
సాక్షి,గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటన ఖరారైంది. రేపటి నుంచి మూడురోజుల పాటు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
శనివారం (ఆగస్ట్31)ఉదయం 11 గంటలకి కడప ఎయిర్ పోర్ట్‌కి చేరుకుని అక్కడ పార్టీ కార్యకర్తలు, నాయకులను కలవనున్నారు. పెండ్లిమర్రి మండలం మాచనూరులో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ మండల అధ్యక్షుడిని మాచనూరి చంద్రా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
అక్కడి నుంచి అదే మండలంలోని గొందిపల్లి చేరుకుని ఇటీవల వివాహం చేసుకున్న కడప మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చంద్రహాస్ రెడ్డి కుమార్తె అశారెడ్డి, శివారెడ్డి దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం పులివెందులలో తన నివాసానికి చేరుకుని కార్యకర్తలకు, నాయకులకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు.