నిరూపిస్తే రాసిస్తా.. చంద్రబాబుకు ఎమ్మెల్యే తోపుదుర్తి సవాల్ | Mla Thopudurthi Prakash Reddy Challenges Chandrababu | Sakshi
Sakshi News home page

నిరూపిస్తే రాసిస్తా.. చంద్రబాబుకు ఎమ్మెల్యే తోపుదుర్తి సవాల్

Published Tue, Mar 5 2024 7:04 PM | Last Updated on Tue, Mar 5 2024 7:38 PM

Mla Thopudurthi Prakash Reddy Challenges Chandrababu - Sakshi

తనకు రూ.500 కోట్ల ఆస్తులున్నట్లు నిరూపిస్తే మీకే రాసిస్తానంటూ చంద్రబాబుకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు.

సాక్షి, అనంతపురం: తనకు రూ.500 కోట్ల ఆస్తులున్నట్లు నిరూపిస్తే మీకే రాసిస్తానంటూ చంద్రబాబుకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. ‘‘మీరు ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేస్తా.. నాకు ఉన్నాయని చెప్తున్న 500 కోట్లు మీరే రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు పంచండి’’ అని చెప్పారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనంటూ తోపుదుర్తి మండిపడ్డారు.

‘‘రాప్తాడు టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత అవినీతి చంద్రబాబుకు కనిపించలేదా?. పరిటాల కుటుంబీకుల అక్రమాస్తులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరు?. చంద్రబాబు దిగజారి ఆరోపణలు చేస్తున్నారు. కియా ఫ్యాక్టరీ చంద్రబాబు వల్ల రాలేదు. వైఎస్సార్, నరేంద్ర మోదీ కృషి ఫలితంగా కియా ఫ్యాక్టరీ ఏర్పడింది. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించిన ఘనత వైఎస్సార్‌దే. పెనుకొండ ప్రాంతంలో వైఎస్సార్ నీటి వసతి కల్పించారు కనుకే కియా ఫ్యాక్టరీ వచ్చింది’’ అని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు.

 ఇదీ చదవండి: ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్.. కేడర్‌కు గూస్ బంప్స్  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement