధాన్యం కొనకుంటే టిఆర్ఎస్ సర్కార్ చావు డప్ఫు కొట్టాల్సిందేనన్నారు. చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తానని ప్రకటించి టీఆర్‌ఎస్.. మూడు నెలలుగా రైతులను అవస్థలు పెడుతూ అన్నదాతల ఆత్మహత్యలకు కారణమవుతుందని భట్టి విక్రమార్క మండిపడ్డారు.
చదవండి: తెలంగాణ మంత్రులపై పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు