Top Stories
ప్రధాన వార్తలు

అంతా భారత్ ఇష్టమేనా?.. దేనికైనా రెడీ.. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు అంటూ కామెంట్స్ చేశారు.జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ పౌరులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని, నదుల విషయంలో కూడా నీటిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీష్ స్పందించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ ఇటీవల భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్ పరోక్షంగా స్పందించారు.Prime Minister Shehbaz Sharif has offered India cooperation in an impartial investigation of the Pahalgam incident, stating that there will be no compromise on Pakistan's security and dignity.#ShehbazSharif #Pakistan #India #Pahalgam #PakistanArmy #TOKReports pic.twitter.com/5vh6y1O63T— Times of Karachi (@TOKCityOfLights) April 26, 2025ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడుతూ..‘మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోం. ఎలాంటి ముప్పును ఎదుర్కోడానికైనా సంసిద్ధంగా ఉన్నాం. పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశం కరెక్ట్ కాదు. భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఈ చర్యతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అంటూ భారత్‌ను నిందించే ప్రయత్నం చేశారు. చివరగా.. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ చెప్పుకొచ్చారు. పహల్గాం దాడి (Pahalgam)పై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు.Pakistan's PM Shehbaz Sharif says the country’s armed forces are "prepared to defend the country’s sovereignty" after Delhi accused Islamabad of being linked to the attack on tourists in Kashmir. #RUKIGAFMUpdates pic.twitter.com/qtJic92uZU— Rukiga F.M (@rukigafm) April 26, 2025

పాక్ అధికారి బలుపు సైగలు.. భారతీయుల పీక కోస్తా అంటూ.. (వీడియో)
లండన్: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద చర్యకు వ్యతిరేకంగా పలు దేశాల్లో భారతీయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారతీయులపై పలుచోట్ల కవ్వింపు చర్యలకు దిగుతున్నారు పాకిస్తానీలు. తాజాగా యూకేలో(Pakistan High Commission in London) ప్రవాస భారతీయులను ఉద్దేశించి.. పాక్ చెందిన ఓ అధికారి ఓవరాక్షన్‌కు దిగాడు. పీక కోస్తానంటూ బహిరంగా సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ భారతీయులు లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం, యూకేలో పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన కల్నల్ తైమూర్ రహత్(Colonel Taimur Rahat) నిరసనలు తెలుపుతున్న ప్రదేశానికి వచ్చారు. అందరూ చూస్తుండగాకల్నల్ తైమూర్ రహత్.. భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ ఫ్లెక్సీని భారతీయులకు చూపిస్తూ.. పీక కోస్తామంటూ సైగలు చేశాడు. ప్రవాస భారయుతీలను ఉద్దేశించి ఇలా ప్రవర్తించాడు. దీంతో, అక్కడున్న భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.JUST IN: 🇬🇧 Pakistan Army Officer Makes Throat-Slitting Gesture at Indian Protestors in London.Col. Taimur Rahat, Defence Attaché at Pakistan's UK Mission, caught behaving like a street thug — no difference between a uniformed officer and a terrorist.Shameful and cowardly… pic.twitter.com/gy5wY7dH48— Asia Nexus (@Asianexus) April 26, 2025ఇక, పాకిస్థాన్ హైకమిషన్ వద్ద భారతీయులు నిరసనలు తెలుపుతున్న సమయంలో ఆఫీసులో ఉన్న పాక్ అధికారులు భారీ సౌండ్‌తో మ్యూజిక్ వింటున్న శబ్దాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. నిరసనలు వారికి వినిపించకుండా ఉండేందుకే ఇలా చేసినట్టు సమాచారం. లండన్‌లోని పాక్ హైకమిషన్ వద్ద దాదాపు 500 మంది భారతీయులు నిరసనలు చేపట్టినట్టు సమాచారం. మరోవైపు, పహల్గాం దాడి తర్వాత.. ఢిల్లీలోని పౌక్ దౌత్య కార్యాలయంలో కేక్ తెచ్చుకుని సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీన్ని బట్టి చూస్తే భారతీయుల విషయంలో పాక్ అధికారులు ఎంత క్రూరంగా ఉన్నారో అర్థమవుతోంది. పాక్ అధికారుల తీరుపై అక్కడున్న సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. Pakistan High Commission London Military Attache Commander Muhammad Zeeshan Nabi Sheikh SI(M) Colonel Taimur Rahat Tea is Fantastic pic.twitter.com/7vz68nHTFk— Malik islam Awan (@MalikIslam_1) April 25, 2025 Indians in London were protesting against the Pahalgam attack outside the Pakistani embassyThen Colonel Taimur Rahat, Pakistan's military attache in Britain, came to the embassy balcony and signaled Indians to slit Abhinandan's throat with a photo of AbhinandanNow you think… pic.twitter.com/rbGpK81kj1— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) April 26, 2025సింధూ నదిలో పారేది రక్తమే.. ఇక, అంతకుముందు.. పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ భిలావల్ భుట్టో (Bilawal Bhutto) జర్దారీ భారత్‌పై నోర పారేసుకున్నారు. సింధూ (Indus Water treaty) నదిలో నీరు పారకపోతే.. రక్తం పారుతుందంటూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధూ నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనంటూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు.కాగా.. అంతకుముందు పాక్ (Pakistan) రక్షణ మంత్రి కూడా ఇదేతరహా ప్రేలాపనలు చేశారు. సింధూ నదిలో ప్రతి చుక్కా తమదేనని, భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని మరో మంత్రి ఆరోపించారు. ఇక, మన దేశంపై విషం చిమ్ముతూ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సింధూ నది (Indus River) గురించి మాట్లాడిన వీడియో బయటికొచ్చింది. ‘కశ్మీర్లో డ్యాం నిర్మించడం ద్వారా పాక్‌కు నీళ్లు ఆపేస్తామని మీరంటున్నారు. పాక్‌ను నాశనం చేయాలని, చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా ప్రణాళికలను విఫలం చేయాలని కోరుకుంటున్నారు. కానీ మీరు నీళ్లు ఆపేస్తే.. నదుల్లో మళ్లీ రక్తం పారుతుంది’ అని హఫీజ్ అందులో బెదిరింపులకు పాల్పడటం గమనార్హం.

పోలీసు కేసులు ప్రజాదరణను దూరం చేయలేవు!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఒక వ్యాఖ్య చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఏమవుతుందని ప్రశ్నించారు. జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచి వేయలేరని ఆయన స్పష్టం చేశారు. గతంలో తనను 16 నెలలు జైలులో పెట్టారని, పార్టీని నడిపే పరిస్థితి లేకుండా చేశారని, అయినా ప్రజలు ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో పార్టీ ఉందని, ఎన్ని కేసులు పెడితే ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారని పేర్కొన్నారు. జగన్ వ్యాఖ్యలు హేతుబద్దమైనవి. మద్యం కేసుతో పాటు సీనియర్ పోలీసు అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు చేయడంపై ఆయన స్పందించారు. ఒక్కసారి గతంలోకి వెళితే 2011లో జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉండే వారు. తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన సొంతంగా పార్టీని స్థాపించుకోవాలని నిర్ణయించుకుని పదవికి రాజీనామా చేశారు. కడప లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో 5.45 లక్షల ఓట్ల అధిక్యతతో విజయం సాధించి జగన్ సంచలనం సృష్టించారు. అప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీలు కలిసే కుట్ర చేశాయి. జగన్‌ను ప్రజా క్షేత్రంలో ఓడించాలేమన్న భయంతో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా వ్యవహరించి కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. ఆ తర్వాత జగన్ కంపెనీలతో సంబంధం లేని కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావుతో హైకోర్టులో ఫిర్యాదు చేయించడం, దానికి టీడీపీ మద్దతివ్వడం, ఆ వెంటనే హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించడం జరిగిపోయాయి.తదుపరి సీబీఐ కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ముఖ్యంగా సోనియాగాంధీ ఆదేశాల ప్రకారం వ్యవహరించి జగన్‌ను జైలులో పెట్టింది. బెయిల్ రాకుండా కూడా అడ్డుపడ్డారు. చివరికి 16 నెలల తర్వాత బెయిల్ లభించింది. అయినా ఆయన రాజకీయంగా నిలబడ్డారు. జైలులో ఉన్నప్పుడు జరిగిన 18 ఉప ఎన్నికలలో 15 చోట్ల జగన్ పార్టీ విజయ దుంధుభి మొగించింది. ఆ అనుభవాలను మననం చేసుకుంటే సరిగ్గా అదే రీతిలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నేతలపై, కొందరు అధికారులపై కేసులు పెడుతున్నట్లు కనిపిస్తుంది. కూటమి అధికారంలోకి రాగానే రాజకీయ ముద్ర వేసి కొందరు అధికారులను సస్పెండ్ చేయడం చేశారు. పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. ఒక మోసకారి నటిని పట్టుకు వచ్చి పోలీసు ఉన్నతాధికారిపై కేసు పెట్టించి, తదుపరి ఆయనను జైలులో పెట్టారు. మరో వైపు అనేక మంది వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇందు కోసం కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను కూడా ఉపయోగించుకుంటున్నారని చెబుతారు. ఆ తర్వాత తమ రెడ్‌బుక్‌ను పై స్థాయికి తీసుకు రావడానికి ప్రయత్నాలు ఆరంభించారు. దీనికి తగ్గట్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కూడా ఈ కేసుపై చర్చించారని అనుకోవాలి. పైకి పోలవరం-బనకచర్ల తదితర అంశాలపై షా ను కలిసినట్లు ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకున్నారు. ఆ పత్రికలలోనే జగన్‌పై మద్యం కేసు విషయంపై కూడా మాట్లాడారని తెలిపారు. అంటే గతంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కై పెట్టినట్లుగానే, ఈసారి బీజేపీతో ఒప్పందమై ఇలాంటిదేదో చేయాలని చూస్తున్నట్లు ఉన్నారు.2014 టర్మ్‌లో బీజేపీతో పొత్తులో ఉన్నపుడు ప్రధాని మోడీని చంద్రబాబు కలిసినప్పుడల్లా కేవలం జగన్ కేసులపై ఏదో ఒకటి చేయాలని కోరుతుండేవారని, అప్పటి బీజేపీ అధ్యక్షుడు, ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆ రోజుల్లో పలుమార్లు చెప్పేవారు. అదే తరహాలో ఇప్పుడు కూడా బీజేపీ పెద్దలతో సంప్రదించి తన కుట్ర ప్లాన్ అమలు చేయాలని తలపెట్టినట్లు అనుమానాలు వస్తున్నాయి. జగన్ పై 2011 లో పెట్టిన కేసులు ఏమిటి? ఆయన కంపెనీలలో కొందరు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని అందులో క్విడ్ ప్రోక్ జరిగిందని సీబీఐ ఆరోపించింది. అయితే ఇందుకు సంబంధించిన ఏ కంపెనీ కూడా జగన్‌పై ఫిర్యాదు చేయలేదు. అలాగే ప్రభుత్వం, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో జగన్‌కు సంబంధం లేదు. అయినా తన కంపెనీలు ఏర్పాటైన మూడేళ్ల తర్వాత కక్షపూరితంగా కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా అదే మోడల్ కనిపిస్తుంది. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఏ డిస్టిలరీ ఫిర్యాదు చేయలేదు. ఎవరో దారినపోయే వ్యక్తి లెటర్ రాయడం, ఆ వెంటనే దానిపై ప్రభుత్వ కార్యదర్శి ఏసీబీ విచారణకు విచారించాలని పంపడం, తదుపరి ఆగమేఘాల మీద కేసు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులను బెదిరించి వాంగ్మూలాలను తీసుకోవడం, వారు హైకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత వేధింపులు తట్టుకోలేక పోలీసు అధికారులు కోరిన స్టేట్మెంట్ పై సంతకాలు చేశారట. తదుపరి మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డిని ఒక పావుగా వాడుకున్నట్లు అనిపిస్తుంది. ఆయన తనకేదో దీని నుంచి రక్షణ కలుగుతుందని అనుకున్నారో ,ఏమో కాని, రాజ్ కెసిరెడ్డి అన్న మాజీ ఐటి సలహాదారుపై ఆరోపణలు చేశారు.దాంతో విజయసాయిని అదుపులోకి తీసుకోకుండా సిట్ బృందం వదలి వేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన ఎంపీ మిథున్ రెడ్డిని విచారించారు. ఆయన తన వాదన చాలా స్పస్టంగా వినిపించగలిగారు. ఆధారాలు ఉంటే కోర్టులో రుజువు చేయండని సవాల్ చేశారు. తమ కుటుంబంపై చంద్రబాబు కాని, ఎల్లో మీడియా కాని పగపట్టి ఇటీవలి కాలంలో ప్రచారం చేసిన ఉదంతాలను ఆయన మీడియా ముందు ప్రస్తావించి వాటిలో ఒక్కదానిని కూడా నిరూపించలేకపోయిన విషయాన్ని తెలిపారు. ఆ తర్వాత గోవా నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కెసిరెడ్డిని హడావుడిగా అదుపులోకి తీసుకున్నారు. ఎల్లో మీడియాలో ఆయనపై పలు కథనాలు రాయించారు. గోవా నుంచి హైదరాబాద్ వచ్చి, అక్కడ నుంచి చెన్నై ద్వారా విదేశాలకు వెళ్లాలని ఆయన ప్లాన్ చేశారని అర్థం, పర్థం లేని రాతలు రాశారు. నిజంగానే అలా వెళ్లదలిస్తే నేరుగా గోవా నుంచో, లేక దగ్గరలో ఉన్న ముంబై, లేదా చెన్నై వెళ్లి విదేశాలకు పోయి ఉండవచ్చు కదా అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. కెసిరెడ్డిని విచారించిన సందర్భంలో కూడా పలు పరస్పర విరుద్దమైన అంశాలను సిట్ రిమాండ్ రిపోర్టులో కనిపించాయి. ఒకసారి ఆయన సీఎంఓ అధికారులకు మద్యం డబ్బు చేరవేసినట్లు, మరోసారి ఆయనే ఆయా కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారట. నాలుగు డిస్టిలరీల నుంచే మద్యం ఎక్కువగా తీసుకోవడంపై రిమాండ్ రిపోర్టులో సందేహం వ్యక్తం చేశారు. మరి అదే తరహాలో చంద్రబాబు ప్రభుత్వంలోను జరిగింది కదా అన్నదానికి రిప్లై లేదు.అన్నిటికి మించి రిమాండ్ రిపోర్టుపై రాజ్ సంతకం పెట్టడానికి నిరాకరించారని కూడా సిట్ తెలియ చేసింది. అలాంటప్పుడు ఆ రిపోర్టుకు ఎంత విలువ ఉంటుంది? కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాలో బానర్లు పెట్టుకుని ఆనందపడడానికి తప్ప. జగన్ పేరేదో ఆయన నేరుగా చెప్పారన్నట్లుగా ప్రచారం చేసిన ఈ మీడియా దానిపై రాజ్ సంతకం లేదన్న అంశానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్తపడింది. అంటే దీనర్థం ఏదో రకంగా జగన్‌ను జనంలో పలచన చేయడం ద్వారా ప్రజలు ఆ అంశంపై చర్చించుకుంటూ, చంద్రబాబు అండ్ కో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను మర్చిపోవాలనే కదా! మరో సంగతి చెప్పాలి. విజయసాయి తననేదో వదలి వేస్తారని అనుకున్నట్లు ఉన్నారు. రాజ్ అరెస్టు కాగానే ఆయన ఒక కామెంట్ చేశారట. దొరికిన దొంగలు, దొరకని దొంగలు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన కూడా నిందితుడే అయినందున ఏ తరహా కిందకు వస్తారో తేల్చుకోవాలి. ఒకటి మాత్రం వాస్తవం. ప్రజలలో కూటమి సర్కార్ పై విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అదే టైమ్‌లో జగన్ ఎక్కడకు వెళ్లిన వేల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అంటే భవిష్యత్తులో తన పార్టీకి, తన వారసులకు జగన్ పెద్ద బెడద అవుతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే ఈ రకమైన కక్ష రాజకీయాలు చేస్తున్నారు.అమిత్ షా తో కూడా ఇదే అంశంపై మాట్లాడడానికి ఢిల్లీ వెళ్లారంటే ఆయనకు ప్రజలకు ఇచ్చిన హామీలకన్నా, జగన్‌ను ఎలాగొలా ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యం ఉన్నట్లు అర్థం అవుతోంది కదా! ఇవన్ని గమనించిన తర్వాత జగన్ పీఏసీ సమావేశంలో మాట్లాడినట్లు ఆయన కాని, వైసీపీ శ్రేణులు కాని అన్నిటికి సిధ్దమైనట్ల స్పష్టం అవుతోంది కదా! ఇదే చంద్రబాబుకు అతి పెద్ద సవాల్!- కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

IPL 2025: ‘ఇదొక అద్భుత విజయం.. ప్లే ఆఫ్స్ చేరతాం’
ఐపీఎల్-2025 (IPL 2025)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఆరంభ మ్యాచ్‌లో గెలుపొందిన కమిన్స్ బృందం.. ఆ తర్వాత మళ్లీ ఒకే ఒక్కటి గెలిచి.. వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడింది. దీంతో ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs SRH)తో శుక్రవారం తలపడ్డ సన్‌రైజర్స్.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జయభేరి మోగించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించి పన్నెండేళ్ల తర్వాత చెపాక్ స్టేడియంలో తొలి విజయం నమోదు చేసింది. అంతేకాదు.. ప్లే ఆఫ్స్ ఆశలను కూడా సజీవం చేసుకుంది.ఇదొక అద్భుత విజయంఈ క్రమంలో విజయానంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈరోజు మాకు అన్నీ కలిసివచ్చాయి. మా వాళ్లు గొప్పగా ఆడారు. ఇదొక అద్భుత విజయం. కష్టపడినందుకు ఫలితం దక్కింది.సీఎస్కేలో ప్రతిభావంతులైన టాపార్డర్ బ్యాటర్లు ఉన్నారు. మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా వారికి ఉంది. అయితే, మా బౌలర్లు మొమెంటమ్‌ను మార్చేశారు. పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేసి ఇన్నింగ్స్ దిశను మార్చివేశారు.ప్లే ఆఫ్స్ చేరేందుకు కృషి చేస్తాంవారి ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. సీఎస్కేపై మాకు మంచి రికార్డు లేదు. కానీ ఈరోజు మేము గత పరాభవాలకు చెక్ పెట్టగలిగాం. ఈ సీజన్లో మాకు ఇంకా ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఎంత కష్టమైనా ప్లే ఆఫ్స్ చేరేందుకు కృషి చేస్తాం.ఇంతకంటే గొప్పగా గెలిచేందుకు ప్రయత్నిస్తాం. అయితే, ఏదేమైనా ఈనాటి విజయం మాకు ప్రత్యేకమైనది’’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఈసారి కూడా ప్లే ఆఫ్స్ చేరతామనే నమ్మకం ఉందని పరోక్షంగా వెల్లడించాడు.వ్యూహంలో భాగమేఅదే విధంగా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుల గురించి చెబుతూ.. ‘‘వ్యూహం ప్రకారమే హెన్రిచ్ క్లాసెన్‌ను నాలుగో స్థానంలో పంపించాం. మధ్య ఓవర్లలో వారు స్పిన్ మంత్రంతో ముందుకు వస్తారని తెలుసు.అందుకే క్లాసెన్ ముందుగా బ్యాటింగ్‌కు వచ్చాడు. అదే విధంగా నితీశ్ రెడ్డికి ఫినిషర్ పాత్ర ఇచ్చాము’’ అని కమిన్స్ తెలిపాడు. కాగా ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఈ సీజన్లో ఇప్పటికి ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం మూడే గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు లేవు.ఐపీఎల్-2025: సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్👉టాస్: ఎస్ఆర్హెచ్.. మొదట బౌలింగ్👉సీఎస్కే స్కోరు: 154 (19.5)👉ఎస్ఆర్హెచ్ స్కోరు: 155/5 (18.4)👉ఫలితం: సీఎస్కేపై ఐదు వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హర్షల్ పటేల్ (4/28).చదవండి: CSK vs SRH: ‘బుర్ర పనిచేయడం లేదా’?!.. మెండిస్‌పై కావ్యా మారన్ ఫైర్!

కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోయిస్టులు మృతి!
సాక్షి, ములుగు: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగుతోంది. ఐదో రోజు కూంబింగ్‌లో భాగంగా మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. భద్రతా బలగాల ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌వైపు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు దూసుకెళ్తున్నాయి. ఐదో రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది. బలగాలకు దిశానిర్దేశం చేస్తూ గగనతలంలో హెలికాప్టర్లు, డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం దాడుల్లో భాగంగా 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. శుక్రవారం తుపాకులు, బాంబుల శబ్దాలు మారుమోగాయి. ఉదయం ఏడు గంటల నుంచే నాలుగు వైమానిక దళ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. గత రాత్రి 10 గంటల వరకు భారీ కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అన్నారు. దీంతో, సమీప గ్రామాల ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు.మరోవైపు.. కూంబింగ్‌లో నిమగ్నమైన జవాన్లు ఎండల బారినపడుతున్నారు. నాలుగు రోజులుగా అడవుల్లోనే మకాం వేయడంతో ఇప్పటికే 15 మంది అస్వస్థతకు గురికాగా, శుక్రవారం మరో ఐదుగురిని హెలికాప్టర్లో వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ముగ్గురిని మెరుగైన చికిత్సకు భద్రాచలం తరలించారు. ఆపరేషన్ కర్రెగుట్టల గాలింపుతో అభయారణ్యం పరిసర గ్రామాల్లో జవాన్లు ఆంక్షలను విధించడం చర్చనీయాంశంగా మారింది. సమీప వ్యవసాయ క్షేత్రాలు, నీటి నిల్వ ప్రాంతాలకు వెళ్లినా హెచ్చరిస్తున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు.ఇక, తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న కర్రెగుట్ట ఆపరేషన్ ను వెంటనే ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు లేఖ రాశారు. తక్షణమే ఆ ఆపరేషన్ ఆపి శాంతి చర్చలకు ముందుకు రావాలని మావోయిస్టులు విజ్క్షప్తి చేశారు. మావోయిస్టు బస్తర్ ఇంచార్జి రూపేష్ పేరిట ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని ఆ లేఖలో విజ్క్షప్తి చేశారు.గత కొంతకాలం నుంచి మావోయిస్టుల, కేంద్ర ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి మావోయిస్టులో శాంతి చర్చలు జరపాలని ఏఐటీయూసీ కోరుతోంది. దీనిలో భాగంగా ఈనెల రెండో వారంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలని సూచించారు. అయితే తాజాగా మావోయిస్టులు.. ఈ మేరకు లేఖ రాశారు. తమతో శాంతి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.

నా నియోజకవర్గంలో నువ్వు వేలు పెట్టడం ఏంటి?
విశాఖపట్నం, సాక్షి: కూటమి కీలక నేతలు బహిరంగంగానే.. అదీ కార్యకర్తల సమక్షంలో గొడవకు దిగారు. ఇంతకాలం టీడీపీ-జనసేన గొడవలు మాత్రమే చూస్తున్న ఏపీ ప్రజలకు ఇవాళ్టి కొత్త వివాదం ఆసక్తికరంగా అనిపించింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. బహిరంగంగా చోటు చేసుకున్న ఈ పరిణామం కెమెరా కంటికి చిక్కింది.శనివారం బహిరంగంగానే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విష్ణు కుమార్ రాజు మధ్య వాగ్వాదం జరిగింది. ‘‘నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే వేలు పెడుతున్నారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. నాకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారు?’’ అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్‌ను ప్రశ్నించారు. అయితే.. లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లే సమయంలో మీరు ఆరోజు అందుబాటులో లేరని, మీరు లేకపోవడంతో కలెక్టర్ ని కలిసి వినత పత్రం సమర్పించామని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ సర్దిచెప్పబోయారు. అయినా కూడా వినకుండా గంటా విష్ణుతో వాగ్వాదం కొనసాగించారు. వాహనంలో కూర్చొనో గంటా విష్ణుపై కేకలు వేయగా.. దానికి బయటి నుంచే విష్ణుకుమార్ కూడా అంతే దీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోటి నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. గంటా అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు విదేశీ విద్యార్థుల బహిష్కరణపై ట్రంప్ వెనక్కి తగ్గారు. తమ వీసాలు రద్దు చేయడంతో విదేశీ విద్యార్థులు అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో, విద్యార్థులకు అనుకూలంగా తీర్పులు రావడంతో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.వివరాల ప్రకారం.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందల మంది విద్యార్థులకు ఊరట లభించింది. అయితే, అమెరికాలో విదేశీ విద్యార్థులపై ట్రంప్ బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా (Student Visa) లేదా వారి చట్టబద్ధ హోదాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమ వీసాల రద్దుపై విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.అనంతరం.. కాలిఫోర్నియా, బోస్టన్ కోర్టుల్లో విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ఆయా న్యాయస్థానాలు.. విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రంప్ యంత్రాంగం చర్యలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్.. ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది. ఈమేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా వెల్లడించారు. దీంతో ఆయా విద్యార్థులకు చట్టబద్ధ హోదా లభిస్తుందన్నారు.ఇదిలా ఉండగా.. విదేశీ విద్యార్థులపై బహిష్కరణ వేటు కారణంగా డిపోర్టేషన్, నిర్బంధం ముప్పు పొంచి ఉండటంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది ఇప్పటికే అమెరికాను వీడగా.. కొందరు రహస్య ప్రదేశాల్లో తల దాచుకున్నారు. తాజాగా కోర్టు వ్యాఖ్యలతో ట్రంప్ (Donald Trump) సర్కారు వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రన్యారావుకు మరిన్ని కష్టాలు .. ఆ చట్టంతో ఇక బెయిల్ కష్టమే!
బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడి కన్నడ నటి రన్యారావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించారు. ప్రస్తుతం జైల్లో ఉంటున్న రన్యారావుకు ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. గతంలో ఆమె బెయిల్ పిటిషన్ వేయగా.. బెంగళూరు ఆర్థిక నేరాల కోర్టు (Court for Economic Offences) తిరస్కరించింది. అయితే ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బంగారం స్మగ్లింగ్ కేసులో బెయిల్ ఆమెకు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రన్యా రావుపై విదేశీ మారకద్రవ్యం, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం-1974((COFEPOSA)) కూడా ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సిఫార్సు మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నోడల్ ఏజెన్సీ అయిన సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (CEIB) ఈ చట్టాన్ని ప్రయోగించింది. ఈ చట్టం ప్రకారమైతే దాదాపు ఏడాది పాటు బెయిల్ వచ్చే అవకాశం లేదు. నిందితుడు దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదని తేలితే ఈ చట్టం ప్రయోగిస్తారని సమాచారం. ఈ కేసులో రన్యా రావు పదేపదే బెయిల్ కోసం ప్రయత్నించిన నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ఈ చర్య తీసుకున్నట్లు వర్గాలు వెల్లడించాయి. ఆమెతో పాటు ఇతర నిందితులు తరుణ్ రాజు, సాహిల్ సకారియా జైన్‌లపై కూడా ఈ చట్టం కింద కేసు నమోదు చేశారు.కాగా.. రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా సీనియర్ పోలీసు అధికారి రామచంద్రరావు సవతి కుమార్తె రన్యారావును మార్చి 3న అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రన్యారావుతో పాటు మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసును డీఆర్ఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్నాయి. డీజీపీ రామచంద్రరావు పాత్రపై రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మూడో నిందితుడైన జైన్‌తో కలిసి నటి హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు డీఆర్ఐ దర్యాప్తులో తేలింది.

ధోనీ కంపెనీలో 200 మందికి లేఆఫ్స్
పాత కార్ల కొనుగోలు, అమ్మకానికి వేదికగా ఉన్న ‘కార్స్ 24’ సంస్థ ఇటీవల 200 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. కంపెనీ కార్యకలాపాలను పునర్నిర్మించడానికి ఉద్దేశించిన చర్యల్లో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈఓ విక్రమ్ చోప్రా ఉద్యోగులకు అంతర్గత నోట్లో స్పష్టం చేశారు. ఈ తొలగింపులు నిరంతర లేఆఫ్స్ ప్రక్రియకు ప్రారంభం కాదని, కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యాలకు అవసరమైన చర్యగా ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కార్స్24 సంస్థలో ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి వాటాలుండడం గమనార్హం.కఠినంగా నియామకాలుకార్స్24 మరింత కఠినమైన విధానాన్ని అనుసరిస్తూ నియామకాల ప్రక్రియ చేపడుతుందని చోప్రా నొక్కి చెప్పారు. ప్రస్తుత లేఆఫ్స్ కంపెనీ వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు తోడ్పడుతాయని తెలిపారు. కార్స్ 24 కొత్త వ్యాపార విభాగాలకు విస్తరిస్తున్న సమయంలో ఈ తొలగింపులు జరిగాయి. కంపెనీ తన ప్లాట్‌ఫామ్ సామర్థ్యాలను పెంచడానికి, ఆటోమోటివ్ కమ్యూనిటీని బలోపేతం చేయడానికి దేశపు అతిపెద్ద ఆటోమోటివ్ ఫోరమ్ ‘టీమ్-బీహెచ్పీ’ని ఇటీవల కొనుగోలు చేసింది. అదనంగా, కార్స్ 24 వాహన మరమ్మతులు, ఫైనాన్సింగ్, బీమాతో సహా కొత్త కార్ల అమ్మకాలు, అనుబంధ సేవల కోసం ఆన్లైన్ సర్వీసులను ప్రారంభించింది.ఇదీ చదవండి: లేటరల్ ఎంట్రీ నియామకాలకు నోటిఫికేషన్ఆర్థిక పనితీరు, వ్యూహాత్మక సర్దుబాట్లుకార్స్ 24 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.498 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. ఇది వ్యూహాత్మక సర్దుబాట్ల అవసరాన్ని ఎత్తిచూపింది. యూనిట్ల అమ్మకాలు, సగటు అమ్మకపు ధరల పెరుగుదలతో కంపెనీ నిర్వహణ ఆదాయం 25 శాతం పెరిగి రూ.6,917 కోట్లకు చేరుకుంది. దాంతో కంపెనీ వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది.

రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
మంచి ఆరోగ్యం కోసం తినాల్సిన వాటి గురించి సదా ఆరోగ్య నిపుణులు ద్వారా వింటుంటాం. అయితే అవి మన వల్ల కాదని, ఇష్టం లేదనో లేక ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పక్కన పెట్టేస్తాం. కానీ కొన్ని రకాల నట్స్ మాత్రం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వాటిని మన డైట్లో భాగం చేసుకుంటే చాలామటుకు ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాంటి వాటిల్లో ఒకటి బాదంపప్పు. బరువుతగ్గేందుకు, వ్యాధినిరోధక శక్తిని పెండచడంతో దీనికి సాటి మరొకటి లేదని నొక్కి చెబుతున్నారు నిపుణులు. పైగా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవో పరిశోధనాత్మకంగా వివరించి చెప్పారు. అవేంటంటే..!.గుండె ఆరోగ్యం: ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలోనూ, డయాస్టొలిక్ రక్తపోటును కొద్దిగా తగ్గించడంలో సహాయపడుతుంది. పైగా మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. బరువు నిర్వహణ: రోజూ కనీసం 50 గ్రాముల బాదం తీసుకుంటే బరువు పెరగమని నమ్మకంగా చెబుతున్నారు నిపుణులు. బరువు తగ్గాలనుకున్న వారికి ఇది మంచి హెల్ప్ అవుతుందని అన్నారు. గట్‌హెల్త్: బాదం ప్రయోజనకరమైన గట్ బాక్టీరియాను పెంచుతుంది. జీవక్రియ ఆరోగ్యానికి సహాయపడుతుంది.బ్లడ్ షుగర్: బాదం ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, హెచ్‌బీఏ1సీస్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవేగాక బాదంలో మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే పోషకాలు అధికంగా ఉన్నందున రోజవారి ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం తమ అధ్యయనాలు బాదం ప్రయోజనాలను బలంగా హైలెట్ చేశాయని అందువల్ల ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమ డైట్లో భాగం చేసుకోవాలని సూచించారు. ఇక వాటి పూర్తి ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని తెలిపారు నిపుణులు.(చదవండి: సలుపుతున్న రాచపుండు! చివరి దశలోనే ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు)
పాకిస్తాన్‌కు భారీ షాక్!.. ఈసారి ఆహ్వానం లేదు!
పారితోషికంగా నోట్ల కట్టలు.. హైదరాబాద్ కింగ్ నేనే అన్నట్లు తిరిగా: నాని
ఆ బ్యాంకు భళా.. ఈ బ్యాంకు డీలా..
HYD: నలుగురు పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు.. కారణం ఇదే..
ఈవీ విడిభాగాల తయారీలోకి హిందాల్కో.. పుణెలో ప్లాంటు
రిటైర్ అవుతున్నారా? రూ.5 కోట్లు సరిపోవు!
వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని..
Rahul Gandhi: ‘సుప్రీం’ మందలింపు.. ఆ వెంటనే చిక్కులు!
పాక్ అధికారి బలుపు సైగలు.. భారతీయుల పీక కోస్తా అంటూ.. (వీడియో)
IPL 2025: ‘ఇదొక అద్భుత విజయం.. ప్లే ఆఫ్స్ చేరతాం’
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
ప్రాణాలు కాపాడిన ఉప్పు
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
తల్లికి వందనం డబ్బులు అడిగితే సంపద సృష్టించే మార్గం చెవిలో చెప్పండని వెళ్లిపోతున్నాడు!
IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
SRH Vs CSK: గెలిచి నిలిచిన రైజర్స్
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
వాళ్ల సంగతేమోగానీ! వలసదారులపై మీదాడి గురించి ప్రపంచం కూడా సంతోషంగా లేదు
PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన కేన్ మామ
కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
మళ్లీ ఉగ్ర కాండ!
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
ఏపీ గవర్నర్‌ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
‘గోల్డెన్ ఛాన్స్ మిస్.. బుర్ర పనిచేయడం లేదా’?!.. కావ్యా మారన్ ఫైర్!
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
విరాట్ కోహ్లి తొందరపడ్డాడు.. అప్పటి వరకు ఆడాల్సింది: సురేష్ రైనా
మెగా అగచాట్ల డీఎస్సీ!
Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్ సార్ కాదు’
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతే: అసంతృప్తి వెళ్లగక్కిన ధోని
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్‌లో అఘోరీ అరుపులు, కేకలు!
భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
టాపర్ కాస్త హంతకుడిగా..
ఒకే ఇల్లు.. ఒకే వంట
ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోండి
అవినీతి 'ఐకానిక్'!
ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?
బయోమెట్రిక్స్, చిరునామా
పాక్‌ను ముక్కలు చేయండి
పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
పహల్గాం ఘటన.. పాక్ కపట నాటకం
చిరంజీవి సినిమాలో విలన్‌గా టాలీవుడ్ యంగ్ హీరో!
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
ఐటీఆర్ ఫైలింగ్‌కు వేళాయే..
పాకిస్తానీలు వెంటనే మీ దేశానికి వెళ్లండి: తెలంగాణ డీజీపీ
నిశ్చితార్థం చేసుకుని ఏడాది.. మరి పెళ్లెప్పుడు?
కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఇక్రమ్.. ఇంకా ఇక్కడే!
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
విశాఖలో దంపతుల దారుణహత్య
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
కాకమ్మకు జర్రమొచ్చింది.. చీమల పుట్టను వెతుక్కుంది
SRH Vs CSK: వారెవ్వా మెండిస్.. ఐపీఎల్ చరిత్రలోనే సంచలన క్యాచ్
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్‌కు జంటగా..!
సాక్షి కార్టూన్ 25-04-2025
ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్..!
పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పాక్ నటి.. నెటిజన్ల ఆగ్రహం!
జలదిగ్బంధం!
మాజీ ఇరిగేషన్ అధికారి హరిరాం ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీగా ఆస్తి పత్రాలు..
పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్ నిర్వాహకుడి అరెస్ట్
నాటి రైతు బిడ్డ... నేడు ఐపీఎల్ హీరో
అంతా భారత్ ఇష్టమేనా?.. దేనికైనా రెడీ.. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం
పవన్ సినిమా వాయిదా.. ఎందుకంటే ఈ రెండు మూవీస్
పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. పది మంది సైనికులు మృతి
సత్తా చాటిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: రూ.35 వేల కోట్లకుపైగా బిజినెస్
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
'నెక్ట్స్ వేకేషన్ జమ్మూ కశ్మీర్‌లోనే'.. కేఎల్ రాహుల్ మామ సంచలన కామెంట్స్!
ఇండియన్ ఆర్మీ ఆన్ ఫైర్.. కశ్మీరీ ఉగ్రవాదుల ఇళ్లు నేలమట్టం
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్‌గేల్ అవుతాడు’
రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
శాంతి చర్చల్లో పురోగతి?.. ట్రంప్ కీలక ప్రకటన
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
బిడ్డను చంపి తల్లిపై గ్యాంగ్‌రేప్!
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
రూటు మార్చిన చంద్రబాబు.. ఏపీలో ఆర్థిక విధ్వంసం
పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించిన టీసీఎస్
వరకట్న వేధింపులకు వివాహిత బలి
ముత్యాల నగరంలో..ఆభరణాల ఉత్సవం!
రియల్టీలోకి రూ.2.29 లక్షల కోట్లు
బీచ్‌లో చిల్ అవుతోన్న సుప్రీత.. తేనే కళ్లతో కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
కారెనుక.. కారు గట్టి..
#SRH: సీఎస్కే కంచు కోట బద్దలు .. 12 ఏళ్ల తర్వాత తొలిసారి
పీఎఫ్ ఖాతా బదిలీ.. ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్!
పాకిస్తాన్‌కు భారీ షాక్!.. ఈసారి ఆహ్వానం లేదు!
పారితోషికంగా నోట్ల కట్టలు.. హైదరాబాద్ కింగ్ నేనే అన్నట్లు తిరిగా: నాని
ఆ బ్యాంకు భళా.. ఈ బ్యాంకు డీలా..
HYD: నలుగురు పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు.. కారణం ఇదే..
ఈవీ విడిభాగాల తయారీలోకి హిందాల్కో.. పుణెలో ప్లాంటు
రిటైర్ అవుతున్నారా? రూ.5 కోట్లు సరిపోవు!
వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని..
Rahul Gandhi: ‘సుప్రీం’ మందలింపు.. ఆ వెంటనే చిక్కులు!
పాక్ అధికారి బలుపు సైగలు.. భారతీయుల పీక కోస్తా అంటూ.. (వీడియో)
IPL 2025: ‘ఇదొక అద్భుత విజయం.. ప్లే ఆఫ్స్ చేరతాం’
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
ప్రాణాలు కాపాడిన ఉప్పు
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
తల్లికి వందనం డబ్బులు అడిగితే సంపద సృష్టించే మార్గం చెవిలో చెప్పండని వెళ్లిపోతున్నాడు!
IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
SRH Vs CSK: గెలిచి నిలిచిన రైజర్స్
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
వాళ్ల సంగతేమోగానీ! వలసదారులపై మీదాడి గురించి ప్రపంచం కూడా సంతోషంగా లేదు
PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన కేన్ మామ
కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
మళ్లీ ఉగ్ర కాండ!
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
ఏపీ గవర్నర్‌ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
‘గోల్డెన్ ఛాన్స్ మిస్.. బుర్ర పనిచేయడం లేదా’?!.. కావ్యా మారన్ ఫైర్!
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
విరాట్ కోహ్లి తొందరపడ్డాడు.. అప్పటి వరకు ఆడాల్సింది: సురేష్ రైనా
మెగా అగచాట్ల డీఎస్సీ!
Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్ సార్ కాదు’
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతే: అసంతృప్తి వెళ్లగక్కిన ధోని
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్‌లో అఘోరీ అరుపులు, కేకలు!
భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
టాపర్ కాస్త హంతకుడిగా..
ఒకే ఇల్లు.. ఒకే వంట
ట్రంప్ యూటర్న్.. అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్
ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోండి
అవినీతి 'ఐకానిక్'!
ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?
బయోమెట్రిక్స్, చిరునామా
పాక్‌ను ముక్కలు చేయండి
పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
పహల్గాం ఘటన.. పాక్ కపట నాటకం
చిరంజీవి సినిమాలో విలన్‌గా టాలీవుడ్ యంగ్ హీరో!
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
ఐటీఆర్ ఫైలింగ్‌కు వేళాయే..
పాకిస్తానీలు వెంటనే మీ దేశానికి వెళ్లండి: తెలంగాణ డీజీపీ
నిశ్చితార్థం చేసుకుని ఏడాది.. మరి పెళ్లెప్పుడు?
కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఇక్రమ్.. ఇంకా ఇక్కడే!
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
విశాఖలో దంపతుల దారుణహత్య
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
కాకమ్మకు జర్రమొచ్చింది.. చీమల పుట్టను వెతుక్కుంది
SRH Vs CSK: వారెవ్వా మెండిస్.. ఐపీఎల్ చరిత్రలోనే సంచలన క్యాచ్
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్‌కు జంటగా..!
సాక్షి కార్టూన్ 25-04-2025
ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్..!
పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పాక్ నటి.. నెటిజన్ల ఆగ్రహం!
జలదిగ్బంధం!
మాజీ ఇరిగేషన్ అధికారి హరిరాం ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీగా ఆస్తి పత్రాలు..
పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్ నిర్వాహకుడి అరెస్ట్
నాటి రైతు బిడ్డ... నేడు ఐపీఎల్ హీరో
అంతా భారత్ ఇష్టమేనా?.. దేనికైనా రెడీ.. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం
పవన్ సినిమా వాయిదా.. ఎందుకంటే ఈ రెండు మూవీస్
పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. పది మంది సైనికులు మృతి
సత్తా చాటిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: రూ.35 వేల కోట్లకుపైగా బిజినెస్
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
'నెక్ట్స్ వేకేషన్ జమ్మూ కశ్మీర్‌లోనే'.. కేఎల్ రాహుల్ మామ సంచలన కామెంట్స్!
ఇండియన్ ఆర్మీ ఆన్ ఫైర్.. కశ్మీరీ ఉగ్రవాదుల ఇళ్లు నేలమట్టం
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్‌గేల్ అవుతాడు’
రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
శాంతి చర్చల్లో పురోగతి?.. ట్రంప్ కీలక ప్రకటన
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
బిడ్డను చంపి తల్లిపై గ్యాంగ్‌రేప్!
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
రూటు మార్చిన చంద్రబాబు.. ఏపీలో ఆర్థిక విధ్వంసం
పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించిన టీసీఎస్
వరకట్న వేధింపులకు వివాహిత బలి
ముత్యాల నగరంలో..ఆభరణాల ఉత్సవం!
రియల్టీలోకి రూ.2.29 లక్షల కోట్లు
బీచ్‌లో చిల్ అవుతోన్న సుప్రీత.. తేనే కళ్లతో కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
కారెనుక.. కారు గట్టి..
#SRH: సీఎస్కే కంచు కోట బద్దలు .. 12 ఏళ్ల తర్వాత తొలిసారి
పీఎఫ్ ఖాతా బదిలీ.. ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్!
సినిమా

'నెక్ట్స్ వేకేషన్ జమ్మూ కశ్మీర్‌లోనే'.. కేఎల్ రాహుల్ మామ సంచలన కామెంట్స్!
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సంచలన కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తన వేకేషన్ను జమ్మూ కశ్మీర్‌లోనే ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాశ్మీర్ లోయలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి.. ఉగ్రవాదంపై పోరాటానికి భారతీయులంతా ఏకం కావాలని ఆయన కోరారు. ముంబయిలో జరిగిన లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు- 2025 వేడుకకు హాజరైన ఆయన పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కాశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగమని.. ఇలాంటి సమయంలోనే మనం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎవరూ కూడా భయానికి కానీ.. ద్వేషానికి కానీ లోనుకావద్దని దేశ ప్రజలను సునీల్ శెట్టి కోరారు.సునీల్ శెట్టి మాట్లాడుతూ.. "మనం మానవాళికి చేసే సేవే భగవంతుని సేవ. సర్వశక్తిమంతుడు అన్నీ చూసి ప్రతిస్పందిస్తాడు. ప్రస్తుతం మనం భారతీయులుగా ఐక్యంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. భయం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న వారి వలలో మనం పడకూడదు. ఇలాంటి సమయంలోనే మనమంతా ఐక్యంగా ఉండాలి. కశ్మీర్ మనదే.. ఎల్లప్పుడూ మనదే అని వాళ్లకి మనం చూపించాలి. అందుకే కాశ్మీర్లో తన విహారయాత్రను ప్లాన్ చేసుకుంటున్నా. మీరు కూడా కశ్మీర్లో పర్యటించాలని భారతీయ పౌరులను కోరుతున్నా. ఒక పౌరుడిగా మనం ఈ పని చేయాలి. మన తదుపరి వేకేషన్ కశ్మీర్‌లోనే ఉండాలి. ఎందుకంటే మనం భయపడలేదని.. మనకు భయం లేదని వారికి చూపించాలి' అని పిలుపునిచ్చారు.ఇప్పటికే తాను అధికారులను సంప్రదించానని.. అవసరమైతే కశ్మీర్లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సునీల్ పేర్కొన్నాడు. తమ సినిమాలను సైతం అక్కడే షూటింగ్ నిర్వహిస్తామని అధికారులకు వివరించినట్లు వెల్లడించారు. ఎందుకంటే మన కశ్మీరీలు ఎప్పటికీ మనకు తోడుగా నిలుస్తారని సునీల్ శెట్టి అన్నారు. ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ ప్రాంతం నుంచి పర్యాటకులు తరలివెళ్లడంతో అక్కడి స్థానికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే సునీల్ శెట్టి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లోని బైసారన్ లోయ వద్ద పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు.. 26 మందిని హతమార్చారు. ఈ ఘటనతో యావత్ భారతదేశం షాకింగ్‌కు గురైంది. View this post on Instagram A post shared by Visitkashmirtravel In (@visitkashmirtravel.in)

బన్నీకి రౌడీ హీరో సర్ప్రైజ్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీలో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ.. మన బన్నీకి మంచి ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు అభిమానం చాటుకుంటూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అల్లు అర్జున్‌కు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు విజయ్.తాజాగా విజయ్... తన రౌడీ బ్రాండ్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బన్నీకి రౌడీ బ్రాండ్ టీషర్ట్స్‌ను, పిల్లల కోసం కొన్ని బర్గర్లను పంపారు. దీనికి సంబంధించిన ఫొటోను పంచుకున్న బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మై స్వీట్ బ్రదర్.. ఎప్పుడూ నువ్వు సర్ప్రైజ్ చేస్తుంటావు. సో స్వీట్ అంటూ అని తన స్టోరీస్‌లో రాసుకొచ్చారు. కాగా.. గతంలోనూ అల్లు అర్జున్‌కు పుష్ప 2 రిలీజ్ సందర్భంగా పుష్ప పేరుతో కూడిన టీ షర్ట్‌లను పంపారు.మరోవైపు పుష్ప-2 తర్వాత బన్నీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో జత కట్టనున్నారు. జవాన్ మూవీతో హిట్ అందుకున్ అట్లీ దర్శకత్వంలో నటించునున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి మూవీ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నట్లు తెలుస్తోంది.

పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పాక్ నటి.. నెటిజన్ల ఆగ్రహం!
2017లో రాయిస్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన పాక్ నటి మహీరా ఖాన్. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించింది. ఈ దారుణ ఘటనలో బాధిత కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ రూపంలోనైనా హింస అనేది పిరికిపంద చర్యగా ఆమె అభివర్ణించింది. ఇప్పటికే ఈ దాడిని పాకిస్తాన్‌కు చెందిన నటులు ఫవాద్ ఖాన్‌తో పాటు హనియా అమీర్, ఫర్హాన్ సయీద్, మావ్రా హోకానే, ఉసామా ఖాన్ లాంటి ప్రముఖులు ఖండించారు.అయితే మహీరా ఖాన్ తన పోస్ట్‌ను కొద్ది క్షణాల్లో డీలీట్ చేసింది. పహల్గామ్ మారణహోమంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే నటి తొలగించడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఇంత మాత్రానికి మీరు సానుభూతి ప్రకటించడం ఎందుకని మహీరాను నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా.. అంతకుముందే ప్రముఖ పాక్ నటుడు ఫవాద్ ఖాన్ ఈ ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఫవాద్ ఖాన్ సినిమాపై బ్యాన్..పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలను తెంచేసుకున్నట్లు ప్రకటించింది. గతంలో 2016లో యూరీ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ఆరిస్టులను ఇండియాలో పని చేయకుండా నిషేధించారు. తాజాగా పహల్గామ్ ఘటన తర్వాత మరోసారి పాక్ నటీనటులపై కేంద్ర నిషేధం విధించింది. అంతేకాకుడా ఫవాద్ ఖాన్ నటించిన సినిమాను విడుదలను బ్యాన్ చేసింది.పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన హిందీ సినిమా 'అబీర్ గులాల్' (Abir Gulaal Movie)ను భారత్‌లో విడుదల చేయకూడదని కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించగా.. బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ అతడికి జంటగా నటించింది. రిద్ధి డోగ్రా, లీసా హైడన్, ఫరీదా జలాల్, పర్మీత్ సేతి, సోనీ రజ్దాన్ కీలక ప్రాతలు పోషించారు. ఆర్తి ఎస్. బగ్దీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను వివేక్ అగర్వాల్, అవంతిక హారి, రాకేశ్ సిప్పీ, ఫిరూజీ ఖాన్ నిర్మించారు.

చెపాక్‌లో తలా సందడి.. మరో తలా కోసమే వచ్చాడంటున్న నెటిజన్స్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఏప్రిల్ 10న విడుదలైన 'గుడ్ బ్యాడ్ అగ్లీ'కి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విదాముయార్చి ఫెయిల్యూర్ తర్వాత వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.రెండు రోజుల క్రితమే అజిత్ తన భార్య షాలినితో కలిసి వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. వీరిద్దరి బంధానికి దాదాపు 25 ఏళ్లు పూర్తి కావడంతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా ఈ జంట ఐపీఎల్ మ్యాచ్‌లోనూ సందడి చేశారు. తమ కుమారుడు ఆద్వైక్తో కలిసి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. అభిమానులు తలా అని ముద్దుగా పిలుచుకునే అజిత్.. మరో తలాగా పిలవబడే ఎంఎస్ ధోని ఆటను ఆస్వాదించేందుకు స్డేడియానికి వచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అతని కొడుకు ఆద్వైక్ను తన ఒడిలో కూర్చొబెట్టుకుని మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించారు.కాగా.. ఈ మ్యాచ్‌లో మరో హీరో శివకార్తికేయన్ కూడా స్టేడియంలో కనిపించారు.అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో హీరోయిన్ శృతిహాసన్ సైతం సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. అయితే సినిమాలతో పాటు రేసింగ్‌లోనూ అజిత్ కుమార్ యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన టీమ్ బెల్జియంలో జరిగిన కారు రేస్‌లో రెండో స్థానంలో నిలిచింది. Seems like Shalini AjithKumar is a big fan of CSK & the way she explains the team players to AK so heartwarming 🥰AK’s Wedding Anniversary Gift 🎁 pic.twitter.com/2jqVtRU6bc— Kolly Corner (@kollycorner) April 25, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజధానిలో దోపిడీ ఐకానిక్... ఐదు టవర్ల నిర్మాణ వ్యయం అనూహ్యంగా పెంపు...

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు... తీవ్రస్థాయికి చేరిన ఉద్రిక్తతలు

పాకిస్తాన్‌కు భారత్ పంచ్. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్. దౌత్య సంబంధాలకు కత్తెర. సింధూ ఒప్పందం సస్పెన్షన్. ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్‌లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్‌రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన
క్రీడలు

‘గోల్డెన్ ఛాన్స్ మిస్.. బుర్ర పనిచేయడం లేదా’?!.. కావ్యా మారన్ ఫైర్!
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎట్టకేలకు ఓ విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కమిన్స్ బృందం సత్తా చాటింది.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs SRH)ను తమ సొంత గడ్డపైనే ఓడించి ఈ సీజన్లో మూడో విజయం సాధించింది.అంతేకాదు.. పన్నెండేళ్ల తర్వాత మొట్టమొదటి సారి చెపాక్‌లో జయభేరి మోగించి.. చెన్నైకి ఊహించని షాకిచ్చింది. ఆద్యంతం ఆసక్తిగా, ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్ (Kavya Maran) పలికించిన భావోద్వేగాలు, ఆమె ఇచ్చిన రియాక్షన్స్ వైరల్‌గా మారాయి.బుర్ర పనిచేయడం లేదా?!ముఖ్యంగా లక్ష్య ఛేదనలో రైజర్స్ స్టార్ కమిందు మెండిస్ (Kamindu Mendis) చేసిన పొరపాటు కావ్యకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ‘ఇంత చెత్తగా కూడా ఆడతారా?.. బుర్ర పనిచేయడం లేదా?!’ అన్నట్లు ఆమె ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. చెపాక్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బౌలింగ్ చేసింది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. రైజర్స్ బౌలర్ల ధాటికి 19.5 ఓవర్లలో 154 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. హర్షల్ పటేల్ నాలుగు వికెట్ల (28/4)తో చెలరేగి సీఎస్కేను దెబ్బకొట్టగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కట్ రెండేసి వికెట్లు కూల్చారు. మహ్మద్ షమీ, కమిందు మెండిస్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే రైజర్స్‌కు షాకులు తగిలాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), ట్రవిస్ హెడ్ (19) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టును ఆదుకున్నాడు. 34 బంతుల్లో 44 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.అయితే, ఇన్ఫామ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (7) విఫలం కావడం.. అనికేత్ వర్మ (19) కూడా పెవిలియన్‌కు చేరడంతో రైజర్స్ శిబిరంలో మరోసారి నిరాశ ఆవహించింది. ఈ క్రమంలో ఆల్‌రౌండర్లు కమిందు మెండిస్, నితీశ్ కుమార్ రెడ్డి చక్కటి సమన్వయంతో ఆడారు.మెండిస్ 22 బంతుల్లో 32, నితీశ్ 13 బంతుల్లో 19 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. జట్టును విజయతీరాలకు చేర్చారు. అయితే, సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ పదహారో ఓవర్లో చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ వేసిన బంతి నోబాల్‌గా తేలింది.గోల్డెన్ ఛాన్స్ మిస్ఈ క్రమంలో ఫ్రీ హిట్ రాగా.. కమిందు మెండిస్ మాత్రం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆఫ్ స్టంప్ దిశగా వచ్చిన బంతిని స్లాగ్ షాట్‌కు యత్రించి విఫలమయ్యాడు. ఇంతలో బంతి అందుకున్న వికెట్ కీపర్ ధోని.. స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో ఒక్క పరుగు కూడా రాకుండానే ఫ్రీ హిట్ వృథా అయిపోయింది. ఇదే కావ్యా మారన్ ఆగ్రహానికి కారణమైంది.ఇక 18.4 ఓవర్లలోనే మెండిస్, నితీశ్ కలిసి లక్ష్యాన్ని పూర్తి చేయగానే.. కావ్యా మారన్ సంబరాలు అంబరాన్నంటాయి. తీవ్ర భావోద్వేగానికి గురైన ఈ విజయం ఎంతో ముఖ్యమైనది అంటూ పక్కన ఉన్న వాళ్లను ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనేEdge-of-the-seat drama! 😱🔥#NoorAhmad oversteps, but #KaminduMendis can’t cash in on the free hit! Tension through the roof! 😵💫Watch the LIVE action ➡ https://t.co/uCvJbWec8a#IPLonJioStar 👉 #CSKvSRH | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! pic.twitter.com/bWQlW9VEna— Star Sports (@StarSportsIndia) April 25, 2025A milestone victory 👏#SRH register their first ever win at Chepauk with a strong performance against #CSK 🔝💪Scorecard ▶ https://t.co/26D3UampFQ#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/lqeX4CiWHP— IndianPremierLeague (@IPL) April 25, 2025

ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతే: అసంతృప్తి వెళ్లగక్కిన ధోని
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ కథ దాదాపు ముగిసినట్లే!.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (CSK vs SRH)తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సీఎస్కే ఓటమిపాలైంది. ఫలితంగా ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) స్పందించాడు.తమ పరాజయానికి బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమని స్పష్టం చేశాడు. చెపాక్ వికెట్ మీద తమ వాళ్లు బ్యాట్ ఝులిపించలేకపోయారని విచారం వ్యక్తం చేశాడు. చిదంబరం స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌కు దిగింది.బ్రెవిస్ ఒక్కడేఓపెనర్లలో షేక్ రషీద్ డకౌట్ కాగా.. ఆయుశ్ మాత్రే (19 బంతుల్లో 30) రాణించాడు. మిగతా వాళ్లలో రవీంద్ర జడేజా (21), దీపక్ హుడా (22) ఫర్వాలేదనిపించగా.. కొత్తగా జట్టుతో చేరిన డెవాల్డ్ బ్రెవిస్ ధనాధన్ దంచికొట్టాడు. ఈ సౌతాఫ్రికా స్టార్ 25 బంతుల్లో 42 పరుగులతో సీఎస్కే టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.రైజర్స్ గెలిచి నిలిచిందికెప్టెన్ ధోని (6) సహా మిగతా వాళ్లంతా విఫలం కావడంతో చెన్నై 19.5 ఓవర్లలోనే కేవలం 154 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రైజర్స్ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి.. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆడిన తొమ్మిదింట చెన్నైకి ఇది ఏడో పరాజయం.మా వాళ్లు విఫలంఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘‘తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ మరీ అంత కఠినంగా ఏమీ లేదు. కానీ మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. ఈ పిచ్ మీద 155 పరుగుల స్కోరు చెప్పుకోదగ్గది కానేకాదు. అసలు వికెట్ ఎక్కువగా టర్న్ కాలేదు.అయితే, 8-10 ఓవర్ల తర్వాత పిచ్ స్వభావం కాస్త మారింది. అయినా సరే పరుగులు రాబట్టేందుకు ఆస్కారం ఉన్నా మేము ఆ పని చేయలేకపోయాం. ఇక రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ స్పిన్నర్లకు సహకరించింది.మా వాళ్లు నాణ్యంగానే బౌలింగ్ చేశారు. సరైన సమయంలో వికెట్లు తీశారు. కానీ మేము ఇంకో 15- 20 పరుగులు చేసి ఉంటే.. వాళ్లు సులువుగా పని పూర్తి చేసేవారు’’ అని పేర్కొన్నాడు.ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతేఇక డెవాల్డ్ బ్రెవిస్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మాకు మిడిలార్డర్లో అలాంటి ఆటగాడే కావాలి. స్పిన్నర్లు బరిలోకి దిగినప్పుడు మా వాళ్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు.అలాంటి సమయంలో బ్రెవిస్ లాంటి వాళ్లు నిలదొక్కుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది’’ అని ధోని తెలిపాడు. ఏదేమైనా జట్టులో ఒకరిద్దరు బాగా ఆడకపోయినా పెద్దగా తేడా ఉండదని.. అయితే, మూకుమ్మడిగా అందరూ విఫలమైతే ఇలాంటి ఫలితాలే వస్తాయని తలా అసంతృప్తి వ్యక్తం చేశాడు.అదే విధంగా.. ప్రతిసారీ 180- 200 పరుగులు స్కోరు చేయాల్సిన అవసరం లేదన్న ధోని.. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా కనీస ప్రదర్శన చేయాలని తమ బ్యాటర్లను విమర్శించాడు. జట్టులో ఎక్కువ మంది విఫలమవుతుంటే ఎలాంటి మార్పులు చేయాలో కూడా అర్థం కాదంటూ పెదవి విరిచాడు. చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనేA milestone victory 👏#SRH register their first ever win at Chepauk with a strong performance against #CSK 🔝💪Scorecard ▶ https://t.co/26D3UampFQ#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/lqeX4CiWHP— IndianPremierLeague (@IPL) April 25, 2025

నాటి రైతు బిడ్డ... నేడు ఐపీఎల్ హీరో
బిహార్ రాష్ట్రంలోని మారుమూల పల్లె అయిన తాజ్‌పూర్‌లో పుట్టిన ఆ బాలుడు ప్రస్తుతం క్రికెట్లో దూసుకుపోతున్నాడు. రైతుబిడ్డగా ఎదిగిన అతను ఆటలో ప్రావీణ్యం చూపుతూ అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. 14 ఏళ్లకే ఐపీఎల్‌కు ఎంపికైన ఘటన సాధించిన అతనే వైభవ్ సూర్యవంశీ. మార్చి 27, 2011న పుట్టిన సూర్యవంశీది రైతు కుటుంబం. పోలంలో పని చేస్తేనే ఇంట్లో అందరూ పోట్టనింపుకునే పరిస్థితి వారిది. చిన్ననాటి నుంచి క్రికెట్‌పై వైభవ్‌కు వల్లమాలిన ఇష్టం.ఆ ఇష్టాన్ని తండ్రి సంజీవ్ గమనించారు. ఎనిమిదేళ్ల తన కొడుకు ముందు ముందు క్రికెట్లో అద్భుతాలు సష్టిస్తాడని ఆయన అంచనా వేశారు. ఇందుకోసం తన మద్దతు అవసరం అని గ్రహించి, తన పోలాన్ని అమ్మేసి మరీ కొడుకుకు క్రికెట్లో శిక్షణ ఇప్పించారు. అప్పటినుంచి క్రికెట్‌పై దష్టి పెట్టిన వైభవ్ శిక్షణ కోసమే పూర్తి సమయాన్ని కేటాయించాడు. సమస్తిపూర్‌కు తండ్రితోపాటు వెళ్లి అక్కడ కోచ్‌ల దగ్గర శిక్షణ పోందేవాడు. 12 ఏళ్లకే శిక్షణలో రాటుదేలాడు. తొలిసారి రంజీ ట్రోఫీలో పాల్గొని ముంబయి జట్టుపై ఆడాడు. అక్కడే అతని ప్రతిభ అందరికీ తెలిసింది. అనంతరం అండర్–16, అండర్–19 టోర్నమెంట్లలో వైభవ్ తన సత్తా చాటాడు. ఒక్కో చోట తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటూ మేలైన క్రీడాకారుడిగా మారాడు. అండర్–19 ఏషియా కప్‌లో తన ఆటతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశాడు.ఇన్ని విజయాలు సాధించిన వైభవ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఎంపికై దేశమంతటికీ తెలిశాడు. 14 ఏళ్లకు రూ.1.10 కోట్ల పారితోషికంతో ఐపీఎల్‌కు ఎంపికై, అతి చిన్నవయస్కుడైన ఐపీఎల్ ఆటగాడిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ద్వారా మైదానంలో విజంభిస్తూ అందరి ప్రశంసలు పోందుతున్నాడు..pic.twitter.com/ElkZUyaI2z— Sujeet Suman (@sujeetsuman1991) April 24, 2025

‘నాపై విద్వేషం చూపిస్తున్నారు’
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో తొలి వ్యక్తిగత స్వర్ణం సాధించి భారత అత్యుత్తమ అథ్లెట్‌గా గుర్తింపు తెచ్చుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు కూడా దేశంలోని దురభిమానుల నుంచి వేధింపులు తప్పడం లేదు. తాను నిర్వహించబోయే ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ టోర్నీ కి పాకిస్తాన్ ఆటగాడు, పారిస్ ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత అర్షద్ నదీమ్‌ను అతను ఆహ్వానించడమే అందుకు కారణం. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తానీయులపై భారత అభిమానులు సహజంగానే ఆగ్రహంతో ఉన్నారు. దానిని ఇప్పుడు నీరజ్‌పై చూపిస్తున్నారు. నిజానికి ఈ ఘటన జరగక ముందే నదీమ్‌ను నీరజ్ ఆహ్వానించాడు. టోర్నీ జరిగే సమయంలో తాను గతంలోనే నిర్ణయించుకున్న కార్యక్రమం ప్రకారం విదేశాల్లో ఉంటున్నానని, అందుకు హాజరు కాలేనని కూడా నదీమ్ స్పష్టం చేసేశాడు. ‘సహచర భారతీయుల్లాగే నేను కూడా కశీ్మర్ ఘటన పట్ల ఎంతో బాధపడుతున్నాను. దానిపై చాలా ఆగ్రహంగా కూడా ఉన్నాను. అయితే నాపై కొందరు చూపిస్తున్న విద్వేషం ఊహించలేనిది. వారి మాటల్లో ఎన్నో తిట్లు కనిపిస్తున్నాయి. నేను సాధారణంగా ఇలాంటివి పట్టించుకోను. కానీ దానిని బలహీనతగా భావించవద్దు. పైగా దేశం పట్ల నా అంకితభావాన్ని ప్రశ్నిస్తే మాత్రం ఊరుకోను. అర్షద్‌కు ఆహ్వానం పంపడం ఒక క్రీడాకారుడి కోణంలోనే చూడాలి. నా ఈవెంట్‌కు అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకురావాలనే ఉద్దేశంతో అలా చేశాను. అయతే పహల్గాం ఘటనకు ముందే అందరినీ ఆహ్వానించాం’ అని నీరజ్ గుర్తు చేశాడు. మా కుటుంబాన్ని వదిలేయండి! కశ్మీర్ ఉగ్రదాడి ఘటన తర్వాత కొందరు వ్యక్తులు తన తల్లిని కూడా వదలడం లేదని, ఏడాది క్రితం ఆమె చేసిన వ్యాఖ్యను తప్పుగా అన్వయిస్తున్నారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. పారిస్ ఒలింపిక్స్‌లో అర్షద్ స్వర్ణం, నీరజ్ రజతం గెలిచిన సమయంలో ‘అర్షద్ కూడా నా కొడుకులాంటివాడే’ అని నీరజ్ తల్లి సరోజ్ చెప్పింది. ‘జనాలు తమ అభిప్రాయాలు వేగంగా ఎలా మార్చుకుంటారో ఇప్పుడు కనిపిస్తోంది. ఏడాది క్రితం మా అమ్మ ఏదో నిరాడంబరత్వం, భోళాతనంతో ఒక మాట అంది. అప్పుడు ఆమెను అందరూ అభినందించారు. ఇప్పుడేమో ఆ మాటను పట్టుకొని అమ్మను తిట్టడం బాధగా ఉంది. కొందరు నన్ను లక్ష్యంగా చేసుకోవడం, నేను వివరణలు ఇచ్చుకోవడం చాలా బాధగా ఉంది. నా గురించి తప్పుడు మాటలు ప్రచారం చేయకండి. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని వదిలేయండి’ అని ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో సుబేదార్ మేజర్ హోదాలో ఉన్న నీరజ్ చోప్రా విజ్ఞప్తి చేశాడు.
బిజినెస్

బాలికల ప్రత్యేక స్కీమ్.. వడ్డీ రేటు మారిందా?
సుకన్య సమృద్ధి యోజన (SSY) దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చిన్న పొదుపు పథకాలలో ఒకటి. ఆడపిల్లల చదువు, వివాహం కోసం పొదుపు చేసే తల్లిదండ్రులకు ఈ పథకం అధిక వడ్డీ ఇస్తుంది. వచ్చే రాబడులపై కూడా పన్ను ఉండదు. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం కింద భారత ప్రభుత్వం ఈ పథకానికి సార్వభౌమ గ్యారంటీని అందిస్తోంది.సుకన్య సమృద్ధి యోజన వడ్డీ తగ్గిస్తున్నారా?సుకన్య సమృద్ధి యోజన సహా చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి సమీక్షిస్తుంది. ఈ నేపథ్యంలో 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు మారిందా అన్న సందేహం చాలా మందిలో ఉంది. కానీ సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటును ప్రభుత్వం మార్చలేదు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ పథకం కింద డిపాజిట్లపై సంవత్సరానికి 8.2 శాతం లభిస్తుంది. పోస్టాఫీసు పొదుపు పథకాలలో ఇదే అత్యధికం. ఈ పథకానికే కాదు ప్రస్తుత త్రైమాసికంలో ఏ చిన్న పొదుపు పథకానికి ప్రభుత్వం వడ్డీ రేటును మార్చకపోవడం గమనార్హం.గరిష్ట, కనిష్ట డిపాజిట్లు..సుకన్య సమృద్ధి యోజన కింద, డిపాజిట్లు నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఉంటాయి. కనీసం రూ.250 ప్రారంభ డిపాజిట్‌తో ఈ ఖాతాను తెరవవచ్చు. కాబట్టి ఇది ఎక్కువ కుటుంబాలకు అందుబాటులో ఉంటుంది. ఖాతా యాక్టివ్‌గా ఉండాలంటే ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ .250 అయినా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ స్కీమ్‌లో ఒక ఆర్థిక సంవత్సానికి గరిష్టంగా రూ .1.5 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. డిపాజిటర్లు తమ సౌలభ్యాన్ని బట్టి ఏకమొత్తంలో లేదా నెలవారీ వాయిదాల ద్వారా పొదుపు జమ చేసుకోవచ్చు.విత్‌డ్రా ఎప్పుడు?సుకన్య సమృద్ధి ఖాతా తెరిచిన 21 సంవత్సరాల తరువాత మెచ్యూరిటీ అవుతుంది. ఈ సమయంలో ఖాతాను క్లోజ్ చేసి, వడ్డీతో సహా పూర్తి బ్యాలెన్స్ పొందవచ్చు. ప్రత్యామ్నాయంగా, అమ్మాయి వివాహం తర్వాత లేదా ఆమెకు 18 ఏళ్లు వచ్చాక ఖాతాను మూసివేయవచ్చు. మెచ్యూరిటీ తర్వాతే నిధులు తీసుకునేందుకు వీలున్నప్పటికీ బాలిక చదువు కోసం అంతకుముందే పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంది.బాలికకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత లేదా పదో తరగతి పూర్తయిన తర్వాత ఏది ముందయితే అది కొంత మేర నిధులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉపసంహరణ మొత్తం గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌లో 50% వరకు ఉంటుంది. దీన్ని వన్ టైమ్ ఏకమొత్తంగా లేదా ఐదేళ్లకు మించకుండా సంవత్సరానికి ఒకటి చొప్పున వాయిదాల్లో పొందవచ్చు.

లేటరల్ ఎంట్రీ నియామకాలకు నోటిఫికేషన్
దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీసుల ఎగుమతిదారుగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లతోపాటు, కొత్త ప్రాజెక్టుల్లో పని చేసేందుకు నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 26, శనివారం బెంగళూరులో లేటరల్ నియామకాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.మై ఎస్‌క్యూఎల్ డీబీఏ, అజూర్ ఎస్ఎంఈ, ఐబీఎం డీబీ2, ఏడబ్ల్యూఎస్ ఎస్ఎంఈ, ఒరాకిల్ డీబీఏ, డీబీ2 డిజైనర్ విభాగాల్లో నైపుణ్యాలున్న వారి కోసం టీసీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 15 ఏళ్ల ఫుల్ టైమ్ ఉద్యోగం చేసిన నిపుణుల కోసం కంపెనీ ఈమేరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. విద్య, ఉద్యోగాల మధ్య రెండేళ్లకు మించి గ్యాప్ ఉండకూడదనే షరతు ఉంది.ఇప్పటికే మార్చి 22న ఐదు నగరాల్లోని టెక్ నిపుణుల కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించిన టీసీఎస్ తిరిగి నెల తర్వాత మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. గతంలో జరిగిన నియామకంలో ఆటోమేషన్ టెస్టర్ (సెలీనియం, కుకుంబర్), జావా డెవలపర్స్ (స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్), ఫ్రంట్ ఎండ్ యాంగులర్ డెవలపర్స్, డేటా సైంటిస్ట్ (పైథాన్), డేటా సైంటిస్ట్స్ (ఎస్ఏఎస్/ఎస్‌క్యూఎల్), పవర్బీ డెవలపర్, స్నోఫ్లేక్, లీడ్ వెబ్ కాంపోనెంట్ డెవలపర్స్ (యాంగులర్) వంటి వివిధ పోస్టులకు మూడు నుంచి ఆరేళ్ల అనుభవం ఉన్నవారిని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, కోల్‌కతాల్లో నియమించుకుంది.ఇదీ చదవండి: జియో స్టోర్స్‌ల్లో స్టార్‌లింక్ హార్డ్వేర్ఈ ఏడాది జనవరిలో అట్రిషన్(కంపెనీ మారడం) కారణంగా టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 5,000 మంది తగ్గిందని, జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ స్వల్పంగానే ఈ లోటును భర్తీ చేసినట్లు తెలిపింది. మరో సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇదే తరహా నియామకాల ప్రక్రియను కొనసాగిస్తుండటంతో టీసీఎస్ నియామకాలు ఊపందుకున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, జావా పైథాన్, డాట్నెట్, ఆండ్రాయిడ్/ ఐఓఎస్ డెవలప్మెంట్, ఆటోమేషన్ టెస్టింగ్ సహా 40+ నైపుణ్యాలకు సంబంధించిన ఉద్యోగుల కోసం వెతుకుతున్నట్లు ఇన్ఫోసిస్ గత నెలలో అంతర్గత మెయిల్‌ను పంపించింది.

