
విపక్ష కూటమిలో ఏర్పడిన టికెట్ల ముసలం చల్లారేలా కన్పించడం లేదు. టికెట్ల కేటాయింపులో న్యాయం జరగలేదని ఎక్కడికక్కడ తెలుగు తమ్ముళ్లు నిరసనలు, ర్యాలీలతో రోడ్డెక్కుతున్నారు

టీడీపీ ఆఖరి జాబితాపై పార్టీలో అసంతృప్తి వెల్లువెత్తింది. అభ్యర్థులను మార్చాలంటూ ప్లెక్సీలు చించుతూ కరపత్రాలు తగలబెట్టారు

అనంతపురం అర్బన్ స్థానంలో సీనియర్ నేత ప్రభాకర్ చౌదరిని కాదని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు టికెట్ కేటాయించారు

ఈ నేపథ్యంలో గుంతకల్లు, అనంతపురం నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి

అనంతపురం అర్బన్‌లో తన పేరు లేకపోవడంతో ప్రభాకర్ చౌదరి తన అనుచరులతో స్థానిక రామ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్‌ను బయటపడేసి కార్యకర్తలతో నిప్పు పెట్టించారు

ఫర్నీచర్ మొత్తం మంటల్లో కాలిబూడిదైంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. ఫ్లెక్సీలు, ఫొటోలు, కరపత్రాలు మంటల్లో కాలిపోయాయి




















