
సాక్షి,విశాఖపట్నం: షర్మిల చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. విశాఖపట్నంలో శనివారం(అక్టోబర్ 26) అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ షర్మిలపై ఫైరయ్యారు. ‘మీరు చేసిన ఆరోపణలు ఖండించిన వాళ్లంతా మోచేతి నీళ్లు తాగినట్లు కనిపిస్తే అది మీ అమాయకత్వం. వైఎస్సార్‌సీపీ నాయకులకు అలాంటి లక్షణాలు లేవు. మేం నిజాలను ప్రజల ముందు పెడుతుంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకులు అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పండి. సొంత అన్నను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎవరూ చూస్తు ఊరుకోరు. వైవీ సుబ్బారెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దుకు కుట్రలు చేస్తున్నారు.
ఎవరి పతనాన్ని మీరు కోరుకుంటున్నారు. ఎందుకు ఈ స్థాయికి దిగజారారు. కాంగ్రెస్ పెట్టిన కేసులను తట్టుకుని నిలబడిన వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన దమ్ము, ధైర్యం, హీరోయిజాన్ని ఇష్టపడే చాలా మంది ఆయనతో నడుస్తున్నారు’అని అమర్‌నాథ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ: వరదు కళ్యాణి