Anantapur District
-
ప్లాట్‌ఫామ్ పైనుంచి దూకి పట్టాలపై తల పెట్టి..
నంద్యాల జిల్లా: అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ బుధవారం మధ్యాహ్నం ప్రయాణికులతో రద్దీగా ఉంది.. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు పట్టాలపైకి చేరుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హఠాత్తు సంఘటనతో అక్కడి ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లెకు చెందిన రామదాసు శ్రీరాములు, మునెమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం కాగా కూతురుకు వివాహమైంది. కుమారుడు మహేంద్ర (25) గతంలో గ్రామంలో వలంటీర్‌గా పని చేశాడు. ప్రస్తుతం అనంతపురం జిల్లా యాడికి సమీపంలోని ఓ సిమెంట్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే మార్గం లేక ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలు చోట్ల గాలిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం గుత్తి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న యువకుడు రైలు వేగంగా వస్తుండగా ప్రయాణికులు చూస్తుండగానే ప్లాట్‌ఫామ్ పైనుంచి దూకి పట్టాలపై తల పెట్టి పడుకోవడంతో రైలు అతనిపై వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీయగా గొర్విమానుపల్లెకు చెందిన మహేంద్రగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
నాన్న కాదు.. నరహంతకుడు..
దారుణాతి దారుణం.. ఘోరాతి ఘోరం.. కన్నతండ్రే కూతురికి స్వయంగా మరణశాసనం రాశాడు. దగ్గరుండి మరీ కన్నబిడ్డను కాటికి పంపాడు. కళ్లెదుట కన్నకూతురు ప్రాణాలు పోతున్నా ఆ పాషణ హృదయం కరగలేదు. ప్రేమించిన వాడిని మరిచిపోలేనని చెప్పిన పాపానికి కూతురిని కర్కశంగా బలితీసుకున్నాడో నరహంతక తండ్రి. ఈ అవమానవీయ ఘటన గురించి తెలిసిన వారందరూ భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి సమాజంలో ఉన్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నారు.గుంతకల్లు రూరల్: కుమార్తె ప్రేమ వ్యవహారం (love affair) కారణంగా కుటుంబ పరువు, మర్యాద మంటగలసి పోతున్నాయనే ఉద్దేశంతో కన్న కూతురినే కడతేర్చాడో తండ్రి. అనంతపురం జిల్లా (Anantapur District) గుంతకల్లులో ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్లో నివాసం ఉంటున్న తుపాకుల రామాంజనేయులు, సావిత్రి దంపతులకు నలుగురు కుమార్తెలు. హోటల్ నిర్వహణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు ఇదివరకే వివాహం చేశారు. చివరి కుమార్తె భారతి (20) కర్నూలులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈమె ఇంటికి సమీపంలోనే ఉంటున్న యువకుడిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారిస్తూ వచ్చారు. ఎంతకూ వారి మాట వినని భారతి ‘చావనైనా చస్తాను గానీ ప్రేమించిన యువకుడిని మరచిపోలేన’ని తెగేసి చెప్పింది. నిర్మానుష్య ప్రాంతంలో ఘాతుకం..తండ్రి రామాంజనేయులు ఈ నెల ఒకటో తేదీన కుమార్తెతో మరోమారు మాట్లాడి.. ఆమె మనసు మార్చే ప్రయత్నం చేశాడు. అయినా వినకపోవడంతో తనతో పాటు ఒక తాడును తీసుకొని కుమార్తెను స్కూటర్‌పై తీసుకొని కసాపురం గ్రామ శివారులోని తిక్కస్వామి తోట సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. తాడుతో అక్కడి చెట్టుకు ఉరితాడు సిద్ధం చేశాడు. ఇప్పటికైనా మాట వింటావా లేక చస్తావా అని అడిగాడు. తాను చావడానికైనా సిద్ధమని స్పష్టం చేయడంతో ‘సరే చావు’ అంటూ ఆమెను ఎత్తి పట్టుకున్నాడు. వెంటనే ఆ అమ్మాయి చెట్టుకు వేలాడుతున్న ఉరితాడును తన మెడకు వేసుకుంది.కుమార్తెను మరోసారి బతిమాలిన రామాంజనేయులు ఆమె మాట వినకపోవడంతో ఉరికి వదిలేసి.. వెనక్కు తిరిగి చూడకుండా ముందుకు కదిలాడు. కొంత దూరం వచ్చాక తిరిగి వెనక్కు వెళ్లి చూడగా అప్పటికే భారతి విగతజీవిగా ఉరికి వేలాడుతోంది. దీంతో మృతదేహాన్ని కిందకు దింపి తన స్కూటర్లోని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నాడు. మూడు రోజుల తర్వాత ఈ నెల నాల్గో తేదీన గుంతకల్లు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. కుమార్తెను చంపేశానని చెప్పి లొంగిపోయాడు.చదవండి: పాపం శిరీష.. ఆడపడుచు కపట ప్రేమకాటుకు బలైందికసాపురం శివారులో ఘటన జరిగినట్లుగా తెలపడంతో రామాంజనేయులుతో కలిసి రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ టీపీ వెంకటస్వామి, పోలీసులు మంగళవారం రాత్రి 9.30 గంటల వరకూ గాలింపు చేపట్టినా ఘటనా స్థలాన్ని గుర్తించలేకపోయారు. దీంతో బుధవారం ఉదయం మరోమారు గాలించి సంఘటన స్థలాన్ని గుర్తించారు. కాలిన మృతదేహాన్ని కొంతమేర కుక్కలు పీక్కు తిన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడే పోస్టుమార్టం నిర్వహింపజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
జేసీ కక్ష.. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేత ఇల్లు కూల్చివేత
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రి వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అన్ని అనుమతులు ఉన్నా కానీ రమేష్ రెడ్డి ఇంటిని కూల్చేశారు. మునిసిపల్ అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ నేత రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రమేష్ రెడ్డి మండిపడ్డారు.వైఎస్సార్సీపీ కార్యకర్త పొలానికి మళ్లీ నిప్పు మరో ఘటనలో రాప్తాడు మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఓబులేష్, వసంత్‌కు చెందిన పొలానికి మళ్లీ నిప్పు పెట్టారు. మండలంలోని గొందిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధి (పులల్లరేవు) పరిధిలోని సర్వే నంబర్ 103–2 (88–3)లో 4.90, 103–3 (88–3)లో పెద్ద ఓబులేష్, వసంత్ తమకున్న 7.76 ఎకరాల వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ పొలంలో రెండేళ్ల క్రితం దాదాపుగా 400 అల్ల నేరేడు మొక్కలను నాటారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఓబులేష్‌కు చెందిన మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఈ ఏడాది జనవరి 17న 15 చెట్లు, అలాగే జనవరి 21న 40 చెట్లను టీడీపీ నాయకులు నరికి వేశారు. మళ్లీ ఈ నెల 3న గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఓబులేష్ తోటకు నిప్పు పెట్టడంతో కొన్ని చెట్లు కాలిపోయాయి.వారం రోజులు కూడా గడవక ముందే మళ్లీ ఈ నెల 10న మరో సారి నిప్పు పెట్టడంతో తోటలోని డ్రిప్ పరికరాలు, మోటర్ సెల్ పూర్తిగా కాలిపోయాయి. 10 రోజులు కూడా గడవక ముందే మూడోసారి పొలానికి నిప్పు పెట్టడంతో దాదాపుగా 4 ఎకరాల్లో పొలం చుట్టూ ఉన్న ముళ్ల కంప కాలిపోయింది. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అనంతపురంలో అక్రమ సంబంధానికి బలైన ఓ వ్యక్తి
-
తాడిపత్రిలో వీఆర్వో కీచకపర్వం
సాక్షి, అనంతపురం జిల్లా: కులం, మతం, ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించిన రామరాజ్యం నాడు. రేషన్ కార్డు కావాలంటే నీ కూతుర్ని నా దగ్గరికి పంపు అని వీఆర్వో అడిగిన రావణ పాలన నేడు. రేషన్ కార్డు అడిగిన పాపానికి పేద వృద్ధురాలికి వచ్చిన బెదిరింపు ఇది. ‘రేషన్‌కార్డు కావాలంటే నీ కూతురిని నా దగ్గరకు పంపించు’ అన్న ఓ వీఆర్వో కీచకపర్వం ఆలస్యంగా వెలుగుచూసింది. తీవ్ర మనోవేదనకు గురైన ఆ వృద్ధురాలు తన వేదనను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో అధికారులు ఆ కీచక వీఆర్వోపై విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం 35వ వార్డుకు చెందిన లక్ష్మీని రెండేళ్ల కిందట భర్త వదిలేయడంతో తల్లి నాగమునెమ్మ దగ్గర ఉంటోంది. రేషన్‌కార్డు లేనందున కుమార్తెకు ఒంటరి మహిళ పింఛన్ రావడం లేదని.. తన కుమార్తెకు కార్డు మంజూరు చేయాలంటూ నాగమునెమ్మ ఏడాదిగా వీఆర్వో చంద్రశేఖర్‌ను బతిమాలుతూ వస్తోంది.తాడిపత్రి మునిసిపల్ అధికారులకూ విన్నవించుకుంది. అయినా ఫలితం లేకపోయింది. పదే పదే వీఆర్వోను బతిమాలుతుండటంతో ఇదే అదునుగా భావించిన వీఆర్వో చంద్రశేఖర్ ‘నీ కూతురిని నా దగ్గరకు పంపించు. అప్పుడు రేషన్‌కార్డు ఇప్పిస్తా’ అని చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. వీఆర్వో దుర్మార్గాన్ని వీడియోలో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై అనంతపురం ఆర్డీవో కేశవనాయుడు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు తాడిపత్రి తహసీల్దార్ రజాక్‌వలి శుక్రవారం నాగమునెమ్మను తన కార్యాలయానికి పిలిచి విచారించి.. నివేదికను ఆర్డీవోకు అందించారు.ఇదీ చదవండి: మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం -
అనంతపురంలో టీడీపీ నేత రాయల్ మధు వీరంగం
-
అనంతపురం జిల్లాలో నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
-
కీలకమైన సమావేశంలో ఆన్ లైన్ లో రమ్మీ ఆడిన డీఆర్వో మలోలా
-
‘దారి’తప్పిన పోలీసులు.. మూడ్ బాగోలేదంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై దాడి
సాక్షి, అనంతపురం: జిల్లాలో పోలీసులు దారి తప్పారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై దాష్టీకం చూపారు. సమాచారం అడిగితే విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసుల వైనం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. అనంతపురం నగరానికి చెందిన యువకుడు ఇంతియాజ్ అహ్మద్ బెంగళూర్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అనంతపురం ఆర్టీవో కార్యాలయం వద్ద నివసించే ఇంతియాజ్ ఇంట్లో చోరీ జరిగింది. ఇదే సమయంలో తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు.తల్లికి ఇడ్లీ తెచ్చేందుకు సూర్యా నగర్ రోడ్డులోని ఓ హోటల్‌కు వెళ్లారు. ఇదే సమయంలో కానిస్టేబుల్ నారాయణస్వామి, హోం గార్డు దాదాపీర్ కనిపించడంతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇంతియాజ్ వారితో మాట్లాడారు. తన ఇంట్లో చోరీ జరిగిందని.. తాను ఉన్న ఇళ్లు ఏ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని కానిస్టేబుల్ నారాయణస్వామిని అడిగారు. తన మూడ్ బాలేదని... తాను ఎలాంటి సమాచారం ఇవ్వలేనని కానిస్టేబుల్ నారాయణస్వామి.. ఇంతియాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు కానిస్టేబుల్. విచారించాల్సిన హోంగార్డు కూడా కానిస్టేబుల్ నారాయణస్వామికి మద్దతు ఇవ్వటంతో ఇద్దరూ కలిసి ఇంతియాజ్ పై దాడి చేసి కొట్టారు. అనంతపురం పోలీసుల దాష్టీకం సీసీ కెమెరాలలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.పోలీసుల చేతిలో గాయపడిన ఇంతియాజ్ అహ్మద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అండగా నిలిచారు. అకారణంగా దాడి చేసిన పోలీసులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీం, ఇతర పార్టీ నేతలు డీఎస్పీ కి ఫిర్యాదు చేశారు.అనంతపురం జిల్లాలో పోలీసుల వైఖరి రోజు రోజుకూ వివాదాస్పదం అవుతోంది. అనంతపురం టవర్ క్లాక్ వద్ద ఇటీవల ఓ వ్యక్తి పై ట్రాఫిక్ కానిస్టేబుళ్లు దాడి చేశారు. అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ లాయర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనలు మరువకముందే ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇంతియాజ్ పై దాడి చేయడం పోలీసుల పనితీరును ప్రశ్నిస్తోంది.ఇదీ చదవండి: తిరుమల: బంగారు బిస్కెట్ చోరీ ఘటన కీలక మలుపు -
ఓ ఊరికథ.. సంక్రాంతి అంటే బెదరు!
సంక్రాంతి పండగ అంటే పల్లెల్లో ఎంతో సందడి ఉంటుంది. జనవరి నెల మొదలు కాగానే అన్ని గ్రామాల్లో ఈ పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతి రోజూ ఇంటి ముందు ముగ్గులు వేయడం, హరిదాసుల సంకీర్తనలు, అందరూ కలసి ఒక చోట చేరి ఆడిపాడి సందడి చేయడం, ముగ్గుల పోటీలు నిర్వహించడం, వివిధ క్రీడా పోటీలు లాంటి కార్యక్రమాలు ఎంతో సందడిగా జరుగుతుంటాయి. అయితే ఇందుకు భిన్నంగా కొన్ని శతాబ్దాలుగా సంక్రాంతి పండుగకు ఓ గ్రామంలో సగానికి పైగా ప్రజలు దూరంగా ఉంటున్నారు. ఇందుకు గల కారణాలు... విశేషాలు తెలుసుకోవాలంటే అనంతపురం జిల్లా పి.కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించి తీరాల్సిందే. – ఆత్మకూరు: అనంతపురం జిల్లా ఆత్మకూరు నుంచి కళ్యాణదుర్గం వెళ్లే మార్గంలో ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే జాతీయ రహదారికి ఓ కిలోమీటరు దూరంలో పి.కొత్తపల్లి గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో కమ్మ, బోయ, ఎస్సీ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దాదాపు 300 గడపలున్న ఈ గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. వరి, చీనీ, వేరుశనగ, టమాట పంటల సాగుతో జీవనం సాగిస్తున్నారు. గ్రామం చుట్టూ ఎటు చూసినా పచ్చని పంట పొలాలు కనువిందు చేస్తుంటాయి. సమైక్య జీవనానికి, స్వశక్తికి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపాలుగా ఈ గ్రామస్తులు నిలుస్తున్నారు.అనాదిగా వస్తున్న ఆచారాన్ని గౌరవిస్తూ..సంక్రాంతి పండుగ విషయంలో బోదపాటి వారి భయాందోళనకు కారణమూ లేకపోలేదు. ఇందుకు సంబంధించి ఓ పురాతన కథను నేటికీ పూర్వీకులు చెబుతున్నారు. శతాబ్దాల క్రితం సంక్రాంతి సరుకుల కొనుగోలు కోసమని గ్రామానికి చెందిన బోదపాటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆత్మకూరు సంతకు వచ్చారు. ఆ సమయంలో ఉన్నఫళంగా ఆయన కుప్పకూలి మృతి చెందాడు. ఇదేదో సాధారణ మృతిగానే అందరూ అప్పట్లో భావించారు. అయితే ఆ మరుసటి సంవత్సరం సంక్రాంతి పండుగ సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన బోదపాటి కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఇలా వరుసగా ఏటా సంక్రాంతి పండుగ చేయాలనే ఉద్దేశంతో సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన బోదపాటి కుటుంబంలోని ఎవరో ఒకరు మృత్యువాత పడుతుండడంతో ఒక్కసారిగా వారిలో ఆందోళన మొదలైంది. దీంతో సంక్రాంతి పండుగ జరుపుకోకూడదని బోదపాటి కుటుంబీకులు నిర్ణయించుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ సంక్రాంతి పండుగకు బోదపాటి కుటుంబీకులు దూరంగా ఉంటూ వస్తున్నారు.సంక్రాంతి అంటే బెదరుహిందూ సంప్రదాయంలో వచ్చే ప్రతి పండుగనూ పి.కొత్తపల్లి వాసులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. అయితే సంక్రాంతి అంటే చాలు ఈ గ్రామంలో సగానికి పైగా జనాభా ఉన్న కమ్మ సామాజిక వర్గంలోని బోదపాటి వారు బెదిరిపోతుంటారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఇంటి ముంగిట కనిపించే రంగవల్లులు వీరి ఇళ్ల ముందు కనిపించవు. గొబ్బెమ్మలు ఉండవు. పిండి వంటలు, నూతన వస్త్రాలకు దూరంగా ఉంటారు. ఇక గ్రామంలో జరిగే సంక్రాంతి సంబరాలకు సైతం బోదపాటి వారు దూరంగా ఉంటారు. రైతు కుటుంబంలో సాధారణంగా భోగి నాడు కనిపించే సందడి ఊసే ఉండదు. పశువులకు, పొలాల్లో నవధాన్యాలకు, ఇంట్లో పూజలు చేయరు. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతి పండుగ నాడు కనీసం స్నానం చేయాలన్నా వీరు భయపడుతుంటారు.నేను పుట్టినప్పటి నుంచి చూడలేదుప్రస్తుతం నాకు 45 సంవత్సరాలు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ బోదపాటి వారు సంక్రాంతి పండుగను జరుపుకున్నది చూడలేదు. మా తాతల కాలం నుంచి కూడా ఇదే పద్ధతి కొనసాగుతూ వస్తోంది. ఒకవేళ బోదపాటి కుటుంబీకులు ఎవరైనా ధైర్యం చేసి పండుగ చేసేందుకు సిద్ధమైతే ఏదో ఒక ప్రమాదం బారిన పడుతున్నారు. దీంతో సంక్రాంతి నాడు ఇంట్లో పూజలు కూడా చేయం.– గోపాల్, పి,కొత్తపల్లి, ఆత్మకూరు మండలంపెద్దల ఆచారాలు గౌరవిస్తున్నాంసంక్రాంతి పండుగ అంటే మా పల్లెల్లో అందరూ ఎంతో ఆనందంగా గడుపుతారు. కొత్త అల్లుళ్ల రాకతో ప్రతి ఇంట్లోనూ సందడిగా ఉంటుంది. కానీ, బోదపాటి వంశానికి చెందిన దాదాపు వంద కుటుంబాల వారు సంక్రాంతి పండుగ చేసుకోం. పెద్దల ఆచారాలు గౌరవిస్తూ ఇళ్ల ముందు ముగ్గులు వేయడం, ఇల్లు, వాకిలి శుభ్రం చేయడం ఇతర ఆచారాలు ఏవీ చేయం.– రమాదేవి, పి,కొత్తపల్లి, ఆత్మకూరు మండలంస్నానం కూడా చేయంసంక్రాంతి అంటే అందరూ ఆనందంగా జరుపుకుంటారు. కానీ మా బోదపాటి వారు స్నానాలు కూడా చేయరు. పండుగ చేసుకుంటే ఏం జరుగుతుందో అనే భయం అందరిలోనూ ఉంది. దీంతో చాలా ఏళ్లుగా పండుగనాడు కూడా సాధారణ వంటకాలతోనే సరిపెట్టుకుంటాం.– రాజప్ప, పి.కొత్తపల్లి, ఆత్మకూరు మండలం -
ఆ దున్నపోతు మాదే!
అనంతపురం: దేవర దున్నపోతు కోసం రెండు గ్రామాల మధ్య వివాదం రాజుకుంది. కూడేరు మండలం ముద్దలాపురంలో ముత్యాలమ్మ, కదరగుంటలో బొడ్రాయి ప్రతిష్ట సందర్భంగా దేవర నిర్వహణకు గ్రామస్తులు పూనుకున్నారు. ఇందు కోసం దేవరలో బలి ఇచ్చేందుకు గ్రామానికి ఒక దున్నపోతును వదిలారు. ఈ రెండు దున్నపోతులు నాలుగేళ్లుగా సమీప గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ఈ నెల 22న దేవర ఉండడంతో ఇటీవల గ్రామంలోకి వచ్చిన దున్నపోతును కదరకుంట గ్రామస్తులు కట్టేశారు. 21వ తేదీన ముద్దలాపురంలో దేవర ఉంది. దీంతో పక్క గ్రామంలో కట్టేసిన దున్నపోతు తమ గ్రామానికి చెందినదేనని ముద్దలాపురం గ్రామస్తులు నిర్ధారణకు వచ్చారు. తమ దున్నపోతును వదిలేస్తు దేవర చేసుకుంటామని కోరగా కడదరకుంట గ్రామస్తులు ఇందుకు ససేమిరా అన్నారు. అది తమదేనని ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుండడంతో ముద్దలాపురం గ్రామస్తులు శుక్రవారం ఎస్పీని కలిసేందుకు కార్యాలయానికి వెళ్లారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించే సోమవారం రోజున రావాలంటూ సిబ్బంది సూచించడంతో గ్రామస్తులు అక్కడి నుంచి వెనుదిరిగారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడి
గుంతకల్లు రూరల్: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం చింతలాంపల్లిలో సోమవారం రాత్రి టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి కొడవళ్లు, గొడ్డళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మల్లికార్జున, కదిరప్ప, వన్నూరప్ప, రుద్రమ్మలకు గాయాలయ్యాయి. వీరిలో మల్లికార్జున పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆటోలో గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన ఒక వ్యక్తికి, టీడీపీకి చెందిన మరో వ్యక్తికి మధ్య కొన్నేళ్లుగా స్థల వివాదం నడుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయ పలుకుబడితో స్థల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు టీడీపీ వర్గీయులు పావులు కదుపుతూ వచ్చారు.అందులో భాగంగా ఈ నెల 24న రెవెన్యూ సిబ్బందితో వివాదాస్పద స్థలంలో సర్వే కూడా చేయించారు. అక్కడితో ఆగకుండా వైఎస్సార్సీపీ వర్గీయులు, వారి ఇళ్లకు వచ్చే బంధువులపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. పోలీసులు సైతం నిత్యం వైఎస్సార్సీపీ నాయకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం, కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. కాగా.. సోమవారం రాత్రి టీడీపీ నాయకులు ఆనంద్, సుధీర్, సురేష్, వేణు, మరికొందరు వైఎస్సార్సీపీ వర్గీయుల ఇళ్లలోకి చొరబడి మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మల్లికార్జున తలకు తీవ్రగాయాలు కాగా.. కదిరప్ప, వన్నూరప్ప, అతని భార్య రద్రమ్మ గాయపడ్డారు. వీరిని గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే దాడి చేసిన టీడీపీ నేతలు తమపైనా దాడి జరిగిందంటూ ఆస్పత్రిలో ప్రత్యక్షమయ్యారు.వైఎస్సార్సీపీ శ్రేణుల ఆందోళనదాడి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు మంజునాథ్‌రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామలింగ, మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సుంకప్పతో పాటు కార్యకర్తలు గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. దాడిలో గాయపడిన వారిని పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి ముందు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. చింతలాంపల్లిలో ఆరు రోజులుగా టీడీపీ నేతలు దౌర్జన్యం సాగిస్తున్నా పోలీసులు మిన్నకుండిపోతున్నారని, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై మాత్రం అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే దాకా ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్న పోలీసుల హామీతో ఆందోళన విరమించారు. -
అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
-
పచ్చమూకల దాష్టీకం.. వైఎస్సార్సీపీ నేత వాహనానికి నిప్పు
సాక్షి, అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు దాష్టీకానికి దిగారు. వైఎస్సార్ సీపీ నేత, 23వ వార్డు కౌన్సిలర్ అర్చన వాహనాన్ని టీడీపీ నేతలు దగ్ధం చేశారు అర్థరాత్రి ఎవరు లేని సమయంలో వాహనానికి నిప్పు పెట్టారు. రెక్కీ నిర్వహించి కారును తగలబెట్టారు. టీడీపీ నేత మహేష్, అతని అనుచరులపై అర్చన ఫిర్యాదు చేశారు. -
ఊరంతా దుస్తులే!
పామిడి: రాయలసీమ జిల్లాల్లోనే నాణ్యమైన వస్త్రాలకు ఖ్యాతి గాంచింది అనంతపురం జిల్లా పామిడి. 65 వేల మంది జనాభా ఉన్న పామిడిలో 85 శాతం మంది వస్త్ర వ్యాపారంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏ వీధికెళ్లినా వస్త్ర దుకాణాలే కనిపిస్తాయి. కేవలం టెక్స్టైల్లోనే కాకుండా రెడీమేడ్ దుస్తుల తయారీలోనూ రెండో ముంబయిగా ఖ్యాతిగాంచింది. గ్రామం ఆవిర్భావం నుంచే... శతాబ్దాల క్రితం ఆవిర్భవించిన పామిడి గ్రామానికి పెద్ద చరిత్రనే ఉంది. పూర్వం పరుశురాముడి స్వైరవిహారం నుంచి తప్పించుకుని కుటుంబాలతో వలస వచ్చిన క్షత్రియులు పామిడి పెన్నానది ఒడ్డున సింగిరప్ప కొండపై స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పూర్వీకులు చెబుతున్నారు. అనంతరం ప్రస్తుతమున్న గ్రామానికి తమ మకాం మార్చి జీవనోపాధి కింద దుస్తులకు రంగుల అద్దకం పనిని చేపట్టారు.దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం వరకూ పామిడిలో కుటీర పరిశ్రమగా రంగుల అద్దకం పని కొనసాగింది. ఈ నైపుణ్యం వారిని రాయల్ టైలర్స్గా, డ్రెస్ డిజైనర్లుగా ఎదగడానికి దోహదపడింది. గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలస రావడంతో వీరిని భావసార క్షత్రియులుగా పిలిచేవారు. రెడీమేడ్కు పెట్టింది పేరు దాదాపు ఐదు దశాబ్దాల క్రితం వరకూ పామిడి వాసులు ర్యాగ్స్ (ఒక సెం.మీ. వెడల్పు ఉన్న వస్త్రం)తో చిన్నారుల ఫ్యాన్సీ డ్రెస్‌లు కుట్టి అతి తక్కువ ధరకు విక్రయించేవారు. ఈ క్రమంలో పరిశ్రమల నుంచి బేళ్ల కొద్దీ సరుకును దిగుమతి చేసుకునేవారు. చేతి నిండా పని దొరకడంతో ప్రతి ఇంట్లోనూ రెండు, మూడు కుట్టుమిషన్లపై ఉదయం నుంచి రాత్రి వరకూ డ్రెస్‌లు కుట్టేవారు. ప్రస్తుతం నైటీలు, నైట్ ప్యాంట్లను కుడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలను కరువు రక్కసి పీడించిన రోజుల్లోనూ పామిడిలో ఉపాధికి ఢోకా ఉండేది కాదు. తర్వాతి కాలంలో మిల్లుల నుంచి కట్పీస్లు తెప్పించి కిలోల లెక్కన అమ్మడం మొదలు పెట్టారు. వీటితోనే ప్రస్తుతం నైట్ ప్యాంట్లు తయారవుతున్నాయి. జైపూర్ కాటన్‌తో నైటీలను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడి ఉత్పత్తులకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. నైటీలకు సంబంధించి 70కి పైగా, నైట్ ప్యాంట్లకు సంబంధించి 50 దాకా కుటీర పరిశ్రమలు ఇక్కడ వెలిశాయి. అన్ని కులాలకు చెందిన వారు ఈ వ్యాపారంలో రాణిస్తున్నారు. ధర తక్కువ.. నాణ్యత ఎక్కువ వస్త్ర వ్యాపారంలో పామిడి వాసుల ప్రత్యేకతే వేరు. కేవలం వస్త్ర వ్యాపారం సాగించే వీధినే ప్రత్యేకంగా ఉంది. ఈ వీధిలో 130కు పైగా వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఏ వస్త్రం నాణ్యత ఏపాటిదో కంటితో చూస్తే చెప్పే నైపుణ్యం ఇక్కడి వారి సొంతం. వస్త్ర పరిశ్రమలు విస్తారంగా ఉన్న గుజరాత్, మహారాష్ట్ర నుంచి తమకు అవసరమైన ముడిసరుకును దిగుమతి చేసుకుని వ్యాపారం సాగిస్తూ వచ్చారు. నేరుగా పరిశ్రమల నుంచి వస్త్రాలను దిగుమతి చేసుకోవడంతో వినియోగదారులకు చాలా తక్కువ ధరకే లభ్యమయ్యేవి. నాణ్యమైన వస్త్రాలను మాత్రమే విక్రయిస్తూ పామిడి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేశారు. ఇక్కడి వస్త్రాలు కొనుగోలు చేసి ధరిస్తే ఏళ్ల తరబడి రంగు వెలిసిపోవని వినియోగదారుల నమ్మకం. దీంతో మూడు దశాబ్దాల వరకూ రాయలసీమ జిల్లాల్లో ఎవరింట శుభకార్యం జరిగినా పామిడికి చేరుకుని వస్త్రాలు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రావడంతో పామిడి వైపు ఎక్కువగా దృష్టి సారించలేకపోతున్నారు. మన్నిక భేష్ పామిడి వ్రస్తాల మన్నిక చాలా బాగుంటుంది. ధర కూడా తక్కువే. ప్రత్యేకించి ఎక్కువ మొత్తంలో వస్త్రాలు కొనుగోలు చేయాలనుకునేవారు తప్పనిసరిగా పామిడికి వస్తుంటారు. ఇక ఇళ్ల వద్ద చీరలు, ఇతర వస్త్రాలు విక్రయించాలనుకునే మహిళలు సైతం పామిడిలోనే కొనుగోలు చేస్తుండడం విశేషం. – డి.హొన్నూరుసాహెబ్, కల్లూరు నాణ్యతగా ఉంటాయిమా గ్రామం గొప్పతనం చెప్పడం కాదు కానీ, ఇక్కడ ఒక్కసారి వస్త్రాలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ నాణ్యమైన సరుకు కావాలంటే పామిడికే వెళ్లాలని చెబుతుంటారు. ప్రస్తుతమున్న ధర ప్రకారం ఇతర ప్రాంతాల్లో రూ.900 చెల్లించి కొనుగోలు చేసిన ఓ ప్యాంట్ పీస్ నాణ్యతకు అదే ధరతో పామిడిలో కొనుగోలు చేసే ప్యాంట్ పీస్ నాణ్యతకు చాలా తేడా ఉంటుంది. ఇక్కడ కొనుగోలు చేసిన వస్త్రాలు చాలా కాలం పాటు మన్నిక వస్తాయి. రంగు వెలిసిపోదు. దీంతో నాణ్యత కావాలనుకునే వారు పామిడికే వచ్చి వస్త్రాలు కొనుగోలు చేస్తుంటారు. – పి.శివకుమార్, పామిడి -
అనంతపురం జిల్లా వెంకటాపురంలో టీడీపీ నేతల బరితెగింపు
-
టీడీపీ నేతల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ నాయకుడి ప్రహారీ గోడ కూల్చివేత
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా అనంతరంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పోలీసులు.. ప్రేక్షక పాత్ర వహించారు.వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డికి చెందిన ప్రవారీ గోడను పట్టపగలే ధ్వంసం చేశారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది.అయితే, ఈ భూ వివాదంపై ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి టీడీపీ నేతలు ప్రహరీ గోడను ధ్వంసం చేశారు. ఇక, ఇదంతా జరుగుతున్నా ఘటనా స్థలంలోనే ఉన్న పోలీసులు.. ప్రేక్షక పాత్ర వహించారు. టీడీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు. దీంతో, పోలీసుల తీరు చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కోమటికుంట్లలో హైటెన్షన్.. పెద్దారెడ్డిపై దాడులకు టీడీపీ స్కెచ్
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం కోమటికుంట్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడికి టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. కోమటికుంట్లలో ఉన్న పెద్దారెడ్డిపై దాడి చేయాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ క్రమంలో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పెద్దారెడ్డిపై దాడి చేయాలని టీడీపీ నేతలతో జేసీ ప్లాన్ చేయించారు. కోమటికుంట్ల గ్రామానికి వెళ్లేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తల యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. జేసీ వర్గీయుల అరాచకాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు.ఇదీ చదవండి: అటు ఆది.. ఇటు జేసీ ‘బూడిద’ రగడ! -
కష్టజీవులను కబళించిన మృత్యుశకటం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గార్లదిన్నె: వారంతా వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు. రోజూ మాదిరిగానే ఉదయాన్నే పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యుశకటం కబళించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నెకు సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు గార్లదిన్నె మండలం తిమ్మంపేట వద్ద అరటి తోటలో ఎరువు వేసే పనికోసం ఉదయమే ఆటోలో వచ్చారు. అక్కడ పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి తిరుగు పయనమయ్యారు. తలగాచిపల్లి క్రాస్ వద్ద ఆటో గార్లదిన్నె వైపునకు మలుపు తీసుకుంటుండగా.. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలపెద్దయ్య అలియాస్ తాతయ్య (55), చిన్ననాగమ్మ (48) రామాంజినమ్మ (47), పెద్ద నాగమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో నుంచి రోడ్డు మీద పడి తీవ్రగాయాలతో హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తున్న కూలీలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనాల్లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్ననాగన్న (55), జయరాముడు (48), కొండమ్మ (50), ఈశ్వరయ్య మృతిచెందారు. లక్ష్మీదేవి, పెద్దులమ్మ, రామాంజినమ్మ, గంగాధర్, ఆటో డ్రైవర్ నీలకంఠ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో చిన్ననాగన్న–చిన్ననాగమ్మ, ఈశ్వరయ్య–కొండమ్మ దంపతులు.ఒకేరోజు ఎనిమిది మంది మృతిచెందడం, ఐదుగురు గాయపడడంతో ఎల్లుట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతపురం ప్రభుత్వాస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై గార్లదిన్నె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్, అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి:వైఎస్ జగన్అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించారు. వీరంతా కూలి పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. వారికి అవసరమైన సాయం అందజేయాలని కోరారు. -
విషాదం.. 5 నెలల చిన్నారిని చంపి.. దంపతుల ఆత్మహత్య
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గం నార్పలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదు రోజుల కిందట తలుపులు వేసుకొని బలవన్మరణానికి దంపతులు పాల్పడ్డారు. దుర్వాసన రావటంతో స్థానికులతో తలుపులు బద్ధలు కొట్టించిన పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు.ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు.. కృష్ణ కిషోర్ (45) శిరీష (35), చిన్నారి (5నెలలు)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టారు. -
అనంతపురం: బీజేపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, అనంతపురం జిల్లా: రాయదుర్గం నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తను టీడీపీ కార్యకర్త హత్య చేశాడు. బొమ్మనహాల్ మండలం చంద్రగిరిలో ఘటన జరిగింది. ఇంట్లో భోజనం చేస్తున్న కృష్ణమూర్తి శెట్టి (50) పై వేటకొడళ్లతో దాడి చేశాడు.స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త కృష్ణమూర్తి శెట్టి చెల్లెలు పుష్పావతితో కలిసి ఉండేవాడు. రాత్రి ఆయన ఇంట్లో చెల్లెలితో కలిసి భోజనం చేస్తుండగా టీడీపీ కార్యకర్త వేటకొడవలితో చెయ్యి, వీపు, తలపై దాడి చేశాడు. తీవ్రగాయాల పాలైన అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించి చెల్లెలు భయంతో బయటకు వచ్చి కేకలు వేసింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునేలోపు ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.కొన ఊపిరితో ఉన్న క్రిష్ణమూర్తి శెట్టిని 108లో బళ్లారి విమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బొమ్మనహాళ్ పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా మండలంలోని కురువల్లికి చెందిన ఓ వ్యక్తితో భూమి తగాదాలతోనే ఈ హత్యాయత్నం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. -
మాటలకందని విషాదం.. కొన్ని గంటల్లో నిశ్చితార్థం.. అంతలోనే..
తాడిపత్రి రూరల్: నిశ్చితార్థం కోసం గోరింటాకు పెట్టించుకుని సోదరునితో కలిసి ద్విచక్రవాహనంపై వస్తున్న యువతిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. తాడిపత్రి అప్‌గ్రేడ్ రూరల్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటరెడ్డిపల్లికి చెందిన వీణాదేవి(24)కి ఆదివారం వివాహ నిశితార్థం జరగాల్సి ఉంది.ఇందు కోసం శనివారం సోదరుడు నారాయణరెడ్డితో కలిసి బైక్‌పై తాడిపత్రికి వెళ్లి చేతికి గోరింటాకు పెట్టించుకుంది. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా వీరి బైక్‌ను బుగ్గ నుంచి తాడిపత్రి వైపు వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో వీణాదేవి అక్కడికక్కడే చనిపోయింది.తీవ్రంగా గాయపడిన తమ్ముడు నారాయణరెడ్డికి తాడిపత్రిలో ప్రథమ చికిత్స చేసి, అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరి కొన్ని గంటల్లో నిశితార్థం జరుగుతుందన్న అనందంలో ఉన్న వీణాదేవి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను, గ్రామస్తులను కలచివేసింది. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
‘ఉమ్మడి అనంత’లో కుంభవృష్టి
అనంతపురం అగ్రికల్చర్/పుట్టపర్తి అర్బన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటలకు మొదలైన వాన జోరు మంగళవారం వేకువజాము వరకు కొనసాగింది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో పలు మండలాల్లో కుంభవృష్టి కురిసింది. ఏకధాటిగా నాలుగైదు గంటలపాటు భారీ వర్షం కురవడంతో చాలా మండలాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాప్తాడు మండలం బండమీదపల్లి చెరువు కట్ట తెగిపోయి దిగువ ప్రాంతానికి వరద పోటెత్తడంతో దాదాపు 70 గొర్రెలు కొట్టుకుపోయాయి. రామగిరి, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, పెనుకొండ, కొత్తచెరువు, పుట్టపర్తి ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో చిత్రావతి, వంగపేరు, కుషావతి, జయమంగళి నదులతోపాటు పలు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్‌లో సాగు చేసిన వరి, వేరుశనగ, పత్తి, ఆముదం, కంది, కొర్ర, మొక్కజొన్న తదితర పంటలు వందలాది ఎకరాల్లో దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి రెండున్నర ఎకరాల్లో సాగు చేసిన ద్రాక్ష తోట మొత్తం నేలమట్టమయ్యింది. రూ.20 లక్షలకు పైగా నష్టపోయినట్లు రైతు వాపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలో రికార్డు స్థాయిలో 198.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో 89.4 మి.మీ., కంబదూరులో 65.4 మి.మీ., ఆత్మకూరులో 60 మి.మీ. చొప్పున భారీ వర్షం కురిసింది. కాగా.. రానున్న రెండు రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పండమేరు ఉగ్రరూపం... నీట మునిగిన పలు కాలనీలు ఎగువన భారీ వర్షాలు కురవడంతోపాటు కనగానపల్లి చెరువుకట్ట తెగిపోవడంతో పండమేరు ఉధృతంగా ప్రవహించింది. పండమేరు వెంబడి ఉన్న అనంతపురం నగర శివారులోని గురుదాస్ కాలనీ, ఆటో కాలనీ, వనమిత్ర పార్క్ వెనుక కాలనీలు, రామకృష్ణ కాలనీ, కళాకారుల కాలనీ, బృందావన కాలనీ, పరిటాల సునీతమ్మ కాలనీ, దండోరా కాలనీ, రాజరాజేశ్వరి కాలనీలు నీట మునిగాయి. సుమారు 300 కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరదపై అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఫలితంగా కట్టుబట్టలతో మిగిలామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. -
అనంత అతలాకుతలం.. ముంచేసిన పండమేరు (ఫొటోలు)
-
రామ రామ.. ఏమిటీ డ్రామా!
సాక్షి టాస్క్ ఫోర్స్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ శ్రీరాములోరి రథం దగ్ధం కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారు. రథానికి నిప్పు పెట్టిన ఘటనలో సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ సానుభూతిపరులేనంటూ సర్వత్రా కోడై కూస్తున్నా.. పోలీసులు మాత్రం ఆ నెపాన్ని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీపై నెట్టేస్తున్నారు. అధికార పార్టీ పెద్దల సూచనలకు అనుగుణంగా పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తిని బుధవారం అనంతపురంలో మీడియా ఎదుట హాజరు పరిచారు. రథానికి నిప్పు పెట్టడంలో ఈశ్వర్‌రెడ్డి పాత్ర ఉందని, ఇతను వైఎస్సార్సీపీకి చెందిన వాడని జిల్లా ఎస్పీ జగదీష్ ప్రకటించారు. వాస్తవంగా ఈశ్వర్‌రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీకి పని చేశాడని, ఆ విషయాన్ని పోలీసులు దాచి.. వైఎస్సార్సీపీ ముద్ర వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రథం దగ్ధం తర్వాత పోలీసులు ఆధారాల సేకరణ కోసం డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. పోలీసు జాగిలాలు గ్రామంలోని నలుగురి ఇళ్ల వద్దకు వెళ్లాయి. ఆ నాలుగిళ్లూ టీడీపీ సానుభూతిపరులవే కావడం గమనార్హం. పోలీసుల ప్రాథమిక విచారణలోనూ టీడీపీకి చెందిన వారే ఈ పని చేసినట్లు తేలినప్పటికీ వారెవ్వరినీ నిందితులుగా చూపలేదు. ఆ పార్టీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు సమాచారం. అన్ని వేళ్లూ వారి వైపే.. హనకనహాళ్ గ్రామంలో శ్రీరాములోరి రథం పట్ల ముందు నుంచీ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నది టీడీపీ వారే కావడం గమనార్హం. ఈ విషయం గ్రామస్తులందరూ చెబుతున్నప్పటికీ వైఎస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన మూలింటి ఎర్రిస్వామిరెడ్డి బ్రదర్స్ 2022లో రూ.19 లక్షల సొంత నిధులతో రథాన్ని తయారు చేయించారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులే ఈ రథాన్ని తయారు చేయించినప్పుడు అదే పార్టీకి చెందిన వారు ఎందుకు నిప్పు పెడతారని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం టీడీపీ వారే రథానికి నిప్పు పెట్టి.. ఆ నెపం వైఎస్సార్సీపీ మద్దతుదారులపై నెట్టేలా వ్యూహం పన్నినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో గ్రామంలో ఇలాంటి సంఘటనలెన్నడూ జరగలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాకే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సీఎం చెప్పిందొకటి..జరిగింది మరొకటి..కేసును నిష్పక్షపాతంగా విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు చెప్పినప్పటికీ, మరోవైపు అందుకు భిన్నంగా జరుగుతోంది. దోషులు టీడీపీ వారేనని తేలినప్పటికీ, ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే ప్రభుత్వానికి మచ్చ రావడం ఖాయమని, వైఎస్సార్‌సీపీపైకి నెపం నెట్టాలని టీడీపీ పెద్దలు చెప్పడంతో పోలీసులు జీ హుజూర్ అన్నట్లు సమాచారం. సీఎం వ్యాఖ్యలకు అర్థం ఇదేనని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతల మెప్పు కోసం పోలీసు యంత్రాంగం ఈశ్వర్‌రెడ్డిని అరెస్ట్ చేసి, అతను వైఎస్సార్సీపీ అని చెప్పడం గమనార్హం. పోలీసుల తీరు పట్ల గ్రామంలో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.రథానికి నిప్పు ఘటనలో ఒకరి అరెస్ట్: ఎస్పీ జగదీష్అనంతపురం: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ గ్రామంలో శ్రీరాముల వారి రథానికి నిప్పంటించిన కేసులో అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బి.ఈశ్వరరెడ్డిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హనకనహాళ్లో ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలను పగులగొట్టి మండపంలోకి ప్రవేశించి.. రథంపై పెట్రోల్/కిరోసిన్ పోసి నిప్పు పెట్టారని తెలిపారు. వెంటనే గ్రామస్తులు మంటలు ఆర్పారని, అప్పటికే రథం ముందు భాగం కాలిపోయిందన్నారు. ఈ ఘటనపై కణేకల్లు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారన్నారు. ఘటనా స్థలంలో ఆధారాల సేకరించామని చెప్పారు. రథాన్ని 2022లో గ్రామానికి చెందిన ఎర్రిస్వామి రెడ్డి సోదరులు రూ.20 లక్షలు వెచ్చించి తయారు చేయించారని తెలిపారు. గ్రామంలో ఏ ఒక్కరి సహాయ సహకారాలు తీసుకోకుండా వారి కుటుంబ సభ్యులే రథాన్ని స్వయంగా తయారు చేయించారన్నారు. దీంతో గ్రామస్తుల్లో విభేదాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోడిమల్ల ఈశ్వర రెడ్డి పాత్ర ఉన్నట్లు తెలియడంతో అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. పోలీస్ కస్టడీలోకి తీసుకుని, ఈ నేరంలో ఇంకా ఎవరి పాత్రయినా ఉందా అనే అంశంపై విచారిస్తామన్నారు. -
రామ రామ.. రథానికి నిప్పు
సాక్షి టాస్‌్కఫోర్స్: గుళ్లు, రథాలు వాళ్లే ధ్వంసం చేస్తారు.. గిట్టని వారిపై ఆ నింద వేస్తారు. వాళ్లే అపచారాలు చేస్తారు.. ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోస్తారు. ఆలయాల ప్రతిష్టను వాళ్లే మంటగలుపుతారు.. ఎదుటి పక్షం వారికి నేరం అంటగడతారు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ పెద్దల తీరిది. నాటి గోదావరి పుష్కరాలు మొదలు.. నేటి తిరుమల లడ్డూ వరకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న దాషీ్టకాలివి. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని దుష్ప్రచారం చేసి, ప్రజల్లో చులకనవుతున్న టీడీపీ పెద్దలను.. ఆ వివాదం నుంచి గట్టెక్కించడానికి ఆ పార్టీ నేతలు మరో ఘాతుకానికి తెరలేపారు.'ఇందుకు అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ రామాలయాన్ని వేదికగా ఎంచుకున్నారు. సుమారు మూడున్నర వేల మంది జనాభా ఉన్న ఈ ఊళ్లో ఏటా శ్రీరామనవమి పర్వదినాన శ్రీ సీతారాముల వారిని ఊరేగించే రథానికి నిప్పు పెట్టించారు. ఈ నెపాన్ని ప్రత్యర్థులపై వేసి.. రాజకీయంగా లబ్ధి పొందాలని విఫలయత్నం చేసినా, ఈ దుర్మార్గానికి పాల్పడింది టీడీపీ వారేనని గ్రామమంతా కోడై కూస్తుండటంతో తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారు.స్థానికుల కథనం మేరకు.. హనకనహళ్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి, శ్రీరామాలయాలు ఊరి నడి»ొడ్డున పక్కపక్కనే ఉన్నాయి. ఈ ఊళ్లో ప్రజలు శ్రీరామనవమి వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు సీతారాముల వారిని రథంపై ఊరేగిస్తారు. అనంతరం రథాన్ని ఆలయం పక్కనే ఉన్న షెడ్డులో ఉంచుతారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత ఇద్దరు వ్యక్తులు షెడ్డు తాళం పగులగొట్టి లోపలకు వెళ్లారు. రథంపై పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఎదురింటిలో ఉండే అనసూయమ్మ అదే సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు రావడంతో రథమున్న షెడ్లో నుంచి మంటలు రావడం గమనించింది. వెంటనే ఆమె.. తన మామ ఎర్రిస్వామికి విషయం చెప్పింది. ఆయన ఇరుగు పొరుగు వారిని నిద్ర లేపి మంటలార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సగం రథం కాలిపోయింది. అలజడి రేగడంతో ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రజలంతా ఆలయం వద్దకు తరలివచ్చారు. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో ఘటన స్థలానికి చేరుకున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, పలువురు పోలీసు, దేవదాయ శాఖ అధికారులు ఘటన స్థలాన్ని సందర్శించారు. కాగా, దుండగులిద్దరూ టీడీపీకి చెందిన వారని, ఉద్దేశ పూర్వకంగానే రథానికి నిప్పుపెట్టినట్లు పోలీసులు, గ్రామస్తులు భావిస్తున్నారు. ముమ్మాటికీ ఇది టీడీపీ పనే.. ఈ ఘటనలో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరే కీలకమని భావిస్తున్నారు. అయితే వీరిద్దరినే అదుపులోకి తీసుకుంటే అధికార పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని, మరో ముగ్గురిని కూడా అనుమానితులుగా చూపుతూ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో టీడీపీ వారిని తప్పించి అమాయకులను బలి చేయాలని చూస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ పార్టీ పెద్దలు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. కాగా, ఈ ఇద్దరితో ఈ దుర్మార్గ పని చేయించిన వారెవరో కూడా స్పష్టం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, రాములోరి రథం దగ్ధం ఘటనలో బాధ్యులను వదిలే ప్రసక్తే లేదని జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. మంగళవారం ఉదయం వారు సంఘటన స్థలాన్ని సందర్శించి.. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, ఆర్డీఓ రాణీసుస్మితను అడిగి వివరాలు తెలుసుకొన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు స్పష్టమవుతోందని, దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఆలయాల వద్ద, ఆలయాల పరిసర ప్రాంతాల్లో రథాలున్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.సమగ్రంగా దర్యాప్తు చేయండి: సీఎం చంద్రబాబుసాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా కణేకల్ మండలం హనకనహాల్‌లో రాములోరి రథం దగ్ధం కావడంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. అగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులకు సీఎం సూచించారు. -
హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు
అనంతపురం: అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు దెయ్యం శివారెడ్డి హత్య కేసులో ఏడుగురు నిందితులకు రెండు జీవితకాల కఠిన కారాగార శిక్షలు (ఏకకాలంలో అమలవుతుంది) విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ తీర్పు చెప్పారు. కందుకూరు గ్రామానికి చెందిన దెయ్యం శివారెడ్డి, అతని కుమారుడు భానుప్రకాష్‌రెడ్డి 2018, మార్చి 30వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు పొలంలో గడ్డి కోసుకుని బైక్‌పై పెట్టుకుని ఇంటికి వెళుతుండగా, వారి గ్రామానికే చెందిన టీడీపీ నాయకుడు బోయ సాకే బాలకృష్ణ, అతని చిన్న తమ్ముడు (మైనర్) అడ్డుకునేందుకు ప్రయత్నించారు.బైక్ నడుపుతున్న భానుప్రకాష్‌రెడ్డి ఆపకుండా ముందుకు వెళ్లగా, బాలకృష్ణ తమ్ముడు రమేష్, బంధువులు అశోక్, సూర్యనారాయణ మరో బైక్‌పై వచ్చి ఢీకొట్టారు. భానుప్రకాష్‌రెడ్డి, శివారెడ్డి కిందపడిపోయారు. బాలకృష్ణ, అతని చిన్న తమ్ముడు (మైనర్), సూర్యనారా యణ వేటకొడవళ్లతో శివారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తన తండ్రిని చంపవద్దని వేడుకున్న భానుప్రకాష్‌రెడ్డిపై కూడా దాడి చేసేందుకు బాలకృష్ణ తమ్ముళ్లు భాస్కర్, విజయ్, కుమారుడు (మైనర్) వేటకొడవళ్లు పట్టుకుని వెంటపడ్డారు. భానుప్రకా ష్‌రెడ్డి కేకలు వేయడంతో సమీపంలోనే పొలంలో ఉన్న అతని చిన్నాన్న నరసింహారెడ్డి, నాగిరెడ్డి, సతీష్‌రెడ్డి రావడంతో బాలకృష్ణ, అతని తమ్ముళ్లు, బంధువులు పారిపోయారు.తీవ్రంగా గాయపడిన శివారెడ్డి అక్కడిక్కడే చనిపోయాడు. భానుప్రకాష్‌రెడ్డి ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అభియోగాలు రుజువుకావడంతో బోయ సాకే బాలకృష్ణ, రమేష్, అశోక్, భాస్కర్, విజయ్‌కుమార్, తలా రి సూర్యనారాయణ, మహేంద్రలకు రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష (ఏకకాలంలో అమలు) విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వీరిలో సాకే భాస్కర్, సాకే విజయ్‌కుమార్‌లకు రూ.35వేలు చొప్పున, మిగిలిన ఐదుగురికి రూ.30 వేలు చొప్పున జరిమానా విధించారు. ఇద్ద రు మైనర్లపై జువైనల్ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు. శిక్ష పడినవారిలో సూర్యనారాయణ మినహా మిగిలిన ఆరుగురు అన్నదమ్ములు కావడం గమనార్హం. -
అనంతపురం : ఆకాశంలో అద్భుతం (ఫొటోలు)
-
అనంతపురం : దులీప్ ట్రోఫీ అభిమానులతో కిక్కిరిసిన స్టేడియం గ్యాలరీ (ఫొటోలు)
-
అనంతపురం జిల్లాలో సందడిగా గణేష్ నిమజ్జనం (ఫొటోలు)
-
అనంతపురంలో వినాయక నిమజ్జనం సందడి (ఫొటోలు)
-
మరో టీడీపీ కామాంధుడు.. మహిళకు లైంగిక వేధింపులు
సాక్షి, అనంతపురం జిల్లా: అధికారాన్ని అడ్డం పెట్టకుని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చిది. అనంతపురం జిల్లా శింగనమల మండలంలో టీడీపీ నేత శ్రీనివాస్ నాయుడు లైంగిక వేధింపులు బయటపడ్డాయి. ఉపాధి హామీ మహిళా కూలీలకు డబ్బుతో ఎర వేస్తున్న టీడీపీ నేత లైంగిక వేధింపుల ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.3 లక్షలు లోన్ ఇప్పిస్తా.. బయటకు రావడానికి వీలు అవుతుందా?. ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా.. తన కోరిక తీర్చాలంటూ శ్రీనివాస్ నాయుడు వేధింపులకు గురిచేశాడు. టీడీపీ నేతపై పోలీసులకు బాధితతురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో దులీప్ ట్రోఫీ ప్రారంభం (ఫొటోలు)
-
అనంతపురం : దులీప్ ట్రోఫీలో భాగంగా క్రీడాకారులు సాధన (ఫొటోలు)
-
మహిళలపై టీడీపీ నేత వేధింపులు
శింగనమల: అతనో టీడీపీ చోటా నేత. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా అనధికారికంగా చలామణి అవుతున్నాడు. ఈ క్రమంలో మహిళా కూలీలపై కన్నేశాడు. తన పక్క మీదకు వస్తేనే బిల్లులు చేస్తానంటూ వేధించసాగాడు. చివరకు అర్ధరాత్రి.. అపరాత్రి అని కూడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసి అసభ్యకర సంభాషణలు కొనసాగిస్తుండడంతో విసుగు చెందిన మహిళలు తమను కాపాడాలంటూ నేరుగా ఎస్పీని ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నాయి.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనంతపురం జిల్లా శింగనమల మండలం జూలకాల్వ గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌ను తప్పించి ఆ స్థానానికి తన పేరును టీడీపీ నాయకుడు శ్రీనివాసులు నాయుడు ప్రతిపాదించుకున్నాడు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులూ ఆయనకు అందలేదు. అయినా ‘ప్రభుత్వం మాది, అంతా మేము చెప్పినట్లే నడుచుకోవాలి’ అనే ధోరణితో ఫీల్డ్ అసిస్టెంట్ తానేనంటూ చలామణి అవుతున్నాడు. తరచూ ఉపాధి పనులు జరిగే ప్రాంతానికి వెళ్లి మహిళా కూలీల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు.కొంత మంది మహిళలను లక్ష్యంగా చేసుకుని వారికి రాత్రి సమయంలో ఫోన్లు చేస్తూ అసభ్యకర సంభాషణ సాగించాడు. తన పక్కమీదకు వస్తేనే బిల్లులు చేస్తానని, లేకపోతే ఎవరొచ్చి చెప్పినా వినేది లేదంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో విసుగు చెందిన మహిళలు వారం కిందట శింగనమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు.. శ్రీనివాసులు నాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే మిన్నుకుండి పోయారు. ఈ క్రమంలో అతని వేధింపులు తారస్థాయికి చేరాయి. దీంతో బాధితులు పలువురు సోమవారం అనంతపురంలో జిల్లా ఎస్పీ జగదీష్ ను కలసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఫోన్లో శ్రీనివాసులు నాయుడు మాట్లాడిన సంభాషణకు సంబంధించి వాయిస్ రికార్డులు వినిపించారు. అతని నుంచి తమకు రక్షణ కలి్పంచాలని వేడుకున్నారు. -
చంద్రబాబుకు జేసీ ఝలక్
అనంతపురం, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక ఆక్రమ రవాణా జరుగుతున్న మాట వాస్తవమేనని చెప్పారాయన. ఏకంగా తన వర్గానికి చెందిన వాళ్లే ఈ పని చేస్తున్నారని చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. తన వర్గానికి చెందిన సుమారు 25 మంది టీడీపీ నేతలే ఇసుక తరలిస్తున్నారని చెప్పారు జేసీ. అయితే.. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణా ఆపాలని అన్నారు. లేకపోతే తానే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుక అక్రమ రవాణా జరగటం లేదని చెప్పుకునే చంద్రబాబుకు సొంత పార్టీ నేతలే షాక్ ఇవ్వడం కొసమెరుపు. -
తాడిపత్రిలో టీడీపీ నేతల అరాచకం బట్టబయలు
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో టీడీపీ నేతల అరాచకం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై టీడీపీ నేతల దాడి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మురళి ఇంటిపై దాడి, వాహనాల విధ్వంసాన్ని స్థానికులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. జేసీ వర్గీయుల బీభత్సం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు మూడు నెలలకు 20వ తేదీన (మంగళవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లారు. వ్యక్తిగత పని ముగించుకుని అరగంటలో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారాయన.ఆయన అలా వెళ్లిన వెంటనే.. జేసీ తన వర్గీయుల్ని రెచ్చగొట్టారు. దీంతో.. టీడీపీ గుండాలు వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేశారు. మురళి ఇంట ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. అదృష్టవశాత్తూ.. జేసీ వర్గీయుల దాడి నుంచి తృటిలో మురళి తప్పించుకున్నారు. -
అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం
అనంతపురం: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. బుధవారం ఉదయం తాడిపత్రి సమీపంలో వంగనూరు వద్ద లారీ, కారు ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. తాడిపత్రికి చెందిన దంపతులు ప్రతాప్ రెడ్డి (25), ప్రమీల(22), మరో మహిళ వెంకటలక్ష్మి (45) మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల పోరుబాట
సాక్షి, అనంతపురం జిల్లా: చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో విద్యార్థులు పోరుబాట ప్రారంభించారు. విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ మహా ధర్నా జరిగింది.తల్లికి వందనం పథకం కింద ఒక్కొ విద్యార్థి కి 15 వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా, విద్యా వ్యవస్ధను నిర్వీర్యం చేసే విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చివేయడంతో పాటు పలు సంస్కరణలు తీసుకొచ్చింది.. వాటిని నీరుగార్చే విధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. -
దివ్యాంగుడి పెన్షన్ అడ్డుకున్న టీడీపీ నేతలు
-
‘బాబుతో మాట్లాడతా.. పేకాట ఆడిస్తా..’!
సాక్షి, అనంతపురం: అనంతపురం ఆఫీసర్స్ క్లబ్లో పేకాట ఆడిస్తానంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పేకాట ఆడకపోవడం వల్ల కరోనా సమయం లో 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లబ్బుల్లో పేకాట ఆడేందుకు కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే ప్రసాద్ సెలవించారు.ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు. అభివృద్ది మరిచి.. పేకాట కోసం సీఎంను కలుస్తారా? అంటూ విమర్శిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.పోలీసుల సమక్షంలోనే తన్నుకున్న టీడీపీ నేతలుఉరవకొండ: స్థానిక పోలీస్టు స్టేషన్ ఎదుటనే టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. పరస్పర దాడులతో రెచ్చిపోయారు. వివరాలు.... ఉరవకొండ మండలం నింబగల్లు వద్ద ఉన్న సమ్మర్ స్టొరేజీ ట్యాంక్ పరిశీలనకు సోమవారం ఉదయం మంత్రి పయ్యావుల కేశవ్ వెళ్లారు. అనంతరం కొనకొండ్లకు వెళుతున్న మంత్రి కాన్వాయ్ వెంట వాహనాల్లో టీడీపీ నేతలూ అనుసరించారు. ఉరవకొండలోని పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న వై.రాంపురం గ్రామ టీడీపీ నేత సంజీవరాయుడు వాహనాన్ని వెనుకనే ఉన్న అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత వాహనం ఢీకొంది.ఆ సమయంలో వాహనాలను ఆపి ఇరువర్గాల నాయకులు వాదులాటకు దిగారు. వారి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. అదే సమయంలో లత్తవరం గ్రామ మాజీ సర్పంచ్ గోవిందు కలుగజేసుకుని నడి రోడ్డు మీద తోపులాటకు దిగిన టీడీపీ నాయకులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో సంజీవరాయుడు వర్గం గోవిందుపై తిరగబడింది. వెంటనే గోవిందు అనుచరులు వారితో కలబడ్డారు. పరస్పర దాడులతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పి ఇరువర్గాలను అక్కడి నుంచి సాగనంపారు. -
తాడిపత్రిలో హై టెన్షన్
సాక్షి, అనంతపురం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరలేపుతోంది. అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తోంది. శనివారం ఉదయం తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బెయిల్ షూరిటీలు సమర్పించేందుకు తాడిపత్రికి కేతిరెడ్ఢి పెద్దారెడ్డి వెళ్లారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అంతుచూస్తానంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరించిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం నేరుగా తాడిపత్రి పీఎస్‌కు వెళ్లిన పెద్దారెడ్డి.. తాడిపత్రి పోలీసులతో మాట్లాడారు. బెయిల్ మంజూరై ఐదు రోజులు గడిచినా షూరిటీలు ఎందుకు తీసుకోలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదని మండిపడ్డారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఐదు రోజులైనా పోలీసులు ఎందుకు షూరిటీలు స్వీకరించలేదని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, మరో 10 మందిపై ఆంక్షలు ఉన్నా తాడిపత్రిలో విచ్చలవిడిగా సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీరు కాదని పెద్దారెడ్డి ధ్వజమెత్తారు.‘‘నన్ను, నా కొడుకులను జిల్లా బహిష్కరణ చేయటానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరు?. తాడిపత్రి ప్రజలకు అండగా ఉంటా. నా ఊపిరి ఉన్నంతవరకూ తాడిపత్రిలోనే ఉంటా. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాను’’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. -
తెల్లారితే గృహ ప్రవేశం.. అంతలోనే విషాదం
విడపనకల్లు : తెల్లారితే నూతన గృహ ప్రవేశం.. అంతలోనే విషాదం చోటుచేసుకుంది. పాత మిద్దె కూలి భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగి ఎస్సీ కాలనీలో ఆదివారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కోనప్పగారి మారెప్ప(42), లక్ష్మి(38) దంపతులు. వీరికి అంజి, హేమంత్ అనే ఇద్దరు కుమారులు, కుమార్తె మానస(మూగ) ఉన్నారు. మారెప్ప పెద్దలు దాదాపు 60 ఏళ్ల క్రితం మట్టితో కట్టించిన ఇంట్లోనే ఉండేవారు. అయితే.. భార్యాభర్త కాయాకష్టం చేసుకుని సంపాదించిన డబ్బుతో ఇటీవల నూతన గృహాన్ని నిరి్మంచుకున్నారు. ఆదివారం గృహ ప్రవేశం పెట్టుకున్నారు. కాగా, శనివారం రాత్రి భారీ గాలులతో కూడిన చిన్నపాటి వర్షం కురిసింది. రోజూ మాదిరిగానే మారెప్ప, లక్ష్మి దంపతులు కుమార్తెతో కలసి పాత మట్టి మిద్దెలో పడుకున్నారు. వీరితో పాటు లక్ష్మి తమ్ముడు రాము కూడా అదే ఇంట్లో నిద్రించాడు. ఇద్దరు కుమారులు మాత్రం ఇంటి ఆరుబయట మంచంపై పడుకున్నారు. వర్షానికి తడిసిన కారణంగా మట్టి మిద్దె ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు ఉలిక్కి పడి లేచారు. మారెప్ప ఇల్లు కూలిపోయిందని గమనించి అరుపులు, కేకలు వేయడంతో కాలనీవాసులంతా వచ్చి మట్టి కింద పూడుకునిపోయిన వారిని వెలికి తీశారు. అప్పటికే మారెప్ప, భార్య లక్ష్మి ప్రాణాలు విడిచారు. కుమార్తె మానసకు చేయి విరిగింది. రాముకు చేతులు, వేళ్లు విరగడంతో పాటు తలకు బలమైన గాయమైంది. గాయపడిన వారిని 108లో ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ఘటనపై ఎస్ఐ ఖాజా హుస్సేన్ కేసు నమోదు చేశారు. మృతదేహాలకు ఉరవకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి కోరారు. -
అనంతపురంలో సినీ తారలు నిధి అగర్వాల్, అనసూయ సందడి (ఫొటోలు)
-
దళితుడిపై ‘దేశం’ నేతల దాడి
సాక్షి టాస్‌్కఫోర్స్: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు రెచ్చి పోయారు. మాజీ వలంటీర్ దళితుడైన నాగరాజును కులం పేరుతో దూషించి దాడిచేశారు. అతడు కౌలుకు సాగుచేసిన మొక్కజొన్న పంట పొలాన్ని దౌర్జన్యంగా దున్నేశారు. బాధితుడు తెలిపిన మేరకు.. కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత నాగరాజు వలంటీర్ ఉద్యోగం పోయింది. దీంతో వ్యవసాయం చేసుకుందామనుకున్న నాగరాజు గ్రామంలోని కొత్తింటి రామ్మోహన్, రుద్రగౌడులకు చెందిన ఎనిమిదెకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగుచేశాడు. ఎకరాకు రూ.30 వేల చొప్పున మొత్తం రూ.2.40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆదివారం అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు గాజుల పెద్ద ఎర్రిస్వామి, చిన్న ఎర్రిస్వామి, వారి కుమారులు.. అనంతపురం నుంచి మరికొందరిని తీసుకొచ్చి నాగరాజు సాగు చేసిన మొక్కజొన్న పంటను హొన్నూరు అలియాస్ హరి అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్‌తో దున్నేశారు. పంటను నాశనం చేయవద్దని బాధితుడు కాళ్లావేళ్లాపడినా కరుణించలేదు. పొలంలోనే తీవ్రంగా కొట్టారు. పొలం తగాదాలుంటే మీరూమీరూ చూసుకోవాలని, పంటను నాశనం చేయవద్దని వేడుకున్నా వినలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం మాది.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ దాడిచేశారని తెలిపాడు. తనకు జరిగిన అన్యాయంపై పాల్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పాడు. అట్రాసిటీ కేసు నమోదు చేయాలి నాగరాజును కులం పేరుతో దూషించి, దాడిచేసిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు కెంగూరి ఎర్రిస్వామి డిమాండ్ చేశారు. దళితుడి పంటను దౌర్జన్యంగా దున్నేయడం దారుణమని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. -
‘అనంత’లో టీడీపీ దౌర్జన్యకాండ
అనంతపురం: ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ కార్యకర్తలు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అరాచకాలు సృష్టిస్తున్నారు. గురువారం కూడా వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడ్డారు. ఉరవకొండలోని కణేకల్లు క్రాస్ వద్ద హోటల్లో బుధవారం టీ తాగుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఒక్కసారిగా తల, కాళ్లు, చేతులపై కర్రలతో దాడి చేశారు. ఇంత జరుగుతున్నా అక్కడే బందోబస్తులో ఉన్న స్పెషల్ పార్టీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో వైఎస్సార్సీపీ వార్డు సభ్యురాలు ఆశాబీ ఇంట్లోకి టీడీపీ కార్యకర్తలు చొరబడి ఆమె కుమారులు అక్బర్, ఇర్ఫాన్‌లపై దాడి చేశారు. చిలమత్తూరు మండలంలోని వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల వద్దకు టీడీపీ కార్యకర్తలు వెళ్లి దాడులకు తెగబడ్డారు. బుధవారం వైఎస్సార్సీపీ కార్యకర్త నరసింహమూర్తిపై దాడి చేసి, తల పగులగొట్టారు. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త నాగభూషణం ఇంట్లో చొరబడి దాడికి యత్నించారు.తాడిమర్రి మండలం ఎం.అగ్రహారంలో గ్రామ సచివాలయం శిలాఫలకాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆత్మకూరు మండలం గొరిదిండ్లలో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బొమ్మనహాళ్ మండలం దేవగిరిలో సచివాలయం ఆర్చ్పై ఉన్న వైఎస్సార్ బొమ్మను ధ్వంసం చేశారు. సచివాలయం, రైతు భరోసా శిలా ఫలకాలను ధ్వంసం చేసేందుకు యతి్నంచగా స్థానికులు అడ్డుకున్నారు. ఉప్పరపల్లిలో సచివాలయం, ఆర్బీకే బోర్డులను ధ్వంసం చేశారు. -
తొమ్మిదేళ్ల బాలికతో దేవదేవుని వివాహం
రాయదుర్గంటౌన్: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శ్రీప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారి కల్యాణం తొమ్మిదేళ్ల బాలికతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాదాపు ఆరు దశాబ్దాల నుంచి ఇక్కడ కొనసాగుతున్న విశిష్ట సంప్రదాయంలో భాగంగా అరవ తెగకు చెందిన బాలికతో దేవదేవుని కల్యాణం జరిపించారు. స్వామి వారిని వివాహమాడిన ఆ బాలికకు సుగుణ æసంపన్నుడైన భర్త లభిస్తాడని భక్తుల నమ్మకం. ఏటా బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది.ఈ ఏడాది రాయదుర్గం పట్టణానికి చెందిన అరవ రమే‹Ù, జయమ్మ దంపతుల కుమార్తె మౌనికతో శ్రీవారి వివాహం జరిపించారు. పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, ఆలయ పాలక కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు వ్యవహరించారు. శనివారం ఉదయం మేళతాళాలతో పెళ్లి కూతురు అయిన పద్మావతి (మౌనిక)ని ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ పెళ్లికూతురిని అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు ఊరేగింపుగా తెచ్చారు. అనంతరం శ్రీవారి ఉత్సవ విగ్రహం ముందు కూర్చోబెట్టారు.వేద మంత్రోచ్ఛారణ మధ్య వివాహం జరిపించారు. అభిజిత్ లగ్న శుభపుష్కరాంశమునందు పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి శ్రీవారి పక్కనే ఉన్న పద్మావతి ఉత్సవ విగ్రహానికి కట్టారు. పసుపు కొమ్ముతో ఉన్న మంగళసూత్రాన్ని బాలిక మెడలో తల్లి కట్టడంతో పెళ్లితంతు ముగిసింది. -
తాడిపత్రిలో సిట్.. అల్లర్లపై కొనసాగుతున్న దర్యాప్తు
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం తాడిపత్రి అల్లర్ల ఘటనలపై సిట్ బృందం దర్యాప్తు చేపట్టింది. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపు లాంటి అంశాలపై సిట్ ఆరా తీస్తోంది. మరోవైపు.. అరెస్టులు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ చేసిన తర్వాతే నివేదికను సిద్ధం చేయాలని సిట్ భావిస్తోంది.పల్నాడు జిల్లాలో పోలింగ్ డే ఘటనల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని పోలీసులు గుర్తిస్తున్నారు. నిన్న(గురువారం) పల్నాడులో 60 మందికిపైగా అరెస్టులు జరిగాయి. 33 మంది పెట్రోల్ బాంబులతో దాడులకు తెగబడినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుల్ని నరసరావుపేట కోర్టులో హాజరుపరిచి.. నెల్లూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.పల్నాడుపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పల్నాడు జిల్లా పోలింగ్ నాటి హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు.. ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోనే విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోంది.ఈవీఎం ధ్వంసం వెనుక కారణాలపై సిట్ ఆరా తీస్తోంది. పిన్నెల్లి వీడియోతో సంబంధం లేదని ఈసీ ప్రకటించగా, వీడియో బయటకు ఎలా వచ్చిందనేదానిపై సిట్ విచారణ చేపట్టనుంది. కుట్ర కోణాలు ఉన్నాయా? అనే అంశంపై సిట్ పరిశీలించనుంది. మాచర్ల, పల్నాడు ఈవీఎం ఘటనలపై సిట్ సమగ్ర నివేదిక సిద్ధం చేయనుంది. -
కారుతో ఢీ కొట్టి.. మృతదేహంతో 18 కిలోమీటర్లు..
ఆత్మకూరు: ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని కారుతో ఢీకొన్నాడు. ఎగిరి కారుపై పడి మృతిచెందిన యువకుడిని అలాగే 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. అటుగా వెళుతున్న వాహనదారులు కారు పైభాగంలో మృతదేహం ఉండటాన్ని గుర్తించి అప్రమత్తం చేయడంతో కారును రోడ్డుపక్కన ఆపి ఉడాయించాడు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన జెన్నే ఎర్రిస్వామి (35)కి ఆత్మకూరు మండలం సిద్ధరామపురం గ్రామానికి చెందిన మంజులతో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ట్రాక్టర్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్న ఎర్రిస్వామి ఆదివారం ద్విచక్ర వాహనంపై అత్తారింటికి వచ్చాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై అనంతపురానికి బయలుదేరాడు. జాతీయ రహదారిపై వై.కొత్తపల్లి వద్దకు చేరుకోగా.. ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు ఢీకొంది. దీంతో ఎర్రిస్వామి కారు పైభాగంపై పడి మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారును ఆపకుండా నిర్లక్ష్యంగా ముందుకు దూసుకెళ్లాడు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద వాహన చోదకులు కారు పైభాగంపై మృతదేహం ఉండటాన్ని గుర్తించి.. కారు డ్రైవర్‌కు చెప్పారు. దీంతో కారును రోడ్డు పక్కన ఆపి, టాప్‌పై పడి ఉన్న మృతదేహాన్ని గమనించి అక్కడి నుంచి ఉడాయించాడు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తండ్రీ కొడుకుల దెబ్బ.. చంద్రబాబు అబ్బా
తనకు ఎదురేలేదని విర్రవీగిన ఆయనకు పెద్దాయన గట్టిదెబ్బే కొట్టారు. దారుణ ఓటమి రుచిచూపించారు. అయితే, అలాంటి వ్యక్తి ఆకస్మిక మరణంతో మళ్లీ తెరమీదికి వచ్చిన ఆయన.. ప్రజలను బురిడీ కొట్టించి మళ్లీ గద్దెనెక్కారు. నమ్మి ఓట్లేసిన పాపానికి నరకం చూపించారు. ఆయన చేతిలో దారుణంగా మోసపోయిన జనం.. తమను అక్కున చేర్చుకున్న పెద్దాయన కుమారుడికి పట్టం కట్టారు. ఆ పెద్దాయన, ఆయన కుమారుడు మరెవరో కాదు దివంగత నేత వైఎస్సార్, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: వైఎస్ రాజశేఖర రెడ్డి చేతిలో 2004,2009లో ఘోర పరాభవం మూటగట్టుకున్న చంద్రబాబును.. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా మట్టి కరిపించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బాబుకు చుక్కలు చూపించారు. గతంలో జరిగిన నాలుగు ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 14 నియోజకవర్గాలున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్ కుటుంబ విశ్వసనీయతకే జనం పట్టం కట్టినట్లు తెలిసిపోతుంది. మాట ఇస్తే దాన్ని నెరవేర్చే వరకూ వెనకడుగు వేయని తత్వం, తమ అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటారన్న నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతోనే ఇది సాధ్యమైంది. తమకు జిల్లా కంచుకోట అని బాకాలు ఊదే టీడీపీ నాయకుల మాటలను జనం నమ్మడం లేదు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో.. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర తనదనీ, మూడు దఫాలు ముఖ్యమంత్రి అయ్యానని చెప్పుకునే చంద్రబాబు.. తండ్రీతనయుల చేతిలో దారుణంగా ఓడిపోవడం చరిత్రలో ఒక విచిత్రం. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేతగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంపూర్ణ ఆధిపత్యం సాధించారు. టీడీపీని పరాభవం బాట పట్టించారు. జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టడం, తన హయాంలోనే ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేయడంతోనే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. 2019లో సునామీ సృష్టించిన జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా 2019లో రాజకీయ పెను తుఫాను సంభవించిందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించింది. ఫ్యాను ధాటికి సైకిల్ గల్లంతైంది. జనహితమే లక్ష్యంగా బరిలోకి దిగిన జగన్ సైన్యం టీడీపీ అభ్యర్థులను మట్టి కరిపించింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు దఫాలు బాబును కోలుకోలేని దెబ్బతీయగా.. 2019లో జగన్ ఏకంగా చంద్రబాబును రాజకీయంగా వెంటిలేటర్‌పై పడుకోబెట్టినంత పనిచేశారు. ఇక అప్పట్లో గెలిచిన ఇద్దరు టీడీపీ అభ్యర్థులు కూడా అత్తెసరు మెజారీ్టతో గట్టెక్కడం గమనార్హం. పాతకథ పునరావృతమే..! 2019 ఫలితాలు ఈ ఎన్నికల్లోనూ పునరావృతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో పారీ్టకి పనిచేసిన వారిని కాదని డబ్బున్న వారికి టికెట్లు ఇవ్వడంతో టీడీపీలో అసమ్మతి జ్వాలలు రగులుతూనే ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. టీడీపీ కేడర్ కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది. అభ్యర్థుల ఎంపిక తమ పారీ్టకి గుదిబండలా తయారైందని నాయకులు వాపోతున్నారు. ముఖ్యంగా మొన్నటిదాకా తీవ్రంగా విమర్శించిన గుమ్మనూరు జయరామ్‌కు చంద్రబాబు టికెట్ ఇవ్వడంతో కేవలం డబ్బు కోసమే సీటు కేటాయించారన్న విమర్శలు ఆ పార్టీ నేతల నుంచే వెల్లువెత్తుతున్నాయి. కళ్యాణదుర్గం, అనంతపురం, పుట్టపర్తి వంటి నియోజకవర్గాల్లోనూ డబ్బున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడంతో ద్వితీయ శ్రేణి నాయకులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ టీడీపీకి భంగపాటు తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
మేమంతా సిద్ధం@డే4: సీఎం జగన్‌కు గ్రామగ్రామాన సాదర స్వాగతం
CM YS Jagan Memantha Siddam Bus Yatra 2024 Updates బెంగళూరు జాతీయ రహదారిపై దారి పొడవునా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రకు ఆత్మీయ స్వాగతం పలికిన జనం పామిడి వద్ద జాతీయ రహదారిపై జనాలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన ముఖ్యమంత్రి జగన్ బస్సుయాత్ర తుగ్గలి నుండి గుత్తి వరకు దారిపొడుగునా స్వాగతం పలికిన ప్రజలు గుత్తి గాంధీ సర్కిల్లో జనసునామీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుయాత్రకు వెల్లువలా తరలి వచ్చిన ప్రజలు అన్నీ మారుతున్నాయి.. సీఎం జగన్ ట్వీట్ మన గ్రామంలో వ్యవసాయం మారింది, వైద్యం మారింది, స్కూళ్లు మారాయి గతానికి భిన్నంగా అన్నీ మారుతున్నాయి పేదోళ్ల బతుకులు మారాలంటే జరుగుతున్న ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు జరుగుతున్న ఈ మార్పుని కొనసాగించడం కోసం వేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి మన గ్రామంలో వ్యవసాయం మారింది, వైద్యం మారింది, స్కూళ్లు మారాయి. గతానికి భిన్నంగా అన్నీ మారుతున్నాయి. పేదోళ్ల బతుకులు మారాలంటే జరుగుతున్న ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు జరుగుతున్న ఈ మార్పుని కొనసాగించడం కోసం వేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి.… pic.twitter.com/mU7uuNtwOT — YS Jagan Mohan Reddy (@ysjagan) March 30, 2024 అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన బస్సు యాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కర్నూలు జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా అనంతపురం జిల్లాలోకి బస్సు యాత్ర సీఎం జగన్. గుంతకల్లు నియోజకవర్గం బసినేపల్లిలో సీఎం జగన్‌కు ఘనస్వాగతం సీఎంకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర కాసేపట్లో అనంతపురంలోకి ప్రవేశించినున్న మేమంతా సిద్ధం యాత్ర గుత్తి శివారులో భోజన విరామం విరామం అనంతరం కొనసాగనున్న ఎన్నికల ప్రచార యాత్ర దారి పొడవునా ఆత్మీయ స్వాగతం కోసం పలు గ్రామాల ప్రజల ఏర్పాట్లు సాయంత్రం ధర్మవరం నియోజకవర్గ పరిధిలో ముగియనున్న యాత్ర జగనన్న మీ బిడ్డ.. ఆప్యాయత ఇలాగే ఉంటుంది మరి! తుగ్గలిలో ముగిసిన సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమం తుగ్గలి పరిధిలో జరిగిన అభివృద్ధిన వివరించిన సీఎం జగన్ ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించిన సీఎం జగన్ తమకు చేకూరిన లబ్ధి గురించి చెప్పి సంతోషించిన గ్రామస్తులు సీఎం జగన్‌కు పలు వినతులు చేసిన ప్రజలు ముఖాముఖి ముగియడంతో మళ్లీ మొదలైన మేమంతా సిద్ధం యాత్ర తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి.. తుగ్గలిలో సీఎం జగన్ మాట్లాడుతూ.. దేశంలో రూ.3వేలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆరోగ్యశ్రీని రూ.25లక్షలకు పెంచాం. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడాను గమనించండి. మన ప్రభుత్వం ఎన్నో మార్పులు జరిగాయి. సంక్షేమం మీ ఇంటి వద్దకే వచ్చింది. మీ బిడ్డ పాలనలో నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బు చేరింది. ఎక్కడా కూడా లంచాలు, వివక్ష లేకుండా సాయం అందించం జరిగింది. ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే సాయం అందించాం. తుగ్గలిలో 1748 ఇళ్లు ఉన్న సచివాలయ పరిధిలో అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం. 58 నెలల కాలంలో గ్రామాల్లో అభివృద్ధి జరిగింది. తుగ్గలి, రతన పరిధిలో 10వేల మంది జనాభా. తుగ్గలి, రాతన పరిధిలో 95 శాతం ఇళ్లకు బటన్ నొక్కి నిదులు జమ చేశాం. 1748లో 1666 ఇళ్లకు 29 కోట్ల 65లక్షల రూపాయలు అందజేశాం. రాతనలో 26కోట్లు. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారు. మీ బిడ్డ పాలనలో ప్రతీ ఇంటి తలుపు తగ్టి సంక్షేమం అందించాం. రైతన్నకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు అండగా ఉంటున్నాం. ఆర్బీకేలను ఏర్పాటు చేశాం. కార్పొరేటుకు ధీటుగా స్కూల్స్‌ను తీర్చిదిద్దాం. వైద్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. అమ్మఒడి పథకం కింద.. తుగ్గలి.. రెండు కోట్ల 91 లక్షలు రాతన.. రెండు కోట్ల 57 లక్షలు వైఎస్సార్ చేయూత.. తుగ్గలి.. రెండు కోట్ల 30 లక్షలు రాతన.. రెండు కోట్ల 19 లక్షలు జగనన్న విద్యాదీవెన.. రెండున్నర కోట్లు. తుగ్గలికి.. కోటీ 16 లక్షలు రాతన.. కోటీ 26 లక్షలు జగనన్న వసతి దీవెన.. తుగ్గలికి.. 51 లక్షలు రాతన.. 54 లక్షలు వైఎస్సార్ ఆసరా.. 2 కోట్ల 60 లక్షలు తుగ్గలి.. కోటి 95లక్షలు రాతన.. 65 లక్షలు సున్నా వడ్డీ.. తుగ్గలి..15 లక్షలు రాతన.. 60 లక్షలు ఇళ్లకు సంబంధించి.. తుగ్గలికి.. 66 రాతన.. 122 పెన్షన్లు.. తుగ్గలి.. ఏడు కోట్ల 58 లక్షలు. రాతన.. ఏడు కోట్ల 54 లక్షలు. రైతు భరోసా.. తుగ్గలి.. ఆరు కోట్ల 15 లక్షలు రాతన.. ఐదు కోట్ల 49 లక్షలు తుగ్గలి చేరుకున్న సీఎం జగన్ ప్రారంభమైన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం జగనన్న.. మేమంతా సిద్ధం: తుగ్గలి ప్రజలు మేమంతా సిద్ధం అంటూ నినాదాలు చేస్తున్నారు కర్నూలు జిల్లా తుగ్గలి వాసులు అభివృద్ధి - సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుపరిపాలన అందించారని.. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమంటున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అనైతికం అని.. 2014 లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబు నాయుడు చెప్పాలని నిలదీస్తున్నారు తుగ్గలి సీఎం జగన్ ముఖాముఖి వేదిక వద్ద.. సంబురంగా నృత్యాలు చేస్తున్న మహిళా లబ్ధిదారులు వైఎస్సార్సీపీ నేతలతో సుదీర్ఘంగా సీఎం జగన్ చర్చలు పత్తికొండ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, కళ్యాణదుర్గం సహా కర్నూలు జిల్లా నేతలు సుమారు 1 గంటా 30 నిమిషాలకు పైగా నేతలు, కార్యకర్తలతో గడిపిన సీఎం జగన్ పలువురు పార్టీ నేతలను, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ... యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసిన సీఎం జగన్ కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర ప్రచార రథం దిగి మార్గమధ్యలో ప్రజల్ని కలుస్తున్న సీఎం జగన్ రతనలో ప్రజలతో మమేకమవుతున్న సీఎం జగన్ కాసేపట్లో తుగ్గలి చేరుకోనున్న సీఎం జగన్ తుగ్గలి ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి రతనలో.. కర్నూలు జిల్లా రతనకు చేరుకున్న సీఎం జగన్ ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు తుగ్గలి మండలం రాతన గ్రామంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురుచూస్తున్న గ్రామ ప్రజలు, జగనన్నకు స్వాగతం పలికేందుకు గజమాల, రోడ్లపై బంతిపూల బాట వేసిన గ్రామ ప్రజలు పత్తికొండ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర కాసేపట్లో తుగ్గలి చేరుకోనున్న సీఎం జగన్ తుగ్గలి ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నేడు అనంతలోకి సీఎం జగన్ బస్సు యాత్ర అనంతపురంలోకి నేడు ప్రవేశించనున్న సీఎం జగన్ బస్సు యాత్ర అనంతపురం జిల్లా సిద్ధమా? అంటూ ట్వీట్ చేసిన సీఎం జగన్ అనంతపురం జిల్లా సిద్ధమా…?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) March 30, 2024 తుగ్గలి సీఎం జగన్ ముఖాముఖి వేదిక వద్ద.. సంబురంగా నృత్యాలు చేస్తున్న మహిళా లబ్ధిదారులు మేమంతా సిద్ధంలోనూ చేరికలు ఎన్నికల వేళ అధికార పార్టీలో చేరుతున్న ప్రతిపక్ష నేతలు సీఎం జగన్ బస్సు యాత్రలో కొనసాగుతున్న చేరికల పర్వం తాజాగా పత్తికొండలో సీఎం జగన్ సమక్షంలో YSRCPలో చేరిన కళ్యాణదుర్గం టీడీపీ ఇన్చార్జ్ ఉమామహేశ్వర నాయుడు నాలుగో రోజు సీఎం జగన్ బస్సు యాత్ర నేడు అనంతపురంలోకి ప్రవేశించనున్న బస్సు యాత్ర కాసేపట్లో పత్తికొండ నుంచి ప్రారంభం పత్తికొండ బస శిబిరం వద్దకు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పత్తికొండ నుంచి తుగ్గలి చేరుకోనున్న సీఎం జగన్ తుగ్గలి ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి సీఎం జగన్ ప్రచార రథానికి అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న జనం కాసేపట్లో పత్తికొండ నుంచి ప్రారంభం కానున్న సీఎం జగన్ బస్సు యాత్ర బైపాస్‌లో బస చేసిన ప్రాంతం నుంచి మొదలుకానున్న సీఎం జగన్ బస్సు యాత్ర రతన మీదుగా తుగ్గలి, గజరాంపల్లి, జొన్నగిరి, గుత్తి, పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు, ఆకుతోటపల్లి, కృష్ణంరెడ్డిపల్లి వద్ద ముగింపు మధ్యలో తుగ్గలిలో సీఎం జగన్ పబ్లిక్ ఇంటెరాక్షన్ రాత్రి ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని సంజీవపురంలో బస ఇదీ చదవండి: మోసగాళ్ల తోక కత్తిరించే స్టార్‌క్యాంపెయినర్లు మీరే తుగ్గలిలో ప్రజలు, మేధావులతో సీఎం జగన్ ముఖాముఖి మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా తుగ్గలిలో పబ్లిక్ ఇంటెరాక్షన్ ప్రజలు, మేధావులతో ముఖాముఖి కానున్న సీఎం జగన్ వైఎస్సార్సీపీ గత 58 నెలలో పాలనలో తుగ్గలికి చేకూరిన లబ్ధిని సీఎం జగన్ వివరించే ఛాన్స్ మంచి కొనసాగాలంటే మళ్లీ ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని తుగ్గలి ప్రజలను కోరనున్న సీఎం జగన్ ముఖాముఖిలో పలువురు లబ్ధిదారులకు మాట్లాడే అవకాశం Memantha Siddham Yatra, Day -4. పత్తికొండలోని KGN ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. తుగ్గలి గ్రామస్తులతో జగనన్న ముఖాముఖి.. ఉదయం 11:30 గంటలకు గుత్తి రోడ్డు షో...#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/lk6U3u2OIo — YSR Congress Party (@YSRCParty) March 30, 2024 నేడు అనంతలోకి ప్రవేశించనున్న మేమంతా సిద్ధం ఇవాళ(మార్చి 30) నాలుగో రోజుకి చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర కర్నూలు, అనంతపురం జిల్లాలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం పత్తికొండ నుంచి బయలుదేరనున్న ప్రచార రథం రతన మీదుగా తుగ్గలి చేరిక జొన్నగిరి, గుత్తి మీదుగా ప్రయాణించి గుత్తి శివారులో భోజనవిరామం తీసుకుంటారు. పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్ , ఆకుతోటపల్లి , సంజీవపురం శివారు వరకు యాత్ర సంజీవపురం శివారులో సీఎం జగన్ రాత్రి బస మొత్తం 102 కిలోమీటర్ల దూరం కొనసాగనున్న యాత్ర మోసగాళ్లను నమ్మొద్దు: ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్ వారి తోకలు కత్తిరించేలా మీరే స్టార్ క్యాంపెయినర్లు కావాలి ఎమ్మిగనూరు సభలో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మీ బిడ్డ మంచి చేసి ఉంటే ఆ మంచిని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి ఆడబిడ్డల కష్టాలు కళ్లారా చూశా.. అందుకే విప్లవాత్మక పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు 50% నామినేటెడ్ పదవులు పిల్లల బంగారు భవిష్యత్ కోసం విద్యారంగంలో సంస్కరణలు అన్ని వర్గాల వారికి మంచి చేసిన ప్రభుత్వానికి రాఖీ కట్టండి మళ్లీ ఆ ముగ్గురు మోసాలు చేసేందుకు కూటమిగా వస్తున్నారు వ్యవసాయం దండగన్న బాబు ఓవైపు.. భూమి పుత్రుడైన మీ బిడ్డ మరోవైపు పేదల తల రాతలు మార్చే ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి కర్నూలు మేమంతా సిద్ధం సక్సెస్ మూడో రోజు కర్నూలు పార్లమెంట్ స్థానం పరిధిలో సాగిన మేమంతా సిద్ధం యాత్ర దారిపొడువునా సీఎం జగన్‌కు సాదర స్వాగతం పలికిన పలు గ్రామాల ప్రజలు ఎమ్మిగనూరు బహిరంగ సభకు పోటెత్తిన జనం కర్నూలు సిద్ధం యాత్ర సూపర్ సక్సెస్ అంటూ వైఎస్సార్సీపీ పోస్టు కర్నూల్ జిల్లాలో జరిగిన మేమంతా సిద్ధం యాత్రలో జననేతను చూసేందుకు పోటెత్తిన జనం. Memantha Siddham Yatra | Day -3 | Highlights #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/bNDJWV0KqD — YSR Congress Party (@YSRCParty) March 29, 2024 -
అనంతపురం టీడీపీలో అసమ్మతి జ్వాలలు (ఫొటోలు)
-
టీడీపీలో టికెట్ మంటలు.. భగ్గుమన్న అసంతృప్తి
సాక్షి, అనంతపురం: టీడీపీ టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అనంతపురం అర్బన్ టికెట్‌ను దగ్గుబాటి ప్రసాద్‌కు కేటాయించగా.. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు మొండిచేయి చూపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభాకర్ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. ప్రభాకర్ చౌదరి వర్గీయులు.. చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసి దహనం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. చంద్రబాబు కోట్ల రూపాయలు డబ్బు తీసుకుని టికెట్లు కేటాయించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఏజెన్సీ నేతలకు చంద్రబాబు హ్యాండ్ ఏజెన్సీ నేతలకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. రా కదలిరా బహిరంగ సభలో దన్ను దొర పేరు ప్రకటించిన చంద్రబాబు.. చివరి నిమిషంలో సీటు బీజేపీకి కేటాయించారు. టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న దన్ను దొర.. రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. నక్సల్స్ కాల్పుల్లో మృతిచెందిన కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోము కుటుంబ సభ్యులకు చంద్రబాబు వెన్నపోటు పొడిచారు. సివేరు సోము కుమారుడు అబ్రహం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు కిడారి శ్రవణ్ దూరంగా ఉంటున్నారు. -
రాప్తాడులో చంద్రబాబుకు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం: రాప్తాడులో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. జనం లేక చంద్రబాబు సభ వెలవెల బోయింది. సభా ప్రాంగణం ఖాళీగా ఉండటంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాట్లాడుతుండగానే జనం వెళ్లిపోయారు. కాగా, కుప్పంలోనే కాదు పలమనేరులోనూ చంద్రబాబు చెప్పిందే చెప్పి రొటీన్ ప్రసంగంతో ప్రజలకు బోర్ కొట్టించారు. తన గంట ప్రసంగంలో అనువుగాని హామీలు వందల్లోనే గుప్పించారు. ఈ మాటలు వివీ వినీ జనం అక్కడనుంచి మెల్లగా జారుకోవడం కనిపించింది. ఆయన పదేపదే చేతులెత్తండి..గట్టిగా చప్పట్లు కొట్టండి.. అంటున్నా జనం నుంచి పెద్దగా స్పందన రాలేదు. మరో వైపు, రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ‘సిద్ధం’ సభలకు లభించిన విశేష స్పందన, సభలకు హాజరైన అశేష జనవాహినిని పత్రికలు, టీవీలలో చూసిన చంద్రబాబుకు భయం పట్టుకుంది. ‘మేమంతా సిద్ధం’ సీఎం జగన్ బస్సు యాత్రకు కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు -
నేటి తరానికి ఆదర్శమూర్తి లలితమ్మ
దేశం కోసం యుద్ధంలో పోరాడే సైనికుడిని రణభూమికి పంపించే తల్లి ఎంత గొప్పదో.. అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రజాసేవ చేసే రాజకీయాల్లోకి పంపించడం కూడా అంతే గొప్పది. కొడుకు రాజకీయాల్లోకి వెళ్తానంటే అడ్డుపడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటారు. కానీ.. తన కుమారులందరినీ ప్రజాసేవకు అంకితం చేసింది ఆ మాతృమూర్తి. ప్రజాభిమానం కలలు కంటే వచ్చేది కాదని.. బతికినన్ని రోజులు జనాన్ని ఇంటివాళ్లుగా భావించాలని చెబుతూ వారిని ప్రజాప్రతినిధులుగా మార్చింది. ఉగ్గుపాలతోనే కొడుకులకు ప్రజాసేవ నేర్పించిన ఆ తల్లి.. ఇప్పుడు కానరాని లోకాలకు వెళ్లిపోయింది. దేవుడు ఆత్మకు మాత్రమే బాధ్యత వహిస్తాడు. కానీ అమ్మ ఆత్మకూ, శరీరానికీ బాధ్యత వహిస్తుంది. అందుకే.. తన పిల్లలపై జీవితాంతం నిస్వార్థమైన ప్రేమను కురిపిస్తూనే ఉంటుంది. తన పిల్లలు ఉన్నత స్థానాల్లో స్థిరపడి సిరిసంపదలతో సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. అయితే.. మాతృమూర్తులంతా ఒకేలా ఆలోచించరు. కేవలం తాము.. తమ కుటుంబం అని కాకుండా.. దేశం కోసం పరితపించే తల్లులు ఎందరో ఉన్నారు. వారి వల్లే ఎంతోమంది సైనికులుగా సరిహద్దుల్లో కాపలా కాస్తూ మనం నిర్భయంగా జీవించేలా ధైర్యాన్నిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మ పేరు ఎల్లారెడ్డిగారి లలితమ్మ. ఈ తల్లి కూడా తన పిల్లలను దేశ సేవకే అంకితం చేయాలని భావించారు. తండ్రి వారసత్వంగా కొడుకులందరినీ ప్రజాసేవలో తరలించేలా చేశారు. ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా తన ఐదుగురు కొడుకులను ప్రజాప్రతినిధులుగా మార్చిన ఆమె... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక టీటీడీ బోర్డు మెంబర్‌ను ఇచ్చారు. బతికున్నంత కాలం కుమారులకు రాజకీయ దిశానిర్దేశం చేసిన లలితమ్మ.. 91 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మంలం కొనకొండ్ల గ్రామానికి చెందిన ఎల్లారెడ్డిగారి భీమిరెడ్డితో కర్నూలు జిల్లాలోని బద్నాల గ్రామానికి చెందిన లలితమ్మకు 12 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. వీరికి ఆరుగురు కుమారులు, ఒక కుమార్తె. తొలి నుంచీ రాజకీయాలపై ఆసక్తి ఉన్న భీమిరెడ్డి 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి ఉరవకొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత రెండేళ్లకే భీమారెడ్డి కన్నుమూశారు. ఆ తర్వాత కుమారులను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన లలితమ్మ.. వారికి దిశానిర్దేశం చేయడం ప్రారంభించారు. ప్రజాభిమానం అనేది కలలు కంటే వచ్చేది కాదని.. ఎప్పటికీ ప్రజలను ఇంటివాళ్లుగానే భావించాలని తొలి నుంచీ వారికి చెప్పుకుంటూ వచ్చారు. ప్రజాసేవలో అనుసరించాల్సిన విధానాలతోపాటు ఎన్నికల వ్యూహాలపై కుమారులకు సలహాలు ఇచ్చేవారు. అమ్మ మాట ప్రకారమే నడుచుకున్న లలితమ్మ కొడుకులు ఇప్పుడు ఉన్నత స్థానంలో నిలిచి ప్రజాసేవలో తరిస్తున్నారు. భీమిరెడ్డి-లలితమ్మ కుమారుల్లో జయరామిరెడ్డి ఇప్పటికే మృతిచెందగా.. కూతురు వరలక్ష్మి గుంతకల్లులో నివాసముంటున్నారు. ఇక మొదటి కొడుకు సీతారామిరెడ్డి ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేస్తుండగా.. శివరామిరెడ్డి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక వెంకట్రామిరెడ్డి గుంతకల్లు, సాయిప్రసాద్‌రెడ్డి ఆదోని, బాలనాగిరెడ్డి మంత్రాలయం ఎమ్మెల్యేలుగా ప్రజా సేవ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలు చేరవేయడమే కాదు.. తమకున్నంతలో చేయూతనిచ్చి ఆదుకోవాలని లలితమ్మ చెప్పిన మాటలను ఇప్పటికీ పాటిస్తారు ఆమె కుమారులు. అందుకే పేదల పెళ్లిళ్లకు తాళిబొట్లు, కొత్త బట్టలు అందించడం, ఆర్థిక స్థోమత లేని వారిని చదివించడం వంటి సేవా కార్యక్రమాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తండ్రి, కుమారులతో కలిపి ఒకే ఇంటి నుంచి ఏకంగా ఆరుగురు రాష్ట్రానికి సేవలందించడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. తండ్రి చనిపోయినా.. ఆ లోటు లేకుండా పిల్లలను పెంచి పెద్దచేసి వారిని ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దిన లలితమ్మ.. నేటి తరానికి ఆదర్శమూర్తిగా నిలుస్తున్నారు. -
నిరూపిస్తే రాసిస్తా.. చంద్రబాబుకు ఎమ్మెల్యే తోపుదుర్తి సవాల్
సాక్షి, అనంతపురం: తనకు రూ.500 కోట్ల ఆస్తులున్నట్లు నిరూపిస్తే మీకే రాసిస్తానంటూ చంద్రబాబుకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. ‘‘మీరు ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేస్తా.. నాకు ఉన్నాయని చెప్తున్న 500 కోట్లు మీరే రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు పంచండి’’ అని చెప్పారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనంటూ తోపుదుర్తి మండిపడ్డారు. ‘‘రాప్తాడు టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత అవినీతి చంద్రబాబుకు కనిపించలేదా?. పరిటాల కుటుంబీకుల అక్రమాస్తులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరు?. చంద్రబాబు దిగజారి ఆరోపణలు చేస్తున్నారు. కియా ఫ్యాక్టరీ చంద్రబాబు వల్ల రాలేదు. వైఎస్సార్, నరేంద్ర మోదీ కృషి ఫలితంగా కియా ఫ్యాక్టరీ ఏర్పడింది. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించిన ఘనత వైఎస్సార్‌దే. పెనుకొండ ప్రాంతంలో వైఎస్సార్ నీటి వసతి కల్పించారు కనుకే కియా ఫ్యాక్టరీ వచ్చింది’’ అని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్.. కేడర్‌కు గూస్ బంప్స్ -
అనంతపురంలో రెచ్చిపోయిన టిడిపి శ్రేణులు
-
CM Jagan: రాప్తాడు ‘సిద్ధం’ సభ హైలైట్స్
సాక్షి, అనంతపురం జిల్లా: రాయలసీమలోనే కాదు.. ఏపీలోనే కనివిని ఎరుగని రీతిలో జరిగిన రాప్తాడు సిద్ధం సభ జరిగింది. సభ సముద్రాన్ని తలపించింది. సభకు లక్షలాదిగా జగన్ దండు తరలివచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం సింహనాదంలా కొనసాగింది. సీఎం జగన్ స్పీచ్‌కు జనం యుద్ధ నినాదాన్ని మోగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టార్గెట్ 175 ఫిక్స్ చేసిన సీఎం జగన్.. ఎంత మంది జత కట్టినా.. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. ప్రజలతోనే తన పొత్తు అని స్పష్టం చేశారు. ప్రజలే స్టార్ క్యాంపెనర్లుగా సీఎం జగన్ ప్రకటించారు. లబ్దిదారులే తనకు ఓటు వేయిస్తారని ప్రకటించిన సీఎం జగన్.. ఫ్యాన్ ఇంట్లో ఉండాలని, సైకిల్ బైట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలంటూ జగన్ పొలిటికల్ పంచ్‌లు విసిరారు. ఎన్నికలు ముగిసే వరకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ►మేనిఫెస్టోలో 99 శాతం హామీలు పూర్తి చేశామని సగర్వంగా ప్రకటించిన సీఎం జగన్ ►పరిపాలనలో ఎక్కడా తగ్గలేదు. మరి ఒక్క సీటు కూడా ఎలా తగ్గుతుందని సీఎం జగన్ భరోసా ►భీమిలి, దెందులూరు సభలకు మించి రాప్తాడులో సిద్ధం సభ సక్సెస్‌తో వైఎస్సార్సీపీ కేడర్‌లో జోష్ ►ప్రతిపక్షాల కుట్రలను ఎండగట్టిన సీఎం జగన్ ►ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా సూటిగా, స్పష్టంగా ఎన్నికల నినాదాన్ని సవివరంగా సోదహారణంగా వివరించిన సీఎం జగన్ ఇదీ చదవండి: రాప్తాడు ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ పంచ్‌లు -
Watch Live: రాష్ట్ర చరిత్రలోనే భారీ బహిరంగ సభ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ జనసముద్రంలా కనిపిస్తోంది పెత్తందారులతో మన యుద్ధం జరగబోతుంది 2024లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది పెత్తందార్లతో యుద్ధానికి మీరు సిద్ధమేనా? విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోంది పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా? చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? ప్రజల మంచి కోసం చంద్రబాబు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా? చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా? చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికైనా సామాజిక న్యాయం గుర్తుకొస్తుందా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 10 శాతమైనా అమలు చేశారా? 1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టోలో 10 శాతమైనా అమలు చేశారా? మళ్లీ అబద్దాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారు రంగురంగుల మేనిఫెస్టోలతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడు చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకు అనేది చంద్రబాబు సిద్ధాంతం 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏ ప్రాంతానికైనా న్యాయం చేశారా? చంద్రబాబు అబద్ధాలను నమ్మొద్దని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారు గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతపెట్టి చంద్రబాబు కుర్చీని మడతేసి వాళ్ల సీట్లను తగ్గించారు చంద్రబాబును మళ్లీ ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా? కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బాబు మార్క్ ఎక్కడైనా ఉందా? 57 నెలల పాలనలో చిత్తశుద్ధితో పాలన అందించాం 57 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం 57 నెలల పాలనలో జరిగిన మంచిని ప్రజలందరికీ వివరించండి ప్రతీ ఇంట్లో జరిగిన మంచిని ప్రతీ ఒక్కరికీ వివరించండి చేసినవి చెప్పాలి, వాటి కొనసాగింపు ఎంత అవసరమో చెప్పాలి ప్రతి అవ్వా, తాత ముఖంలో చిరునవ్వులు చూశాం ప్రతి అక్క, చెల్లెమ్మకు ఎంతో మేలు చేశాం రైతులకు రైతు భరోసా తీసుకొచ్చి ఇచ్చాం రైతన్నకు పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చాం మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెని చంద్రబాబు లాక్కుంటారు వైఎస్ఆర్ సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఎన్నో పథకాలు గుర్తొస్తాయి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మనది ప్రతీ అక్కచెల్లెమ్మ ఫోన్ లో దిశ యాప్ తీసుకొచ్చాం చంద్రబాబు మోసాలను ప్రతీ రైతన్నకు వివరించాలి సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలి ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి గతంలో ఎన్నడూ చూడని విధంగా నాడు-నేడుతో మార్పులు తెచ్చాం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం పేద విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చాం కేవలం కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు రాకూడదంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలి వాళ్లంతా మనకు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలి సైకిల్ గుర్తుకు ఓటు వేయడమంటే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడమే YSRCP మార్క్ ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తోంది ప్రజలు ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇవన్నీ చేశాం ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే మరిన్ని మంచి పనులు చేస్తాం లంచాలకు తావులేకుండా పేదల ఖాతాల్లోకి నగదు బదిలీ జరుగుతోంది 57 నెలల్లోనే 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం చంద్రబాబుకు ఓటు వేయడమంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయడమే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేశాం 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదు అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు? విద్యాదీవెన, వసతి దీవెనతో విద్యార్ధులకు అండగా నిలిచాం పెత్తందారుల పిల్లలతో మన పిల్లలు పోటీ పడాలంటే మళ్లీ మన ప్రభుత్వమే రావాలి మన పిల్లలు ప్రపంచ స్థాయికి ఎదిగేలా విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చాం పెన్షన్ కొనసాగాలంటే మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే రావాలి మీ అన్న ప్రభుత్వమే సంక్షేమ పథకాలను కొనసాగించగలదు జరుగుతున్న మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వమే రావాలి వైఎస్ఆర్ సీపీ పేరు చెబితే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి కోవిడ్ కష్టకాలంలోనూ అందించిన సేవలు గుర్తొస్తాయి లంచాలకు తావు లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బు వేశాం మీ బిడ్డ 125 సార్లు బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నిధులు జమ చేశాం రూ.2.55 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ఖాతాల్లో వేశాం వైఎస్ఆర్ సీపీ మార్క్ ప్రతీ ఇంట్లోనూ కనిపిస్తోంది మళ్లీ అవకాశమిస్తే ఇంకెంత మంచి జరుగుతుందో ఆలోచించమని చెప్పండి 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవుల్లో ప్రాధాన్యతనిచ్చాం కేవలం 57 నెలల కాలంలో 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాం నిరుపేద వర్గాలకు 80 శాతం ఉద్యోగాలు ఇచ్చాం మేనిఫెస్టోను మీ బిడ్డ మాదిరిగా అమలు చేసిన వారెవరైనా ఉన్నారా? చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటేయాలి? జగన్ కు జనబలం లేకుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు? తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర ఎందుకు? సైకిల్ ను తొయ్యడానికి ప్యాకేజ్ స్టార్ ఎందుకు? ప్రజల కోసం 125 సార్లు నేను బటన్ నొక్కాను మళ్లీ ఫ్యాన్ కు ఓటేస్తే చంద్రముఖి బెడద ఇక మీకుండదు సైకిల్ కు ఓటేస్తే పేదల రక్తం తాగేందుకు చంద్రముఖి వస్తుంది పేదవాడి బతుకును మార్చేందుకు మనం యుద్దం చేస్తున్నాం చంద్రబాబు పెత్తందారుల తరపున సంసిద్ధం అంటున్నారు టీడీపీ దేనికి సంసిద్ధమని అడుగుతున్నా ?? దుష్టచతుష్టయం బాణాలకు తల వంచేందుకు ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు, అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ప్రజలున్నారు వైఎస్ఆర్ సీపీ మీ అందరి పార్టీ మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు.. ప్రజలతోనే మా పొత్తు గతంలో లంచాలు పిండుతూ తన వారికే చంద్రబాబు పథకాలిచ్చుకున్నాడు పార్టీలో ప్రతి కార్యకర్తకూ మీ అన్న జగన్ తోడుగా ఉంటాడు నాయకుడంటే ప్రతీ కార్యకర్తా కాలర్ ఎగరేసేలా ఉండాలి వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175 అసెంబ్లీ స్థానాలు వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25కి 25 ఎంపీ స్థానాలు 650 హామీలిచ్చి 10 శాతం కూడా చంద్రబాబు అమలు చేయలేదు మేనిఫెస్టోలో వైఎస్ఆర్ సీపీ 99 శాతం హామీలు అమలు చేసింది ఎల్లోమీడియా దుష్ప్రచారాలను తిప్పి కొట్టేందుకు మీరు సిద్ధమా? మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమా? ఈ ఎన్నికల తర్వాత టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు ఎల్లో మీడియా చీకటి రాతలు తిప్పి కొట్టేందుకు మీరు సిద్ధమా? పెత్తందారులంతా తోడేళ్లుగా ఏకమవుతున్నారు ఈ ఎన్నికలు చాలా కీలకం పొరపాటు జరిగితే పేదవాడి బతుకు అతలాకుతలమవుతుంది సమర భేరి మోగిద్దాం... సమర నినాదం వినిపిద్దాం -
భీమిలి, దెందులూరును మించిపోయేలా రాప్తాడు ‘సిద్ధం’
సాక్షి, అనంతపురం: సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది. అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ... సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే భీమిలి, దెందులూరు బహిరంగ సభలు విజయవంతం అయ్యాయి. రేపు అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ జరగనుంది. రాప్తాడు సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద సుమారు 250 ఎకరాల మైదానం లో సిద్ధం సభ కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. లక్షలాది మంది వచ్చే సిద్ధం సభ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. రాప్తాడు బైపాస్ వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. పరిసర ప్రాంతాల్లో 16 చోట్ల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. బెంగళూరు నుంచి వచ్చే భారీ వాహనాలు కళ్యాణ దుర్గం మీదుగా మళ్లిస్తారు. అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే భారీ వాహనాలను ధర్మవరం మీదుగా మళ్లిస్తారు. ఈ ఆంక్షలు భారీ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ ప్రయాణికుల వాహనాలు యథావిధిగా రాప్తాడు హైవే పై వెళ్లవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధం సభకు పెద్ద సంఖ్యలో జనం వస్తారని... ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఎం ప్రొగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. రాప్తాడు సిద్ధం సభ నుంచి సీఎం జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో సీఎం జగన్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం మరోసారి ఖాయమని ఎమ్మెల్యే తోపుదుర్తి పేర్కొన్నారు. -
అభివృద్ధికి కేరాఫ్ గా అనంతపురంజిల్లా
-
టీడీపీలో తగ్గుతున్న ప్రాధాన్యం.. పెరుగుతున్న ప్రత్యర్ధులు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఫ్యాక్షనిస్టుగా, మాజీ నక్సలైటుగా జిల్లాలో దశాబ్దకాలం పాటు పరిటాల రవి రాజకీయాలను శాసించారు. ఆయన మరణానంతరం టీడీపీ గడ్డు కాలం ఎదుర్కొంటోంది. సొంత పార్టీలోనే గ్రూపులు, అధిష్టానం ఆడుతున్న డ్రామాలు వెరసి పరిటాల సునీత, తనయుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ భవిష్యత్‌కు ప్రతిబంధకాలయ్యాయి. మరోవైపు తల్లీ కొడుకుల మధ్యే ఎన్నికల్లో పోటీ ఎవరు చేయాలనే మీమాంస వీరిని ఇరకాటంలో పెడుతోంది. పరిటాల కుటుంబం ప్రభ తగ్గింది పరిటాల రవి మరణానంతరం ఆయన భార్య పరిటాల సునీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. మంత్రిగా ఉండి కూడా ఆమె ఎలాంటి అభివృద్ధీ చేయకపోవడంతో జిల్లాలో క్రమంగా పరిటాల కుటుంబ పరపతి తగ్గింది. పరిటాల శ్రీరామ్ వ్యవహారశైలి కూడా జనానికి ఆ కుటుంబాన్ని దూరం చేసింది. 2019లో సునీత పోటీ చేయకుండా పరిటాల శ్రీరామ్ రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. దీంతో జిల్లాలో పరిటాల ప్రభ పూర్తిగా మసకబారింది. ప్రభావం లేదని గుర్తించిన అధిష్టానం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబ ప్రభావం ఏమాత్రమూ లేదనడానికి తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరే కారణం. ‘మీ కుటుంబానికి ఒక్కటే సీటు.. ఇష్టమైతే రండి లేదంటే పోండి’ అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. దీంతో రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలని భావించిన సునీత, శ్రీరామ్‌ల ఆశలు అడియాసలయ్యాయి. మరోవైపు సునీత ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఒక్క టికెట్ అయితే సరిపోతుందని చంద్రబాబు తన అనుకూల మీడియాలో లీకులు ఇప్పించారు. అధిష్టానం దెబ్బతో తల్లీ తనయులు కుదలేయ్యారు. పోటీలో తల్లా.. కొడుకా? రానున్న ఎన్నికల్లో ఎవరు పోటీయాలనే దానిపై తల్లీకొడుకు తేల్చుకోలేక పోతున్నారు. 2019లో పోటీచేసి ఓడిపోయిన శ్రీరామ్.. మళ్లీ తనకే టికెట్ కావాలని తల్లిమీద ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. కొడుకై తే ఓడిపోతాడని, తానే పోటీ చేస్తానని సునీత భావిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీరామ్‌కు టికెట్ ఇవ్వకపోతే ఒప్పుకోడు.. ఇస్తే ఓడిపోయే పరిస్థితులున్నాయి. దీంతో సునీత తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, పైగా రాప్తాడులో గతంలోలాగా కేడర్ సహకరించే పరిస్థితి లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. గ్రూపులు వెంటాడుతున్నాయి పరిటాల కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువయ్యారు. ధర్మవరంలో వరదాపురం సూరికి, పరిటాల కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇక పయ్యావుల కేశవ్‌కు పరిటాల కుటుంబంతో పొసగదు. ప్రభాకర్ చౌదరికి అస్సలే పడదు. ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చెప్పుకుంటూ వెళితే ఏ ఒక్క నాయకుడూ పరిటాల కుటుంబంతో అనుకూలంగా లేకపోవడం కూడా వీరికి మైనస్‌గా మారింది. పరిటాల పతనమే తమ లక్ష్యమంటూ ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. -
బండారు శ్రావణికి మొండిచేయేనా?
తెలుగుదేశం పార్టీలో దళిత నేతల పరిస్థితి దయనీయంగా మారింది. ఎమ్మెల్యే సీటు అడిగితే అవమానాలు ఎదురవుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఓ దళిత మహిళా నేతను తెలుగుదేశం పార్టీ అవమానించటమే దీనికి నిదర్శనం.మొన్నటిదాకా నియోజకవర్గ బాధ్యతలన్నీ మీవేనని చెప్పి.. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి.. ఇప్పుడు ఆమె ఎవరో తెలీదన్నట్లుగా పార్టీ పెద్దలు వ్యవహరించటం పచ్చ పార్టీ లో దుమారం రేపుతోంది. అంతే కాదు పలువురు దళిత మాజీ మంత్రుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారైంది. రాజకీయ నేత పేరు బండారు శ్రావణి.. అనంతపురం జిల్లా శింగనమల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం లో రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ..ఓటమి తర్వాత కూడా శింగనమల టీడీపీ ఇంఛార్జి గా ఈ మహిళా దళితనేత బాధ్యతలు నిర్వహించారు. ఈమె నుంచి టీడీపీ పెద్దలు కోట్ల రూపాయలు లబ్ధి పొందినట్లు ఆ పార్టీ లోనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి బండారు శ్రావణి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో దళిత మహిళా నేతను అవమానించేలా టీడీపీ పెద్దలు ఈ మధ్యనే ఓ ప్రకటన విడుదల చేశారు. అసలు బండారు శ్రావణి శింగనమల టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి కాదని టీడీపీ జోనల్ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మీడియా సమావేశం లో పేర్కొన్నారు. ఇక్కడ పార్టీ వ్యవహారాలన్నీ టూమెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు చూసుకుంటారని స్పష్టం చేశారు. చంద్రబాబు చేయించిన ఈ ప్రకటనతో దళిత నేతలు రగిలిపోతున్నారు. ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం లో పెత్తనం అంతా అగ్రవర్ణాలకు చెందిన నేతలకు ఎందుకు అప్పగించారో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నియోజకవర్గ ఇంచార్జి పదవి.. టిక్కెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో దళితులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెత్తందార్లకు ఇవ్వడం దారుణమని టీడీపీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. టీడీపీ అధిష్టానం తాజా ప్రకటన తో బండారు శ్రావణి ఆత్మరక్షణలో పడ్డారు. తన భవితవ్యం ఏమిటో చంద్రబాబు వద్దే తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో దళిత నేతలు పార్టీ అధినేత చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నట్టు సమాచారం. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలకు సీట్లు అడిగితే సీటివ్వకపోగా, అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా.. అవమానాలకు గురిచేస్తున్నారని వారు మదనపడుతున్నారు. దళిత మాజీ మంత్రులతో కాళ్లు మొక్కించుకుని చంద్రబాబు దళితులను హీనాతి హీనంగా చూస్తున్నారని టీడీపీలోని దళిత నేతలంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి జవహార్ ఎన్నికల్లో తన సీటు కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకుని వేడుకోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబుతో మాట్లాడటానికి ఎన్ని సార్లు అపాయింట్మెంట్ కోరినా జవహర్‌కి దక్కలేదు. చివరికి ఇటీవల విజయవాడ వచ్చిన చంద్రబాబుకి ఎయిర్‌పోర్ట్‌లో ఎదురు వెళ్లి కాళ్లకి మొక్కారు జవహర్ . చంద్రబాబు కేబినెట్లో పనిచేసిన మరో దళిత మంత్రి రావెల కిశోర్ బాబు కూడా ఇటీవల టిడిపిలో దళిత నేతలకు జరుగుతున్న అవమానాలపై ఆగ్రహించారు. చంద్రబాబు, ఆయన సామాజికవర్గం నేతలు కొందరు దళితుల మీద పెత్తనం చేస్తున్నారని చివరాఖరికి చంద్రబాబు కేవలం తన సామాజికవర్గ నేతలకే మద్దతిస్తారని మండిపడ్డ విషయం తెలిసిందే. కాళ్లు మొక్కినా తమకు సీట్లు రావడం లేదని ఆవేదన చెందారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన పీతల సుజాత పరిస్థితి కూడా అంతే. పీతల సుజాత చింతలపూడి సీటు ఆశిస్తున్నారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈమెకు ఇప్పుడు చింతలపూడి సీటు రాకుండా ఇక్కడ కూడా టిడిపి పెత్తందారులే అడ్డుపడుతున్నారని ఆమె వర్గీయులు రగిలిపోతున్నారు. దళితులకు ఎందుకు రాజకీయాలని ఓపెన్‌గానే చెప్పిన చింతమనేని ప్రభాకర్ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి తన చెప్పు చేతుల్లో ఉండేవాళ్లే కావాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. . పీతల సుజాత తన మాట విననందుకే టిక్కెట్ రాకుండా చింతమనేని అడ్డుకున్నాడట. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది టిడిపి దళితనేతల పరిస్థితి ఆ పార్టీలో దయనీయంగా మారింది. వాడుకోవడం వదిలించుకోవడం చంద్రబాబు నైజమనే విషయం తెలిసినా సరే ఆ పార్టీలో కొనసాగడం వల్లనే తమకు ఈనాడు ఈ దుస్థితి వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. -
ఎంపీగానా.. వద్దుబాబోయ్! అనంతపురం టీడీపీలో అభ్యర్థుల వెనకడుగు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాము చెప్పిందే వేదం... చేసిందే చట్టం... అన్నరీతిలో సాగుతోంది టీడీపీలో అభ్యర్థుల ఎంపిక విధానం. తండ్రీకొడుకులు వేర్వేరు జాబితాలు సిద్ధం చేసుకోవడంతో వారి మధ్య సయోధ్య నడవక... మరోవైపు ఎక్కడ జాబితా ప్రకటించేస్తే అసమ్మతి నేతలు బయటకు వెళ్లిపోతారోనన్న భయంతో ఎక్కడా అభ్యర్థులను ఖరారు చేయకుండా సాగదీత ధోరణి అవలంబిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా తయారవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షులకే తాము కోరుకున్న చోట టికెట్ దొరికే అవకాశం లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధిష్టానం అనుసరిస్తున్న వైఖరి వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఎంపీగానే వెళ్లాలని అధిష్టానం హుకుం అనంతపురం జిల్లాకు కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లాకు బి.కె.పార్థసారథి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ అసెంబ్లీ టికెట్లు లేవని పరోక్షంగా పార్టీ అధిష్టానం సంకేతాలిచ్చింది. ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం లేనందున ఎంపీలుగా పోటీ చేయాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఇద్దరూ ససేమిరా అంటున్నారు. రెండు రోజుల క్రితం కాలవ శ్రీనివాసులు తాను రాయదుర్గం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీగానే వెళ్లాలని నారా లోకేశ్ తన సన్నిహితుల వద్ద తెగేసి చెప్పినట్టు తెలిసింది. బీకే పార్థసారథి కూడా ఎంపీగా వెళ్లడానికి సుముఖంగా లేరు. మూడు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉంటే ఇప్పుడు పెనుకొండ టికెట్ ఇవ్వకుండా ఎంపీగా వెళ్లమనడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉరవకొండకు చంద్రబాబు వచ్చినప్పుడు కూడా టికెట్ గురించి ప్రస్తావించగా.. ఆయన దాటవేసినట్టు తెలుస్తోంది. టికెట్లు ప్రకటించేస్తే వెళ్లిపోతారేమో.. ఇప్పటికిప్పుడు టికెట్లు ఖరారు చేసేస్తే అసమ్మతి నేతలంతా పార్టీని వదిలి వెళ్లిపోతారేమోననే ఆందోళనతోనే అధినేత చంద్రబాబు సాగదీత ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు దాదాపు ఖరారై... ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తుండగా ఇప్పటికీ టీడీపీలో అభ్యర్థులెవరో తేలకపోవడం విశేషం. తాడిపత్రి, హిందూపురం, ఉరవకొండ మినహా.. మిగతా 11 సెగ్మెంట్లలోనూ అభ్యర్థి ఎవరన్నది తెలియని పరిస్థితి నెలకొంది. అనంతపురం అర్బన్ టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వొచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఎన్నికల వ్యయం కోసం ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులకు చంద్రబాబు, లోకేశ్‌లు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. -
వసూళ్లు ‘కాలువై’ పారాయి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీకి తీరని శాపంలా పరిణమించిన అంతర్గత విభేదాలు ఒక వైపు..కీలక నేత వసూళ్ల పర్వం మరోవైపు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ నేత..జిల్లాలో పలు నియోజకవర్గాల నాయకుల నుంచి చేపడుతున్న వసూళ్లు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ‘మీకు టికెట్ ఇప్పిస్తాను, ముందు కొంత సొమ్ము తీసుకురండి’ అంటూ చెప్పిన మాటలు నమ్మి రూ.50 లక్షల నుంచి కోటి రూపా యల వరకూ ఇచ్చిన వారు కొందరు, మరి కొంత మంది దగ్గర ‘కోటి రూపాయలుంటే ఇవ్వు తర్వాత చూద్దాం’ అంటూ చేబదుళ్ల రూపంలో ఇచ్చిన వాళ్లు కొందరు..ఇలా పలువురు డబ్బులిచ్చి ఇప్పుడు టికెట్ వచ్చే అవకాశమూ లేక, డబ్బులూ వెనక్కు రాక ఆందోళనలో ఉండిపోయారు. డబ్బు అడిగితే.. టూమెన్ కమిటీ శింగనమలకు చెందిన ఓ మహిళా నేత ముఖ్యనేతకు అప్పు అనుకుని కోటి రూపాయలు ఇచ్చారు. కొద్దిరోజులకు తిరిగి డబ్బు అడగ్గానే సదరు నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ నియోజకవర్గంలో ద్విసభ్య కమిటీని వేశారు. దీంతో ఆ మహిళా నేత తన వర్గం నాయకుల దగ్గర తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను అప్పుగా ఇచ్చానని, తిరిగి డబ్బు అడిగినందుకు తనను నియోజకవర్గంలో టికెట్‌కు దూరం చేశారని చెబుతున్నారు. టూమెన్ కమిటీ ఎవర్ని ఎంపిక చేస్తే వారినుంచి తిరిగి డబ్బు తీసుకునేందుకు రెడీ అవుతున్నారని శింగనమల టీడీపీ నాయకులు చెబుతున్నారు. టూమెన్ కమిటీలో ఉన్న ఒకరు రియల్ ఎస్టేట్‌లో చాలామందికి డబ్బు ఎగ్గొట్టినట్టు మహిళా నేత వర్గానికి సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. పలు నియోజకవర్గాల్లో భారీగా దందా.. ఒక్క శింగనమల నియోజకవర్గమే కాదు..పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని పలు నియోజకవర్గాల్లో వసూళ్లు చేసినట్టు తెలుగుదేశం నాయకులే వాపోతున్నారు. గుంతకల్లు, కళ్యాణదుర్గం, అనంతపురం వంటి నియోజకవర్గాల్లో కొంతమంది నుంచి రూ.30 లక్షల నుంచి రెండు కోట్ల రూపాయల వరకూ వసూళ్లు చేసినట్టు తెలిసింది. దీంతో పాటు పలువురికి ఎంపీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చి వసూళ్లు చేసినట్టు కూడా చర్చ జరుగుతోంది. అధిష్టానాన్ని ఒప్పించి మీకు ఎలాగైనా ఎంపీ టికెట్ ఇప్పిస్తానని సుమారు ఏడెనిమిది మందికి హామీ ఇచ్చారన్న చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఊపందుకుంది. మాకు టికెట్ ఇప్పించకపోతే అసలు విషయం బయటకు చెబుతామని కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పటికే పార్టీలో వర్గ రాజకీయాలు ప్రోత్సహిస్తూ భారీ నష్టం చేకూరుస్తున్న నేతకు చాలామంది వ్యతిరేక వర్గం తయారైంది. టికెట్లు ప్రకటించే సమయంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో నంటూ కేడర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
అక్కచెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు
సాక్షి, అనంతపురం (ఉరవకొండ) : ‘ప్రజలకు ఏ మంచీ చేయని వారికి, ప్రజలను మోసం చేసిన వారికి ఇంత మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. అయితే మీ బిడ్డ వాళ్లెవరినీ నమ్ముకోలేదు. వీళ్లందరి కంటే ఎక్కువగా నాకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని గట్టిగా చెబుతున్నాను. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్కచెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం ఆయన వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగవ విడత నిధుల విడుదల సభలో మాట్లాడారు. ‘జెండాలు జత కట్టడమే వారి అజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా’ అని తెలిపారు. వారందరికీ భిన్నంగా తనకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు.. రాజకీయ చరిత్రలో ఎవరికి ఉండరన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీరే మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలని కోరారు. జరుగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలవాలన్నారు. మనం వేసే ఓటు.. నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నామో మనసులో పెట్టుకోవాలని చెప్పారు. మీరు వేసే ఓటు ఒక్క జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడమే కాదు.. పేద కుటుంబాలు పేదరికం నుంచి బయట పడేందుకనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటేనే అది జరుగుతుందని మనసులో పెట్టుకోవాలని చెప్పారు. వారికి మంచి చేసిన చరిత్రే లేదు ‘చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు, ఆయన గజదొంగల ముఠాకు మంచి చేసిన చరిత్ర లేదు. చెడు మాత్రమే చేసిన చరిత్ర వారిది. ఎప్పుడూ మోసాలే. చంద్రబాబుకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, వీరందరికీ ఒక దత్తపుత్రుడు తోడు. ఇటువంటి వారికి రోజూ సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోంది. నిజంగా ఇది కలికాలమే’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏ మంచి చేయకపోయినా, ఏ పథకాలు అమలు చేయకపోయినా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు చాలా మంది ఉన్నారని, చంద్రబాబును భుజాన ఎత్తుకుని మోసే పెద్ద ముఠా ఉందని చెప్పారు. వాళ్లందరూ పక్క రాష్ట్రంలో ఉంటారన్నారు. ‘పక్క రాష్ట్రంలో పరి్మనెంట్ రెసిడెంట్‌గా ఉన్న చంద్రబాబు దత్తపుత్రుడు, చంద్రబాబు వదిన, మరో స్టార్ క్యాంపెయినర్, పక్క పార్టీలోకి వెళ్లిన మరో స్టార్ క్యాంపెయినర్, ముగ్గురు మీడియా అధిపతులు పొరుగు రాష్ట్రంలో ఉంటారు. అక్కడ ఉన్న మీడియా అధిపతులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీళ్లందరూ చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లే. వీరు కాకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘమంతా కూడా.. ఆయన్ను జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్నారు. ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లు కూడా చంద్రబాబుకు తో డుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న పసుపు కమలాలు.. ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్లు.. మనుషుల్లో, ఇతర పార్టీల్లో రకరకాల రూపాల్లో బినామీలుగా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లుగా కనిపిస్తారు. టీవీల్లో విశ్లేషకుల పేరుతో కనిపిస్తారు. మే«దావుల పేరుతో వేదికల్లో కనిపిస్తారు. వీళ్లందరూ బాబు కోసం పని చేస్తారు. కారణం దోచు కోవడం, పంచుకోవడంలో వీళ్లందరూ కూడా భాగస్వాములే కాబట్టి’ అని సీఎం జగన్ నిప్పులు చెరిగారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు రూ.33 కోట్లు జీడిపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చే పనులు వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఉరవకొండ నియోజకవర్గంలో కొత్తగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు రూ.33 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. -
అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద వాహనాల తనిఖీలు
-
Anantapur: పరిటాల సునీతకు గట్టి షాక్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తమ కుటుంబానికి రెండుచోట్ల ఎమ్మెల్యే టికెట్లు వస్తున్నట్టు ప్రచారం చేసుకున్న పరిటాల సునీతకు గట్టి షాక్ తగిలింది. 2009, 2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి గెలిచిన సునీత 2019లో ఓటమి పాలైన విషయం విదితమే. నాలుగోసారి కూడా రాప్తాడు నుంచి టీడీపీ తరఫున సునీత పోటీ చేస్తారని భావిస్తూ వచ్చిన ఆమె అనుచరుల్లో ధీమా సన్నగిల్లుతోంది. రోజుకో సమీకరణంతో టికెట్ ఎక్కడిస్తారో నమ్మకం లేకుండాపోయింది. మొన్నటివరకు రాప్తాడుతోపాటు ధర్మవరం టికెట్ తమకే అని పరిటాల కుటుంబం చెప్పుకుంది. ఇప్పుడు అందులో ఒక టికెట్‌పై ఆశలు వదులుకోవాల్సి వస్తుండటంతో కలవరం మొదలైంది. రాప్తాడు నుంచి తెరపైకి రియల్టర్ అనంతపురం జిల్లాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీకి దిగుతున్నారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. ఈ సీటు కోసం ఆయన భారీ మొత్తంలో పార్టీ ఫండ్ ఇచ్చేందుకు అధిష్టానంతో డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ నెల 18 లేదా 19న ఆయన పార్టీ అధిష్టానాన్ని కలవనున్నట్టు చెబుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో బంధువర్గం ఉండటంతోపాటు బాగా డబ్బు ఖర్చు చేయగలిగిన సామర్థ్యం ఉండటంతో అధిష్టానం ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రాప్తాడు ఇవ్వకపోతే ధర్మవరం? రాప్తాడు నియోజకవర్గంలో సునీతకు టికెట్ ఇవ్వని పక్షంలో ధర్మవరం పంపించాలనే యోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తనకు ధర్మవరం టికెట్ కావాలని సునీత కుమారుడు శ్రీరామ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తాజా పరిణామాలతో శ్రీరామ్‌కు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోగా.. తల్లి సునీతకు ధర్మవరం టికెట్ ఇవ్వొచ్చని అంటున్నారు. రాప్తాడులో సునీతకు అనుకూల పరిస్థితులు లేవని, కొత్త అభ్యర్థి అయితే బావుంటుందని కూడా ఆలోచిస్తున్నారు. సునీతకు నియోజకవర్గంలో అనుకూలంగా లేదనే ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మొదలుపెట్టింది. సూరిని తీసుకుంటే పరిస్థితి ఏమిటి? చంద్రబాబు ఎక్కడున్నా తగవులు పెట్టి తన్నుకునేలా చేస్తారనే విమర్శ ఉంది. ధర్మవరం నియోజకవర్గంలో వరదాపురం సూరికే టికెట్ ఇవ్వాలని ఆలోచిసూ్తనే సునీతకు కూడా ఇస్తామని లీకులిస్తున్నారు. ఒకవేళ ధర్మవరం నియోజకవర్గానికి సూరిని నియమిస్తే సునీతను పెనుకొండకైనా పంపించాలని మరో వాదన వినిపిస్తోంది. ఉదయం లేచినప్పటి నుంచి చంద్రబాబు జపం చేసే పరిటాల సునీతకు స్థానచలనం చేస్తే ఏళ్ల తరబడి నమ్మకంతో ఉన్న మన పరిస్థితి ఏమిటన్న ఆందోళన కేడర్‌లో మొదలైంది. కొంప ముంచుతున్న నాన్చుడు ధోరణి చంద్రబాబు చివరివరకూ నాన్చుడు ధోరణి అవలంభిస్తుండటంతో టికెట్ ఆశిస్తున్న నాయకులు మానసికంగా కుంగిపోతున్నారు. ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తున్నా.. ఎక్కడ ఏ అభ్యర్థో తేల్చకపోవడంతో ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం గందరగోళంగా ఉంది. 2019లో చంద్రబాబును నమ్ముకుని రూ.కోట్లు ఖర్చు చేశామని, ఇప్పుడు కూడా ఆయన్ని నమ్ముకుంటే మునుగుతామో తేలుతామో అర్థం కావడం లేదని సీనియర్ నాయకులు వాపోయారు. -
ప్రపంచ స్థాయికి ‘నాసిన్’ కీర్తి
సాక్షి, పుట్టపర్తి: అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రపంచస్థాయి సంస్థ ‘నాసిన్’ అకాడమీని నెలకొల్పినందుకు ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు తెలియచేశారు. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) అకాడమీ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ ప్రధానితో కలసి పాల్గొన్నారు. ‘నాసిన్’ను తీసుకొచ్చే గొప్ప ప్రయత్నం చేయడమే కాకుండా పట్టుబట్టి సాధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు సందర్భాలలో ఇక్కడికి రావడం మన కళ్లెదుటే కనిపించిన వాస్తవమన్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థ మన రాష్ట్రం పేరు, కీర్తి ప్రతిష్టలను దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అన్నింటిని అనుసంధానించే గొప్ప సంస్థగా నిలవాలని ఆకాంక్షించారు. -
అనంతపురంలో ఎడ్ల, గుర్రం పందాలు (ఫొటోలు)
-
‘స్టాంప్ పేపర్‌పై సంతకం పెడుతున్నా.. దమ్ముంటే నా సవాల్ స్వీకరించండి’
సాక్షి, అనంతపురం: తనపై వచ్చిన ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పరిటాల సునీత జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కొడిమి జగనన్న కాలనీలో కార్మికులను కిడ్నాప్ చేశారంటూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి.. అనంతపురం ఆర్అండ్బి అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాప్తాడు నియోజకవర్గం కొడిమి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం కోసం శాన్వి - లోటస్ సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని ఆయన వివరించారు. పేదలకు ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి అయ్యేలా తాను చర్యలు తీసుకున్నానని చెప్పారు. శాన్వి సంస్థ నుంచి 55 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్న లోటస్ సంస్థ ప్రతినిధులు పనులు చేయకుండా వెళ్లిపోయారని తెలిపారు. శాన్వి సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు కలకత్తా కార్మికులను అదుపులోకి తీసుకున్నారని.. దీనిపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, సీపీఐ నేత రామకృష్ణ, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు రెండు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారని.. 500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయని.. తనకు 50 కోట్లు ఇస్తే తన ఆస్తులు రాసిస్తానని ఆయన మీడియా ఎదుట వంద రూపాయల స్టాంప్ పేపర్ పై సంతకం చేసి సవాల్ విసిరారు. -
గుంతకల్లులో బడుగు, బలహీనవర్గాల విజయ యాత్ర
అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లులో బడుగు, బలహీన వర్గాల ప్రజలు విజయ యాత్ర చేశారు. వైఎస్సార్సీపీ మంగళవారం ఇక్కడ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండదండలతో తాము సాధించిన సాధికారతను ప్రదర్శించారు. గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ యాత్ర పట్టణంలో పండగ వాతావరణాన్ని నింపింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజల సాధికార నినాదంతో గుంతకల్లు హోరెత్తింది. పట్టణ ప్రధాన వీధులన్నీ జనంతో నిండిపోయాయి. యువత కేరింతలతో ఉత్సాహంగా యాత్రలో పాల్గొన్నారు. పట్టణ ప్రజలు యాత్రకు పూల వర్షంతో స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభ వేలాది ప్రజలతో జనసంద్రంలా కనిపించింది. సభ ఆద్యంతం ‘జై జగన్.. జైజై జగన్’, ‘గిరగరా తిరగాలి ఫ్యాన్’ అంటూ నేతలతో కలిసి నినాదాలు చేశారు. అణగారినవర్గాల కోసం పాటుపడుతున్న సీఎం జగన్ : ఎంపీ సురేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం అణగారిన వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నారని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సాధికారత సాధించి, తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది సీఎం జగన్ చేసిన మేలు వల్లేనని అన్నారు. సంక్షేమంలో, అన్ని పదవుల్లో అగ్రస్థానం ఈ వర్గాలకే కేటాయించారని తెలిపారు. అణగారిన వర్గాలను అభివృద్ధి చేసి, సామాజిక న్యాయాన్ని సాధించిన సీఎం జగన్ ఆదర్శనీయుడని, ఈరోజు దేశమంతా మన రాష్ట్రం వైపు చూస్తోందని తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఏనాడూ పేదల గురించి ఆలోచించలేదని అన్నారు. చంద్రబాబుకు అవకాశం ఇస్తే మరోమారు నట్టేట ముంచుతారని, ఆయన్ని నమ్మవద్దని చెప్పారు. రాష్ట్రానికి దిక్సూచిలా ఉన్న సీఎం వైఎస్ జగన్‌ను వచ్చే ఎన్నికల్లోనూ ఆశీర్వదించి, మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది విజయ యాత్ర: ఎల్రక్టానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు రాష్ట్రంలో విజయయాత్ర చేస్తున్నారని, ఇదంతా సీఎం వైఎస్ జగన్ చలవేనని ప్రభుత్వ ఎల్రక్టానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ చెప్పారు. మనల్ని ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చి న సీఎం వైఎస్ జగన్‌కు మనం ఇచ్చే గిఫ్ట్ ‘వై నాట్ 175’ అని అన్నారు. గత ఎన్నికల్లో గుంతకల్లు ప్రజలు 50 వేల మెజార్టీతో వెంకటరామిరెడ్డిని గెలిపించారని, ఈసారి లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ వెంటే నడుద్దాం: మాజీ మంత్రి ఎం. శంకరనారాయణ 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా సామాజిక న్యాయం సాధించిన సీఎం వైఎస్ జగన్ ఒక్కరేనని మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే ఎం. శంకరనారాయణ చెప్పారు. మనందరినీ అభివృద్ధిలోకి తెచ్చి , సమాజంలో గౌరవ స్థానం కల్పిస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే నడుద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు బడుగు, బలహీన వర్గాలను కేవలం ఓటుబ్యాంకుగా ఉపయోగించుకున్నారని చెప్పారు. అదే వర్గాలను సీఎం జగన్ ఉన్నత స్థితికి తీసుకువెళ్తున్నారని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు గౌరవం పెరిగింది: ఎంపీ తలారి రంగయ్య వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చి న ప్రాధాన్యతతో రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు గౌరవం పెరిగిందని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అత్యున్నత స్థానాల్లో కూర్చోబెట్టారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ రూ. 1,500 కోట్ల అభివృద్ధి జరిగిందని అన్నారు. ఇంతటి మేలు చేసిన వైఎస్ జగన్‌ను వచ్చే ఎన్నికల్లోనూ ఆశీర్వదించాలని కోరారు. -
ఉరవకొండలో ఉరిమిన ఉత్సాహం
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కల్పించిన సముచిత స్థానాన్ని తెలియజేసేందుకు చేపట్టిన ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’ జైత్రయాత్రలా సాగుతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్రకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. సభా వేదిక ఏర్పాటుచేసిన పాత బస్టాండ్ ప్రాంతమంతా జన సంద్రమైంది. నియోజకవర్గ నలుమూలల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు తరలివచ్చి బస్సుయాత్రకు బ్రహ్మరథం పట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం వస్తుందని వక్తలు పేర్కొనడంతో పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఆత్మగౌరవం నిలబెట్టిన వైఎస్సార్సీపీకి అండగా ఉందాం: హఫీజ్‌ఖాన్ ఓట్ల కోసం రాజకీయాలు చేసే వాళ్లు వద్దని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆత్మగౌరవం నిలబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందామని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ పిలుపునిచ్చారు. 2014 ఎన్నికలకు ముందు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పేద వర్గాలను వంచించారన్నారు. ఆయన హయాంలో కనీసం ఆరు హామీలు కచ్చితంగా అమలు జరిగాయని ఎవరైనా నిరూపిస్తే లక్ష రూపాయలు బహుమానం ఇస్తానన్నారు. పేద వర్గాలను ఎప్పుడూ బానిసలుగా చూసిన చంద్రబాబుకు, ఆ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న జగనన్నకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. జగనన్న అవసరం మనకు ఉందని, ఆయన్ను ఎప్పటికీ మరచిపోవద్దని హఫీజ్‌ఖాన్ చెప్పారు. మోసగాళ్ల వైపు చూడొద్దు: తలారి రంగయ్య రా.. కదలిరా అంటూ తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తోందని, అయితే.. ఇప్పటికే వచ్చి తాము (బడుగు, బలహీనవర్గాలు) ఇక్కడ కూర్చున్నామని, ఇంకెవరు వస్తారు.. ఎక్కడికి కదులుతారు అని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఎద్దేవా చేశారు. మోసగాళ్ల వైపు చూడొద్దని, సింహం లాంటి జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాజ్యసభ మొదలుకుని స్థానిక సంస్థల వరకు జగనన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశారని ఆయన గుర్తుచేశారు. కలలో కూడా ఎవరూ ఊహించని విధంగా ఆయా వర్గాల అభివృద్ధికి బాటలు వేసిన జగనన్నను ఎలా మరచిపోగలమన్నారు. బలమైన వర్గాలుగా మార్చిన ఘనత జగన్‌దే : మాజీమంత్రి శంకరనారాయణ రాష్ట్రంలో బలహీన వర్గాలను బలమైన వర్గాలుగా మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని మాజీమంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఏ ముఖ్యమంత్రీ సామాజిక సాధికారతకు కృషిచేయలేదన్నారు. 70 శాతం బలహీన వర్గాల వారే పదవుల్లో ఉన్నారన్నారు. చంద్రబాబు బలహీన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని విమర్శించారు. సాధికారత కోసం జగన్ తపన : వై.విశ్వేశ్వరరెడ్డి అట్టడుగు వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదల సాధికారత కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరితపించారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆయా వర్గాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. పెత్తందారుల వద్ద చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి నుంచి ఆత్మగౌరవంగా నిలబడే స్థాయికి తెచ్చారని ఆయన కొనియాడారు. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో పేదలు, పెత్తందారుల మధ్య పోటీ ఉంటుందని, పేద వర్గాలే గెలుస్తాయని విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఈనాడు ఫొటోగ్రాఫర్‌కు జనం మందలింపు.. ఇక ఉరవకొండలో ఆదివారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సభ ముగిసిన తర్వాత ఖాళీ కుర్చీల ఫొటోలు తీస్తున్న ఈనాడు ఫొటోగ్రాఫర్‌ను జనం మందలించారు. ఈ సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అయితే.. సభ ముగిసి జనం వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఖాళీగా కన్పించిన కుర్చీలను ఈనాడు ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీస్తుండగా అక్కడున్న కొందరు దీనిని గమనించారు. సభ ముగిసిపోయిన తర్వాత ఎందుకు ఫొటోలు తీస్తున్నావంటూ ప్రశ్నించారు. ఇందుకు అతను దురుసుగా ప్రవర్తించడంతో జనం మందలించారు. దుష్ప్రచారం చేసేందుకు ఇలాంటి కుయుక్తులు మంచివి కాదని హితవు పలికారు. దీంతో ఫొటోగ్రాఫర్ అక్కడి నుంచి జారుకున్నాడు. -
టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ ఓ దద్దమ్మ: కాపు రామచంద్రారెడ్డి
సాక్షి, అనంతపురం జిల్లా: టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ ఓ దద్దమ్మ అని, రాయదుర్గంను అభివృద్ధి చేయలేకపోయారంటూ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. టీడీపీ పాలనలో వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని.. రామోజీరావు వద్ద కాల్వ శ్రీనివాస్ బ్రోకర్ పని చేశారంటూ దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నేను చేసిన అభివృద్ధి చూపిస్తూ రోజూ ఫొటోలు పెడతా. సాగు, తాగునీటిపై టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ అబద్ధాలు చెబుతున్నారు. సీఎం జగన్ సహకారంతో రాయదుర్గం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేశా. 45 గ్రామాలకు తారు రోడ్లు వేయించాను. 58 చెరువులకు నీటి సరఫరాకు చర్యలు చేపట్టామని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఇదీ చదవండి: డబ్బు కుమ్మరిస్తేనే టీడీపీ ఎమ్మెల్యే టికెట్! -
అనంతపురం జిల్లాలో బస్సు-ట్రాక్టర్ ఢీ: నలుగురి మృతి
సాక్షి, అనంతపురం జిల్లా: గార్లదిన్నె మండలం కల్లూరు సమీపంలో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను వోల్వో బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను బస్సు ఢీకొట్టింది. మృతులను గుత్తి మండలం మామిడూరు గ్రామానికి చెందిన రైతులు చిన్నతిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున, శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. బస్సు డ్రైవర్ సహా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: సూర్యోదయాన్ని చూసి వస్తుండగా.. -
పామిడి మండలాల్లో ప్రారంభమైన అంగన్వాడీ కేంద్రాలు
-
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 22వ రోజు షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సామాజిక సాధికార యాత్ర సోమవారం రెండు ప్రాంతాల్లో జరగనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును, అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ సాగుతున్న సామాజిక సాధికార యాత్ర విశేష ప్రజాదరణ పొందుతోంది. ఇందులో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది. అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. వైఎస్సార్ సర్కిల్ దాకా బస్సు యాత్ర కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా: ఎచ్చెర్లలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ ఆధ్వర్యంలో జరగనున్న బస్సుయాత్ర సాగనుంది. ఉదయం 11గంటలకు రణస్థలంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం ర్యాలీ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఎచ్చర్ల మండలం చిలకపాలెంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. చదవండి: జనం మెచ్చిన 'జగన్' -
అంతర్రాష్ట్ర ‘సైబర్’ ముఠా గుట్టురట్టు
అనంతపురం క్రైం: అమాయక ప్రజల కష్టార్జితాన్ని కమీషన్ల పేరుతో కాజేసే అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేసిన అనంతపురం పోలీసులు ఐదుగురు సైబర్ నేరగాళ్లను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ముఠా 16 ఫేక్ అకౌంట్ల ద్వారా ఏపీలో రూ.35.59 కోట్ల లావాదేవీలు జరిపినట్లు తేల్చి.. రూ.14.72 లక్షలను ఫ్రీజ్ చేయించారు. ఈ 16 ఫేక్ అకౌంట్ల నుంచి మరో 172 ఫేక్ అకౌంట్లలోకి సొమ్మును మళ్లించారు. ఇలా దేశవ్యాప్తంగా జరిగిన లావాదేవీలను అంచనా వేస్తే రూ. 350 కోట్లకు పైగానే కొల్లగొట్టినట్లు పోలీసుల అంచనా. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ స్థానిక పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఇలా వెలుగులోకి.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తనకు జరిగిన సైబర్ మోసంపై జిల్లా పోలీసు కార్యాలయం స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గార్లదిన్నె పోలీసు స్టేషన్లో ఈ నెల 15న కేసు నమోదయ్యింది. దీంతో తీగలాగితే డొంక కదిలింది. ఐదుగురు అరెస్టు .. ఈ కేసును సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో నిందితులకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయి. ఉత్తర భారత దేశానికి చెందిన కింగ్ పిన్ను కీలక సూత్రధారిగా గుర్తించిన అనంత పోలీసులు.. కింగ్ పిన్ ముఠాలో పనిచేస్తున్న తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన మహ్మద్ సమ్మద్, వెంకటగిరికి చెందిన వెంకటాచలం, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన సందీప్, ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన అజయ్‌రెడ్డి, అనంతపురానికి చెందిన సంధ్యారాణిని అరెస్టు చేశారు. కింగ్ పిన్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా ప్రస్తుతం అరెస్టయిన ముఠా సభ్యులకు కింగ్‌పిన్ నుంచి కమీషన్ రూపంలో రూ.20 లక్షలకు పైగా అందడం గమనార్హం. వివిధ రూపాల్లో మోసాలు.. యూట్యూబ్ యాడ్స్ సబ్ స్క్రైబ్, రేటింగ్‌లకు అధిక కమీషన్లు, ఆన్లైన్ గేమింగ్, ఓటీపీ, పార్ట్ టైం జాబ్స్ ఇలా రకరకాల పేర్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడ్డారు. వీరిపై దేశవ్యాప్తంగా నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) పోర్టల్‌లో 1,550 ఫిర్యాదులు నమోదయ్యాయి. రూ.350 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా దోపిడీ చేసిన సొమ్మును దుబాయ్‌లో డ్రా చేస్తున్నట్లు తేల్చారు. అప్రమత్తంగా ఉండాలి.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగ యువతను కొన్ని సైబర్ ముఠాలు లక్ష్యంగా చేసుకున్నాయి. అనవసరమైన లింకులు, వాట్సాప్ కాల్స్, మెసేజీలకు స్పందించొద్దు. ఏదైనా సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 సైబర్ పోర్టల్, స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. – కేకేఎన్ అన్బురాజన్, జిల్లా ఎస్పీ, అనంతపురం -
అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల వినూత్న నిరసన
-
‘అప్పుడే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది’
అనంతపురం: ఎన్నికలు రాకముందే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు మంత్రి ఉషాశ్రీ చరణ్. ఆ భయంతోనే తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘చంద్రబాబు అబద్దాలకోరు. 2014-19 కళ్యాణదుర్గం ప్రజలకు చంద్రబాబు చేసింది శూన్యం. హంద్రీనీవా కాలువ తవ్వకాలకు భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారు. భైరవానితిప్ప ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దే. పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని జీర్ణించుకోలేక చంద్రబాబు విమర్శలు. ఎన్నికలు రాక ముందే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది’ అని ఉషాశ్రీ చరణ్ పేర్కొన్నారు. -
సీఎం జగన్ ఆదేశం.. దివ్యాంగుడికి ఆధునిక కృత్రిమ కాలు
అనంతపురం అర్బన్: సీఎం వైఎస్ జగన్ చొరవతో ఓ దివ్యాంగుడికి అతి ఖరీదైన కృత్రిమ కాలు అందింది. అనంతపురానికి చెందిన సయ్యద్ ఖాజా రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. గత నెల 8న సీఎం జగన్ కళ్యాణదుర్గం పర్యటనకు రాగా, హెలిప్యాడ్ వద్ద సీఎంను కలిసి తన కష్టాన్ని చెప్పుకొన్నాడు. స్పందించిన సీఎం బాధితుడికి సాయం చేయాలని అనంతపురం కలెక్టర్ గౌతమిని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ గౌతమి ఖాజాకు కృత్రిమ కాలు అందించాలనుకున్నారు. అయితే మామూలు కాలిపర్స్ కాకుండా నాణ్యమైన, సౌకర్యవంతంగా ఉండేలా కృత్రిమ కాలును సిద్ధం చేయించి సోమవారం బాధితుడికి అందించారు. చదవండి: సీఎం జగన్ మానవత్వం.. చిన్నారి వైద్యానికి రూ.41.5 లక్షల సాయం -
రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. పోలీసులను అరేయ్.. ఓరేయ్ అంటూ..