కాస్త పెరిగిన ఇంటి అద్దెలు..
కొనేటప్పుడు తక్కువ ధరకు కావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ ధర రావాలని కోరుకునేది స్థిరాస్తి రంగంలోనే.. ఇది అద్దె విభాగానికీ వర్తిస్తుంది. గత కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాలలో అద్దె గృహాల విపణి క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉంది. - సాక్షి, సిటీబ్యూరోప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తుండటంతో సప్లయి తగ్గింది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్‌తో పాటు రెంట్లు కూడా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్‌లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్ 50, సప్లయి వాటా 39 శాతంగా ఉన్నాయి.పశ్చిమంలో డిమాండ్ ఎక్కువ.. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీనే ప్రధాన కారణం. రూ.25 వేలు నుంచి రూ.35 వేలు నెలవారీ అద్దెలకు కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 1,000 చ.అ. నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ అధికంగా ఉంది.

జియో స్టోర్స్‌ల్లో స్టార్‌లింక్ హార్డ్‌వేర్
భారతదేశపు ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా ఉన్న తన రిటైల్ అవుట్లెట్లలో స్టార్‌లింక్ హార్డ్‌వేర్‌ను అందించడానికి స్పేస్ఎక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. శాటిలైట్ ఇంటర్నెట్ పరికరాలను మరింత సులువుగా వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇది దేశంలోని డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కీలకంగా మారనుందని చెప్పింది. అయితే, స్పేస్ఎక్స్ దేశంలో తన కార్యకలాపాలు నిర్వహించేందుకు రెగ్యులేటరీ అనుమతులను పొందాల్సి ఉంది.రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ ఆర్థిక పనితీరును, భవిష్యత్తు ప్రణాళికలను హైలైట్ చేసింది. జియో విస్తృతమైన స్థానిక ఉనికిని, స్టార్‌లింక్ అత్యాధునిక లో-ఎర్త్-ఆర్బిట్ శాటిలైట్ టెక్నాలజీతో కలపడం ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ సర్వీసులు అందించవచ్చని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. స్టార్‌లింక్ పరికరాల ఇన్స్టలేషన్, యాక్టివేషన్ కోసం ప్రత్యేకమైన కస్టమర్ సర్వీస్ మెకానిజంను ఏర్పాటు చేయడం, వినియోగదారులకు అంతరాయం లేని సర్వీసులు అందించడం ఈ సహకారంలో భాగం. ఇది అందుబాటులోకి వస్తే స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు జియో ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్‌లైన జియో ఫైబర్, జియోఎయిర్ ఫైబర్లకు అనుబంధంగా ఉంటాయో లేదో తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: అవి ‘అల్లం’.. ఇవి ‘బెల్లం’!జియో ప్రస్తుత చర్యలు దేశంలో డిజిటల్ అంతరాన్ని పూడ్చడానికి ఎంతో తోడ్పడుతాయని కంపెనీ నమ్ముతుంది. స్టార్‌లింక్ అధునాతన ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా రిమోట్ ఏరియాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం, ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 2025 నాటికి రిలయన్స్ జియో 48.8 కోట్లకు పైగా చందాదారులను కలిగి ఉంది. ఇందులో 19.1 కోట్లు ట్రూ 5జీ వినియోగదారులు ఉన్నారు.
ఫ్యామిలీ

స్టెగానోగ్రఫీ.. అలా చేస్తే లక్షలు మాయం అవుతాయి!
రవికి ఒకరోజు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ తరువాత ఎస్.ఎం.ఎస్. వచ్చింది. ‘ఫలానా వ్యక్తి మీకు తెలుసా?’ అని. మొదట్లో రవి పట్టించుకోలేదు. పదేపదే ఫోన్ కాల్స్ రావడంతో ‘ఎవరీ వ్యక్తి?’ అని తెలుసుకోవడానికి ఆ ఫోటోను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ ఒక్క క్లిక్‌తో హ్యాకర్లు అతడి ఫోన్లోకి చొరబడగలిగారు. నిమిషాల వ్యవధిలోనే రవి బ్యాంకు ఖాతా నుంచి రెండు లక్షలు మాయమయ్యాయి.ఈ స్మార్ట్ స్కామ్‌ను ‘స్టెగానోగ్రఫీ’ అంటారు,స్టెగానోగ్రఫీ (steganography) అనేది గ్రీకుపదం. దీని అర్థం ‘రహస్య రచన’ ‘దాచిన రచన’ హాని చేయని మీడియా ఫైళ్లలో మాల్వేర్ లేదా సీక్రెట్ ఇన్స్ట్రక్షన్ పొందుపరచడమే ‘స్టెగానోగ్రఫీ’ టెక్నిక్. ఈ హిడెన్ ప్లేలోడ్లు ట్రెడిషనల్ డిటెక్షన్ సిస్టమ్ కంటపడకుండా తప్పించుకుంటాయి. ‘ఇది కొత్త కాన్సెప్ట్ కాదు. 2017లో హ్యాకర్లు వాట్సాప్‌లో షేర్ చేసిన జిఫ్ ఫైల్స్‌లో హానికరమైన కోడ్స్ పొందుపరిచారు. డౌన్లోడ్ చేసినప్పుడు హిడెన్ కోడ్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంది. సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను దాటవేసి, యూజర్ డేటాను యాక్సెస్ చేస్తుంది. ఇది జరగకుండా చర్యలు తీసుకున్నప్పటికీ సరికొత్త మార్పులతో 2019లో స్టెగానోగ్రఫీ తిరిగి వచ్చింది’ అంటున్నాడు సైబర్ ఎక్స్పర్ట్ తుషార్శర్మ. సంప్రదాయ మాల్వేర్ అటెంప్ట్స్‌కు ‘స్టెగానోగ్రఫీ’ ఏ రకంగా భిన్నమైనది? ఎంతమాత్రం అనుమానానికి తావు ఇవ్వని రీతిలో ఇన్నోసెంట్ ఫైల్స్‌లో కోడ్‌ను దాచిపెడతారు, ‘ఈ ఇమేజ్‌లు, ఆడియో ఫైల్స్ ప్రమాదకరమేమీ కాదు అనిపిస్తాయి. అందుకే అవి తరచు యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను దాటవేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) ఆధారిత ఇమేజ్ రికగ్నిషన్ వంటి ఆధునాతన సాధనాలను కూడా స్టెగానోగ్రఫీ మోసం చేయగలదు’ అంటున్నారు నిపుణులుమరి దీనికి పరిష్కారం లేదా?‘స్టెగానోగ్రఫీని గుర్తించడానికి ఫోరెన్సిక్ సాధనాలు, స్టెగానాలిసిస్ ప్లాట్‌ఫామ్‌ల అవసరం ఉంది’ అంటున్నారు సైబర్ నిపుణులు.కొన్ని జాగ్రత్తలు→ అపరిచిత నంబర్స్ నుంచి వచ్చిన ఫైల్స్‌ను ఓపెన్, డౌన్లోడ్ చేయవద్దు → ఫోన్‌ను అప్డేట్ చేస్తూ ఉండాలి → ఆటో డౌన్‌లోడ్‌ను డిజేబుల్ చేయండి. వాట్సాప్ సెట్టింగ్‌ను మార్చడం ద్వారా అన్నోన్ మీడియా ఆటోమేటిక్‌గా సేవ్ కాకుండా నిరోధించవచ్చు. → ఓటీపీలను ఎప్పుడూ షేర్ చేయవద్దు → ‘మై కాంటాక్ట్స్’ గ్రూప్ పర్మిషన్ సెట్ చేయండి. అనుమానాస్పద గ్రూప్‌లను దూరం పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది → వాట్సాప్‌లో ‘సైలెన్స్’ అన్నోన్ కాలర్స్’ ఫీచర్‌ను యాక్టివేట్ చేయండి .

ఖాకీ రీల్స్
దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళా పోలీసులు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకొంటున్నారు. ‘ఖాకీ రీల్స్’ కొత్త ట్రెండ్‌గా మారింది. ఉత్తేజపరిచే వ్యక్తిత్వ వికాస ప్రసంగాల నుంచి వర్కవుట్ల వరకు ఆకట్టుకునే ‘రీల్స్’ చేస్తున్నారు....ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పోలీస్ ఆఫీసర్ కాంచన్ పాండేకు ఇన్‌స్టాగ్రామ్‌లో 99,900 మంది ఫాలోవర్లు ఉన్నారు. డ్యాన్స్ చేయడం, పోలీస్ యూనిఫామ్‌లో స్టైల్‌గా నడవడం, జుట్టును చలాకీగా తిప్పడంలాంటి ‘రీల్స్’ చేస్తుంటుంది. ‘హిందీ సినిమా తారలకు ఏమాత్రం తీసిపోదు’ అంటూ పాండే అందాన్ని ΄÷గుడుతుంటారు అభిమానులు. ‘ప్రతి రోజూ పరుగెత్తండి. కానీ ప్రతిరోజూ ఒక రౌండ్ పెంచండి’లాంటి సలహాలు ఆమె నోటి నుంచి వినిపిస్తాయి.మధ్యప్రదేశ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ సిమ్రాన్ రఘువంశీ ఒకప్పుడు మోడల్ కావాలని కలలు కన్నది. కాని ఆమె కుటుంబం ఒప్పుకోలేదు. దీంతో ‘మోడల్’ కలకు తెర వేసి పోలీస్ డిపార్ట్మెంట్లో చేరింది. ఆ తరువాత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్గా మారింది. ‘ఖాళీ సమయాల్లో రీల్స్ చేస్తుంటాను’ అంటున్న సిమ్రాన్‌ను–‘పోలీస్ యూనిఫామ్‌లో రీల్స్ చేయవద్దని సీనియర్ అధికారులు చెప్పారా?’ అని అడిగితే...‘యూనిఫాంలో అభ్యంతరకరమైన రీల్స్ చేసినప్పుడు, అసభ్యకరమైన పాటకు యూనిఫామ్‌తో డ్యాన్స్ చేయడంలాంటివి చేసినప్పుడే సమస్య. అలా చేయనంత కాలం ఎలాంటి సమస్య ఉండదు’ అంటుంది సిమ్రాన్.సిక్కింకు చెందిన ఆలివా సవాడెన్ ‘లేడీబైకర్కాప్’ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా రాష్ట్రంలోని పచ్చని చెట్ల పక్క నుంచి, పరిశుభ్రమైన రోడ్ల వెంట రైడింగ్ చేస్తున్న వీడియోలను షేర్ చేస్తుంటుంది. పోలీస్ యూనిఫామ్, సివిడ్ డ్రెస్‌లలో ఆమె పోస్ట్‌లు కనిపిస్తుంటాయి.‘ఫిట్ సురేఖ’ అనే హ్యాండిల్ ద్వారా పోలీసు అధికారి సురేఖ పవర్ లిఫ్టింగ్ నుంచి రన్నింగ్ వరకు రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. ‘మీరు గెలవాలంటే మొండిగా ఉండాలి. ఓడిపోవడానికి భయం చాలు’ అని తన పోస్ట్‌లో రాసింది.అస్సాంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున జిమ్మీ రోంగ్మేయ్ ఎంటీవీ రియాలిటీ షోలో పాల్గొంది, వర్కవుట్ వీడియోలు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.దిల్లీలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అన్షు ఇన్స్టాగ్రామ్ వీడియోలతో పేరు తెచ్చుకుంది. ఆమె పోస్ట్ చేసే వీడియోలలో ఆకట్టుకునే డైలాగులు ఎన్నో ఉన్నాయి.తన సన్ గ్లాసెస్‌పై ‘ఐ డోండ్ కేర్’ అని రాసి ఉంటుంది.మధ్యప్రదేశ్‌కు చెందిన పోలీస్ ఆఫీసర్ సారిక రావత్....‘అమ్మాయిలు ఏ గులాబీపై ఆధారపడరు. వారే ఈ విశ్వపు తోటలు’ అంటుంది. సబ్–ఇన్స్పెక్టర్ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం గైడెన్స్ వీడియో ను రూపొందించమని ఫాలోవవర్స్ నుంచి వచ్చిన విన్నపాన్ని ఆమె అంగీకరించింది.

కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి, కోటి ఆశలతో అత్తింటికి చేరే కోడళ్లను కన్న కూతురిలా చూసుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ కొడుకు మరణం తరువాత కోడల్ని అక్కున చేర్చుకుని ఆదరించడమే కాకుండా, ఆమెకు మరో జీవితాన్ని ప్రసాదించిన కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి ఒక హృద్యమైన కథనం నెట్టింట వైరల్‌గా మారింది. అనేక ప్రశంసలు దక్కించుకుంది. గుజరాత్‌లోని అంబాజీ నివాసి ప్రవీణ్ సింగ్ రాణా. ముదిమి వయసులో ఆదు కుంటాడనుకున్న పెద్ద కుమారుడు సిద్ధరాజ్ సింగ్ అర్థాంతరంగా కన్నుమూశాడు. దీంతో తనతో పాటు కోడలు, నెలల వయస్సున్న చిన్న బిడ్డ అనాథలైపోయారు. కానీ ఇక్కడే ప్రవీణ్ సింగ్ తన పెద్దరికాన్ని చాటుకున్నాడు. కోడలికి తండ్రి స్థానంలో నిలబడ్డాడు. చక్కగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపాడు. కోడలి, మనవరాల్ని కన్నీటితో సాగనంపడం విశేషంగా నిలిచింది.చదవండి: Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది! కొడుకు మరణం2024లో దీపావళి పండుగ సందర్భంగా ఆకస్మిక గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. ఈ సంఘటనతో సిద్ధరాజ్ భార్య కృష్ణ, చిన్నారి దీక్షితతో సహా కుటుంబం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. ఇక జీవితాంతం భర్తలేకుండా గడపాల్సి ఉంటుందని, తండ్రి లేకుండా తన కుమార్తెను ఎలా పెంచాలంటూ కృష్ణ అంతులేని శోకంలో మునిగిపోయింది. చుట్టుపక్కల సమాజం కూడా అలానే అనుకుంది.కానీ ప్రవీణ్ మనసు వేరేలా ఆలోచించింది. తన కుమార్తెలా చూసుకున్నాడు. సమాజం అభిప్రాయాలను, భయాలను పట్టించుకోకుండా, తన కొడుకు ప్రాణ స్నేహితుడు సంజయ్‌తో తన కోడలి కృష్ణకు వైభవంగా పెళ్లి జరిపించాడు. కోడలితో పాటు, మనవరాలు దీక్షిత తరలి పోతోంటే, తన తల్లితో వెళ్లిపోయినప్పుడు తాత భావోద్వేగంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో నెటిజన్లు ప్రవీణ్,కుటుంబంపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ప్రేమ, ఆప్యాయతలు కదా నేటి సమాజానికి కావాల్సింది అంటూ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్.. ఎవరీ నటుడు?కృష్ణను రెండో పెళ్లి చేసుకున్న సంజయ్ ప్రవీణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సిద్ధరాజ్ తన చిన్ననాటి స్నేహితుడనీ, కృష్ణను కొంతకాలంగా తనకు తెలుసునని చెప్పారు. కృష్ణ, దీక్షితను కంటికి రెప్పలా చూసుకుంటానని సిద్ధరాజ్ కుటుంబానికి సంజయ్ హామీ ఇచ్చాడు. తన స్నేహితుడి కుమార్తె , కోడలికి కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను. దీని గురించి ప్రవీణ్ సింగ్‌తో మాట్లాడాను. ఆయన మా పెళ్లికి అంగీకరించారు అని చెప్పుకొచ్చాడు. అటు కృష్ణ కూడా అత్త మామలకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది.

