
ఎవరు ఏ పార్టీలో చేరినా, ఎన్ని కలిసి వచ్చినా, కూటములుగా వచ్చినా తమకు భయం లేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి.. ఆ పార్టీ కండువా కప్పుకున్నారు షర్మిల. ఈ పరిణామంపై వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఎవరు ఏ పార్టీలో చేరినా.. తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని అన్నారు. ఏపీ ప్రజలు మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారాయన.
ఎవరు కలిసినా, కూటములుగా వచ్చినా మాకు భయం లేదు. మళ్లీ జగన్ సీఎం కావాలి.. మాకు దేవుడి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఎవరు ఏ పార్టీలో చేరినా మాకు ఇబ్బంది ఉండదని పేర్కొన్నారాయన. అలాగే.. తాను వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడనన్నారు. ఇక..
వచ్చే ఎన్నికల్లో అన్నిస్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం జరుగుతున్న మార్పుల గురించి స్పందిస్తూ.. పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని, అన్నినియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నామని, ఇది కొంతమందికి నచ్చకపోవచ్చని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.