సాక్షి, అనంతపురం: తరచూ తన వ్యవహారశైలితో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. తాడిపత్రి మున్సిపల్ అధికారులు, పోలీసులపై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అరుపులు, కేకలతో దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. అరేయ్.. ఓరేయ్ అంటూ మీడియా సమావేశంలో ఊగిపోయారు. ఒక్కొక్కరి అంతుచూస్తానంటూ జేసీ బెదిరింపులకు దిగారు. ఇటు నియోజకవర్గంలోను, అటు టీడీపీ క్యాడర్లోను ఉనికి కోల్పోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఎలాగైనా ఉనికిని చాటుకునేందుకు చవకబారు రాజకీయాలు చేస్తున్నారు. గత నెల ఇసుక రవాణా వాహనాలను తగలబెడతానంటూ జేసీ తన వర్గీయులతో వీరంగం సృష్టించేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. గత ఏడాది జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏకంగా కలెక్టర్‌పైనే దౌర్జన్యం చేసిన సంగతి తెలిసిందే. కనీస మర్యాద కూడా లేకుండా కలెక్టర్‌ను ఏకవచనంతో సంబోధించడంతో పాటు ఆమె ముందే పేపర్లు విసిరేశారు. అడ్డుకోబోయిన కలెక్టర్ గన్‌మెన్‌ను తోసేసి నానా రభస సృష్టించారు. చదవండి: టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ: ఎంపీ విజయసాయిరెడ్డి -
ఉద్యాన పంటల సాగులో అనంతపురం టాప్.. తక్కువ ధరకే పండ్లు, కూరగాయలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా పేరుగాంచిన అనంతపురంలో ‘ఫల రాజసం’ అబ్బురపరుస్తోంది. అరుదైన పండ్లు, రుచికరమైన కూరగాయల ఉత్పత్తులకు కేరాఫ్‌గా నిలిచి రికార్డు సృష్టిస్తోంది. ఇక్కడ పండే బత్తాయి పండ్లు నిగనిగలాడుతాయి. ఎర్రగా మెరిసే డ్రాగన్ పండ్లు ఆకర్షిస్తాయి. అంజూర్ పండ్ల రాశులు మురిపిస్తాయి. ఎరుపు – పసుపు వర్ణం కలగలసిన దానిమ్మ పండ్లు నోరూరిస్తాయి. అన్నిటికీ మించి అరబ్ షేక్‌లను సైతం ఆకట్టుకున్న గ్రాండ్ 9 అరటి గెలలు మైమరిపిస్తాయి. ఖర్జూర ఫలాలను తెంపుతున్న మహిళా రైతు 32 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి.. రాష్ట్రంలో హార్టికల్చర్ హబ్ (ఉద్యాన పంటలకు కేంద్రం)గా అనంతపురం జిల్లా పేరుగాంచింది. చీనీ, అరటి తోటలు భూమికి ఆకుపచ్చటి రంగేసినట్టు కనిపిస్తుంటాయి. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే ఈ తరహా పంటలు ఇప్పుడు రైతుకు మంచి ఆదాయ వనరుగా మారాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 32 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు, కూరగాయలు ఈ జిల్లా నుంచే ఉత్పత్తి అయ్యాయి. అందులో సింహభాగం ఒక్క కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచే 10.85 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తవుతున్నాయి. మన కూరగాయలు భలే రుచి గురూ.. జిల్లాలో పండించే కూరగాయలు రుచికి, నాణ్యతకు పేరెన్నికగన్నవి. టమాట, పచ్చిమిరప, బెండకాయలు, ఎండు మిర్చి, గోరు చిక్కుడు, అనప, వంకాయలు అద్భుతమైన రుచికి ఆలవాలం. పైగా స్థానికంగా పండించే ఈ కూరగాయలు ధరలోనూ అసాధారణమేమీ కాదు. సరసమైన ధరలకు లభిస్తుండటంతో కొనుగోలుదారులకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉన్నాయి. ఇక్కడ ఉద్యాన పంటలన్నీ బోర్లకిందే ఉన్నాయి. గడిచిన నాలుగేళ్లుగా కరెంటు కోతలు లేకపోవడం, వర్షాలు సమృద్ధిగా పడటంతో మంచి ఫలసాయం రావడానికి కారణమైంది. విదేశాలకు ఎగుమతి.. జిల్లాలో 1,27,599 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఇక్కడ పండిన అరటి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, మామిడి, సపోట, రేగు, జామ, నేరేడు, ద్రాక్ష, పుచ్చకాయ, మస్క్మొలన్ (ఢిల్లీ దోస), బొప్పాయి, టమాట, పచ్చిమిర్చి, బెండ, ఉల్లి పంట ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. విదేశాలకూ ఎగుమతి అనుకూలమైన వాతావరణమే అనంతపురం జిల్లాలో పండ్ల తోటలకు అనుకూలమైన వాతావరణం ఉంది. ఇక్కడ రైతులు కష్టపడే తత్వం ఎక్కువ. రాష్ట్రంలో అన్ని రకాల పండ్లను పండించే జిల్లాల్లో మొదటి స్థానం అనంతపురానిదే. ఈ తరహా పంటలు రైతులకు లాభదాయకంగా కూడా ఉంటాయి. – రఘునాథరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్, హార్టికల్చర్ ఎకరాకు రూ.20 లక్షలు మూడు ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్స్ పంట పెట్టాను. తొలి ఏడాది ఎకరాకు రూ.3 లక్షల దాకా పెట్టుబడి వస్తుంది. ఆ తర్వాత తగ్గుతుంది. కాపుకొచ్చాక ఎకరాకు 20 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను ప్రస్తుతం రూ.లక్ష పలుకుతోంది. మరో ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఖర్జూర పెట్టాను. ఆ పంట ఇంకా కాపునకు రాలేదు. మన నేలలు ఏ ఫలాలకై నా అనుకూలంగానే ఉంటాయి. – కె.వి.రమణారెడ్డి, రైతు, మర్తాడు, గార్లదిన్నె మండలం -
అనంతపురం నగర శివారులో రోడ్డు ప్రమాదం
-
ప్రకృతి వ్యవసాయంలో పొదుపు సంఘాల మహిళలు
-
మునగకు మార్కెట్ లో ఎప్పుడూ మంచి డిమాండ్
-
అనంతపురంలో మొహరం పండుగ వేడుకలు (ఫొటోలు)
-
లెక్కలు తేలాలి.. పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: పవన్ వల్ల ఎంతమంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్కలు తేలాలని మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో మహిళల అదృశ్యంపై ఏ నిఘా సంస్థ పవన్‌కు నివేదిక ఇచ్చిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ‘‘హెరిటేజ్‌లో గంజాయి, నారావారిపల్లెలో ఎర్ర చందనం దొరుకుతోంది. రాష్ట్రంలో ఇంకెక్కడా గంజాయి దొరకలేదు. రాయలసీమ నిజమైన ద్రోహి చంద్రబాబే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సీమ ప్రాజెక్టు లను పరిశీలించే అర్హత లేదు’’ అని మంత్రి రోజా ధ్వజమెత్తారు. చదవండి: ఉనికి కోసమే టీడీపీ గోబెల్స్ ప్రచారం: మోపిదేవి ఫైర్ -
ఆల్చిప్పల సాగులో తక్కువ పెట్టుబడి అధిక ఆదాయం..
-
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత కలకలం
-
ఉద్యమంలా కొనసాగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమం
-
కళ్యాణదుర్గం: వైఎస్సార్ రైతు దినోత్సవంలో సీఎం జగన్ (ఫొటోలు
-
చంద్రబాబు గజ దొంగల ముఠా మొసలి కన్నీరు: సీఎం జగన్
సాక్షి, అనంతపురం జిల్లా: దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల ఖాతాల్లో పంట బీమా పరిహారం జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. 2022–ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు లబ్ధి కలిగిస్తూ బీమా పరిహారం విడుదల చేశారు. ఈ సందర్భంగా బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ, బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి శ్రీకారం చుట్టామని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకులబ్ధి చేకూరనుందని తెలిపారు. ‘‘ఐదేళ్లలో చంద్రబాబు బీమా పరిహారంగా రైతులకు చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు. మేము అధికారంలోకి వచ్చాక రైతులకు చెల్లించింది రూ. 7,802 కోట్లు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాం. ప్రతి ఏటా మూడు విడతల్లో వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నాం. నాలుగేళ్లలో కోటిన్నర రైతులకు రూ.30 వేల 985 కోట్లు రైతు భరోసా ఇచ్చాం. గ్రామస్థాయిలోనే ఆర్బీకేలు తీసుకొచ్చి రైతులకు సేవలు అందిస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: మీ స్ఫూర్తి చేయిపట్టి నడిపిస్తోంది నాన్న.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ ‘‘ఐదేళ్లలో చంద్రబాబు.. రైతులకు అరకొరగా బీమా డబ్బులు చెల్లించారు. చంద్రబాబు గజ దొంగల ముఠా మొసలి కన్నీరు కారుస్తోంది. కరువు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వంలో పరిహారం ఇవ్వలేదు. చంద్రబాబు కరువును పారద్రోలాడని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 నిసిగ్గుగా అసత్యాలు రాశాయి’’ అని సీఎం దుయ్యబట్టారు. విత్తనం మొదలు పంట అమ్మకం వరుకు ఆర్బీకే రూపంలో రైతుకు తోడుగా ఉంటున్నామని సీఎం తెలిపారు. ‘‘ఏ సీజన్లో పంటనష్టం జరిగినా ఆ సీజన్ ముగియక ముందే పరిహారం అందిస్తున్నాం. సున్నా వడ్డీకి రైతులకు రుణాలు అందిస్తున్నాం. సున్నా వడ్డీ రుణాల్లో ఏపీ అగ్రగామిగా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర కోసం రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ధాన్యం కొనుగోళ్ల కోసం నాలుగేళ్లలో రూ.58,767 కోట్లు ఖర్చు చేశాం. ఇతర పంటల కొనుగోళ్ల కోసం మరో రూ.7,633 కోట్లు ఖర్చు చేశాం. రైతులకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘రైతులకు ఎప్పటికీ ఉచిత విద్యుత్ ఇచ్చేలా విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. చుక్కల భూములకు సంపూర్ణ భూహక్కు కల్పించాం. పశువుల కోసం 340 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశాం. పాడి రైతులకు ఆదాయం వచ్చేలా అమూల్‌ను తీసుకొచ్చాం’’ అని సీఎం తెలిపారు. ‘‘మనకు పాడిపంటలు ఉండే పాలన కావాలా? లేక నక్కలు, తోడేలు ఉండే పాలన కావాలా?. రైతు రాజ్యం కావాలా? రైతులను మోసం చేసే పాలన కావాలా?. రైతుకు తోడుగా ఆర్భీకే వ్యవస్థ కావాలా? దళారీ వ్యవస్థ కావాలా?. పేదల ప్రభుత్వం కావాలా? పెత్తందారుల ప్రభుత్వం కావాలా?. ఏ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి. గతంలో పేదలను చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు. చంద్రబాబు పాలనలో డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది. రాబోయే రోజుల్లో ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తారు. నైతికత లేని వ్యక్తిని చంద్రబాబు అంటారు. వీళ్లలా నాకు అబద్ధాలు చెప్పడం రాదు’’ అని సీఎం చెప్పారు. -
నేడు సీఎం వైఎస్ జగన్ అనంతపురం పర్యటన... ఇంకా ఇతర అప్డేట్స్
-
తాడిపత్రిలో దారుణం.. నిద్రిస్తున్న వారిపై పెట్రోలు పోసి..
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న వారిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టారు.. ఈ ఘటనలో దంపతులతో పాటు మరో యువతి తీవ్రంగా గాయపడింది. మద్యం, వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పారిశ్రామిక వాడలోని శ్రీనిధి నల్ల బండల పాలిష్ పరిశ్రమలో నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి పరిశ్రమ ఆవరణలో మంచంపై నిద్రిస్తున్నారు. అదే ఫ్యాక్టరీలో పని చేసే మల్లికార్జున కుమార్తె పూజిత కూడా వీరి పక్కనే మంచం వేసుకుని నిద్రిస్తోంది. రాత్రి 11.30 గంటల సమయంలో సరస్వతి మరిది రామేశ్వర్‌రెడ్డి నిద్రిస్తున్న నల్లపురెడ్డి, సరస్వతిపై పెట్రోల్ పోశాడు. మెలకువ వచ్చిన సరస్వతి ఏం చేస్తున్నావురా అని అరిచేలోగానే నిప్పంటించాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే నిద్రిస్తున్న పూజితకు కూడా మంటలు అంటుకుని చేతులు కాలాయి. తాగుడుకు బానిసైన రామేశ్వర్‌రెడ్డిని రెండు రోజుల క్రితం తాము పద్ధతి మార్చుకోవాలని దండించామని, అది మనసులో ఉంచుకుని ఇలా చేశాడని నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు రూరల్ ఎస్ఐ గౌస్ మహ్మద్‌కు వివరించారు. వారి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ కేసు నమోదు చేసుకున్నారు. సరస్వతి, నల్లపురెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పూజితకు తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చదవండి: బంజారాహిల్స్: మసాజ్ చేస్తూ గొలుసు కొట్టేశారు.. -
టీడీపీ నేతలకు కొత్త టెన్షన్.. రూటు మార్చిన పచ్చ పార్టీ లీడర్లు!
అభివృద్ధి అనేది టీడీపీ ఎజెండాలో లేని విషయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనుల్ని అడ్డుకోవడమే పచ్చ పార్టీ నేతల పని. అన్ని ఆటంకాలు అధిగమించి పనులు సాగుతుంటే మాత్రం ఆ ఘనత తమదే అని డప్పు కొట్టుకోవడంలో కూడా టీడీపీ నేతలు ముందుంటారు. అనంతపురం జిల్లాలోని ఒక టీడీపీ నేత డప్పు ఎలా కొట్టుకుంటున్నారంటే.. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ ఛైర్మన్ వైకుంఠం ప్రభాకర చౌదరి అభివృద్ధి అంటే నేనే అని డప్పు కొట్టుకోవడంలో ఆరితేరిపోయారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ తరపున జేసీ దివాకరరెడ్డి ఎంపీగా, ప్రభాకర చౌదరి టౌన్ ఎమ్మెల్యేగా కొనసాగారు. అనంతపురం టౌన్లో ఏ పని చేయాలన్నా ఇద్దరి మధ్యా ఏకాభిప్రాయం కుదిరేది కాదు. పట్టణంలో ఏ పనీ చేయకుండా, ఇద్దరు గొడవ పడటంతోనే ఐదేళ్ళు ముగిసిపోయింది. అందుకే టీడీపీ పాలనలో అనంతపురం పట్టణం అభివృద్ధి జరగకపోగా.. మరింత వెనుకపడిపోయింది. గత ఎన్నికల్లో ప్రభాకరచౌదరి మీద విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నగరం అభివృద్ధి పథంలో సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనంతపురం నగర అభివృద్ధికి ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అనంతపురం అభివృద్ధికి 650 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కేంద్రంతో మాట్లాడి అనంతపురం నగరం మీదుగా ఓ జాతీయ రహదారిని మంజూరు చేయించారు. అనంతపురం నగరంలో కొత్త ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. హైవే పనులు కూడా 80 శాతం పూర్తి కావటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరం అభివృద్ధి అంతా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళడం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి నచ్చడంలేదు. ఇలాగే సాగితే నగరంలో పచ్చ పార్టీకి ఉనికి ఉండదని భయపడి.. అభివృద్ధిని వక్రీకరించడం ప్రారంభించారు. అనంతపురం నగరంలో నిర్మాణమవుతున్న 42, 44 జాతీయ రహదారుల లింక్ హైవే టీడీపీ హయాంలోనే మంజూరు అయిందని.. పనులు ప్రారంభం అయ్యే లోగా ప్రభుత్వం మారిపోయిందంటూ ప్రభాకర్ చౌదరి గోబెల్స్ ప్రచారం ప్రారంభించారు. వాస్తవానికి జాతీయ రహదారిగా ఉన్న అనంతపురం సుభాష్ రోడ్డును స్టేట్ హైవేగా మారుస్తూ టీడీపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం విక్రయాలకు నేషనల్ హైవే నిబంధనలు అడ్డురావటంతో నగర అభివృద్ధి గురించి ఆలోచించకుండా టీడీపీ నేతలు హైవే హోదానే తగ్గించేశారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ చౌదరి దీనికి ఏ మాత్రం అడ్డుచెప్పలేదు. మద్యం అమ్మకాల కోసం చంద్రబాబు అనంతపురం నగరంలోని జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పును గుర్తించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో అనంతపురం ప్రధాన రహదారిని తిరిగి నేషనల్ హైవే జాబితాలో చేర్చాలని సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే పంగల్ రోడ్డు నుంచి బళ్లారి రోడ్ దాకా కొత్తగా నాలుగు లేన్ల హైవే నిర్మించాలని.. అనంతపురం క్లాక్ టవర్ దగ్గరున్న పాత బ్రిడ్జి స్థానంలో కొత్త ఫ్లై ఓవర్ నిర్మించాలని కేంద్ర మంత్రి గడ్కరీని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో 310 కోట్లతో జాతీయ రహదారి మంజూరు అయింది. హైవే పనులు జరక్కుండా అడుగడుగునా అడ్డు పడిన టీడీపీ నేతలు.. అభివృద్ధి పనులు చివరి దశకు చేరటంతో రూటు మార్చారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. పనులన్నీ పూర్తి అయితే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నామరూపాల్లేకుండా పోతుందన్న భయం టీడీపీ నేతల్ని వెంటాడుతోంది. పచ్చ పార్టీ రాజకీయ డ్రామాలు నమ్మవద్దని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రజలకు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: టీడీపీలో సీటు కోసం నానాపాట్లు.. సీనియర్ నేతకు సర్దుబాటు అవుతుందా? -
తాడిపత్రిలో వివాహిత దారుణ హత్య.. వారిపైనే అనుమానం?
తాడిపత్రి అర్బన్(అనంతపురం జిల్లా): మంచంపై నిద్రిస్తున్న వివాహితను తలపై కత్తితో నరికి చంపి.. పెట్రోల్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించిన ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలోని నందలపాడులో చోటుచేసుకుంది. ఆ మహిళను భర్త లేదా కుమారుడు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు.. నందలపాడుకు చెందిన రంగనాథ్‌రెడ్డి, శివమ్మ (48) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. కుమార్తెలందరికీ వివాహమైంది. కుమారుడు రవీంద్రనాథ్‌రెడ్డి ఇటీవల ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. మతాంతర వివాహం కావడంతో కొడుకును ఇంటికి రావొద్దని తల్లి శివమ్మ వ్యతిరేకించింది. దీంతో రవీంద్రనాథ్‌రెడ్డి తాడిపత్రిలోనే వేరు కాపురం పెట్టాడు. చదవండి: అప్పు తీరుస్తామని పిలిపించి.. రాధను చంపేశారు కాగా.. భర్త రంగనాథ్‌రెడ్డి, భార్య శివమ్మ ఇద్దరే నందలపాడులో నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి శివమ్మ తన ఇంటి వసారాలో మంచంపై నిద్రపోగా.. భర్త రంగనాథ్‌రెడ్డి ఇంటి మిద్దెపైకి ఎక్కి పడుకున్నాడు. గురువారం ఉదయం కిందకు దిగొచ్చిన రంగనాథ్‌రెడ్డి తన భార్య పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందిందని చుట్టుపక్కల వారికి చెప్పాడు. ముమ్మాటికీ హత్యే కానీ.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 70 శాతానికి పైగా కాలిపోయిన శివమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటే.. కాలిపోతున్నప్పుడు కేకలు వేసేదని పోలీసులు చెబుతున్నారు. మంటల్లో కాలిపోతున్న సమయంలో ఆ ప్రాంతంలో అటూఇటూ తిరిగిన ఆనవాళ్లు ఏమీ లేవని గుర్తించిన పోలీసులు ఘటన స్థలంలో లభించిన ఆధారాలను బట్టి శివమ్మ హత్యకు గురైందనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చి క్లూస్ టీమ్‌ను రప్పించారు. శివమ్మ తలపై కత్తిలాంటి పదునైన ఆయుధంతో నరికిన ఆనవాళ్లను క్లూస్ టీమ్ కనుగొంది. శివమ్మ తలపై రెండుచోట్ల బలమైన లోతు గాయాలు ఉన్నట్టు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముందుగా శివమ్మను తలపైకొట్టి హత్య చేసి.. ఆ తర్వాత పెట్రోల్ పోసి దహనం చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. చంపిందెవరో! కాగా, శివమ్మను చంపింది ఎవరనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. తన భార్య హత్యకు గురైనా.. ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త రంగనాథరెడ్డి ఫిర్యాదు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు ఇటీవలే మతాంతర వివాహం చేసుకున్న కుమారుడు రవీంద్రనాథ్‌రెడ్డిని శివమ్మ ఇంట్లోకి రానివ్వకపోవడంతో అతడేమైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అనే అనుమానం కూడా ఉంది. కుమారుడు రవీంద్రనాథ్‌రెడ్డిపై పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. శివమ్మ అంత్యక్రియలు ముగిసిన అనంతరం తండ్రీ కొడుకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ పూర్తయిన అనంతరం గానీ.. వారిద్దరిలో ఎవరు హంతకులో చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. -
ఆ షాక్ నుంచి జేసీ బ్రదర్స్ ఇంకా తేరుకోలేదా?
అనంతపురం జిల్లాలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ కుటుంబం ఒకటుంది. ఆ కుటుంబ పెద్ద ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయనకో తమ్ముడున్నాడు. అన్నదమ్ములు ఇద్దరికీ నోటి తీట, దుడుకుతనం కూడా ఎక్కువే. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నదమ్ముల రాజకీయ ప్రభ మసకబారింది. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తుండటంతో ఉనికి కోసం నానా తంటాలు పడుతున్నారు. జేసీ దివాకరరెడ్డి, జేసీ ప్రభాకరరెడ్డి పేర్లు అనంతపురం జిల్లాలో అందరికీ పరిచయమైనవే. 1985 నుంచి వరుసగా ఆరుసార్లు తాడిపత్రి అసెంబ్లీ సీటు నుంచి విజయం సాధించిన దివాకరరెడ్డి నలుగురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని ముందుగానే ఊహించి హస్తానికి హ్యాండిచ్చి కుటుంబం అంతా సైకిల్ సవారీ స్టార్ట్ చేసింది. తాడిపత్రి అసెంబ్లీ సీటు తమ్ముడు ప్రభాకరరెడ్డికి ఇచ్చి.. తాను అనంతపురం ఎంపీగా పోటీ చేశారు దివాకరరెడ్డి. ఇద్దరూ విజయం సాధించారు. ఇక 2019లో తాను తప్పుకుని కొడుకు పవన్‌రెడ్డిని అనంతపురం నుంచీ ఎంపీ సీటుకు పోటీ చేయించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనంతో జేసీ బ్రదర్స్ రాజకీయాలు ముగిసిపోయాయి. నాలుగు దశాబ్దాల రాజకీయానుభవం వైఎస్ జగన్ జైత్రయాత్ర ముందు తుడిచిపెట్టుకుపోయింది. ఆ షాక్ నుంచి జేసీ కుటుంబం ఇంకా తేరుకోలేదు. ఓటమి తర్వాత పవన్‌రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరో ఏడాదిలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు జేసీ దివాకరరెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో జేసీ కుటుంబానికి ఒక టిక్కెట్ మాత్రమే ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ జేసీ ప్రభాకర్‌రెడ్డి లేదా ఆయన కుమారుడికి ఇస్తే తమ పరిస్థితి ఏంటని జేసీ దివాకర్‌రెడ్డి డైలమాలో పడ్డారు చదవండి: చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై మంత్రి అంబటి ట్వీట్ అందుకే రాయల తెలంగాణా పేరుతో మరోసారి వార్తల్లోకి ఎక్కి.. రాజకీయంగా గందరగోళం సృష్టించి..లబ్ది పొందాలని జేసీ దివాకర్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే పలువురు రాజకీయ నిరుద్యోగులను జేసీ దివాకర్ రెడ్డి కలుస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ను ఇటీవలే జేసీ దివాకర్ రెడ్డి కలిసి చర్చించారు. రాయల తెలంగాణ అంశంతో పాటు శింగనమల అసెంబ్లీ స్థానంపై జేసీతో శైలజానాథ్ చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు తాడిపత్రి నియోజకవర్గంలో రోజు రోజుకూ బలహీన పడుతున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం.. రెచ్చగొట్టే కార్యక్రమాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. చదవండి: రజినీకాంత్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన లక్ష్మీపార్వతి పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు. నోటి దురుసుతో అధికారులు, ప్రత్యర్థులపై తిట్లు లంకించుకోవడం, దాడులకు దిగడం ద్వారానే ఎప్పుడూ వార్తల్లో వ్యక్తులుగా ఉండే జేసీ బ్రదర్స్ ఇప్పుడు రాజకీయంగా ఉనికి నిలబెట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టే రాజకీయాలకు కూడా దిగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. -
మా చిరునవ్వుకు కారణం మీరే జగనన్న.. నార్పల సభలో విద్యార్థిని భావోద్వేగం..
సాక్షి, అనంతపురం జిల్లా: ‘అన్నా నమస్తే, మా నాన్న టైలరింగ్ చేస్తారు.. మా అమ్మ గృహిణి, మాది ధర్మవరం.. అన్నా మీరు అంటుంటారు ఒక దీపం ఒక గదికి వెలుగులు ఇస్తుంది కానీ చదువుల దీపం ఆ జీవితాల్లో వెలుగులు నింపి ఆ కుటుంబ రూపురేఖలు మార్చేస్తుందని, మీరు విద్యా వ్యవస్ధలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు.. ఆ చదువుల దీపాలను వెలిగించే యాగానికి మీరు శ్రీకారం చుట్టారు’’ అంటూ అనంతపురం జేఎన్టీయూ కాలేజ్ బీటెక్ సెకండియర్ విద్యార్ధిని దివ్య దీపిక భావోద్వేగానికి గురైంది. నార్పలలో కంప్యూటర్ బటన్ నొక్కి ‘జగనన్న వసతి దీవెన’ ఆర్ధిక సాయాన్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో విద్యార్ధులు తమ స్పందన తెలిపారు. ‘జగనన్న వసతి దీవెన గురించి విద్యార్ధిని దివ్య దీపిక మాటల్లోనే.. మీరు వెలిగించే దీపాలు ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాయి. అన్నా నాది 2021లో ఇంటర్ పూర్తవగానే ఇక్కడ జేఎన్టీయూలో సీట్ తెచ్చుకున్నాను. నేను విద్యా దీవెన ద్వారా ఉచితంగా చదువుకుంటున్నాను. అలాగే మా తల్లిదండ్రులకు భారం కాకుండా వసతి దీవెన ద్వారా హాస్టల్ ఫీజు కూడా చెల్లిస్తున్నారు. ఇప్పుడు నేను గర్వంగా చెబుతున్నా.. మా జగనన్న నన్ను చదివిస్తున్నారని.. లాక్డౌన్ తర్వాత అంతంతగా ఉన్న మా ఆర్ధిక పరిస్ధితిపై మీరు కనుక ఈ పథకాలు పెట్టకపోయి ఉంటే ఎంతో భారం పడేది. మీ చిరునవ్వులో నేను భాగమవుతా.. మీ కుటుంబంలో ఒకడినవుతానని మీరు అంటుంటారు.. మా చిరునవ్వులో భాగమే కాదు చిరునవ్వుకు కారణం కూడా మీరే, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు.. విద్యా కానుక ద్వారా స్కూల్ బుక్స్, బ్యాగ్, ఇలా ప్రతీది అందిస్తున్నారు, ఇది సాధారణ వ్యక్తులకు సాధ్యం కానిదంతా మీరు చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ నాయకుడు రాబోయే తరం గురించి ఆలోచిస్తాడు. మీరు ప్రతి గుండెలో ఉంటారన్నా.. మా ఇంట్లో చాలా పథకాలు అందుతున్నాయి. మా ఇంట్లో ఇప్పటివరకు అక్షరాలా రూ. 3,06,000 సాయం చేశారు. మా సొంతింటి కల నెరవేరింది.. అన్నొచ్చాడని చెబుతాం, మంచి రోజులు వచ్చాయని చెబుతాం. చదవండి: ఆ పెద్దమనిషి ఇంటర్వ్యూ చూస్తే ముసలి పులి కథే గుర్తొచ్చింది మీరు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయ్యారు. మీ పాదయాత్రకు ఏదీ సాటిరాదన్నా. నేను కోరుకుంటున్న ఉన్నతమైన సమాజానికి మీరు పునాదులు వేశారు. ప్రతి గ్రామంలో అన్నీ ఏర్పాటుచేస్తున్నారు. సచివాలయాల ద్వారా అన్నీ అందుతున్నాయి, మీ కష్టాన్ని చరిత్ర కచ్చితంగా గుర్తుంచుకుంటుంది. ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు కానీ చరిత్ర కొందరినే గుర్తించుకుంటుంది. ఆ చరిత్రలో జగన్ అనే పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. యాదృచ్చికమో లేక దైవ నిర్ణయమో కానీ మీరు సీఎం అయిన తర్వాత కరువుతో అల్లాడే రాయలసీమ కూడా పచ్చగా కళకళలాడుతుంది. అన్నొచ్చేశాడు మన బతుకులు మార్చేశాడు. రాబోయే రోజుల్లో మీరు చదివిస్తున్న ఈ బిడ్డ ఉన్నతస్ధాయికి ఎదిగి మీ ముందుకొచ్చి మాట్లాడుతుంది అన్నా. మీ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో నా వంతు పాత్రను నేను పోషిస్తాను, ధ్యాంక్యూ అన్నా. మా విద్యార్ధులంతా మీకు రుణపడి ఉంటాం సార్, మాది నిరుపేద కుటుంబం, చెన్నూరు గ్రామం, తిరుపతి జిల్లా. మా నాన్న కూలిపనులు చేస్తారు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్ధితుల్లో ఉన్న నేను ఈ రోజు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నానంటే మీ నవరత్న పథకాలే కారణం. విద్యాదీవెన, వసతిదీవెన లేకుండా ఉంటే నేను చదువుకు దూరమయ్యేవాడిని, నాలాంటి ఎంతోమంది విద్యార్ధులకు మీరు సాయం చేస్తున్నారు, మా విద్యార్ధులంతా మీకు రుణపడి ఉంటాం, వసతి దీవెన ద్వారా మాకు సాయం అందుతుంది, మాకు చాలా సంతోషంగా ఉంది, చరిత్రలో చిరస్ధాయిగా నిలిచిపోయే మార్పులు మీరు విద్యారంగంలో చేస్తున్నారు. నాడు నేడు, అమ్మ ఒడి, గోరుముద్ద, విదేశీ విద్యాకానుక పథకాలు తీసుకొచ్చారు, ప్రతి నెలా మా ఇంట్లో పథకాలు అందుతున్నాయి, మా ఒక్క కుటుంబానికే మీరు రూ. 4,59,976 అందజేశారు, మాలాంటి పేద విద్యార్ధులకు మీరు అండగా నిలిచి ఎప్పుడూ మాకు తోడుగా నిలిచి సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం, నేను రాముడి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని పుస్తకాలలో చదివాను కానీ ఇప్పుడు జగనన్న పాలనలో మేం అంతే సంతోషంగా ఉన్నాం, నేను మంచి ప్రయోజకుడిని అయి పది మంది విద్యార్ధులకు తోడ్పాటును అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను, నేను మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను సార్, ధన్యవాదాలు. -గోవింద్ చంద్రశేఖర్, బీటెక్ ఫైనలియర్, ఎస్కేడీ యూనివర్శిటీ విద్యార్ధులకు మీరు రోల్‌మోడల్.. సార్, నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను, ఈ కాంపిటీటివ్ ప్రపంచంలో ఉన్నత చదువులు చదివించడం అనేది మా తల్లిదండ్రులకు పెద్ద భారం, కానీ మీరు సమాజంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. మీరు మా విద్యార్ధులకు అనేక పథకాలు తీసుకొచ్చారు, దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్లో అనేక కోర్సులు ప్రవేశపెట్టారు, మా విద్యార్ధులకు మీరు రోల్‌మోడల్‌గా నిలిచారు.. మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చారు. మేం కూడా ఉన్నత చదువులు చదివి ప్రయోజకులై భవిష్యత్‌లో ఉన్నతంగా రాణిస్తాం.. నేను ఈ మధ్య మాల్కం గ్లాడ్వెల్ రచించిన అవుట్లేర్స్ పుస్తకం చదివాను, ఆ పుస్తకంలో పదివేల గంటల సూత్రం చదివాను, దాని అర్ధం ఏంటంటే ఎవరైనా ఏ రంగంలోనైనా నిష్ణాతులు కావాలంటే పదివేల గంటలు అభ్యసించాలని, మీరు పాదయాత్రలో దానిని నిరూపించారు, ఏ రంగానికైనా ఇది వర్తిస్తుంది, మీరు మనసున్న మారాజులా నిలిచారు, మీరు మా యువతకు గొప్ప స్పూర్తిప్రదాతగా నిలిచారు. మీ పేరు నిలబెట్టేలా మేం ముందుకెళతాం, ధ్యాంక్యూ సార్. -గ్రేసీ, బీటెక్ సెకండియర్ విద్యార్ధిని, జేఎన్టీయూ, అనంతపురం -
సీఎం జగన్ రాక కోసం ముస్తాబవుతున్న శింగనమల
-
సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన వాయిదా
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి అనంతపురం జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 26కి వాయిదా వేసినట్లు సీఎంవో అధికారులు ప్రకటించారు. 26న అనంతపురం జిల్లా నార్పలలో సీఎం పర్యటించనున్నారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఐదోసారి జిల్లాకు సీఎం జగన్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఐదోసారి వస్తున్నారు. తొలిసారిగా అనంతపురం జిల్లా కేంద్రంలో కంటివెలుగు కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఆ తర్వాత ధర్మవరంలో నేతన్న హస్తం, వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రైతుదినోత్సవం పేరుతో రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడే ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్ ప్రారంభించారు. అనంతరం రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు శింగనమల నియోజకవర్గం నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి వస్తున్నారు. ఇక్కడి నుంచే కంప్యూటర్ బటన్ నొక్కి వసతి దీవెన నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నారు. కాగా, రేపు(సోమవారం) ముస్లిం సోదరులకు ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. విజయవాడ విద్యాధరపురం మినీ స్టేడియంలో జరిగే ఇఫ్తార్ విందులో సీఎం హాజరవనున్నారు. చదవండి: రామోజీరావు అంటే ఆయన కుమారుడు సుమన్‌కి నచ్చదు.. ఎందుకంటే? -
ఇదేందయ్యా ఇది లోకేష్ బాబూ.. మైండ్ బ్లాంక్?
శింగనమల/గార్లదిన్నె: టీడీపీ అధికారంలోకి వస్తే రుణమాఫీ ఎంత చేస్తారని ఆ పార్టీ నాయకుడు నారా లోకేశ్‌ను పలువురు రైతులు ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నె కొట్టాల వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కాగా, అక్కడకు టీడీపీ శ్రేణులు రైతులను బతిమాలి తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు ‘మీ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ ఎంత చేస్తారు’ అని రాసి అక్కడ ఉంచిన ప్రశ్నోత్తరాల బాక్స్‌లో వేయగా.. వాటి గురించి లోకేశ్ సమాధానం చెప్పలేదు. ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి టెక్నాలజీని అనుసంధానిస్తామని, బటన్ నొక్కగానే వ్యవసాయ యంత్ర పరికరాలు అందేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. -
అతి తక్కువ వర్షంతో పండే ఎడారి పంట.. . మెట్ట రైతుకు అండ..
30 ఎకరాల్లో జీవీ కొండయ్య అశ్వగంధ సాగు కింగ్ ఆఫ్ ఆయుర్వేదగా పేరొందిన ఔషధ పంట అశ్వగంధ మెట్ట రైతులకు లాభాల సిరులను కురిపిస్తోంది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో సంప్రదాయ పంటలను నమ్ముకొని ఏటా పంట నష్టంతో కుదేలైన జీవీ కొండయ్య అనే రైతు వినూత్నంగా ఆలోచించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం జీ.కొట్టాల గ్రామంలోని తన పొలంలో 30 ఏళ్ల క్రితం అశ్వగంధ సాగుకు శ్రీకారం చుట్టి లాభాలు గడిస్తూ రైతులకు ఆదర్శంగా నిలిచారు. కొండయ్యను ఆదర్శంగా తీసుకొని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఎందరో రైతులు అశ్వగంధ సాగు చేపట్టారు. ఆయన సలహాలు, సూచనలు పాటిస్తూ లాభాలు గడిస్తున్నారు. అశ్వగంధ పంటపై హైదరాబాదు బోడుప్పల్‌లోని కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా కేంద్రం (సీమాప్)లో జరిగిన అవగాహన సదస్సు పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు చెప్పింది శ్రద్ధగా విన్న కొండయ్య ఆ సీజన్లోనే ఎకరాకు రూ.6 వేల ఖర్చుతో 5 ఎకరాల్లో అశ్వగంధను సాగు చేశారు. అతి తక్కువ వర్షపాతంలోనే పండే పంట ఇది. ఎటువంటి క్రిమి సంహారక మందులుగానీ, ఎరువులు గానీ వాడాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడి సాధించారు. ఎకరాకు 3 క్వింటాళ్ల అశ్వగంధ వేర్ల దిగుబడి రావడంతో క్వింటాకు రూ.40 వేల వరకూ ఆదాయం పొందారు. నాటి నుంచి కొండయ్య వెనుతిరిగి చూడలేదు. 5 ఎకరాలతో ప్రారంభించి 30 ఎకరాలకు విస్తరించారు. తనకున్న 8 ఎకరాలతో పాటు ఇతర రైతుల భూమిని కౌలుకు తీసుకొని, ప్రతి ఏడాదీ భూమి మారుస్తూ. అశ్వగంధను సాగు చేస్తున్నారు. అశ్వగంధ సాగులో మంచి దిగుబడి సాధించడంతోపాటు, నాణ్యమైన దిగుబడితో ప్రశంశలు అందుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మెడిషినల్ బోర్డు నుంచి, లక్నోలోని ‘సీమాప్’తో పాటు ఢిల్లీ, జైపూర్లలో కూడా అవార్డులు సొంతం చేసుకున్నారు. 2 ఎకరాల్లో ఫారం పాడ్లు నిర్మించి, వర్షాభావ పరిస్థితుల్లోనూ మంచి దిగుబడులు సాధిస్తూ వచ్చారు. కొండయ్యను చూసి సొంత గ్రామంతోపాటు రాయలసీమ జిల్లాల రైతులు పలువురు అశ్వగంధ సాగు చేస్తూ లాభాలు గడిస్తుండటం విశేషం. మార్కెటింగ్ సమస్య లేదు అశ్వగంధ పంటను జూలైలో విత్తితే జనవరిలో పంట చేతికి వస్తుంది. వర్షపాతం అతితక్కువ ఉన్న ప్రాంతాలకే ఈ పంట అనుకూలం. వర్షాలు ఎకువైతే వేరు కుళ్లిపోయి పంట పాడైపోతుంది. పెట్టుబడి పెద్దగా అవసరం లేదు. కిలో రూ.200 చొపున ఎకరాకు 3 కేజీల విత్తనం వేస్తే సరిపోతుంది. పంటకు చీడపురుగుల బెడదగానీ, తెగుళ్ల బెడద గానీ ఏమీ ఉండవు. పశువులు, పక్షులు, జింకల నుంచి కూడా ముప్పు ఉండదు. పశువుల పేడను ఎరువుగా వేస్తే సరిపోతుంది. విత్తిన నెల తరువాత ఒకసారి, 3 నెలల తరువాత మరోసారి కలుపు తీయాలి. పంట పీకిన రోజే వేరును, కాండాన్ని, కాయలను వేరు చేసి ఆరబెడతాం. వేరు నాణ్యతను బట్టి 6 భాగాలుగా విభజించి ప్యాకింగ్ చేసి పెడతాం. కాయను నూర్పిడి చేసి విత్తనాలు తీస్తాం. ఎకరాకు 50 నుండి 100 కేజీల వరకూ విత్తనం వస్తుంది. అదే విత్తనాన్నే తిరిగి పంట సాగుకు ఉపయోగిస్తాం. మిగిలిన విత్తనాన్ని కావాల్సిన రైతులకు కిలో రూ.200 చొప్పున విక్రయిస్తాం. అశ్వగంధ విత్తనం వేశాక తరువాత నెలరోజుల పాటు వర్షం రాకపోయినా విత్తనం ఏమీ కాదు. అశ్వగంధ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ప్రోత్సాహం కూడా అందుతుంది. పంటను నిల్వ చేసేందుకు స్టోరేజీ రూముల నిర్మాణానికి డబ్బు కూడా ఇస్తుంది. వ్యాపారులు పొలం వద్దకే వచ్చి కొంటున్నారు. మార్కెటింగ్ సమస్య లేదు. – జీవీ కొండయ్య (94415 35325), అశ్వగంధ రైతు, జీ.కొట్టాల, గుంతకల్లు మం., అనంతపురం జిల్లా – యం.మనోహర్, సాక్షి, గుంతకల్లు రూరల్, అనంతపురం జిల్లా -
భారీ క్రేన్ వచ్చేసిందోచ్!
అనంతపురం సిటీ/క్రైం: అనంతపురానికి ఆదివారం ఓ భారీ క్రేన్ చేరుకుంది. దీనిని ప్రత్యేక వాహనంలో చైన్నె నుంచి తీసుకువచ్చారు. నగరంలోని టవర్‌క్లాక్ సమీపంలో చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ) పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఈ క్రమంలో విద్యుత్ లైన్‌కు పైన గడ్డర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందు కోసం చైన్నె పోర్టు నుంచి 700 టన్నుల బరువున్న భారీ క్రేన్‌ను తెప్పించారు. రైల్వే ఉన్నతాధికారుల నుంచి అనుమతులు అందగానే గడ్డర్లను ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయనున్నారు. అనంతరం 45 రోజుల్లో మిగిలిన పనులు పూర్తి చేసి జాతికి అంకింతమివ్వనున్నారు. ఈ అంశానికి సంబంధించి రైల్వే శాఖ ఉన్నతాధికారులతో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, స్థానిక రైల్వే అధికారులు పలుమార్లు చర్చించారు.sr -
అనంత: జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వేలూరు రంగయ్య నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నామినేషన్లో సరైన డాక్యూమెంట్లు సమర్పించకపోడంతో టీడీపీ నేత వేలూరు రంగయ్య నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1277 ఓట్లు ఉండగా.. వైఎస్సార్సీపీ కి 1200 పైగా ఆధిక్యత ఉంది. బలం లేకపోయినా బరిలో దిగేందుకు యత్నించి టీడీపీ నేతలు అభాసుపాలయ్యారు. పైగా ఎన్నికల అధికారులపై అభాండాలు వేయటం సరికాదని అనంతపురం సీనియర్ న్యాయవాది ఉమాపతి పేర్కొన్నారు. చదవండి: నా కుమారుడు రాఘవరెడ్డి ఏ తప్పు చేయలేదు: ఎంపీ మాగుంట -
ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తా: వెన్నపూస రవి
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించండి: మంత్రి పెద్దిరెడ్డి
-
చెలరేగిపోతున్న కార్పొరేట్ కళాశాలలు ..అధికంగా ఫీజుల వసూలు
హితేష్ అనే విద్యార్థి నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ‘చైనా’ బ్యాచ్ అని, 24 గంటలూ ఏసీ అని రూ.90 వేలు ఫీజు కట్టించుకుంటున్నారు. పుస్తకాలకు మరో రూ.15 వేలు వసూలు చేశారు. హాస్టల్‌కు నెలకు రూ.5 వేల చొప్పున కట్టించుకున్నారు. నారాయణ కళాశాలలో నర్మద అనే విద్యార్థినికి ఐఐటీ కోచింగ్ పేరుతో ఏడాదికి రూ.75 వేలు, హాస్టల్‌కు నెలకు రూ.5 వేలు చొప్పున కట్టాలని చెప్పారు. పుస్తకాలు, ప్రాక్టికల్స్ పేరుతో మరికొంత చెల్లించాలని ఒత్తిడి చేశారు. తలకు మించిన భారం కావడంతో తల్లిదండ్రులు రెండు నెలల క్రితం నారాయణ కళాశాలలో టీసీ తీసుకుని.. కూతురిని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్చారు. నారాయణ విద్యా సంస్థల్లో ముందస్తుగా అడ్మిషన్లు చేయడానికి పీఆర్వోలను నియమించుకున్నారు. ముందుగా చేరితే ఫీజుల రాయితీ ఇస్తామని అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. జెడ్ఎఫ్బీ, ఎన్120, కోస్పార్క్ అని ఆకర్షణీయమైన పేర్లు పెట్టి స్టడీ మెటీరియల్‌పై అమాంతంగా ఫీజులు పెంచుతున్నారు. అనంతపురం నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ ఇటీవల కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఫీజు మొత్తం కడితేనే రికార్డులు ఇస్తామని బెదిరించడంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. ఫీజు కట్టలేదని అందరి ముందు అవమానించడం, క్యాంపస్ బయట నిల్చోబెట్టడం, రికార్డులు, హాల్‌టికెట్లు ఇవ్వబోమని బెదిరించడం కార్పొరేట్ కళాశాలల్లో షరామామూలవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవ్యశ్రీ లాంటి విద్యార్థినులు ఎంతోమంది అర్ధంతరంగా చదువులు మానేయడం.. ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తున్నారు. అనంతపురం: కార్పొరేట్ కళాశాలలు అడ్డగోలు సంపాదనకు తెరలేపాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కన్నా అదనంగా వసూలు చేస్తున్నాయి. నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ కళాశాలల్లో అధిక ఫీజులు, వసూళ్ల కోసం వేధింపులు పరాకాష్టకు చేరుతున్నాయి. సూపర్ –20, ఐఐటీ తదితర కోర్సుల పేరుతో విచ్చలవిడిగా వసూలు చేస్తూ తల్లిదండ్రులపై విపరీతమైన భారం మోపుతున్నారు. విద్యార్థుల్లోనూ మానసిక ఒత్తిడి పెంచుతున్నారు. దీని నుంచి విద్యార్థులు బయటపడలేక అర్ధంతరంగా చదువు మానేయడం, ఆత్మహత్యకు యత్నించడం వంటి విపరీతమైన పరిస్థితులకు దారితీస్తోంది. కళాశాలలపై పర్యవేక్షణ చేయాల్సిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు నిమ్మను నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. హాస్టల్ ఫీజు ఏడాదికి రూ.60 వేలట! నారాయణ కళాశాలలో ఒక్కో విద్యార్థికి హాస్టల్ ఫీజు రూ.60 వేలుగా నిర్ధారించారు. నెలకు రూ.5 వేల చొప్పున వసూలు చేస్తూ ఒక్కో గదిలో 10 మందిని కేటాయించారు. నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదు. ఇదే విషయం ఇటీవల తనిఖీలో వెలుగు చూడటంతో జాయింట్ కలెక్టర్ జరిమానా విధించారు. ఒక్కో విద్యార్థికి ఇంటర్మీడియెట్‌లో ఫీజు రూ.20 వేలు దాటకూడదు. కానీ కార్పొరేట్ కళాశాలలు రూ.65 వేల నుంచి రూ.80 వేల దాకా వసూలు చేస్తున్నాయి. తెలుగు అకాడమీ పుస్తకాలు మాత్రమే చదవాల్సి ఉన్నప్పటికీ సొంత మెటీరియల్ పేరుతో మరో రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. ఏడాదికి హాస్టల్ ఫీజు, కళాశాల ఫీజు మొత్తం రూ.1.50 లక్షలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారు. అంత డబ్బు చెల్లించుకోలేని వారు తమ పిల్లలను చదువు మాన్పిస్తున్నారు. అన్నీ అద్దె భవనాలే.. నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఏ ఒక్క బ్రాంచ్‌కూ సొంత భవనాలు ఉండవు. అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలల హవా నడిచినన్నాళ్లూ తల్లిదండ్రులను ముక్కుపిండి వసూలు చేసి.. అద్దె భవనాలు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చుననే ఎత్తుగడతోనే కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులకు నివేదించాం నారాయణ కళాశాల ఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాం. అధిక ఫీజులు వసూలు చేస్తున్న అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – డాక్టర్ సురేష్‌బాబు, ఆర్ఐఓ, అనంతపురం -
అనంతపురం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం
-
అప్పుడే వద్దు.. టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల నష్టాలివే..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలిసీ తెలియని వయసులో కలిగే లైంగిక కోరికలతో పాటు లైంగిక హింస, బాల్య వివాహాలు.. ఆడుకునే అమ్మాయిల్ని అమ్మల్ని చేస్తున్నాయి. చిన్న వయసులోనే గర్భం దాల్చిన అమ్మాయిల్లో, వారికి పుట్టే పిల్లల్లో కొన్ని దీర్ఘ కాలిక అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. ఫలితంగా ఇద్దరూ జీవితాంతం ఇటు శారీరకంగా, అటు మానసికంగా బాధపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చ రిస్తున్నారు. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు లైంగిక విద్య పట్ల పూర్తి అవగాహన కల్పిస్తేనే ఈ సమస్యను అధిగమించవచ్చని సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో మార్పు రాకపోవడం విస్మయపరుస్తోంది. కూతురు రజస్వల కాగానే పెళ్లి చేస్తే సరిపోతుందని చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కాగా కొంతమంది అమ్మాయిలు చదువు, కెరీర్, ఉద్యోగాల్లో స్థిరపడటం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం గురించి ఆలోచిస్తూ 26 ఏళ్ల వరకూ వివాహం చేసుకోవడం లేదు.. కానీ గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు కూతురికి పెళ్లిచేస్తే తమ బాధ్యత తీరుతుందని, బరువు తగ్గుతుందని పదహారేళ్లకే కానిచ్చేస్తున్నారు. ఈ కారణంగానే ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీనేజీ ప్రెగ్నెన్సీలు పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. ఇక్కడే కాదు రాయలసీమ జిల్లాల్లోనే చిన్న వయసులో తల్లులవుతున్న వారు చాలా ఎక్కువగా ఉన్నారంటే ఆశ్చర్యంగా కలుగక మానదు. పదహారేళ్లకే తల్లులుగా.. వివాహ అర్హత వయసే 18 ఏళ్లు ఉండగా పదహారేళ్లకే తల్లులవుతున్న పరిస్థితి చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గడిచిన 11 మాసాల్లో అనంతపురం జిల్లాలో 105 మంది అమ్మాయిలు 16 ఏళ్ల లోపు వయసులోనే గర్భం దాల్చారు. 18 ఏళ్లలోపు వయసున్న అమ్మాయిల్లో మరో 433 మంది గర్భం దాలి్చన వారిలో ఉన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోనూ 16 ఏళ్లలోపు వయసున్న 63 మంది అమ్మాయిలు తల్లులయ్యారు. 18 ఏళ్లలోపు ఉండి ప్రెగ్నెన్సీ వచ్చిన వారు మరో 283 మంది ఉన్నారు. వీరిలో 95 శాతం మంది గ్రామీణ ప్రాంత అమ్మాయిలే. చదువుకోవాల్సిన వయసులో తల్లిదండ్రులు వారికి మూడుముళ్ల బంధం వేసి వారి కెరీర్‌కు మధ్యలోనే సమాధి కడుతున్నారు. రాయలసీమ జిల్లాలో కర్నూలు తర్వాత ఎక్కువగా టీనేజీ ప్రెగ్నెన్సీలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలు సామాజిక మాధ్యమాలకు ప్రభావితమై అబ్బాయిలతో కలిసి ఇంట్లోనుంచి వెళ్లిపోతున్న పరిస్థితులూ ఉన్నాయి. టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల నష్టాలు ►మెటర్నల్ మోర్టాలిటీ అంటే కాన్పు సమయంలో తల్లులు మృతి చెందే అవకాశం ఉంది ►నెలలు నిండక ముందే పుట్టే అవకాశం ►స్టిల్ బర్త్ అంటే కడుపులోనే బిడ్డ చనిపోవడం ►శిశువులు బరువు తక్కువగా పుట్టడం ►తీవ్రస్థాయిలో రక్తపోటు ►శిశువులు సరిగా శ్వాస తీసుకోలేక పోవడం చదవండి: భారత్‌లో భూకంప భయాలు.. మూడు రోజుల్లో 3 రాష్ట్రాల్లో ప్రకంపనలు.. చర్యలు తీసుకుంటాం 1098.. ఇది చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్. బాల్య వివాహం చేసినట్లు లేదా ఏర్పాట్లు చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే సదరు ప్రాంతానికి వెళ్తాం. అమ్మాయిని కేజీబీవీలో చేర్పించి చదివిస్తాం. చట్టపరంగా తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకుంటాం. చాలామంది అమ్మాయిలు మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు ఆకర్షితులై చిన్న వయసులో అబ్బాయిలతో కలిసి వెళ్లిపోతున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయి. – శ్రీదేవి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్ -
వ్యసనాలకు డబ్బివ్వలేదని ఇల్లాలినే హతమార్చాడు!
గుత్తి(అనంతపురం జిల్లా): గుత్తిలో దారుణం చోటు చేసుకుంది. తన వ్యసనాలు తీర్చుకునేందుకు అవసరమైన డబ్బును పుట్టింటి నుంచి తీసుకురాలేదన్న అక్కసుతో కట్టుకున్న భార్యనే హతమార్చాడు ఓ దుర్మార్గుడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తిలోని తాడిపత్రి రోడ్డులో ఉన్న మారుతీ నగర్‌కు చెందిన ఖాజా, జుబేదాబీ దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఏడాది లోపు వయసున్న ఓ కుమారుడు ఉన్నాడు. కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న ఖాజా తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో మద్యం కొనుగోలుకు అవసరమైన డబ్బును పుట్టింటికెళ్లి తీసుకురావాలని భార్యను వేధించేవాడు. అయితే కొద్దిగా కొద్దిగా కాకుండా ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బును భార్య పుట్టింటి నుంచి తీసుకువచ్చేలా పథకం వేశాడు. ఇందులో భాగంగా తాను కారు కొనుగోలు చేస్తున్నానని, ఇందుకు రూ.2 లక్షలు ఇప్పించుకుని రావాలని భార్యకు పురమాయించాడు. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు జుబేదాబీ వివరించింది. అల్లుడి తాగుడు అలవాటు గురించి తెలిసిన అత్తమామలు తొలుత రూ.20 వేలు ఇచ్చారు. మిగిలిన డబ్బు త్వరలో సమకూరుస్తామని భరోసానిచ్చారు. అయితే తాను అడిగిన మొత్తం తీసుకురాలేదన్న అక్కసుతో సోమవారం అర్ధరాత్రి మద్యం మత్తులో జుబేదాబీతో గొడవ పడ్డాడు. తల్లిని తండ్రి కొడుతుండడంతో నిద్ర మేల్కోన్న కుమార్తెలు సోమియా తవేరా, అలియా భయంతో ఏడుస్తూ తల్లిని గట్టిగా హత్తుకున్నారు. పిల్లలు చూస్తుండగానే జుబేదాబీని ఖాజా గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం తాడుతో ఫ్యాన్‌కు ఉరి వేశాడు. మంగళవారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అల్లుడి ఇంటి వద్దకు చేరుకుని చూడగా విగత జీవిగా ఉరికి వేలాడుతున్న కుమార్తెను చూసి బోరున విలపించారు. అప్పటికే తల్లి కోసం ఏడ్చి, ఏడ్చి సొమ్మసిల్లిన చిన్నారులను స్థానికులు చేరదీశారు. చదవండి: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య సమాచారం అందుకున్న సీఐ వెంకట్రామిరెడ్డి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. తమ కుమార్తెను అల్లుడే హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడంటూ జుబేదాబీ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో జుబేదాబీని భర్త ఖాజానే హతమార్చినట్లు వెల్లడైంది. ఖాజాపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెంకట్రామిరెడ్డి తెలిపారు. -
వర్క్ ఫ్రం హోం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
బొమ్మనహాళ్(అనంతపురం జిల్లా): పని ఒత్తిడి భరించలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ రమణ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన బొమ్మనహాళ్‌కు చెందిన కాడ్రా కృష్ణమూర్తికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కాడ్రా అశోక్ (26) బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి చేరుకుని వర్క్ ఫ్రం హోమ్ ద్వారా పనిచేస్తున్నాడు. అయితే పని ఒత్తిడి పెరగడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని హెచ్చెల్సీ వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి బళ్లారి విమ్స్‌కు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో బుధవారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. చదవండి: నర్సుతో డాక్టర్ ప్రేమాయణం.. పెళ్లి.. బిడ్డ పుట్టిన తర్వాత! -
అంతరిస్తున్న తోడేళ్లు! ఉమ్మడి అనంతపురంలో భారీగా తగ్గిన వన్యప్రాణులు
సాక్షి ప్రతినిధి అనంతపురం: క్రూర జంతువుగా పేరున్న తోడేళ్లు పొదలు, గుట్టలను ఆవాసాలుగా చేసుకుని జీవిస్తాయి. ఒకప్పుడు అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా కనిపించేవి. గొర్రెలు, మేకల మంద సంచరించే ప్రాంతాల్లో తిరిగేవి. ముఖ్యంగా జీవాలు ఎక్కువగా ఉండే అనంతపురం జిల్లాలో భారీగా ఉండేవి. కానీ ప్రస్తుతం వాటి జాడ మచ్చుకైనా కనిపించడం లేదు. తాజాగా అటవీశాఖ అధికారులు వీటిని అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేర్చారు. రెండేళ్లుగా ఎక్కడా కనిపించడం లేదని వెల్లడిస్తున్నారు. వేటలో పటిష్టమైన వ్యూహం తోడేళ్లు గుంపులుగా సంచరిస్తాయి. వేటలో పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేస్తాయి. ఒకటి ముందుగా డెకాయ్ ఆపరేషన్ చేస్తుంది. ఆ తర్వాత మిగతా వన్నీ వస్తాయి. మేక లేదా గొర్రెను తీసుకెళ్లేటప్పుడు గొంతును నోట కరచుకుని, తన ముళ్లతోకతో వెనుక కొడుతూ ఉంటుంది. దీంతో ఆ జీవం దానితో పాటు పరిగెడుతుంది. దీని వల్ల ఈడ్చుకెళ్లే శ్రమ వాటికి తగ్గుతుంది. ఒక తోడేలు ఉందంటే రెండు మూడు నక్కలు కూడా దాని సమీపంలోకి పోలేవు. రెండు లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో 30కి మించి తోడేళ్లు ఉండేవని అంచనా. కాగా, ఒకప్పుడు ప్రతి జిల్లాలోనూ గుంటనక్కలు కనిపించేవి. ఇప్పుడు వాటి జాడ కూడా లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో నాలుగేళ్లుగా మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే పునుగుపిల్లి కూడా కనుమరుగైనట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అటవీ విస్తీర్ణం తగ్గడం వల్లే.. జనావాసాలు పెరిగాయి. అడవులు వ్యవసాయ భూములుగా మారాయి. దీంతో వన్యప్రాణుల ఆవాసానికి ఇబ్బందిగా మారింది. కొండలు ఎక్కువగా ఉన్న అనంతపురం లాంటి జిల్లాలే తోడేళ్లకు మంచి ఆవాసాలు. ఇక్కడే వీటి జాడ లేదంటే మిగతా చోట్ల అసలే కనిపించవు. వీటిని కాపాడుకునేందుకు సర్వశక్తులా యతి్నస్తున్నాం. –సందీప్ కృపాకర్, జిల్లా ఫారెస్టు అధికారి, అనంతపురం చదవండి: కొరమీను, ఇంగిలాయి, జల్ల, బొమ్మిడాయి, గొరక, వాలుగ.. ఇక్కడ పుట్టినవే! -
మైనర్ బాలికకు పబ్లిక్ గా తాళి కట్టిన యువకుడు
-
దూసుకెళ్తున్న కార్లు.. ఆ జిల్లాలో నెలకు 400 కార్ల విక్రయాలు
సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కార్ల అమ్మకాలు దూసుకెళ్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పుడు నాలుగు చక్రాల వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు కారు హోదాగా భావించే సగటు కుటుంబాలు.. ఇప్పుడు నిత్యావసరంగా భావిస్తున్నాయి. సొంత ఇల్లు ఎంత ముఖ్యమో కారు ఉండటమూ అంతేననే ఆలోచన ఏర్పడింది. ముఖ్యంగా కోవిడ్ అనంతరం చిన్న చిన్న ఉద్యోగులు కూడా కారు వైపు మొగ్గు చూపుతున్నారు. కుటుంబంతో కలిసి సొంతకారులో ప్రయాణించాలన్న ఆలోచన బలంగా ఏర్పడింది. కార్లకు భారీ డిమాండ్.. ఐదేళ్ల క్రితం అనంతపురం జిల్లా కేంద్రంగా మహా అంటే నెలకు 80 నుంచి 100 కార్లు అమ్ముడయ్యేవి. తాజా గణాంకాలు చూస్తే నెలకు 400కు పైగా అమ్ముడవుతున్నాయి. దీన్నిబట్టి కార్ల డిమాండ్ ఎలా ఉందో అంచనా వేయచ్చు. కియా, మహీంద్రా, హ్యుందాయ్, మారుతి, టాటా వంటి కార్లకు బాగా డిమాండ్ ఉంది. కారు బుక్ చేసుకున్న తర్వాత కనీసం మూడు మాసాలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నట్టు షోరూం నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని కార్లకు 6 మాసాలు కూడా పడుతోంది. పండుగలు, ప్రత్యేక పర్వదినాల వేళ 500 కార్లు అమ్ముడైన సందర్భాలున్నాయి. కుటుంబ ప్రయాణాలపై మొగ్గు.. ఒకప్పుడు బస్సు, రైలు ప్రయాణాలు ఎక్కువ. ఇప్పుడు రూ.40 వేలు వేతనం తీసుకునే ఉద్యోగి కూడా కుటుంబంతో కలిసి కారులో ప్రయాణం చేయాలనుకుంటున్నారు. దీంతోపాటు సులభతర వాయిదాల్లో లోన్లు లభిస్తున్నాయి. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కార్లలో ప్రయాణమే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు. కొత్త కార్లకే కాదు సెకండ్ హ్యాండ్ కార్లకూ ఇప్పుడు మంచి మార్కెట్ ఉన్నట్టు ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. కొనుగోలు శక్తి పెరిగింది ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. చిన్న చిన్న ఉద్యోగులు కూడా కారు కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు చాలా ఎక్కువ మార్కెట్ ఉంది. ముఖ్యంగా కోవిడ్ అనంతరం జిల్లాలో కార్ల అమ్మకాల మార్కెట్ పెరిగింది. – వంశీ, జనరల్ మేనేజర్, మహీంద్రా కంపెనీ అక్కడ జాప్యం జరుగుతోందని.. మాది కృష్ణా జిల్లా కలిదిండి. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కొనాలనుకున్నా. కానీ విజయవాడలో 7 మాసాలు వెయిటింగ్ అని చెప్పారు. తెలిసిన వాళ్లుంటే అనంతపురంలో కొన్నా. ఈ వారంలో డెలివరీ ఇస్తున్నారు. ఆ వాహనం నాకు బాగా ఇష్టం. – ఎం.నాగరాజు, కలిదిండి ఆదాయం గణనీయంగా పెరిగింది రవాణాశాఖకు ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 206.42 కోట్లు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. డిసెంబర్ నాటికి రూ.154 కోట్లు టార్గెట్ కాగా రూ. 132 కోట్లు వసూలైంది. ఇందుకు కారణం వాహనాల కొనుగోలు పెరగడమే. ముఖ్యంగా కార్ల కొనుగోలు శాతం భారీగా పెరిగింది. మధ్యతరగతి వారు సైతం కార్లను కొనుగోలు చేస్తున్నారు. – శివరామప్రసాద్, ఉపరవాణా కమిషనర్, అనంతపురం -
‘దున్నపోతు’ సమస్యకు పరిష్కారం.. ఏంటా కథ.. అసలేం జరిగింది?
కణేకల్లు(అనంతపురం జిల్లా): తీవ్ర ఉత్కంఠకు తెరలేపిన అమ్మవారి దున్నపోతు సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. అందుబాటులో ఉన్న ఒకేఒక దున్నపోతుతో అంబాపురం, రచ్చుమర్రి గ్రామస్తులు ఊరి దేవర జరుపుకునేందుకు సిద్ధమైన నేపథ్యం తెలిసిందే. ఈ క్రమంలో దున్నపోతు తమదంటే తమదంటూ ఇరు గ్రామాల ప్రజలు వాగ్వాదానికి దిగి 20 రోజులుగా ఉత్కంఠకు తెరలేపారు. అసలేం జరిగిందంటే... ఈ నెల 17న అంబాపురంలో దేవర నిర్వహించాలని గ్రామస్తులు నిశ్చయించిన నేపథ్యంలో అమ్మవారి పేరుతో వదిలిన దున్నపోతు కోసం దాదాపు 30 రోజులకు పైగా వివిధ ప్రాంతాల్లో గాలించి చివరకు బొమ్మనహాళ్ మండలంలో కనిపించిన దేవరపోతును తీసుకెళ్లి బంధించారు. ఈ విషయం తెలుసుకున్న రచ్చుమర్రి గ్రామస్తులు అంబాపురానికి వెళ్లి తమ గ్రామ దేవత పేరున వదిలిన దున్నపోతును ఎలా బంధిస్తారంటూ వాదనకు దిగారు. అప్పటి నుంచి ఈ రెండు గ్రామాల మధ్య దున్నపోతు పంచాయితీ నలుగుతూ వస్తోంది ఎటూ తేల్చని పంచాయితీ.. ఇరు గ్రామాల ప్రజలను బుధవారం కణేకల్లు పోలీస్ స్టేషన్‌కు సీఐ యుగంధర్ పిలిపించుకుని మాట్లాడారు. ఒక్కొ గ్రామం నుంచి 80 నుంచి 90 మంది ప్రజలు తరలిరావడంతో పోలీస్ స్టేషన్ కిటకిటలాడింది. దున్నపోతును వదులుకునేది లేదంటూ అంబాపురం వాసులు వివరించారు. అయితే తమ గ్రామ దేవతకు సంబంధించిన దున్నపోతును తామూ వదులుకోబోమని రచ్చుమర్రి వాసులు తేల్చి చెప్పారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పంచాయితీ... మధ్యాహ్నం 1 గంట వరకూ సాగింది. సమస్యకు పరిష్కారం దక్కకపోవడంతో ఇరువైపులా ఐదుగురు చొప్పున గ్రామ పెద్దలను స్టేషన్ లోపలకు పిలుచుకెళ్లి సీఐ చర్చించారు. అయినా ఏకాభిప్రాయం కుదరలేదు. అనంతరం ఎవరికి వారు ఆ దున్నపోతు తమదంటే తమదంటూ దేవుడిపై ప్రమాణాలు చేశారు. చివరకు టాస్ వేసి తుది నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. అయితే టాస్ వేస్తే తమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన ఇరు గ్రామాల ప్రజల్లో తలెత్తి చివరకు ఈ అంశాన్ని కూడా విరమించుకున్నారు. సెంటిమెంట్‌తో రాజీ కుదిర్చిన సీఐ.. చివరగా సీఐ యుగంధర్ ఇరు గ్రామాల పెద్దలను కూర్చొబెట్టి చర్చలు జరిపారు. ఈ నెల 17న అంబాపురంలో దేవర ఉందని, రచ్చుమర్రిలో దేవరకు ఇంకా ఏడాది గడువు ఉండడంతో దున్నపోతు కొనుగోలుకు అంబాపురం వాసులతో డబ్బిప్పిస్తానన్నారు. ఇది దైవ కార్యం కావడంతో అందరికీ మంచి జరుగుతుందని, మరో ఏడు రోజుల్లో ఊరి దేవర ఉండడంతో మంచి మనసుతో ఆలోచించి అంబాపురం వాసులకు సహకరించాలని, దీంతో అమ్మవారు కూడా శాంతిస్తారని సీఐ నచ్చచెప్పారు. చదవండి: వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా? సీఐ ప్రయోగించిన సెంటిమెంట్ అస్త్రం రచ్చుమర్రి వాసులను ఆలోచనలో పడేసింది. చివరకు అంబాపురంలో దేవర ముగిసిన తర్వాత ఓ దున్నపోతును కొనిస్తామంటూ ఆ గ్రామస్తులు భరోసానివ్వడంతో ఇరు గ్రామాల మధ్య రాజీ కుదిరింది. ఎట్టకేలకు దున్నపోతు సమస్యకు పరిష్కారం దక్కడంతో అంబాపురం వాసులు హర్షం వ్యక్తం చేశారు. -
టీడీపీ కంచుకోటలో జేసీ బ్రదర్స్‌కు గట్టి షాక్
పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): టీడీపీ కంచుకోట నరసాపురంలో జేసీ బ్రదర్స్ (దివాకర్‌రెడ్డి– ప్రభాకర్‌రెడ్డి)కు గట్టి షాక్ తగిలింది. వారి ప్రధాన అనుచరుడైన రామాంజులరెడ్డి, ఆయన వర్గీయులు దాదాపు 160 కుటుంబాల వారు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. యాడికి మండలం రాయలచెరువుకు చెందిన రమణారెడ్డి నేతృత్వంలో వీరంతా మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కండువా కప్పి అందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో పార్టీ మారడం టీడీపీ కంచుకోటకు బీటలు బారినట్లయ్యింది. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు వర్తింపజేస్తూ సీఎం జగన్ పాలన సాగిస్తుండటంతో ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోందన్నారు. టీడీపీ కోసం అహర్నిశలు శ్రమించినా గుర్తింపు లభించకపోవడం, వర్గ కక్షలు పెంచి పోషించే జేసీ సోదరుల వైఖరి నచ్చకపోవడంతో 160 కుటుంబాల వారు పార్టీ వీడారన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన వారందరికీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా.. అండగా ఉండి ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ రాష్ట్రకౌన్సిల్ సభ్యుడు వేమనాథరెడ్డి, ఎంపీపీ రామ్మూర్తిరెడ్డి, వైస్ ఎంపీపీ రామిరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు హాజీవలి, మండల యూత్ కన్వీనర్ కమలాకర్‌రెడ్డి, పార్లమెంటు జనరల్ సెక్రటరీ రవిప్రసాద్‌రెడ్డి, సీనియర్ నాయకులు చిక్కేపల్లి రామేశ్వర్‌రెడ్డి, ముచ్చుకోట అమర్నాథరెడ్డి, నరసాపురం రామచంద్ర (కాశీ), ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. చదవండి: చింతకాయల విజయ్‌కు షాకిచ్చిన చంద్రబాబు -
పరిశ్రమలకు స్వర్గధామం ఆ జిల్లా.. మూడేళ్లలోనే రూ.300 కోట్లతో 990 పరిశ్రమలు
ఇది పెనుకొండ మండలం గుడిపల్లి ఇండస్టియల్ పార్క్‌లో ఏర్పాటైన ఎస్ఆర్ఎం కంపెనీ. 2021లో దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను నెలకొల్పారు. కార్ల సంబంధిత పరికరాలను రోబోల సహాయంతో తయారు చేసి కంపెనీలకు ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు. ఏటా రూ.100 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న ఈ కంపెనీలో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా వందల సంఖ్యలో కార్మికులు లబ్ధి పొందుతున్నారు. సాక్షి, అనంతపురం: పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి ఉమ్మడి అనంతపురం జిల్లా స్వర్గధామంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారమందుతుండడం, పెద్ద నగరాలకు సులువుగా చేరుకునేలా రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తుండడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మూడేళ్లలోనే 900 పరిశ్రమలు.. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లాలోని 5 ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేశారు. మౌలిక వసతులు కల్పించారు. వీటిల్లో పుట్టపర్తి మండలం కప్పల బండ, రాప్తాడు, ఆర్.అనంతపురం, కొటిపి గ్రామాల్లోని పార్కుల్లో 50 శాతానికి పైగా రాయితీతో పారిశ్రామికవేత్తలకు స్థలాలు కేటాయించారు. దీంతో గత మూడేళ్లలోనే రూ.300 కోట్ల పెట్టుబడితో 990 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఒక్క శ్రీ సత్యసాయి జిల్లాలోనే 800కి పైగా పరిశ్రమలు రూపుదిద్దుకున్నాయి. 6,200 మందికి ఉపాధి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటైన పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. 990 పరిశ్రమల ద్వారా దాదాపు 6,200 మంది కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుందన్నారు. పరోక్షంగా మరో 10 వేల మందికి ఈ పరిశ్రమలు ఉపాధి కల్పిస్తున్నాయి. హిందూపురం డివిజన్ పరిధిలోని గొల్లాపురం గ్రామంలో గతేడాది రూ.7 కోట్ల పెట్టుబడితో ప్రైమ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఏర్పాటు చేశారు. గృహోపకరణాలైన డోర్లు, కిటికీలతోపాటు వివిధ రకాల వస్తువులు ఇక్కడ తయారు చేస్తున్నారు. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, ముంబై తదితర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తున్నారు. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 250 మంది కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. పారిశ్రామిక హబ్‌ల తయారీ లక్ష్యం.. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తూ అండగా నిలుస్తోంది. పెనుకొండ, హిందూపురం, పుట్టపర్తి నియోజకవర్గాలను పరిశ్రమల ఏర్పాటుకు స్వర్గధామంగా మార్చి పారిశ్రామిక హబ్‌లుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రత్యేక సంకల్పంతో సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమల నుంచి సులువుగా ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక కారిడార్‌ను సైతం అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికారులు సైతం పరిశ్రమిస్తుండడంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా తమ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటవుతుండడం, సమీపంలోనే ఉపాధి దొరుకుతుండడంతో జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాల ప్రోత్సాహం పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోంది. భూముల కేటాయింపుతోపాటు విద్యుత్ రాయితీలను సైతం అందిస్తోంది. హిందూపురం పారిశ్రామికవాడ పరిధిలోని గొల్లాపురం, కొటిపిలో ప్రత్యేకంగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటికే భూములను అభివృద్ధి చేశాం. మౌలిక వసతులు కల్పించాం. యువ పారిశ్రామికవేత్తలు యూనిట్ ఏర్పాటు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ప్రత్యేక రాయితీలు కల్పిస్తాం. సద్వినియోగం చేసుకోవాలి. – మురళీమోహన్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ -
రైతులకు పట్టా పండుగ.. సంక్రాంతిలోగా సాగు భూమికి పట్టా!
అనంతపురం అర్బన్: సంక్రాంతి ప్రత్యేకంగా రైతుల పండుగ. ఈ పండుగకు మరింత శోభ తీసుకువచ్చి రైతుల కుటుంబాల్లో సంతోషం నింపే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. జీవనాధారంగా ప్రభుత్వభూమిని ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పేద రైతులకు డీ పట్టాలు పంపిణీ చేసి అండగా నిలిచేందుకు సిద్ధమయ్యింది. ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న పేద రైతులకు తరి రెండున్నర ఎకరాలు, మెట్ట ఐదు ఎకరాలకు మించకుండా డీ– పట్టా ఇవ్వనున్నారు. ఇప్పటికే అర్హులైన 2,090 మంది సాగు రైతులు 2,897 ఎకరాలు ప్రభుత్వ భూమిలో సాగు చేస్తున్నట్లు గుర్తించారు. వీరందరికీ సంక్రాంతి పండుగలోగా పట్టాలు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేసింది. అసైన్మెంట్ కమిటీ ఆమోదానికి.. సాగుభూమికి సంబంధించి రైతులకు పట్టా ఇచ్చేందుకు ప్రత్యేకంగా అసైన్మెంట్ కమిటీని (ఏసీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా జిలా ఇన్చార్జి మంత్రి వ్యవహరిస్తారు. మెంబర్ కన్వీనర్‌గా జాయింట్ కలెక్టర్, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్సీ ఉంటారు. మెంబర్లుగా జిల్లా మంత్రి, ఎమ్మెల్యే, ఆర్డీఓ ఉంటారు. 2023 జనవరిలో జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన అసైన్మెంట్ కమిటీ సమావేశం జరగనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. కమిటీ ఆమోదం తీసుకుని సంక్రాంతి పండుగలోగా రైతులకు పట్టాలు పంపిణీ చేస్తారు. అర్హతలివీ.. సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమి తప్ప రైతుకు ఇతరత్రా పట్టా భూమి ఉండకూడదు. సాగు చేసుకుంటున్న భూమిని ఇంతకు ముందుకు ఎవరికీ డీ –పట్టా ఇచ్చి ఉండకూడదు. దరఖాస్తులో పొందుపరచిన భూమిలో సదరు రైతు తప్పనిసరిగా సాగు చేసుకుంటూ ఉండాలి. అర్హత ఉన్న రైతుకు తరి 2.50 ఎకరాలు లేదా మెట్ట 5 ఎకరాల మించకుండా డీ–పట్టా మంజూరు చేస్తారు. ఏ భూములకు పట్టా ఇవ్వరంటే... ప్రభుత్వ నిబంధనల ప్రకారం పొరంబోకు భూములు, వాగులు, వంకలు, కొండలు, గుట్టలకు పట్టాలు ఇవ్వరు. వ్యవసాయ యోగ్యమైన భూమిని మాత్రమే అసైన్డ్ చేస్తూ డీ – పట్టా ఇస్తారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సంక్రాంతిలోగా పంపిణీకి చర్యలు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ నిబంధనల ప్రకారం పట్టా పొందేందుకు అర్హులైన పేద రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యింది. వచ్చే నెలలో జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన అసైన్మెంట్ కమిటీ సమావేశం ఉంటుంది. కమిటీ ఆమోదం తీసుకుని సంక్రాంతి పండుగలోగా పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాం. – కేతన్‌గార్గ్, జాయింట్ కలెక్టర్ -
బాలయ్యా.. ఇటు రావేమయ్యా.. కిష్టప్ప.. ఎక్కడున్నావప్పా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అధికారంలో ఉన్నన్నాళ్లూ హడావుడి చేసిన టీడీపీ నేతలు పత్తాలేకుండా పోయారు. ఎన్నికల వేళ కిందిస్థాయి కార్యకర్తలను ఉసిగొలిపి రచ్చ చేసిన వారంతా ఓటమి తర్వాత తలోదారి చూసుకున్నారు. చుట్టపుచూపుగా కూడా నియోజకవర్గాల్లో కనిపించకపోవడంతో కేడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మళ్లీ ఎన్నికల వేళ వచ్చి మాయమాటలు చెప్పాలని చూసినా ఇక వారిని నమ్మకూడదని కార్యకర్తలు నిర్ణయం తీసేసుకున్నారు. కొందరు నాయకులు అధికారం కోసమే రాజకీయం చేస్తారు. ఫలితం తిరగబడితే చాపచుట్టేస్తారు. నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచి తాము మాత్రం హాయిగా ఉండిపోతారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలో టీడీపీ నాయకులు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఊరూరూ తిరిగిన నేతలు ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. కనీసం నెలకోసారి వచ్చి కార్యకర్తలనైనా పలకరించే పరిస్థితి లేదు. దీంతో కేడర్ కూడా తలోదారి చూసుకుంటోంది. ఏమప్పో.. ఇట్ల ‘జేస్తి’రి! 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి తనయుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారు జేసీ దివాకర్‌రెడ్డి. 2019లో అనంతపురం పార్లమెంటుకు బరిలోకి దిగిన జేసీ కుమారుడు... పవన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారో తెలియదు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఉండే పవన్.. ఎన్నికలైనప్పటి నుంచి అనంతపురం జిల్లాకు వచ్చిన దాఖలాలు లేవు. పార్టీ కార్యక్రమాల్లోగానీ, సమావేశాల్లోగానీ ఎప్పుడూ పాల్గొనలేదు. తాడిపత్రి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ తమ్ముడు అస్మిత్‌రెడ్డి కూడా అప్పుడప్పుడు తాడిపత్రికి వచ్చి పోతున్నారు. యువ నేతలపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నికలప్పుడు వారి వెంటే తిరిగిన తాడిపత్రి ‘తమ్ముళ్లు’ ఏందప్పా ఇట్ల జేస్తిరి అంటూ నిట్టూరుస్తున్నారు. వలసపోయినా.. కానరాని ‘వరద’ టీడీపీ హయాంలో ఎప్పుడూ గన్మెన్లు, మందీమార్బలంతో కనిపించిన వారెవరంటే టక్కున గుర్తించేవారు వరదాపురం సూరి. గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన.. కొన్నాళ్లకే అన్నీ సర్దుకుని బీజేపీలోకి వలసపోయారు. తీవ్రమైన భూ ఆక్రమణల ఆరోపణలున్న నేపథ్యంలో ఆయా కేసుల నుంచి తప్పించుకునేందుకే వలస రాగం అందుకున్నారని విమర్శలున్నాయి. బీజేపీ తీర్థం పుచ్చుకున్నాక పోనీ.. ఆ పార్టీ నాయకులకైనా అందుబాటులో ఉంటున్నారంటే అదీ లేదు. అయితే, 2024 ఎన్నికల్లో తిరిగి టీడీపీ తరఫున పోటీ చేయాలని చూస్తుండగా.. అదే పార్టీకి చెందిన పరిటాల శ్రీరాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. వరదాపురంసూరికి సన్నిహితంగా ఉన్న వారు సైతం ఏ కండువా వేసుకోవాలో తెలియక ఆయనకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటీముట్టనట్టుగా.. నిమ్మల కిష్టప్ప 2019లో హిందూపురం పార్లమెంటు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన నిమ్మల కిష్టప్ప రాజకీయాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కార్యకర్తల సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. సామాజిక వర్గ సమీకరణలనే నమ్ముకున్న ఆయనకు, 2024లో టికెట్ ఇస్తారో లేదోనన్న అనుమానాలూ ఉన్నాయి. చుట్టపు చూపుగా బాలయ్యా హిందూపురం నియోజకవర్గ వాసులు 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ బాలకృష్ణను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపారు. కానీ ఆయన చుట్టపు చూపుగా ఆరుమాసాలకోసారి కూడా నియోజకవర్గానికి రావడం లేదన్న విమర్శలున్నాయి. గతంలో ఆయన పీఏనే మొత్తం చూసుకునేవారు. ఆ పీఏ కూడా ఇటీవలే పేకాట ఆడుతూ పోలీసులకు దొరికాడు. దీంతో అతన్ని తీసేశారు. దీంతో అసలు బాలకృష్ణ ఎప్పుడొస్తారన్న విషయం నియోజక వర్గ ప్రజలకు కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి వారిని ఇంకోసారి నమ్ముకోవద్దని అటు టీడీపీ కేడర్‌తో పాటు జనం కూడా నిర్ణయించుకున్నారు. అందువల్లే బాలయ్య ఎప్పుడోకసారి వచ్చినా జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఉనికి పాట్లలో కొందరు.. పరాజయం పాలయ్యాక కొందరు టీడీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏళ్లుగా విశ్రాంతి తీసుకుంటూ హాయిగా గడిపేస్తున్నారు. ఎన్నికల వేళ హడావుడి చేసిన నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడలేదు. అప్పుడప్పుడూ చుట్టపుచూపుగా వచ్చేవారు మాత్రం ‘ఉనికి’ చాటుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు వంటి వారు గిమ్మిక్కులు చేస్తూ పత్రికలకెక్కుతున్నారు. చదవండి: అన్నదమ్ముల అస్త్రసన్యాసం! కానీ సొంత పార్టీ నేతలే వారి తీరును తప్పుపడుతున్నారు. ‘మంత్రులుగా ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు.. ఇప్పుడేం చేస్తారు’ అన్నట్టు ఆ పార్టీ కార్యకర్తలే విమర్శిస్తుండడం ఇక్కడ కొసమెరుపు. అనంతపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఘోర పరాజయం మూటగట్టుకున్న ప్రభాకర్ చౌదరితో సహా చాలా మంది అసలు టికెట్ వస్తుందో రాదోనన్న అనుమానంతో దిక్కుతెలియని పరిస్థితిలో పడిపోయారు. దీంతో కేడర్ దిక్కులేక తలోదిక్కు చూసుకుంది. ఇక గుంతకల్లులో జితేందర్ గౌడ్ సైతం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరనే విమర్శలున్నాయి. -
'రాజకీయ నేత ఎలా ఉండకూడదో చెప్పేందుకు.. చంద్రబాబే ఉదాహరణ'
సాక్షి, అనంతపురం: ప్రజలు ఇదేం ఖర్మ అని భావించారు కాబట్టే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పనితీరుపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని అన్నారు. ఏపీలో 90శాతం మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. మంచి పాలనకు నిదర్శనం సీఎం జగన్ అని పేర్కొన్నారు. 'రాజకీయ నేత ఎలా ఉండకూడదో చెప్పేందుకు చంద్రబాబే ఉదాహరణ. ఎల్లోమీడియా ద్వారా ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. వైద్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే ఏపీలో పెద్ద ఎత్తున కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవలను కూడా విస్తరించారు. వ్యాధులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ సర్కారు కృషి చేస్తోంది' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: (తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారికి గుడ్‌న్యూస్) -
భర్త రెండో పెళ్లి.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన మొదటి భార్య
బొమ్మనహాళ్(అనంతపురం జిల్లా): రెండో పెళ్లి చేసుకున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. బొమ్మనహాళ్ మండలం గోవిందవాడ నివాసి సుధాకర్‌కు విడపనకల్లు మండలం మల్లాపురానికి చెందిన శ్రీలేఖను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం వీరి కాపురం అన్యోన్యంగా సాగింది. కొన్ని రోజులుగా శ్రీలేఖకు దూరంగా వచ్చిన సుధాకర్.. గురువారం ఉదయం కుటుంసభ్యులతో కలసి ఉరవకొండ మండలం రాకెట్లకు చెందిన యువతిని నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయంలో రెండో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీలేఖ వెంటనే బొమ్మనహాళ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై విచారణ అనంతరం సుధాకర్‌తో పాటు అతణ్ని రెండో వివాహానికి ప్రేరేపించిన తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య -
ఆర్టీసీ బస్టాండ్‌లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కొత్త పెళ్లికూతురు
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కుటుంబసభ్యులతో కలసి ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్న నవ వధువు కనిపించకుండా పోయింది. అనంతపురం మూడో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన మేరకు.. ఆత్మకూరు మండలం మదిగుబ్బకు చెందిన మాదేశ్వరికి రామగిరికి చెందిన ఓ యువకుడితో మూడు నెలల క్రితం వివాహమైంది. ఆదివారం ఉదయం తల్లిదండ్రులతో కలసి అనంతపురం బస్టాండుకు మాదేశ్వరి చేరుకుంది. ఆ సమయంలో తాను అత్తింటికి వెళ్లనంటూ మాదేశ్వరి తెలపడంతో తల్లిదండ్రులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కాసేపటి తర్వాత బాత్రూంకు వెళుతున్నట్లు చెప్పిన మాదేశ్వరి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. తల్లిదండ్రులు బస్టాండు, ఆ పరిసర ప్రాంతాలు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: విశాఖలో దారుణం.. మహిళను ముక్కలుగా నరికి, డ్రమ్ములో కుక్కి -
జేసీ దివాకర్ రెడ్డికి దేవాదాయ శాఖ నోటీసులు
-
జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌లపై హత్యాయత్నం కేసు
తాడిపత్రి అర్బన్(అనంతపురం జిల్లా): తాడిపత్రిలో వైఎస్సార్సీపీ కార్యకర్త గండికోట హాజీబాషా అలియాస్ ఘోరా హాజీపై దాడి చేసి గాయపరిచిన ఘటనకు సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అతని కుమారుడు, జేసీ అస్మిత్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. ఈ నెల 23న తాడిపత్రిలోని మూడో వార్డు పర్యటనకు వెళ్లిన అస్మిత్‌రెడ్డి, ఆయన అనుచరుడు ఖాదర్‌బాషా మరికొందరు.. అదే వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగారు. అంతటితో ఆగకుండా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో హాజీబాషా తీవ్రంగా గాయపడ్డాడు. అతని ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి, అనుచరులు ఖాదర్‌బాషా, ఫిల్టర్ బీడీ యజమాని అయూబ్‌తో పాటు మరో పది మంది టీడీపీ నేతలపై 147, 148, 307, 506 రెడ్‌విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: హైకోర్టు జడ్జీల బదిలీపై టీడీపీ యాగీ -
జాకీ పాపం టీడీపీదే.. అప్పట్లోనే సర్దుకున్నారు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాప్తాడు నుంచి జాకీ పరిశ్రమ వెనక్కి వెళ్లిపోవడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వ తీరు, ఆ పార్టీ నేతల ఒత్తిళ్లే ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ పరిశ్రమ ఏర్పాటు కాకపోవడంపై తెలుగుదేశం పార్టీ గోబెల్స్ ప్రచారానికి దిగింది. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు పచ్చమీడియాను అడ్డు పెట్టుకుంది. దాని సాయంతో ప్రస్తుత ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా జాకీ నేపథ్యంలో పుట్టుకొచ్చిన పత్రికా కథనాలు కూడా టీడీపీ మోసాలను కప్పిపుచ్చుకునేందుకే అన్నట్టు తేటతెల్లమవుతోంది. టీడీపీ నేతలకు ముడుపులు చెల్లించలేకనే జాకీ వెళ్లిపోయిందనేది వాస్తవం. గుడ్‌విల్ కోసం పట్టుపట్టడంతో.. దుస్తుల తయారీ ఫ్యాక్టరీ పెట్టడానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో అంటే 2017 సంవత్సరంలో జాకీ యాజమాన్యం ముందుకు వచ్చింది. రాప్తాడు వద్ద సుమారు 42 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉండేది. 2017 అక్టోబర్ నాటికి భూమిని అభివృద్ధి చేయాలని, నవంబర్ నాటికి సివిల్ వర్క్ పూర్తి చేయాలని, 2018 ఆగస్ట్ నాటికి భవన నిర్మాణాలు పూర్తిచేసి, నవంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలనేది ప్రభుత్వ అగ్రిమెంటు. కానీ 2018 చివర్లో అంటే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోతున్న దశలో ఆదరాబాదరాగా కాంపౌండ్ వాల్ నిర్మాణానికి పూనుకున్నారు. అందులోనూ అప్పటి మంత్రి తనయుడు, సోదరుడు గుడ్‌విల్ కోసం పట్టుపట్టడంతోనే వాళ్లు వెనక్కు వెళ్లారన్నది అనంతపురం జిల్లాలో అందరికీ తెలిసిన విషయం. ఈ ప్రభుత్వం వచ్చే నాటికే... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2019 మే 30న. అంతకుముందే జాకీ ప్రతినిధులు వెనక్కు వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ మంత్రి, తన సోదరుడి ఒత్తిడి మేరకు ఇక్కడ తాము పెట్టుబడులు పెట్టలేమని చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల పాటు కంపెనీ యాజమాన్యం ఒక్క ఇటుక కూడా వెయ్యలేక పోయింది. టీడీపీ, పచ్చమీడియా ఆరోపిస్తున్నట్లుగా 2019లో ఈ ప్రభుత్వం వచ్చాక జాకీ కంపెనీ వెళ్లిపోయి ఉంటే అంతకు ముందు పనులు జరిగి ఉండాలి కదా అన్నది సామాన్యుడి ప్రశ్న. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2018 అక్టోబర్ నాటికి ఫ్యాక్టరీ పనులన్నీ పూర్తి కావాలి. మరి అప్పటివరకూ కాంపౌండ్ వాల్ కూడా ఎందుకు నిర్మించలేక పోయారన్నది ప్రశ్నగానే ఉండిపోయింది. అనుమతులు పొందిన రెండేళ్ల వరకూ జాకీ యాజమాన్యాన్ని పనులు చేయనివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుని, కోట్లాది రూపాయల కమీషన్లు డిమాండ్ చేయడం వల్లే వెనక్కు వెళ్లిపోయారనేది బహిరంగ రహస్యం. ముడుపుల పాపాలు కప్పిపుచ్చుకునేందుకు పచ్చమీడియాను రంగంలోకి దించారన్న విమర్శలు వస్తున్నాయి. -
టీడీపీ బాగోతం బయటపెట్టిన బీకే పార్థసారథి
సాక్షి, అనంతపురం జిల్లా: రూ. కోట్లు ఉంటేనే టీడీపీ టికెట్ వస్తుందంటూ శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి తమ పార్టీ బాగోతాన్ని బయటపెట్టారు. బాగా డబ్బు సంపాదించి రాజకీయాల్లోకి రావాలని, ఉత్తి చేతులతో వస్తే ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. శింగనమల నియోజకవర్గం నార్పలలో జరిగిన కురుబ కులస్తుల సమావేశంలో టీడీపీ డబ్బు సిద్ధాంతాన్ని బీకే పార్థసారథి బయటపెట్టారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: బూతుల మోతాదు పెంచిన చంద్రబాబు.. పీక్స్‌లో ఫ్రస్టేషన్! -
నువ్వా? నేనా?.. సైకిల్ పార్టీలో ఏం జరుగుతోంది?
గత ఎన్నికల్లో సీమలో తెలుగుదేశం పార్టీ రెండు సీట్లు గెలుచుకున్న జిల్లా అది. ఈసారి ఒకటి కూడా కష్టమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటువంటి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరాయి. వీలున్నప్పుడల్లా నువ్వా? నేనా అన్నట్లుగా ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు. పచ్చపార్టీలో అనంత వివాదాలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఫైట్ పీక్ స్టేజ్‌కు చేరింది. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఇద్దరు నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి.. కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు మధ్య చాన్నాళ్ళుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. అనంతపురం జిల్లా టీడీపీలో వృద్ధ నేత హనుమంతరాయచౌదరి 2014 నుంచి 2019 దాకా కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో హనుమంతరావు చౌదరికి టిక్కెట్ నిరాకరించిన చంద్రబాబు.. ఉమామహేశ్వర నాయుడుని బరిలో దింపారు. గత ఎన్నికల్లో ఉమామహేశ్వర నాయుడు ఘోరంగా ఓడిపోయారు. సైకిల్‌కు ఫ్లెక్సీ వార్ ఉమామహేశ్వర నాయుడుకి జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. 2019లో ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి ఇప్పటివరకు.. టీడీపీ చేపట్టే అన్ని కార్యక్రమాలను ఉన్నం, ఉమా మహేశ్వరుడు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఎవరికి వారుగా ఫ్లెక్సీలు చేయించుకోవడం.. బలప్రదర్శన చేయడం.. ఒకరిపై మరొకరు బాహాటంగా విమర్శించుకోవటం కల్యాణదుర్గంలో సాధారణ విషయంగా మారింది. బహిరంగంగా కుస్తీలాట కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ పదవుల ఎంపిక జరుగుతోంది. కళ్యాణదుర్గంలోనే సమావేశం నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతుందని భావించిన టీడీపీ అధిష్టానం ఆ సమావేశాన్ని అనంతపురంలో జరపాలని ఆదేశించింది. మాజీ మంత్రులు కాలువ శ్రీనివాస్, అమర్నాథ్ రెడ్డి, టీడీపీ జిల్లా ఇంఛార్జి బీటీ నాయుడు సమక్షంలో కళ్యాణదుర్గం పార్టీ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే.. ఉన్నం హనుమంతరాయచౌదరి, ఉమామహేశ్వర నాయుడు పార్టీ పదవులు తమ వర్గానికే ఇవ్వాలని పట్టుబట్టారు. మాటల యుద్ధంతో ఇరు వర్గాలు రెచ్చిపోయాయి. వాగ్వాదం, తోపులాటలతో పాటు పరస్పరం కొట్టుకోవడం.. కుర్చీలు విసురుకోవడం జరిగింది. రెండు వర్గాలకు సర్ది చెపచెప్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు ముఖ్య నేతలు. దీంతో చేసేది లేక అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించారు. లాబీయింగ్ బాబు కళ్యాణదుర్గం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు పొందేందుకు మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో తనకు గాని.. తన కొడుకు మారుతీ చౌదరికి గానీ టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు ఇంఛార్జి పదవిని కాపాడుకుంటూనే వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని ఉమా మహేశ్వర నాయుడు భావిస్తున్నారు. అందుకే ప్రతి విషయం లోనూ రెండు వర్గాలు బాహాబాహీకి దిగుతున్నాయి. నియోజకవర్గంలో నాయకులు అనుసరిస్తున్న తీరుపై పార్టీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అలా ఊగిపోతారంతే..!
ఆయనో సీనియర్ రాజకీయ నాయకుడు. ఒక నియోజకవర్గంలో దశాబ్దాలుగా చక్రం తిప్పినా.. గత ఎన్నికల్లో పరాజయం చెందారు. తనకు రాజకీయంగా సమాధి తప్పదని కుమిలిపోతున్న ఆ నేత.. ఇప్పుడు కనిపించిన వారందరిపైనా తన ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు. కావాలనే వివాదాలు సృష్టించుకుంటూ అభాసుపాలవుతున్నారు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ పేరు తెలియనివారుండరు. సోదరులిద్దరూ రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం తర్వాత పచ్చపార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. జేసీ దివాకరరెడ్డి రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా జిల్లా రాజకీయాలను శాసిస్తే.. తమ్ముడు ప్రభాకరరెడ్డి మాత్రం లోకల్‌గానే తన ప్రతాపం చూపించేవారు. నాలుగు దశాబ్దాలుగా వీరిద్దరూ జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి బరిలో లేకపోవడంతో.. తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి తన కొడుకు అస్మిత్ రెడ్డి తో పోటీ చేయించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కొడుకు ఓటమి..తనకు వయోభారంతో పాటు గతంలో చేసిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన కేసులు జేసీ ప్రభాకర్ రెడ్డి మెడకు చుట్టుకుని గిలగిల్లాడుతున్నారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసుల్లో 33 ఛార్జిషీట్లను, ఆధారాలతో సహా పోలీసులు కోర్టులో సమర్పిస్తున్నారు. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి... తన ఫ్రస్ట్రేషన్ అంతా చుట్టూ ఉన్నవారిపైన చూపుతున్నారు. అలా ఊగిపోతారంతే..! ఇటీవలే తాడిపత్రిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకించి అభాసుపాలైన జేసీ ప్రభాకర్ రెడ్డి... ఇప్పుడు అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిపై దురుసుగా ప్రవర్తించి ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహానికి గురయ్యారు. అనంతపురం కలెక్టరేట్లో ఓ వినతి పత్రాన్ని అందజేసేందుకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. సమస్యను చెప్పకుండానే.. కలెక్టర్ నాగలక్ష్మి పై అనుచితంగా ప్రవర్తించారు. ఆవేశం ఊగిపోతూ.... బీకేర్ ఫుల్ అంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వార్నింగ్ ఇచ్చాడు జేసీ. అంతటితో ఆగక.. గన్ మెన్ ను తోసేసి దాడికి యత్నించారు. అత్యంత సహనంతో వ్యవహరించిన కలెక్టర్ నాగలక్ష్మి పెద్దమనసుతో జేసీని క్షమించారు. ఆయన దురుసు ప్రవర్తనపై ఇప్పటిదాకా కలెక్టర్ ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజంపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. జేసీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే జేసీకి తెగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గతంలోనూ ఓ రవాణా శాఖ కార్యాలయంలో కూడా ఉన్నతాధికారులపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాగే వ్యవహరించారు. పప్పులు ఉడకలేదు మరీ.! రాజకీయ ప్రత్యర్ధులపై భౌతిక దాడులు చేయించటం.. తనకు అనుకూలంగా వ్యవహరించని పోలీసు అధికారులపై ప్రైవేటు కేసులు పెట్టించటం.. బెదిరించి పనులు చేయించుకోవటం జేసీ ప్రభాకర్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. గతంలో పోలీసు స్టేషన్ కు వెళ్లి సీఐ, ఎస్సై లను బెదిరించి తన మనుషులను విడిపించుకెళ్లిన చరిత్ర కూడా ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి పై అనేక క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో ముక్కుసూటిగా విధులు నిర్వహిస్తూ.. పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్న డీఎస్పీ చైతన్యను టార్గెట్ చేశారు. డీఎస్పీపై ఇరవైకి పైగా ప్రైవేటు కేసులను జేసీ ప్రభాకర్ రెడ్డి పెట్టించారు. ఈయన వ్యవహార శైలిపై సొంత పార్టీ లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాబు కనుసన్నల్లోనే బ్లాక్ మెయిల్ జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాల వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుందని పలువురు టీడీపీ నేతలు వాపోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వీర్యమయ్యాక గత్యంతరం లేక టీడీపీలో చేరిన ప్రభాకర్ రెడ్డి అవినీతి.. అక్రమాలు.. దౌర్జన్యాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చంద్రబాబుకు తెలిసినా చూసీ చూడనట్లుగా వ్యవహరిన్నారని అనంతపురం టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
‘ఫ్యామిలీ డాక్టర్’: వైద్యం మరింత చేరువ
అనంతపురం సప్తగిరి సర్కిల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం ద్వారా వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తోందని చెప్పారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ‘సుస్థిర అభివృద్ధి సూచికలు 2022–23’పై కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాల విజయవంతంలో వైద్యాధికారుల పాత్ర చాలా కీలకమన్నారు. ఆరోగ్య కార్యక్రమాల అమలు, చేరుకోవాల్సిన లక్ష్యాలపై నిర్దేశించారు. ప్రస్తుతం జిల్లాలో ‘ఫ్యామిలీ ఫిజీషియన్’ విధానం ట్రయల్ రన్ జరుగుతోందన్నారు. ప్రతి నెలా రెండు దఫాలు సచివాలయాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులు, కౌమారదశ పిల్లలకు ఓపీ సేవలు, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జి అయిన రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఫాలోఅప్, మంచాలకే పరిమితమైన రోగుల గృహాలను సందర్శించి చికిత్సలు అందజేస్తారన్నారు. ట్రయల్ రన్‌ను విజయవంతం చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. జిల్లాలో సంక్రమిక, అసంక్రమిక వ్యాధుల సర్వే వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమల ద్వారా సంక్రమించే జబ్బుల నివారణకు సర్పంచ్ల ద్వారా ఫాగింగ్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మాతాశిశు మరణాల రేటును పూర్తిగా తగ్గించాలన్నారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం వంద శాతం ఉండాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ విశ్వనాథయ్య మాట్లాడుతూ స్వచ్ఛభారత్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహార సమతుల్యత, నులిపురుగుల నివారణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇదిలా ఉండగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాకిన్ కూలర్లను కలెక్టర్ ప్రారంభించారు. ఇందులో ఎయిడ్స్, కుష్టు రోగుల మందులను భద్రపరచనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ కృష్ణవేణి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ యుగంధర్, ప్రోగ్రాం అధికారులు అనుపమ జేమ్స్, సుజాత, చెన్నకేశవులు, నారాయణస్వామి, డెమో భారతి, డిప్యూటీ డెమో త్యాగరాజు, మలేరియా అధికారి ఓబులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంటి పట్టాల పంపిణీకి చకచకా ఏర్పాట్లు అనంతపురం అర్బన్: పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు జగనన్న ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ‘పేదలందరికీ ఇల్లు పథకం’ కింద అర్హులైన పేదలకు ఇంటి పట్టా ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణ కార్యక్రమం యజ్ఞంలా సాగుతోంది. అర్హులై ఉండీ అందులో లబ్ధిపొందని వారు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే ‘90 రోజుల్లో ఇంటి పట్టా పథకం’ కింద మంజూరు చేస్తుంది. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ పథకం కింద అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 7,155, గుంతకల్లు డివిజన్లో 2,573, కళ్యాణదుర్గం డివిజన్లో 1,820 చొప్పున 11,548 మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరికి ఇంటి పట్టా ఇచ్చేందుకు అవసరమైన భూ సేకరణ పూర్తికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. జగనన్న లే అవుట్లలో ఖాళీగా ఉన్న ప్లాట్లను గుర్తించడం.. అవసరమైన చోట భూ సేకరణ చేపట్టడం వంటి అంశంపై అధికారులకు ఆదేశాలిచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. -
అనంతపురం దుర్ఘటన.. విద్యుత్ శాఖకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో విద్యుదాఘాతం ఘటనపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని డిస్కంల పరిధిలో ఆడిట్ చేయాలని ఆదేశించారు. 2 వారాల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇలాంటి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తక్షణమే గుర్తించాలన్నారు. సమగ్ర అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కాగా, అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూరు వద్ద బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, అధికారులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. దర్గా హొన్నూరు గ్రామానికి చెందిన కమ్మూరి సుబ్బన్న అనే రైతు ఊరికి సమీపంలోని తన పొలంలో ఆముదం పంట సాగు చేశాడు. పంట దిగుబడిని తీసేందుకు బుధవారం ఉదయం 8.30 గంటలకు సొంత ట్రాక్టరులో గ్రామానికే చెందిన 14 మంది కూలీలను తీసుకుని వెళ్లాడు. వీరిలో ఎనిమిది మంది మహిళలు.. ఆరుగురు పురుషులు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పని పూర్తయ్యింది. అదే సమయంలో వర్షం కూడా మొదలైంది. అయినా తిరుగు పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు. కూలీలను ఎక్కించుకుని, ట్రాక్టర్‌ను రివర్స్ చేస్తుండగా.. పైనున్న 11 కేవీ విద్యుత్ తీగ షార్ట్‌సర్క్యూట్ కారణంగా తెగి ట్రాక్టరుపై పడింది. దీంతో వన్నక్క (52), రత్నమ్మ (40) అనే అత్తాకోడళ్లతో పాటు శంకరమ్మ (34), పార్వతి (48) అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు మహిళా, ఇద్దరు పురుష కూలీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని విజయనగర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (విమ్స్)కు తరలించారు. వీరిలో సుంకమ్మ అనే మహిళా కూలీ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న రైతు సుబ్బన్న, ఐదుగురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. చదవండి: (మృత్యుపాశం.. కూలీల ట్రాక్టర్‌పై తెగిపడ్డ 11 కేవీ విద్యుత్ తీగ) -
అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. డిస్మిస్ కానిస్టేబుల్ ప్రకాష్ పెట్టిన అట్రాసిటీ కేసు ఫాల్స్‌గా నిర్థారణ అయ్యింది. ఎస్పీపై నమోదైన ఎఫ్ఐఆర్పై అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ సమగ్ర విచారణ చేశారు. చదవండి: 15 మంది బాయ్‌ఫ్రెండ్స్.. భర్త హత్య కేసులో భార్య లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి.. పోలీసు నియమావళిని ఉల్లంఘించినందునే కానిస్టేబుల్ ప్రకాష్‌ను ఎస్పీ డిస్మిస్ చేశారని ఆయన వెల్లడించారు. 11 క్రిమినల్ కేసులు నమోదైనందునే ప్రకాష్‌ను ఎస్పీ డిస్మిస్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. దురుద్దేశంతో ఎస్పీ ఫకీరప్ఫపై డిస్మిస్ కానిస్టేబుల్ కేసు పెట్టినట్లు విచారణలో తేలింది. దీంతో అనంతపురం టూటౌన్లో నమోదైన ఈ కేసును కొట్టివేశారు. -
భలే అడ్వొకేట్లు.. వంశ వృక్షాన్నే డూప్లికేట్ చేశారు!
