'ఫేక్‌ వెబ్‌సైట్స్‌' క్లిక్‌ చేశారో ఖతమే! వాటిని ఇలా గుర్తించండి!! | - | Sakshi
Sakshi News home page

'ఫేక్‌ వెబ్‌సైట్స్‌' క్లిక్‌ చేశారో ఖతమే! వాటిని ఇలా గుర్తించండి!!

Published Mon, Dec 18 2023 12:16 AM | Last Updated on Mon, Dec 18 2023 1:57 PM

- - Sakshi

రాజన్న సిరిసిల్ల: సైబర్‌ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేక్‌ వెబ్‌సైట్స్‌ పేరుతో నగదు అపహరిస్తున్నారు. ఫర్నీచర్‌.. ఎలక్ట్రానిక్‌ వస్తువులపై భారీ ఆఫర్లు ఇస్తున్నామంటూ ఫేక్‌ వెబ్‌సైట్లతో బురిడీ కొట్టిస్తున్నా రు. నమ్మి వాటిపై క్లిక్‌ చేస్తే చాలు మన ఖాతాలోని డబ్బు మాయమవుతుంది. ఇటీవల జిల్లాలో సైబర్‌మోసాలు వరుసగా జరుగుతున్నాయి. సోషల్‌మీడియాలో వస్తున్న ఆఫర్లకు ఆకర్షితులై అమాయకులు డబ్బులు పోగొట్టుకుంటున్నారు.

జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలు!

  • సిరిసిల్లటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒకరికి క్రెడిట్‌కార్డ్‌ ప్రొటెక్షన్‌ ప్లాన్‌ గురించి ఓ కాల్‌ వచ్చింది. బాధితులు అతనితో క్రెడిట్‌కార్డ్‌ నంబర్‌, ఓటీపీ షేర్‌ చేసుకోవడంతో రూ.77వేలు నష్టపోయాడు.
  • సిరిసిల్లటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒకరు ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ యాడ్‌ చూసి అందులోని లింక్‌పై క్లిక్‌ చేయడంతో వాట్సాప్‌కు కనెక్ట్‌ అయ్యింది. దీంతో బాధితుడు వారు చెప్పినట్లు కొన్ని టాస్క్‌లు చేయడంతో రూ.40వేలు నష్టపోయాడు.
  • కోనరావుపేట్‌ ఠాణా పరిధిలో ఒకరికి తక్కువకే వజ్రాలు ఇస్తామంటూ ఓ కాల్‌ వచ్చింది. లోన్‌ ఇస్తామని చెప్పిన వారు ముందుగా చార్జీలు రూ.27వేలు చెల్లించాలనడంతో పంపాడు. తర్వాత తను మోసపోయానని గుర్తించాడు.
  • సిరిసిల్లటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒకరికి కొత్త నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. వారి మాటలు నమ్మి డెబిట్‌కార్డ్‌ వివరాలు, ఓటీపీ షేర్‌ చేసుకోవడంతో రూ.లక్ష వరకు మోసపోయాడు.
  • సిరిసిల్ల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒకరు నర్సరీ వ్యాపారం కోసం ఫేక్‌ కస్టమర్‌ కేర్‌ సర్వీస్‌ను సంప్రదించాడు. తర్వాత కొత్త నంబర్‌ నుంచి కాల్‌ రావడంతోపాటు ఒక పేమెంట్‌ స్కానర్‌ను పంపించారు. బాధితుడు దాన్ని స్కాన్‌ చేయడంతో రూ.లక్ష నష్టపోయాడు.
  • సిరిసిల్ల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బిజినెస్‌ ఎమోషనల్‌ అని చెప్పి టెలిగ్రామ్‌లో ఒక లింక్‌ పంపించారు. అందులో భాగంగా కొన్ని టాస్క్‌ లు చేస్తే డబ్బు వస్తుందని నమ్మబలికారు. వారు చెప్పినట్లుగా కొన్ని టాస్క్‌లు చేయడంతో కొంత డబ్బు పంపించారు. ఇందులో భాగంగా బాధితుడు రూ.96వేలు నష్టపోయాడు.
  • సిరిసిల్ల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బాధితుడు పార్ట్‌ టైం జాబ్‌ గురించి ఒక యాప్‌లో నమోదు చేసుకున్నాడు. ఇందులో భాగంగా వారు ఇచ్చిన వర్క్‌లో డాటా తప్పుగా ఎంటర్‌ చేశారని బెదిరించి బాధితుడి నుంచి రూ.55వేలు తీసుకున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • సోషల్‌మీడియాలో వచ్చే యాడ్స్‌ను నమ్మొద్దు.
  • ఎస్‌బీఐ యోనో బ్లాక్‌ అయిందని, పాన్‌కార్డు అప్‌డేట్‌ చేయాలని వచ్చే మెస్సేజ్‌లను నమ్మొద్దు. ఆ మెస్సేజ్‌లలో వచ్చే లింక్స్‌పై అస్సలు క్లిక్‌ చేయొద్దు.
  • సోషల్‌మీడియాలో వచ్చే ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టవద్దు.
  • మీ ప్రమేయం లేకుండా మీ సెల్‌ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పొద్దు. అది సైబర్‌ నేరగాళ్ల ఎత్తుగడగా గమనించాలి.

అప్రమత్తతే అవసరం..
కొత్త ఫోన్‌ నంబర్‌ నుంచి కాల్‌ వస్తే ఎలాంటి వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు. ఒకవేళ సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్‌చేస్తే తిరిగి డబ్బులు పొందే అవకాశం ఉంది. డెబిట్‌కార్డు, బ్యాంక్‌ ఖాతా వివరాలు ఎవరితో షేర్‌ చేసుకోవద్దు. – అఖిల్‌మహాజన్‌, రాజన్నసిరిసిల్ల ఎస్పీ
ఇవి కూడా చ‌ద‌వండి: ఆన్‌లైన్‌ గేమ్స్‌తో జాగ్ర‌త్త‌! లేదంటే ఇలా జరుగుతుందేమో!?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement