
సాక్షి, విజయవాడ: సీఎం జగన్ విద్య, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ చేసేదే చెప్తారు.. మంచి జరిగే నిర్ణయాలనే తీసుకుంటారన్నారు.
ప్రజలంతా మళ్లీ ముఖ్యమంత్రిగా జగనే ఉండాలని కోరుకున్నారు. టీడీపీ అసహనంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఎన్నికల్లో సీఎం జగన్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. వైనాట్ 175 లక్ష్యానికి దగ్గరగా సీట్లు గెలవబోతున్నాం. మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రావాలనే విధంగా ప్రజలు ఓటింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని వర్గాలవారిని సమానంగా చూసిన వ్యక్తి సీఎం జగన్ ఎన్టీఆర్, వైఎస్సార్ హయాంలో వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి.’’ మంత్రి బొత్స చెప్పారు.
‘‘మేము అధికారంలోకి రాగానే అందరూ తోక ముడుస్తారు. టీడీపీ అసహనంతో దాడులు చేసింది. మేము సంయమనం పాటిస్తున్నాం. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట్లు వేయండని ధైర్యంగా చెప్పిన వ్యక్తి జగన్. గతంలో చంద్రబాబు హామీలు ఇచ్చి మాట తప్పారు. బాబుకు అధికారం ఇస్తే మళ్లీ కష్టాలు వస్తాయి.. మళ్లీ పెత్తందారులు వస్తారని ప్రజలు భయపడ్డారు. చంద్రబాబుది మేకపోతు గాంభీర్యం’’ అంటూ మంత్రి బొత్స ఎద్దేవా చేశారు.