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: న్యాయవాద వృత్తిలో ఉన్న తల్లీ కుమారుడు సునాయసంగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారి తొక్కారు. బతికున్న యజమానులను చనిపోయినట్లుగా సర్టిఫికెట్లు సృష్టించి.. నకిలీ వారసులను తెరపైకి తీసుకొచ్చి.. వారి ద్వారా రూ.75లక్షల విలువచేసే ఆస్తి కాజేయబోయారు. బాధితుడి ఫిర్యాదుతో బండారం బయటపడిపోయింది. కీలక సూత్రధారులైన తల్లీ కుమారుడు, వీరికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం ఇన్చార్జ్ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు ఆదివారం తన చాంబర్లో టూటౌన్ సీఐ శివరాముడుతో కలిసి మీడియాకు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో నివాసముంటున్న అనంతపురం వాసి శ్రీరాములునాయక్‌కు స్థానిక ఆదర్శ నగర్ కాలనీలో 333, 339 సర్వేనంబర్లలోని 5.14 సెంట్ల విస్తీర్ణంలో ఇల్లు ఉంది. రూ.75లక్షలు విలువ చేసే ఈ ఆస్తిని ప్రస్తుతం అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో ధర్మవరం న్యాయవాది కట్టా శ్రీదేవి, ఆమె కుమారుడు కట్టా గణేష్‌లు ఆ ఆస్తి డాక్యుమెంట్లు సేకరించారు. యజమాని ఇక్కడ లేనందున ఎలాగైనా ఆస్తిని కొట్టేయాలని కుట్ర పన్నారు. శ్రీరాములు నాయక్, ఆయన భార్య ఇద్దరూ చనిపోయినట్లుగా తమ ల్యాప్‌టాప్‌లోనే నకిలీ డెత్ సర్టిఫికెట్లు తయారు చేశారు. కట్టా శ్రీదేవి తనకు అత్యంత నమ్మకస్తురాలైన పనిమనిషి ముత్యాలమ్మ, అనిల్‌కుమార్, బండిమాల లోకేశ్వర, సాంబశివ, డాక్యుమెంట్ రైటర్ శ్రీనివాసప్రసాద్, గుర్రం గణేష్‌ల సహకారం తీసుకున్నారు. అనిల్‌కుమార్‌ను శ్రీరాములునాయక్ కొడుకుగా చిత్రీకరిస్తూ ఆధార్‌కార్డులో మార్పులు చేశారు. నకిలీ వంశ వృక్షం తయారు చేయించారు. వీటి ద్వారా గత సెప్టెంబర్ 23న ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శ్రీరాములునాయక్ ఆస్తిని అనిల్‌కుమార్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత అనిల్‌కుమార్ నుంచి పనిమనిషి ముత్యాలమ్మకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేయించారు. మోసం బయటపడిందిలా.. శ్రీరాములు నాయక్ తన ఆస్తిని అమ్మే ఏర్పాట్లను ఈ నెలలో ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో ‘జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ’ అనిల్‌కుమార్ నుంచి ముత్యాలమ్మకు వెళ్లినట్లు బయటపడింది. దీంతో శ్రీరాములునాయక్ ఎవరో తన ఆస్తిని కాజేశారని ఎస్పీ ఫక్కీరప్పకు ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ కేసును టూటౌన్ పోలీసులకు అప్పగించారు. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. దర్యాప్తులో తల్లీ కొడుకులైన అడ్వొకేట్లు కట్టా శ్రీదేవి, కట్టా గణేష్‌ల పన్నాగం బయట పడింది. దీంతో తల్లీకుమారుడితో పాటు ధర్మవరం మండలం దర్శినమలకు చెందిన బేతరాసి అనిల్‌కుమార్, అనంతపురం రామ్‌నగర్‌కు చెందిన జింక శ్రీనివాస ప్రసాద్, చెన్నేకొత్త పల్లి మండలం బసంపల్లికి చెందిన పుట్టపర్తి సాంబశివ, బండిమాల లోకేశ్వర్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, డెత్ సర్టిఫికెట్, లీగల్ హైర్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. -
జేసీ వర్గీయుల బరితెగింపు.. వైఎస్సార్సీపీ నేతలపై దాడి
సాక్షి, అనంతపురం జిల్లా: జూటూరులో జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నేతలపై కత్తులు, కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం పొలం పనులకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి బంధువులు, ఆయన వర్గీయులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. -
బెడ్రూంలో యువకుడితో ఏకాంతంగా భార్య.. బిగ్ షాక్ ఇచ్చిన భర్త
గుంతకల్లు(అనంతపురం జిల్లా): వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లు మండలం గుండాలతండాకు చెందిన స్వామి నాయక్, మంగమ్మ దంపతులు కొన్నేళ్ల క్రితమే గుంతకల్లుకు చేరుకుని చైతన్య థియేటర్ సమీపంలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. హైదరాబాద్‌లో స్వామినాయక్ కారు డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబ పోషణకు డబ్బు పంపించేవాడు. ఈ క్రమంలో స్వామినాయక్ చిన్నాన్న కుమారుడు సుంకేనాయక్ తరచూ మంగమ్మ ఇంటికి రాకపోకలు సాగించేవాడు. చదవండి: అమెరికాలో ఆమెతో రిలేషన్షిప్.. ఏపీలో మరో యువతిని ట్రాప్ చేసి.. బుధవారం ఉదయం ఇద్దరు పిల్లలు స్కూల్‌కు వెళ్లిన తర్వాత మంగమ్మ ఇంటికి సుంకేనాయక్ చేరుకున్నాడు. కాసేపటికి స్వామినాయక్ కూడా ఇంటికెళ్లాడు. ఆ సమయంలో బెడ్రూంలో సుంకేనాయక్, మంగమ్మ ఏకాంతంగా ఉండడం చూసి కోపోద్రిక్తుడైన స్వామినాయక్ కత్తితో సుంకేనాయక్పై దాడి చేశాడు. అడ్డుకోబోయిన భార్య మంగమ్మ తలపై బాది నేరుగా వెళ్లి కసాపురం పోలీసులకు లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని డీఎస్పీ నర్శింగప్ప, టూటౌన్ సీఐ చిన్నగోవిందు పరిశీలించారు. అప్పటికే సుంకేనాయక్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మంగమ్మను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. -
అనంతపురంలో భారీ వర్షాలు
-
అత్యధిక ఆలయాలతో అగ్రగామిగా అనంతపురం జిల్లా
అనంతపురం కల్చరల్: హైందవ సంప్రదాయంలో ఆలయానికి, అందులో పనిచేసే అర్చకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు వైభవంగా సాగిన అర్చక పురోహిత వ్యవస్థ కాలానుగుణంగా మార్పులు చెందుతూ ఆర్థిక వనరులు అందక కుదేలవుతూ వచ్చింది. దీంతో చాలా అర్చక కుటుంబాలు వృత్తిని వదిలేసి ప్రత్యమ్నాయ మార్గాల్లో స్థిరపడిపోయిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అర్చకులకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అండగా నిలిచారు. ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యం (డీడీఎన్) సమర్పించేందుకు వీలుగా కొత్తగా పథకాన్ని తీసుకువచ్చారు. దీంతో ఆలయాలకు కొత్త శోభ చేకూరింది. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరోసారి ఆలయ వ్యవస్థ చతికిలబడింది. 2019 తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలతో ఆలయాలకు పునః వైభవం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఆలయాలను డీడీఎన్ఎస్ పథకం కిందకు తీసుకువస్తూ తాజాగా జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో అత్యధిక ఆలయాలతో అనంతపురం జిల్లా అగ్రగామిగా నిలిచింది. జిల్లాలో ఉరవకొండ టాప్.. రాష్ట్ర వ్యాప్తంగా డీడీఎన్ఎస్ పథకం కింద ఇప్పటి వరకూ 2,747 ఆలయాలు ఉండేవి. జగన్ సర్కార్ తాజా నిర్ణయంతో 4,367 ఆలయాలకు ప్రయోజనం చేకూరనుంది. గతంలో అనంత జిల్లాలో 218 ఆలయాలు ఈ పథకం కింద ఉండేవి. తాజాగా 71 ఆలయాలను ఈ పథకం పరిధిలోకి తీసుకురావడంతో వీటి సంఖ్య 289కు చేరుకుంది. ఇందులోనూ ఉరవకొండ నియోజకవర్గం 75 ఆలయాలతో అగ్రస్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో 69 ఆలయాలతో తాడిపత్రి నియోజకవర్గం ఉంది. ఆలయానికి రూ.5 వేలు.. ఈ పథకం ద్వారా ప్రతి ఆలయానికి ధూప, దీప, నైవేద్యం ఖర్చులకు రూ. 2వేలు, పూజారి గౌరవ వేతనం కింద మరో రూ.3వేలు చొప్పున నెలకు రూ.5వేలను ప్రభుత్వం అందజేస్తుంది. ఆలయ పూజారి బ్యాంక్ ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేస్తారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ. 30 వేల కన్నా తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు లేదా రెండున్నర ఎకరాల లోపు మాగాణి భూమి, ఐదెకరాల లోపు మెట్ట భూమి ఉంటేనే డీడీఎన్ఎస్ పథకం వర్తిస్తుంది. సంతోషంగా ఉంది దశాబ్ధానికి పైగా ఆ భగవంతుణ్ని నమ్ముకుని పూజలు చేస్తున్నా. గత ప్రభుత్వ పెద్దలకు మా దుస్థితి విన్నవించుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయి. చిన్నపాటి ఆలయాలకు సైతం గుర్తింపునిస్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంది. – చంద్రస్వామి, రామాలయం అర్చకుడు, ముచ్చుకోట 289 ఆలయాలకు వర్తింపజేశారు డీడీఎన్ఎస్ పథకంలో గతంలో కేవలం 129 ఆలయాలు మాత్రమే ఉండేవి. చాలా మంది అర్చకులు విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. మేము పంపిన ప్రతిపాదనల్లో 306 ఆలయాలు ఉండగా ఇందులో అన్ని విధాలుగా అర్హత ఉన్న 289 ఆలయాలకు పథకాన్ని వర్తింపజేశారు. – రామాంజనేయులు, ఏసీ, దేవదాయ ధర్మదాయశాఖ -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. జేసీ ట్రావెల్స్‌పై నమోదైన 33 కేసుల్లో ఛార్జిషీట్ సిద్ధం చేశారు. తాడిపత్రి, అనంతపురం కోర్టుల్లో ఛార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేయనున్నారు. టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి, ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి సహా మొత్తం 23 మందిపై ఫోర్జరీ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. చదవండి: వైఎస్సార్సీపీ నేత వేణుబాబుపై హత్యాయత్నం సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసింది. నిషేధిత 154 బస్సులు, లారీలను ఫోర్జరీ డాక్యూమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లతో బీఎస్-4 వాహనాలుగా చూపి అక్రమ రిజిస్ట్రేషన్‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి పాల్పడ్డారు. నాగాలాండ్ రాష్ట్రం కోహిమా ఆర్టోవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆధారాలతో సహా కోర్టులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. -
హిందూపురంలో యువ వైద్యురాలు ఆత్మహత్య
హిందూపురం(అనంతపురం జిల్లా): తీవ్రమైన మానసిక ఒత్తిడిని తాళలేక ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. హిందూపురంలోని 1వ వార్డు కౌన్సిలర్ (వైఎస్సార్సీపీ) మల్లికార్జున కుమార్తె సుప్రియ (25) ఇటీవల కర్నూలులోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. బెంగళూరులో పీజీ కోర్సు పూర్తి చేసేందుకు ఆన్లైన్లో పోటీ పరీక్షకు సిద్ధమవుతోంది. చదవండి: రూ.25 లక్షల కట్నం.. రూ.50లక్షలతో ఘనంగా పెళ్లి.. అయినా సరిపోలే! ఈ క్రమంలో తాను ఎంపిక చేసుకున్న విభాగంలో సీటు దక్కుతుందో లేదోననే ఆందోళనతో తీవ్ర ఒత్తిడికి లోనైన ఆమె సోమవారం ఉదయం ఇంటి మేడపైన ఉన్న గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గమనించిన తండ్రి మల్లికార్జున ఫిర్యాదు మేరకు హిందూపురం వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఫోన్ ద్వారా మల్లికార్జునను పరామర్శించారు. ఘటనపై ఆరా తీశారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్లు జబీవుల్లా, బలరామిరెడ్డి, కౌన్సిలర్లు బాధితకుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. -
‘ప్రభ’ తొలగి.. పన్నాగాలు.. ఉనికి కాపాడుకునేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి పాట్లు
♦టీడీపీ హయాంలో జిల్లాలో పనిచేసిన మైనింగ్ ఏడీ నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తుండేవారు. తమ గ్రానైట్ దోపిడీకి ఏడీ అడ్డు తగులుతున్నారని జేసీ సోదరుల (దివాకర్‌రెడ్డి – ప్రభాకర్‌రెడ్డి) ప్రధాన అనుచరుడు ఎస్.వి.రవీంద్రారెడ్డితో ఏడీని తీవ్రస్థాయిలో బెదిరించారు. లారీలతో గుద్ది చంపుతామని బెదిరించడమే కాకుండా అవినీతి మరకలంటించారు. చదవండి: సైకోలా అయ్యన్న తీరు ♦ఇటీవల బదిలీపై వెళ్లిన తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డిని కూడా ప్రభాకర్‌రెడ్డి టార్గెట్ చేశారు. చీటికిమాటికి.. అయినదానికి కానిదానికి బ్లాక్మెయిల్ చేశారు. మున్సిపల్ కార్యాలయ పరిపాలనా విభాగాల సిబ్బందిపైనా నోరు పారేసుకున్నారు. ♦తాజాగా డీఎస్పీ వీఎన్కే చైతన్య శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డికి మింగుడు పడటం లేదు. సోషల్ మీడియా వేదికగా డీఎస్పీపై విమర్శలు గుప్పిస్తూ అవినీతి మరక అంటించేందుకు సిద్ధమయ్యారు. ♦అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా తన పనులు సజావుగా, సాఫీగా చేసుకునేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి కుట్రలకు తెరలేపుతున్నారు. మాట వినని అధికారులను, పోలీసులను బెదిరించడం, వారి బంధువులకు వార్నింగ్ ఇవ్వడం చేస్తున్నారు. తాడిపత్రి అర్బన్: కళ్లు పెద్దవి చేస్తూ.. ఆవేశంతో ఊగిపోతూ.. నోటి దురుసుతో రాజకీయ నాయకులను రెచ్చగొట్టడం.. అధికారులు, ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతీయడం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నైజం. ఆయన వ్యవహార శైలి నచ్చక అనుచరులు ఒక్కొక్కరుగా టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. దీంతో నిరాశానిస్పృహలకు లోనైన ప్రభాకర్‌రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. తాడిపత్రిలో తన ప్రాభవం కనుమరుగైపోతుండటంతో తిరిగి పట్టు సాధించుకునేందుకు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. తాను చైర్మన్ అని, మున్సిపల్ పరిధిలోని వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని, అధికారులందరూ తాను చెప్పినట్లే వినాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఈయన అహంకార ధోరణితో అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కుదిరితే బేరం.. లేకుంటే బ్లాక్మెయిల్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తాను చెప్పిన పనులు చేయించుకోవడం కోసం అధికారులతో మొదట బేరానికి వెళ్లడం.. కుదరకపోతే బ్లాక్మెయిల్ చేయడం సర్వసాధారణం. ముందుగా తన అనుచరులతో అధికారులకు ఫోన్ చేయించి, వారి ద్వారా నజరానాలు పంపి బేరం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అధికారులు వాటిని తిరస్కరిస్తే ఇక తనదైన శైలిలో బెదిరింపులకు దిగుతారు. దీంతో నిక్కచ్చిగా పనిచేసే అధికారులు జేసీ తీరుతో ఇబ్బంది పడుతున్నారు. అధికారుల బంధువులకు బెదిరింపులు! అధికారుల వద్ద తన ఆటలు సాగవని తెలుసుకున్న ప్రభాకర్‌రెడ్డి.. అధికారుల బంధువులు ఎవరున్నారు.. వారు ఎక్కడ ఉంటున్నారన్న సమాచారం సేకరించి వారిని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రి సబ్‌డివిజన్‌లో పని చేస్తున్న ఓ ఎస్ఐ సమీప బంధువు వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం నక్కలపల్లిలో ఉంటున్నారు. మూడ్రోజుల క్రితం ఆ ఎస్ఐ బంధువుకు జేసీ అనుచరుడు మల్లికార్జునరెడ్డి ఫోన్ చేసి ‘మీవాడు హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు.. జాగ్రత్తగా ఉండమ’ని హెచ్చరించినట్లు సమాచారం. ఇందుకు ఆ ఎస్ఐ బంధువు భయపడకుండా దీటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. •సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఎస్ఐలు, వారి బంధువుల వివరాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత వారు సివిల్ పంచాయితీలు చేసి లంచాలు తీసుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా నిరాధార ఆరోపణలు చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. •ఇటీవల ఓ సీఐని బెదిరించినట్లు తెలిసింది. ‘నా అనుచరులపై దాడి చేస్తే మేం కూడా వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడి చేస్తాం...మీరేమి చేస్తారో చూస్తాం’ అని ఆ సీఐని ఫోన్లో బెదిరించినట్లు సమాచారం. •గన్నెవారిపల్లి కాలనీలో ఇటీవల ప్రభుత్వ అనుమతులు లేకుండానే జేసీ అనుచరులు భూగర్భ డ్రెయినేజీ మరమ్మతు పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి అడ్డుకోవడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహించారు. వారికి ఫోన్ చేసి ‘నా మనుషులు చేసే కాంట్రాక్టు పనులను అడ్డుకుంటారా!’ అంటూ బూతులు తిట్టినట్లు తెలిసింది. దీంతో అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. •మున్సిపల్ ఎన్నికల్లో మొసలి కన్నీరు కార్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డికి అధికారం కట్టబెడితే ఇలా అధికారులపై బెదిరింపులకు దిగడమేంటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
ధాన్యం రైతుకు దన్ను
అనంతపురం అర్బన్: రైతు సంక్షేమానికి జగన్ సర్కార్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. జిల్లాలో వరి ధాన్యం సేకరణ చేపట్టి రైతుకు దన్నుగా నిలిచేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు అనుగుణంగా జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా సేకరణ కమిటీ (డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్మెంట్ కమిటీ–డీపీసీ) ఏర్పాటైంది. వ్యవసాయ శాఖ జేడీ, మార్కెటింగ్ శాఖ ఏడీ, డీసీఎంఎస్ అధికారి, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, జిల్లా సరఫరాల అధికారి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే ఒక దఫా సమావేశమై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంది. 5 వేల టన్నుల సేకరణ లక్ష్యం జిల్లాలో కణేకల్లు, బొమ్మనహాళ్, డీ హీరేహాళ్ ప్రాంతాల్లో ఐదు వేల టన్నుల వరి ధాన్యం సేకరించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మొదటి రకం క్వింటాలు రూ.2,060, రెండో రకం రూ.2,040తో రైతుల నుంచి ధాన్యం సేకరిస్తారు. ఈ మూడు మండలాల పరిధిలోని 3 పీఏసీఎస్‌లు, 37 ఆర్బీకేల సహకారంతో డిసెంబర్ నుంచి సేకరణ చేపట్టనున్నారు. జిల్లాలో సార్టెక్స్ మిల్లులు లేని కారణంగా ఇక్కడ సేకరించిన ధాన్యాన్ని చిత్తూరు, తిరుపతి మిల్లులకు పంపించనున్నారు. నాణ్యత పరిశీలనకు సహకారం ధాన్యం నాణ్యత పరిశీలనకు సాంకేతిక సహాయకుల సహకారం తీసుకోనున్నారు. పీఏసీఎస్‌లోని సభ్యులు ఎవరైనా బీఎస్సీ, అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వారు ఉంటే వారిని సాంకేతిక సహాయకులుగా నియమించుకుంటారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం ఒక బ్యాచ్‌కు కణేకల్లులో మొదటి విడత శిక్షణ ఇస్తున్నారు. ఇక సేకరణ ప్రక్రియలో వలంటీర్లను భాగస్వాముల్ని చేయనున్నారు. రైతు ఖాతాలోకి నగదు జమ ధాన్యం సేకరణకు సంబంధించిన నగదు నేరుగా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తుంది. రైతు పట్టాదారు పాసుపుస్తకం, ఫోన్ నంబర్‌తో పాటు ఆధార్ అనుసంధానమైన బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ వెంటనే సంబంధిత రైతు ఎఫ్టీఓ (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) క్రియేట్ అవుతుంది. మిల్లరు ధాన్యం తీసుకున్న వెంటనే ఆన్లైన్లో నమోదవుతుంది. ఎఫ్టీఓ ఆధారంగా రైతు ఖాతాలోకి నగదు జమవుతుంది. లక్ష్య నిర్దేశనం జిల్లాలో వరి అధికంగా పండించే కణేకల్లు, బొమ్మనహాళ్, డీ.హీరేహాళ్ మండలాల్లో ధాన్యం సేకరణ చేపడుతున్నాం. 3 పీఏసీఎస్‌లు, 37 ఆర్బీకేల పరిధిలో ఈ ఏడాది 5 వేల టన్నుల సేకరణ లక్ష్యంగా నిర్దేశించాం. ఇందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేశాం. తొలివిడతగా 1,500 టన్నులు సేకరించాలని చెప్పాం. ధాన్యానికి సంబంధించి నగదు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమవుతుంది. – కేతన్‌గార్గ్, జాయింట్ కలెక్టర్ సేకరణ ప్రక్రియ ప్రారంభం కార్యాచరణ ప్రకారం ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభించాం. జాయింట్ కలెక్టర్ నిర్దేశించిన లక్ష్యం 5 వేల టన్నుల ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. పీఏసీఎస్, ఆర్బీకేల సహకారం, వలంటీర్ల భాగస్వామ్యంతో లక్ష్యం పూర్తి చేస్తాం. – నీలమయ్య, డీఎం, పౌర సరఫరాల సంస్థ -
ఆన్‌వీల్ ట్రైనింగ్.. బస్సులో బడి
సాక్షి ప్రతినిధి, అనంతపురం : వైద్య వృత్తిలో ఉన్న వాళ్లు నిత్య విద్యార్థులు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రోజుకో మెలకువ నేర్చుకుంటూ ఉండాలి. దీన్నే సీఎంఈ (కంటిన్యుటీ మెడికల్ ఎడ్యుకేషన్) అంటారు. కొత్త మెలకువలు నేర్చుకోవాలంటే ఎక్కడో ప్రత్యేక ఇన్స్టిట్యూట్కో, సంస్థకో వెళ్లాలి. కానీ అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలోకే బస్సు వచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ కార్పొరేట్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సామాజిక బాధ్యత)లో భాగంగా శస్త్రచికిత్సలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన బస్సును గురువారం తీసుకొచ్చింది. శుక్రవారం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మైరెడ్డి నీరజ ‘ఇనిస్టిట్యూట్ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. శనివారం వరకు సాగే ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల, సర్వజనాస్పత్రిలో పనిచేసే వైద్యులు, పీజీలు, హౌస్ సర్జన్లు దాదాపు 200 మంది శిక్షణ తీసుకోనున్నారు. ల్యాప్రోస్కోపిక్పై శిక్షణ ప్రధానంగా ఈ బస్సు బడిలో అతి చిన్న కోతలు అంటే ల్యాప్రోస్కోపిక్ ద్వారా సర్జరీ ఎలా చేయాలి, కుట్లు ఎలా వేస్తే త్వరగా గాయం మానే అవకాశం ఉంటుందన్న విధానాలపై శిక్షణ ఇచ్చారు. స్టిమ్యులేషన్ పద్ధతిలో బస్సులోనే ప్రత్యేకంగా రూపొందించిన అత్యంత ఆధునిక పరికరాలతో సర్జరీ మెలకువలు నేర్పించారు. కొంతమంది ప్రొఫెసర్లు సైతం ఈ టెక్నిక్లను నేర్చుకునేందుకు ఆసక్తి చూపించారు. పెద్దగా గాట్లు పెట్టడం, కుట్లు సరిగా వేయకపోవడం వంటి కారణాలతో రక్తస్రావం అవుతుంది. ఇలా రక్త స్రావం కాకుండా సర్జరీ ఎలా చేయాలి అన్నదానిపై ప్రత్యేక ట్రైనర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. సర్జరీ అనంతరం రోగి వీలైనంత త్వరగా డిశ్చార్జి అయ్యేలా, అందుకు తగ్గట్టు ఆపరేషన్లు ఎలా సూక్ష్మగాటుతో చేయాలనే దానిపై చూపించారు. సుమారు రూ.10 కోట్లతో రూపొందించిన ఈ బస్సు ఆధునిక వైద్య విజ్ఞాన వేదికగా ఉందని పలువురు పీజీ వైద్యవిద్యార్థులు పేర్కొన్నారు. ఇదొక సువర్ణావకాశం వైద్యశాస్త్రంలో రోజుకో కొత్త మెలకువ వస్తోంది. అది ప్రాక్టికల్‌గా చేస్తే గానీ తిరిగి పేషెంటుకు చెయ్యలేం. అలా కొత్త టెక్నిక్ స్టిమ్యులేషన్ పద్ధతిలో బస్సులో నేర్చుకునే అవకాశం వచ్చింది. వైద్యవిద్యార్థులకే కాదు మాకు కూడా ఇది బాగా ఉపయోగపడింది. –డా.రామకృష్ణ నాయక్, హెచ్ఓడీ, జనరల్ సర్జరీ విభాగం కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటేనే.. పాతికేళ్లుగా సర్జరీలు చేస్తున్నా. ఏరోజుకారోజు కొత్తే. దీన్ని నేర్చుకోవాల్సిందే. ఇక్కడకు వచ్చిన బస్సులో వైద్యులు, విద్యార్థులు అందరికీ ఉపయోగపడే కొత్త టెక్నిక్స్ ఉన్నాయి. ప్రధానంగా గైనకాలజీ సర్జరీల్లో కుట్లు చాలా ముఖ్యం. దీనిపై కొత్త మెలకువలు చెప్పారు. –డాక్టర్ మాణిక్యాలరావు, హెచ్ఓడీ, గైనకాలజీ విభాగం -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్య ఏం చేసిందో తెలిస్తే షాకే
తాడిపత్రి అర్బన్(అనంతపురం జిల్లా): వేధింపులు తాళలేక కట్టుకున్న భర్తనే హతమార్చింది ఓ ఇల్లాలు. వివరాలను తాడిపత్రి డీఎస్పీ చైతన్య వెల్లడించారు. తాడిపత్రికి చెందిన అబ్దుల్ బాషా అలియాస్ అబ్దుల్ (34)కు ఆరేళ్ల క్రితం ఆయేషాతో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. లారీ క్లీనర్‌గా పనిచేస్తున్న అబ్దుల్.. మద్యానికి బానిసై మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. చదవండి: గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే? ఈ క్రమంలో రోజూ మద్యం మత్తులో ఇంటికి చేరుకుని భార్య ఆయేషాతో గొడవపడేవాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న అబ్దుల్... ఆయేషాతో గొడవపడి చిత్రహింసలకు గురి చేశాడు. దీంతో విసుగెత్తిన ఆమె అర్ధరాత్రి 2 గంటలకు రోకలి బండతో నిద్రపోతున్న అబ్దుల్ తలపై మోది హతమార్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే?
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: నగరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో బుధవారం జరిగిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జేబు దొంగలు రెచ్చిపోయారు. కేవలం గంట వ్యవధిలోనే 300 సెల్ఫోన్లను అపహరించారు. దీంతో ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాట్‌బాట్ సేవలకు 24 గంటల వ్యవధిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చదవండి: కట్టుకున్నవాడు ఖతం.. ప్రియుడు, కూతురితో కలిసి.. దాదాపు 270 మందికి పైగా తమ సెల్ఫోన్లు అపహరణకు గురైనట్లు చాట్‌బాట్‌కు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. అలాగే అనంతపురం త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు 20, టూటౌన్ పోలీసు స్టేషన్‌కు 18 రాతపూర్వక ఫిర్యాదులు అందాయి. -
కలకలం.. ఏటీఎం నుంచి నకిలీ నోటు!
గుత్తి(అనంతపురం జిల్లా): స్థానిక ప్రధాన ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎం కేంద్రం నుంచి నకిలీ రూ.500 బయటపడింది. వివరాలు.. గుత్తిలోని లచ్చానపల్లి రోడ్డులో నివాసముంటున్న సీఆర్పీఎఫ్ విశ్రాంత జవాన్ కిష్టప్ప బుధవారం ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎం కేంద్రం నుంచి రూ.9,500 డ్రా చేశాడు. అందులో ఓ నకిలీ రూ.500 నోటు వచ్చింది. విషయాన్ని వెంటనే ఎస్బీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై ఎస్బీఐ అధికారులు స్పందించలేదని, ఏటీఎం కేంద్రంలో డబ్బు డిపాజిట్టు విషయం తమ పరిధిలో కాదని వారు పేర్కొన్నట్లు వివరించాడు. చదవండి: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్ ఫాదర్’ -
అనంతపురం: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్ ఫాదర్’
గార్లదిన్నె(అనంతపురం జిల్లా): అనంతపురం వేదికగా బుధవారం నిర్వహించిన ‘గాడ్‌ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషాదాన్ని మిగిల్చింది. తమ అభిమాన హీరోని చూడాలన్న ఆత్రుత ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాలు.. గుత్తి మండలం చెర్లోపల్లికి చెందిన రాజశేఖర్(23), అభిరామ్ స్నేహితులు. వీరికి చిరంజీవి అంటే చెప్పలేనంత అభిమానం. చదవండి: కేబుల్ బ్రిడ్డి వద్ద టెన్షన్.. దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య! దీంతో అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుగుతున్న గాడ్‌ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై కుక్క అడ్డు రావడంతో వేగాన్ని నియంత్రించుకోలేక అదుపు తప్పి కిందపడ్డారు. రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్పంగా గాయపడ్డ అభిరామ్‌ను స్థానికులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తొక్కిసలాటలో గాయపడ్డ యువతి అనంతపురం శ్రీకంఠంసర్కిల్: స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన గాడ్‌ఫాదర్ ఈవెంట్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. భారీగా అభిమానులు తరలిరావడంతో మైదానం కిక్కిరిసింది. అభిమాన హీరోని చూడాలనే ఆత్రుత కారణంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో అనంతపురంలోని రహమత్‌నగర్‌కు చెందిన అఖిల అనే యువతి తీవ్రంగా గాయపడింది. పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. -
వింత మనుషులు.. చీకటి గదిలో నుంచి వెలుగులోకి..
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: మూడేళ్లుగా చీకటి గదిలో మగ్గిన జీవితాల్లో వెలుగులు నిండాయి. స్వీయ నిర్బంధంలో ఉన్న అన్నా చెల్లెళ్లు పోలీసుల చొరవతో జనంలోకి వచ్చారు. అనంతపురం నగరంలోని వేణుగోపాల్ నగర్ ఆటోస్టాండ్ సమీపంలో నివాసముండే అన్నా చెల్లెళ్లు తిరుపాల్, కృష్ణవేణి, లక్ష్మి తల్లిదండ్రుల మరణంతో తీవ్రంగా కుంగిపోయి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇంటి నుంచి వచ్చే దుర్గంధాన్ని భరించలేక స్థానికులు పోలీసులకు తెలపడంతో ఈ అన్నా చెల్లెళ్ల దయనీయ స్థితి వెలుగులోకి వచ్చింది. చదవండి: ఛీ..ఛీ..ఇదేం పాడు పని...ఫ్యామిలీ రెస్టారెంట్లో... శుక్రవారం సాయంత్రం పోలీసులు వారి ఇంటికి వచ్చి అన్నా చెల్లెళ్లతో మాట్లాడారు. తిరిగి శనివారం ఉదయం స్థానిక కార్పొరేటర్ సుజాత, ఇన్చార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, మునిసిపల్ కమిషనరు కె.భాగ్యలక్ష్మి వారి ఇంటికి వెళ్లారు. మురికి కూపంగా ఉన్న బాధితుల ఇంటిని శుభ్రం చేయించారు. విద్యుత్తు, నీటి సరఫరాను పునరుద్ధరించారు. అన్నా చెల్లెళ్లకు ఆహారం, కొత్త దుస్తులు అందజేశారు. అన్నా చెల్లెళ్లకు స్నానం చేయించి, దుస్తులు మార్చి జన జీవన స్రవంతిలోకి తెచ్చారు. ఇన్నాళ్లూ ఆ ఇంటిని చూసి భయపడిన వీధిలోని చిన్నారులు సైతం వారితో మాట్లాడేలా పోలీసులు మమేకం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో వీరికి ఈ సహాయం చేసినట్లు ఇన్చార్జి డీఎస్పీ తెలిపారు. నాడెంతో వైభవం శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం దంపెట్ల చెర్లోపల్లికి చెందిన అంబటి రామయ్య, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం మదిగుబ్బకు చెందిన లక్ష్మిదేవి దంపతులు 50 ఏళ్ల క్రితం అనంతపురానికి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు సంతానం. స్థానిక పాతూరు పూల మండీల పక్కనే ఉన్న వీధిలో అంబటి రామయ్య హోటల్ నడిపేవారు. బాగానే సంపాదించారు. పెద్ద కుమార్తెను కనగానపల్లి మండలం భానుకోటకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటికే అల్లుడికి మరో మహిళతో పెళ్లయిందని తెలిసి కుమార్తెను ఇంటికి తెచ్చుకున్నారు. చిన్న కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది. రామయ్య వయసు మళ్లి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మూడేళ్ల క్రితం భార్య లక్ష్మీదేవి కూడా మృతి చెందింది. తల్లిదండ్రుల మరణం తర్వాత అన్నా చెల్లెళ్లు తిరుపాల్, కృష్ణవేణి, లక్ష్మి కుంగిపోయారు. పిల్లలను చిన్నప్పటి నుంచి పెద్దగా బయటకు పంపకపోవడంతో అటు బంధువులు, ఇటు ఆత్మీయులు పెద్దగా లేరు. చిన్న చెల్లెలు, ఆమె భర్త ఎప్పుడైనా ఇంటికి వెళ్లినా, అన్నా చెల్లెళ్లు వారిని కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో క్రమేణా వారూ దూరమయ్యారు. తిరుపాల్ బయటకు వెళ్లినప్పుడు ఏదో ఒకటి తేవడం, దాంతోనే ముగ్గురూ సరిపెట్టుకోవడంతో బక్కచిక్కిపోయారు. చివరకు స్థానికుల సమాచారంతో పోలీసులు స్పందించి వారికి కొత్త వెలుగు ప్రసాదించారు. -
'ఆ పురుగు మనిషిని తాకితే 5 నిమిషాల్లో చనిపోతారు'.. శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..
అనంతపురం అగ్రికల్చర్: రెండు మూడు రోజులుగా వాట్రాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఫొటోలు, సందేశాలు నిరాధారమైనవని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి, రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.మల్లీశ్వరి తెలిపారు. “పత్తి పంటలో ఒక పురుగు ఉంది. ఆ పురుగు మనిషిని తాకితే 5 నిమిషాల్లో చనిపోతున్నారు... జాగ్రత్తగా ఉండండి’ అంటూ అందరూ ఆందోళనకు గురయ్యేలా పురుగు ఫొటోలు, చనిపోయిన మనుషుల ఫొటోలు, ఆడియో సందేశాలు పంపిస్తున్నారని తెలిపారు. ఇవన్నీ పూర్తీగా అవాస్తవమని పేర్కొన్నారు. అలాంటి పురుగు పత్తి పంటకు అసలు ఆశించదని, అది ఎక్కువగా చెరకు, పండ్ల తోటల్లో కనిపిస్తుందన్నారు. లద్దె పురుగు ఆకారంలో శరీరంపై వెంట్రుకలు కలిగి ఉంటుందన్నారు. వెంట్రుకల చివరి భాగంలో స్వల్ప విషపూరిత పదార్థం ఉంటుందన్నారు. ఒకవేళ ఆ పురుగు మనిషి శరీరాన్ని తాకినా కేవలం తగిలిన చోట దురద , లేదంటే చిన్నగా వాపు వస్తుందని, ఒకట్రెండు రోజుల్లో తగ్గిపోతుందని స్పష్టం చేశారు. రైతులు, ప్రజలు ఆ విషయాన్ని గమనించాలని సూచించారు. చదవండి: (AP: విద్యాశాఖలో మరో కీలక సంస్కరణ) -
శుద్ధ అబద్ధం: మినరల్ కాదు జనరల్ వాటరే
ఫ్లోరైడ్.. ఉప్పు నీటినుంచి ఉపశమనం కోసం ప్రజలు శుద్ధనీటి వైపు మళ్లారు. స్థానిక సంస్థల ద్వారా సరఫరా అయ్యే నీటిని రోజువారీ అవసరాలకు వినియోగిస్తున్నారు. తాగడానికి అత్యధిక శాతం మంది శుద్ధ్ధనీటిపైనే ఆధారపడుతున్నారు. ఫిల్టర్ చేసిన నీరు రుచికరంగా అనిపిస్తుండటంతో ఎక్కువ మంది వాటినే తాగుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల వరకే ఉన్న ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ (శుద్ధ జలం) ప్లాంట్లు గ్రామాలకూ విస్తరించాయి. మినరల్ వాటర్ అని పైకి చెప్పినా జనరల్ వాటర్‌నే పైపైన ఫిల్టర్ చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు. ఐఎస్ఐ ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారు. అధికారులు కూడా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా అంతటా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సంస్కృతి విస్తరించింది. ఇల్లు, దుకాణాలు, హోటళ్లు, టీ కేఫ్‌లు, కార్యాలయాలు ఇలా ఒకటేమిటి ఎక్కడ చూసినా ప్యూరిఫైడ్ క్యాన్ వాటర్ దర్శనమిస్తున్నాయి. ఈ క్యాన్లోనివి మినరల్ నీళ్లు అని, స్వచ్ఛమైనవని సేవిస్తున్నారు. అయితే ఇవి అంత శుద్ధమైనవి కాదని అధికారుల తనిఖీల్లో ఎన్నోసార్లు రుజువైంది. ఉమ్మడి జిల్లాలో 44 లక్షల మందికి పైగా జనాభా ఉంటే రోజూ 25 లక్షల మంది ప్యూరిఫైడ్ నీటినే వాడుతున్నట్టు అంచనా. జిల్లాలో వెయ్యికి పైగా వాటర్ ప్లాంట్లు ఉంటే.. అందులో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఐఎస్ఐ గుర్తింపు పొందినవి మూడు మాత్రమే. మిగిలినవన్నీ ప్రమాణాలు పాటించకుండానే కొనసాగుతున్నాయి. ప్లాంట్లపై పర్యవేక్షణ లేదు రూ.కోట్లల్లో వ్యాపారం నిర్వహిస్తున్న ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు? ఈ నీటిని ఎవరైనా నమూనాలను సేకరించి నిర్ధారించి అనుమతులు ఇస్తున్నారా? ఈ నీళ్లను శుద్ధి చేస్తున్నారా లేదా? ఇవి సురక్షిత నీరేనా? అని చూసేవారు లేరు. కొన్నిసార్లు నీళ్ల క్యాన్లలో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్టు ఫిర్యాదులు కూడా అందాయి. ఇలా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ల పేరిట జరుగుతున్న దోపిడీ అంతా ఇంతా కాదు. పలు సందర్భాల్లో డయేరియా కేసులు నమోదవుతూ ఉండటంతో ఈ నీళ్లపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటర్‌ప్లాంట్ నుంచి గృహాలకు చేరే 20 లీటర్ల వాటర్ క్యాన్‌ను 90 సార్లకంటే ఎక్కువగా వాడకూడదు. కానీ ఇక్కడ మూడేళ్లు దాటినా అవే క్యాన్లను వినియోగిస్తూనే ఉన్నారు. నీటి శుద్ధి ఇలా జరగాలి.. ఆర్ఓ ప్లాంట్ ద్వారా నీటిని శుద్ధి చేస్తారు. ఆర్ఓ అంటే రివర్స్ ఓస్మోసిస్. బోరు నుంచి వచ్చే నీటిలో మోతాదుకు మించి మినరల్స్ ఉంటాయి. ఎక్కువ మోతాదులో ఉంటే హాని కలిగిస్తాయి. వీటిలో మెగ్నీíÙయం, రకరకాల సల్ఫేట్స్, బోరాన్, బేరియం, మాంగనీస్ వంటివి ఉంటాయి. ఎక్కువ మోతాదులో మినరల్స్ కలిగి ఉన్న నీటినే భారజలం అంటాం. టీడీఎస్ (టోటల్ డిస్పెన్స్డ్ సాలిడ్స్) అనికూడా అంటాం. వీటిని ఆర్ఓ ప్లాంట్లు వడపోత నిర్వహించి భారజలాన్ని సాధారణ జలంగా మార్చాలి. వంద లీటర్లను ఆర్ఓ ద్వారా ఫిల్టర్ చేస్తే మనకు పది నుంచి 15 లీటర్లు మాత్రమే తాగునీరు వస్తుంది. ఇందులో మూడు దశల్లో వడపోత జరగాలి. ఆర్‌ఓలో ప్రీ ఫిల్టరైజేషన్ సాలిడ్ వాటర్ మొదటి దశ, ఉప్పుశాతాన్ని తగ్గించడం రెండోదశ. ఇక మూడోదశలో బ్యాక్టీరియాను తగ్గించే వడపోత ఉంటుంది. ఈ మూడు దశల్లో ఏది సరిగా జరగకపోయినా ఉపయోగం ఉండదు. నాణ్యమైన తాగునీరు కావాలంటే ఈ ఆర్ఓ ప్లాంట్లలో వాడే ఫిల్టర్లను తరచూ మారుస్తూ ఉండాలి. అయితే వీటిని ఎక్కడా పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మూడు ప్లాంట్లకే ఐఎస్ఐ మార్క్ జిల్లాలోని మూడు వాటర్ ఫిల్టర్ ప్లాంట్లకు మాత్రమే ఐఎస్ఐ అనుమతి ఉంది. మిగతావన్నీ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ పేరుతో నడుస్తున్నవే. ఈ ప్లాంట్లపై ఫిర్యాదులొస్తే తనిఖీలు నిర్వహిస్తున్నాం. ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం మాకుంది. కానీ ఇలా 20 లీటర్ల క్యాన్లతో లూజ్ వాటర్ సరఫరా చేసే వాటిపై స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలి. అయినా మేం తరచూ ఈ ప్లాంట్ల నమూనాలపై నిఘా పెట్టాం. ఎక్కడైనా ఫిర్యాదులొస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. –దేవరాజు, ఫుడ్‌సేఫ్టీ అధికారి నిబంధనలు పాటించరు ఐఎస్ఐ నాణ్యతా ప్రమాణాల ధ్రువీకరణ, కాలుష్య నియంత్రణమండలి సరి్టఫికెట్ తదితర వాటితో వస్తే రాయితీలు ఇస్తాం. కానీ ఈ ప్రమాణాలు పాటించరు కాబట్టి మా దగ్గరకు రారు. ప్లాంటు ఏర్పాటుకే కాదు, నాణ్యత పాటిస్తే విద్యుత్ రాయితీ కూడా ఇస్తాం. ఈ నిబంధనలు పాటించే ప్లాంట్లు లేవనే చెప్పాలి –నాగరాజారావు, జనరల్ మేనేజర్, పరిశ్రమల శాఖ వ్యాధులు సంక్రమిస్తాయి శుద్ధి చేయని నీటిని తాగడం వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు ఎక్కువగా ఇబ్బందులు పడతారు. డయేరియా, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ ఏ, డిసెంట్రీ (చీము రక్తంతో విరేచనాలు), కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా ఉంటుంది. అందువల్ల నీటి శుద్ధి గురించి అందరూ తెలుసుకోవాలి. టోటల్ డిసాల్వ్ సాలిడ్స్(టీడీఎస్) 100 నుంచి 300 శాతం లోపు ఉండాలి. ఇది తక్కువైనా, ఎక్కువైనా ఇబ్బందే. అలాంటి నీటిని వాడుకోవడం హానికరం. – డాక్టర్ రజిత, క్యాజువాలిటీ మెడికల్ అధికారి, అనంతపురం -
ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో అదే హాట్ హాట్ టాపిక్
ఆయన ఓ సీనియర్ పొలిటీషియన్. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. పన్నేండేళ్ల క్రితం నియోజకవర్గాల పునర్విభజనలో అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయారు. ఆ నేత ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తన భవిష్యత్తు కోసం ప్రశ్నార్థకంగా ఎదిరిచూస్తున్నారు. ఆయనే నిమ్మల కిష్టప్ప. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. గోరంట్ల అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు విజయం సాధించిన నిమ్మల కిష్టప్ప చంద్రబాబునాయుడు క్యాబినెట్లో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 2004 నిమ్మల కిష్టప్ప ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో గోరంట్ల అసెంబ్లీ నియోజకవర్గం రద్దయింది. దాని స్థానంలో పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పడింది. గోరంట్ల మండలం పెనుకొండ నియోజకవర్గంలో కలిసిపోయింది. దీంతో నిమ్మల కిష్టప్ప హిందూపురం పార్లమెంటుకు షిప్ట్ అయ్యారు. హిందూపురం నుంచి ఎంపీగా ఒకసారి విజయం సాధించారు. ఆ తర్వాత పుట్టపర్తి లేదా పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేద్దామనుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. అసెంబ్లీకి వెళ్ళడానికి వీలు లేకపోయినా... మళ్ళీ హిందూపురం పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేద్దామని అనుకుంటున్నారు. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు అదీ దక్కే పరిస్థితులు కనిపించడంలేదు. వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీ టిక్కెట్ నిమ్మల కిష్టప్పకు ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించినట్లు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. నిమ్మల కిష్టప్ప స్థానంలో మరో బీసీ నేతకు ఇక్కడ అవకాశం కల్పించాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నిమ్మల కిష్టప్పకు టిక్కట్ ఉండదన్న సంకేతాలు ఇచ్చినట్లు టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అధిష్టానం వైఖరిపై నిమ్మల కిష్టప్ప గుర్రుగా ఉన్నట్లు సమాచారం. పార్టీలో అత్యంత సీనియర్ అయిన తనకే టిక్కెట్ ఇవ్వకపోతే ఎలా అని నిమ్మల కిష్టప్ప సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. తనకు టిక్కెట్ దక్కకపోతే తన సామాజిక వర్గమైన నేతన్నలు తెలుగుదేశం పార్టీకి దూరమవటం ఖాయమని కిష్టప్ప స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్లుగా టిక్కెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీని ఏవిధంగా దెబ్బతీయాలి. ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న దానిపై ఇప్పటికే నిమ్మల కిష్టప్ప వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఉమ్మడి అనంతపురం జిల్లా పచ్చ పార్టీలో చర్చ జరుగుతోంది.