
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు (నవంబర్ 13) మొదటి దశ ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో కోడెర్మా జిల్లాలోని వివిధ సంస్థలు పలు వస్తువులపై విరివిగా ఆఫర్లు ప్రకటించాయి. ఫర్నిచర్ నుండి దుస్తుల వరకూ, అలాగే రెస్టారెంట్లలోని వంటకాలను రుచి చూసేందుకు తగ్గింపు ధరలను ప్రకటించారు.
ఓటు వేసిన తర్వాత ఓటర్లు తమ వేలిపై సిరా గుర్తును చూపించిన ఈ తగ్గింపు ధరల ఆఫర్ను సొంతం చోసుకోవచ్చు. స్థానిక పిజ్జా సిటీ రెస్టారెంట్ ఆపరేటర్ ఆదిత్య కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ఓటుకున్న ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నదని చెప్పారు. కోడెర్మా జిల్లాలోని పలు వ్యాపార సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించి, మరింత మందిని ఓటు వేసేలా చైతన్యపరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయన్నారు. ఓటు వేసిన తర్వాత ఓటర్లు తమ వేలిపై సిరా గుర్తును చూపితే, తన రెస్టారెంట్‌లో భారతీయ, చైనీస్, సౌత్ ఇండియన్ సహా అన్ని రకాల రుచికరమైన వంటకాలపై 10 శాతం ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: ‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్‌కు రూ. 5 కోట్ల టోకరా