Summer Tips 46-48 డిగ్రీలకు ఎండలు : జాగ్రత్తలు తీసుకోకపోతే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు గత కొన్ని రోజులుగా ఆందోళనకర స్థాయిలో పెరిగాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40–42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. మే నాటికి 46–48 డిగ్రీల వరకు చేరుకోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా సింగరేణి కాలరీస్‌తోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వేసవికి అనుగుణంగా నడుచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి తీవ్రత.. తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనుల సమీపంలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరుకుంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల వడగాడ్పులు తీవ్రతరం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సింగరేణి కారి్మకులతోపాటు రోజువారీ కూలీలు, రైతులు, చిరువ్యాపారులు, నిర్మాణరంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరగడం వల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువ ఉందని వైద్యులు చెబుతున్నారు. అప్రమత్తత అవసరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరైతే గొడుగు, టోపీ, సన్‌్రస్కీన్ లేదా తడి గుడ్డ ఉపయోగించడం ద్వారా ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందాలని చెబుతున్నారు. టూవీలర్లపై వెళ్లే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వదులైన, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలంటున్నారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ... వేసవిలో తాగిన నీరు తాగినట్టే చెమట రూపంలో వెళ్లిçపోతుంది. రోజుకు 3–4 లీటర్ల నీరు తాగడం శ్రేయస్కరం. దాహం లేకపోయినా గంటకోసారి నీటిని తాగుతూ ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చెమట ఎక్కువగా పట్టినప్పుడు ఓఆర్ఎస్, ఉప్పు–చక్కెర కలిపిన నీరు తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. కూల్‌డ్రింక్స్, బీర్లు, చికెన్, మాంసం తినడం వేసవిలో వేడిని ఇంకా పెంచుతాయి. రోజుకు 2–3 సార్లు కొబ్బరినీరు తాగితే శరీరంలో ఎలక్రొ్టలైట్స్ సమతౌల్యంగా ఉంటాయి. కాఫీ, టీ, ఆల్కహాల్ శరీరంలో నీటిని తగ్గిస్తాయి కాబట్టి వాటి బదులు హెర్బల్ టీ, తాజా పండ్ల రసాలు తాగడం మేలు. ఆహారం ముఖ్యం తేలికైన, నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పుచ్చకాయ, దోసకాయ, ఆరెంజ్, కీర దోస వంటివి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అధిక ఉప్పు, కారం, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. బదులుగా ఉడకబెట్టిన ఆహారం, సూప్‌లు, సలాడ్లు తీసుకోవాలి. గుండె జబ్బులు, మధుమేహం ఉన్న వాళ్లు నీటిని అధికంగా సేవిస్తూ ఎండల్లో తిరగడం తగ్గించాల్సి ఉంటుంది. జాగ్రత్తలతోనే వేసవి నుంచి రక్షణ వేసవిలో శరీరంలో నీటి శాతం, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. శరీర ఉష్ణోగ్రత 40.5 డిగ్రీలు దాటినప్పుడు మెదడు వ్యాధులు, అవయవ వైఫల్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను శరీరం బ్యాలెన్స్ చేసుకొనేలా వ్యవహరించాలి. ఆహార నియమాలు పాటించాలి. అధిక ఎక్సర్సైజ్లు తగ్గించాలి. – డాక్టర్ కిరణ్ మాదాల, ప్రొఫెసర్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్, ఉస్మానియా కళాశాల
ఫొటోలు


పట్టు చీరలో పుత్తడిబొమ్మలా మెరిసిపోతున్న అనసూయ (ఫొటోలు)


కన్నీటి సుడుల నడమ.. బాధాతృప్త హృదయాలతో వీడుతూ. సరిహద్దులో భావోద్వేగ దృశ్యాలు (చిత్రాలు)


సన్‌రైజర్స్ vs చెన్నై మ్యాచ్‌లో సందడి చేసిన హీరో అజిత్, శివ కార్తికేయన్ (ఫొటోలు)


హైదరాబాద్ : ‘భారత్ సమ్మిట్-2025.. విదేశీ ప్రతినిధులకు ఘనస్వాగతం (ఫొటోలు)


నిశ్చితార్థమై ఏడాది.. కాబోయే భర్తతో 'బిగ్ బాస్' శోభాశెట్టి (ఫొటోలు)


బాబోయ్.. సుర్రుమంటున్న ఎండలు.. జనం బెంబేలు (చిత్రాలు)


త్రిష తల్లిని చూశారా? ఈమె కంటే అందంగా ఉందిగా! (ఫొటోలు)


అందంగా ఆషికా.. అద్దం ముందు నుంచి కదలట్లేదుగా! (ఫోటోలు)


సూర్య ‘రెట్రో’ మూవీ ఆడియో లాంచ్ (ఫొటోలు)


నేచురల్ స్టార్ నాని 'హిట్ 3' మూవీ స్టిల్స్
అంతర్జాతీయం

జలదిగ్బంధం!
దశాబ్దాల నాటి సింధూ నదీజల ఒప్పందాన్ని పక్కన పెడుతూ భారత్ కొట్టిన దెబ్బతో ఆర్థికంగా పాకిస్తాన్ నడ్డి విరిగినట్టేనని చెబుతున్నారు. కొందరు చెబుతున్నట్టుగా దీని ప్రభావం పూర్తిస్థాయిలో కనిపించేందుకు దశాబ్దాలేమీ పట్టదని జల వనరుల నిపుణులు అంటున్నారు. పాక్‌పై తక్షణ ప్రభావం చూపేందుకు పలు మార్గాలున్నాయని వారు చెబుతున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. సింధూ నదిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచనున్నట్టు వెల్లడించాయి. అందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నాయి. జీలం తదితర సింధూ ఉపనదుల విషయంలో కూడా ఇదే వ్యూహం అమలవుతుందని తెలిపాయి. వీటితో పాటు కొత్తగా డ్యాములు తదితరాల నిర్మాణం వంటివి కూడా శరవేగంగా జరిపే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చినాబ్ బేసిన్లో పలు డ్యాములు, ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తయ్యేందుకు ఐదేళ్ల దాకా పట్టవచ్చని అంచనా. తాజా పరిణామాల నేపథ్యంలో వాటన్నింటినీ శరవేగంగా పూర్తి చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాక్‌కు సమాచారం తొమ్మిదేళ్ల సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం భారత్, పాక్ నడుమ 1960లో సింధూ జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పుకు పారే సట్లెజ్, బియాస్, రావి నదీ జలాలు భారత్‌కు; పశ్చిమానికి ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలు పాక్‌కు చెందాయి. సింధూ జలాల్లో 20 శాతం భారత్‌కు, 80 శాతం పాక్‌కు దక్కేలా అంగీకారం కుదిరింది. ఆ ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్టు పాక్‌కు కేంద్రం లాంఛనంగా వర్తమానమిచ్చింది. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈ మేరకు పాక్ జల వనరుల శాఖ కార్యదర్శికి ఇప్పటికే లేఖ రాశారు. జమ్మూ కశ్మీర్‌ను లక్ష్యం చేసుకుని పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతోందని అందులో ఘాటుగా దుయ్యబట్టారు. ‘‘ఏ ఒప్పందానికైనా పరస్పర విశ్వాసమే పునాది. దానికే మీరు తూట్లు పొడుస్తున్నారు. మీ దుశ్చర్యలు సింధూ ఒప్పందం కింద భారత్‌కు దఖలుపడ్డ హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. కనుక సింధూ ఒప్పందాన్ని గౌరవించాల్సిన అవసరం భారత్‌కు ఎంతమాత్రమూ లేదు’’ అని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో పాక్ అంగీకారంతో నిమిత్తం లేకుండా సింధూ, దాని ఉపనదులపై ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు వాటి జలాలను భారత్ తోచిన రీతిలో వాడుకునే వీలుంది. వాటికి సంబంధించి దాయాదికి ఎలాంటి ముందస్తు సమాచారమూ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. దీనిపై పాక్ తీవ్రంగా ఆక్రోశించడం, నీటిని ఆపే చర్యలను తమపై యుద్ధ ప్రకటనగా భావిస్తామంటూ బీరాలు పలకడం తెలిసిందే. చుక్క కూడా వదిలేది లేదు కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ అతి త్వరలో సమగ్ర వ్యూహం ప్రధాని ఆదేశాలిచ్చినట్టు వెల్లడి సింధూ ఒప్పందంపై సమీక్ష అమిత్ షా తదితరుల హాజరు న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చుక్క నీటిని కూడా వదలబోమని కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ స్పష్టం చేశారు. ‘‘ఆ దిశగా సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నాం. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పలు సూచనలు చేశారు. స్పష్టమైన ఆదేశాలిచ్చారు’’ అని వెల్లడించారు. సింధూ జలాల ఒప్పందం సస్పెన్షన్ నేపథ్యంలో ఈ విషయమై చేపట్టాల్సిన తదుపరి చర్యల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. పాటిల్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు అందులో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఆదేశాల అమలుకు చేపట్టాల్సిన చర్యలపైనే భేటీలో ప్రధానంగా చర్చించినట్టు వివరించారు. అమిత్ షా కూడా పలు సూచనలు చేసినట్టు తెలిపారు. ఈ దిశగా స్వల్ప, దీర్ఘకాలిక చర్యలు చేపడుతూ మూడంచెల వ్యూహంతో కేంద్రం ముందుకు సాగనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్

అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం దాయాదీ దేశం పాకిస్తాన్‌పై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ సైతం అదే రీతిలో స్పందిస్తూ తమ గగనతలాన్ని భారతదేశ విమానాలు ఉపయోగించుకోకుండా నిషేధించింది. ఇండియా విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలపై అదనంగా ఆర్థిక భారం పడుతోందని, అతిమంగా ప్రయాణికులే భరించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఉత్తర భారతదేశం నుంచి పాక్ గగనతలం గుండా ప శ్చిమ దేశాలకు ప్రయాణించాల్సిన విమానాలు ఇక చుట్టూ తిరిగి వెళ్లక తప్పదు. దీనివల్ల విమాన చార్జీలు 8 నుంచి 12 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరప్, ఉత్తర అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లేవారు అదనపు భారం భరించాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ రూట్లలో విమాన ప్రయాణాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఇండియాలో రిజిస్టర్ అయిన అన్ని విమానాలతోపాటు భారతీయుల యాజమాన్యంలో ఉన్న విమానాలు పాక్ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదు. ఇక సుదూర ప్రయాణాలే పాక్ ఆంక్షల ప్రభావం ఇప్పటికే మొదలైందని ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు నిర్ధారించాయి. తమ అంతర్జాతీయ విమానాలను మరో మార్గం గుండా మళ్లించామని తెలిపాయి. తమ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాక్ ఆంక్షల విషయంలో తాము చేయగలిగేది ఏమీ లేదని నిస్సహాయత వ్యక్తంచేశాయి. ఇండియా నుంచి యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల రెండు నుంచి రెండున్నర గంటల అదనపు సమయం పడుతోందని ఓ పైలట్ చెప్పారు. ఢిల్లీ, అమృత్సర్, జైపూర్, లక్నో, వారణాసి తదితర నగరాల నుంచి ప్రయాణించేవారు అదనపు సమయం వెచి్చంచడంతోపాటు అదనపు వ్యయం భరించాల్సి వస్తోంది. ఇండియా విమానాలకు పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ అత్యంత కీలకం. చాలావరకు విమానాలు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. ఇన్నాళ్లూ ఎటువంటి ఇబ్బందుల లేకుండా ప్రయాణాలు సాగిపోయాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏ విమానానికి ఎంత సమయం అదనంగా అవసరమన్న దానిపై త్వరలో పూర్తి స్పష్టత వస్తుందని సీనియర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఒకరు తెలిపారు. కనెక్టింగ్ విమానాలు అందుకోవడం కష్టం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత ఖరీదు కాబోతున్నాయి. విమానాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఇంధనంతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయి. అదే స్థాయిలో టికెట్ చార్జీలు పెరగడం తథ్యం. విమానయాన సంస్థలు తమపై పడే అదనపు వ్యయాన్ని ప్రయాణికులకే బదిలీ చేస్తాయి. మరో ఇబ్బంది ఏమిటంటే.. ప్రయాణానికి అదనపు సమయం పట్టడం వల్ల ఇతర దేశాల్లో కనెక్టింగ్ విమానాలు అందుకోవడం కష్టం కావొచ్చు. అందుకే ప్రయాణ ప్రణాళికను రీషెడ్యూల్ చేసుకోవాలి. విదేశాల నుంచి వచ్చేవారు కూడా ఆలస్యంగా స్వదేశానికి చేరుకుంటారు. లాంగ్ జర్నీ వల్ల విమానాల్లో ఇంధనం లోడ్ పెరుగుతుంది. ఎక్కువ ఇంధనాన్ని నింపుకోవాలి. ప్రయాణ సమయానికి అనుగుణంగా భద్రతాపరమైన ప్రమాణాలు కూడా పాటించాలి. పేలోడ్‌ను తగ్గించుకోవాలి. అంటే తక్కువ మంది ప్రయాణికులు, తక్కువ లగేజీతో ప్రయాణించాలి. దీనివల్ల విమానాల్లో సీట్లు లభించడం కష్టమవుతుంది. ఓవర్‌బుకింగ్ వంటి పరిణామాలు ఎదురవుతాయి. ముందస్తు ప్రణాళిక ఉంటే తప్ప అంతర్జాతీయ విమానాల్లో అప్పటికప్పుడు సీట్లు దొరకవు. భారత విమానాలకు తమ గగనతలాన్ని పాక్ మూసివేయడం ఇదే మొదటిసారి కాదు. 2019 ఫిబ్రవరిలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. భారత సైన్యం చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడుల నేపథ్యంలో తమ గగనతలం గుండా భారత విమానాలు ప్రయాణించకుండా నిషేధించింది. ఈ నిషేధం కొన్ని నెలలపాటు కొనసాగింది. ఇప్పట్లో భారత ప్రయాణికులకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు చేయాల్సిందేమిటి? → పాక్ ఆంక్షల కారణంగా విమానయాన చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలి. → విమానాల విషయంలో అప్డేట్స్ కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్ వెబ్సైట్ లేదా యాప్‌ను తరచూ చెక్ చేసుకోవాలి. → అంతర్జాతీయ ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించేందుకు సిద్ధపడాలి. తదనుగుణంగా పక్కా ప్లానింగ్ ఉండాలి. → ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయాణికుల లగేజీపై పరిమితి విధించే అవకాశం కనిపిస్తోంది. కనుక తక్కువ లగేజీతోనే ప్రయాణించాలి. – సాక్షి, నేషనల్ డెస్క్

ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్
అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పహల్గాం దాడి అనంతరం భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ‘స్కై న్యూస్’ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు ఇవ్వడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని.. దీని మీరు అంగీకరిస్తారా? అంటూ జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘‘అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు తాము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామంటూ ఖవాజా బదులిచ్చారు.సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే.. పాక్‌కు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉండేదన్నారు. లష్కరే తోయిబాకు గతంలో పాకిస్థాన్‌తో కొన్ని సంబంధాలు ఉన్నాయని కూడా ఖవాజా ఆసిఫ్ అంగీకరించారు. అయితే, ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ అంతమైందన్నారు.

పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు నరమేధం జరిపి 26 మందిని పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. కశ్మీర్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే కావడం గమనార్హం. అయితే లష్కర్-ఇ-తోయిబా(LeT) తరఫున కరడుగట్టిన టీఆర్ఎఫ్ గ్రూప్ ఈ ఘాతుకానికి పాల్పడగా.. ఆ సంస్థ కదలికలపై భద్రతా ఏజెన్సీలు ఓ అంచనాకి వచ్చాయి.లష్కరే తోయిబా విష సర్పానికి పుట్టిన పిల్ల పామే.. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్). 2019లోనే ఇది పుట్టింది. ఈ విభాగానికి తొలినాళ్లలో షేక్ సాజిద్ గుల్ సుప్రీం కమాండర్‌గా, చీఫ్ ఆపరేషనల్ కమాండర్‌గా బాసిత్ అహ్మద్ దార్ వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి లష్కరే చీఫ్ హఫీజ్ సయ్యద్(hafiz saeed) కనుసన్నల్లోనే నడుస్తోంది. డిప్యూటీ హెడ్‌గా సైఫుల్లా(హిజ్బుల్ ముహజిదిన్) వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరూ పాక్ నుంచే ఎల్ఈటీ కార్యకలాపాలను నడిపిస్తున్నారనే అభియోగాలు ఉండనే ఉన్నాయి. పాక్ సైన్యం, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ISI) టీఆర్ఎఫ్ గ్రూపులకు సైద్ధాంతికపరమైన మద్దతు మాత్రమే కాదు.. అన్నిరకాలుగా మద్దతు ఇస్తున్నాయని భారత గూఢచార సంస్థలు భావిస్తున్నాయి.తొలినాళ్లలో జిహాదీ పేరిట ఆన్లైన్లో The Resistance Front సంస్థ పోస్టులు చేసేది. కశ్మీరీలు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా గప్‌చుప్ ప్రచారాలు చేసేది. ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్లైన్ ద్వారా యువతను నియమించుకునేది. ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడింది. ఆ సమయంలో ఈ గ్రూప్ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు జమ్ము పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించలేదు. ఆ తర్వాత హిజ్బుల్ ముహజిదిన్, లష్కరే తొయిబా సభ్యులతోనే చాన్నాళ్లు నడిచింది. కానీ, ఆ తర్వాతే ఈ గ్రూపులో విదేశీ ఉగ్రవాదుల చేరిక క్రమంగా పెరుగుతూ వచ్చింది. వీళ్లకు కశ్మీర్ నుంచి స్థానిక ఉగ్రవాదుల మద్దతు లభిస్తూ వస్తోంది. అలా.. ఈ సంస్థ కశ్మీర్ లోయలో చాలా కాలంగా యాక్టివ్‌గా ఉంది. 2023లో కేంద్రం హోం శాఖ ఈ గ్రూప్‌పై విషేధం విధించింది.ఇంతకుముందు.. సోనామార్గ్, బూటా పాత్రి, గందర్బల్ దాడులకు ఈ సంస్థే కారణమని భద్రతా సంస్థలు బలంగా నమ్ముతున్నాయి. కిందటి ఏడాది అక్టోబర్‌లో బూటా పాత్రి ఇద్దరు సైనికులు సహా నలుగురిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. అదే నెలలో సోనామార్గ్ టన్నెల్ పనులు జరుగుతున్న ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు కార్మికులు, ఓ డాక్టర్ చనిపోయారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది హషీమ్ మూసా.. సోనామార్గ్ దాడిలోనూ పాల్గొన్నట్లు స్పష్టంగా తేలింది. అయితే సోనామార్గ్ ఘటన తర్వాత.. ఎల్ఈటీ ఏఫ్లస్ కేటగిరీ ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్‌ను డిసెంబర్లో దాచిగామ్ వద్ద భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఇదే ఎన్కౌంటర్లో గ్రూప్ సభ్యులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు.సాధారణంగా దాడులకు పాల్పడ్డాక టీఆర్ఎఫ్ గ్రూప్ సభ్యులు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోతారు. దట్టమైన అడవుల్లో తలదాచుకుంటూ.. పాక్ నుంచి గ్రూప్ నేతలు ఆదేశాలు కోసం ఎదురు చూస్తుంటారు. టీఆర్ఎఫ్ను తన కనుసన్నల్లోనే నడిపిస్తున్న హఫీజ్ సయ్యదే.. పహల్గాం దాడికి మాస్టర్ మైండ్ హఫీజ్ సయ్యదే అయి ఉండొచ్చని నిఘా సంస్థలు భావిస్తున్నారు. ఏప్రిల్ 24వ తేదీన.. గురువారం జమ్ము కశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులకు సంబంధించిన స్కెచ్‌లు రిలీజ్ చేశారు. అందులో హషిమ్ మూసా అలియాస్ సులేమాన్, అలీ బాయి అలియస్ తల్హా పాకిస్థానీలుగా జమ్ము పోలీసులు ప్రకటించారు. మిగతా ఇద్దరు అబ్దుల్ హుస్సేన్ తోకర్, అసిఫ్‌లు స్థానికులేనని ప్రకటిచారు. ఈ ఇద్దరూ 2018లో కశ్మీర్‌కు వెళ్లి.. ఎల్ఈటీలో శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎఫ్లో సహాయకులుగా చేరి.. పహల్గాం మారణ హోమంలో భాగం అయ్యారు.ప్లాన్ ప్రకారమే..సైనికుల దుస్తుల్లో వచ్చిన టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు.. బైసరన్ లోయలోని పిక్నిక్ స్పాట్లో మూడు వేర్వేరు ప్రాంతాలను ఎంచుకుని దాడికి పాల్పడ్డారు. తొలుత పర్యాటకులతో చాలాసేపు వాళ్లు మాట్లాడారు. ఆ తర్వాత పర్యాటకుల్లో ఐదుగురిని ఒక చోట చేర్చి చంపారు. మైదానంలో మరో ఇద్దరిని కాల్చి చంపారు. పారిపోతున్న క్రమంలో.. ఫెన్సింగ్ వద్ద ఇంకొందరిని కాల్చి చంపారు. ఫెన్సింగ్ దూకిన వాళ్లు ప్రాణాలతో బయటపడగలిగారు.
జాతీయం

ఐక్యంగా ఎదుర్కొందాం
శ్రీనగర్: దేశ ప్రజలంతా కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. మనమంతా ఐక్యంగా ఉంటే ఉగ్రవాదం అంతం కావడం ఖాయమని చెప్పారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి, విభజన తీసుకురావాలన్న లక్ష్యంతోనే పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిందని అన్నారు. కలిసి ఉంటున్న సోదరుల మధ్య గొడవలు పెట్టాలన్నదే ముష్కరుల ఉద్దేశమని ఆరోపించారు. ముష్కర మూకల కుట్రలను తిప్పికొట్టడానికి మనమంతా ఒక్కటై చేతులు కలపాలని సూచించారు. ఐక్యమత్యమే మన బలమని ఉద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని శాశ్వతంగా ఓడించడానికి యావత్ దేశం ఐక్యంగా ఉండాలని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ శుక్రవారం జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని సైనిక ఆసుపత్రిని సందర్శించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న పహల్గాం ఉగ్రవాద దాడి బాధితుడిని పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని బాధితుడికి భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చానని అన్నారు. పహల్గాం దాడి అత్యంత దారుణమని చెప్పారు. ఈ ఉగ్రదాడిని జమ్మూకశ్మీర్ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించారని తెలిపారు. ఈ దాడిలో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు తన సానుభూతి ఉంటుందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొనే చర్యలు పూర్తి మద్దతు ఇస్తున్నామని పునరుద్ఘాటించారు. ప్రతిపక్షం మొత్తం ప్రభుత్వానికి అండగా ఉంటుందన్నారు. దేశంలో ఇతర ప్రాంతాల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రజలపై దాడుల జరుగుతుండడం విచారకరమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మన సోదర సోదరీమణులను లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనమంతా ఒక్కటి కావాలని కోరారు. మరోవైపు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోపాటు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై చర్చించారు. అంతకుముందు జమ్మూకశ్మీర్ వ్యాపారులు, విద్యార్థి సంఘాల నాయకులు, పర్యాటక రంగ ప్రతినిధులతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

భూతల స్వర్గం మళ్ళీ వెలవెల!
భూతల స్వర్గంగా పేరుగాంచిన అందాల కశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న అక్కడి పర్యాటక రంగాన్ని మళ్లీ సంక్షోభంలోకి నెట్టేసింది. పహల్గాంలో ముష్కరులు 26 మంది టూరిస్టులను అత్యంత పాశవికంగా హతమార్చడం పర్యాటకుల విశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీయడమే కాకుండా దాదాపు 2.5 లక్షల మంది కశ్మీరీల జీవనోపాధి, కశ్మీర్ లోయ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రశ్నార్థకం చేసింది. మళ్లీ పర్యాటకుల్లో మునుపటి విశ్వాసం, ఉత్సాహం నెలకొనాలంటే ఎన్నేళ్లు పడుతుందోనని టూరిజం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. - సాక్షి, స్పెషల్ డెస్క్హోటళ్లన్నీ ఖాళీ..ఈ నెల 22న పహల్గాం సమీపంలో మినీ స్విట్జర్లాండ్‌గా పేరుగాంచిన బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాద దాడి ప్రభావంతో కశ్మీర్లో పర్యటించేందుకు సిద్ధమైన వేలాది మంది పర్యాటకుల్లో దాదాపు 90 శాతం మంది 24 గంటల వ్యవధిలోనే విమాన టికెట్లు రద్దు చేసుకున్నారు. మరోవైపు ఇప్పటికే కశ్మీర్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు రాత్రికి రాత్రే హోటళ్లు, క్యాబ్‌ల బుకింగ్‌లు కూడా పెద్ద ఎత్తున రద్దు కావడం మొదలయ్యాయి.ఇప్పట్లో పర్యాటక పరిశ్రమ కోలుకొనే అవకాశమే లేదని ఓ ట్రావెల్ ఏజెంట్ వ్యాఖ్యానించారు. ‘మొన్నటివరకు పర్యాటకులతో కళకళలాడిన మా హోటల్ ఇప్పుడు వెలవెలబోతోంది. అసలైతే గదులన్నీ వచ్చే నెలకు కూడా బుక్ అయ్యాయి. కానీ రాత్రికి రాత్రే పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. టూరిస్టులంతా భయంతో గదులు ఖాళీ చేసి వెళ్లిపోయారు’ అని ఓ హోటల్ యజమాని వాపోయారు.కేంద్రం చర్యలన్నీ బూడిదపాలు..కశ్మీరీలకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. జమ్మూకశ్మీర్ వార్షిక పర్యాటక పరిశ్రమ విలువ దాదాపు రూ. 12 వేల కోట్లు. దీని విలువ 2030 నాటికి రూ. 30 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా. జమ్మూకశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్ కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని కేంద్రం 2019లో రద్దు చేయడంతోపాటు రాష్ట్ర హోదా తొలగించి జమ్మూకశ్మీర్‌ను లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది. అలాగే ఏటా స్థానికంగా దాదాపు 50 వేల మందికి ఉపాధి కల్పించేలా, ఐదేళ్లలో రూ. 2 వేల కోట్ల వార్షిక పెట్టుబడులను ఆకర్షించేలా 2020లో ప్రత్యేక పర్యాటక పాలసీని తీసుకొచ్చింది. దీనికితోడు మౌలిక సదుపాయాల మెరుగుదల, విమాన కనెక్టివిటీ, విదేశీ పర్యాటకులకు ఆన్–అరైవల్ వీసా, 75 కొత్త పర్యాటక ప్రదేశాలు, 75 కొత్త వారసత్వ/సాంస్కృతిక ప్రదేశాలు, 75 కొత్త సూఫీ/మత ప్రదేశాల స్థాపన కోసం రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించింది. కశ్మీర్‌ను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో నేరుగా అనుసంధానించడానికి రైల్వే కూడా కసరత్తు ప్రారంభించింది.ప్రీమియం రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఇందులో ఉంది. కేంద్రం చర్యలతో 2020 నుంచి కశ్మీర్ లోయను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2024 నాటికి పర్యాటకుల సంఖ్య సుమారు 2.36 కోట్లకు చేరుకుంది. కానీ ఇప్పుడు ఉగ్రవాద దాడితో అక్కడి పర్యాటక రంగం చుట్టూ సంక్షోభం ముసురుకుంది.

ఢిల్లీ మేయర్‌గా బీజేపీ నేత రాజా ఇక్బాల్ సింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారం దాదాపు రెండేళ్ల తర్వాత బీజేపీకి దక్కింది. ఆ పార్టీకి చెందిన రాజా ఇక్బాల్ సింగ్ శుక్రవారం ఢిల్లీ నూతన మేయర్‌గా ఎన్నికయ్యారు. 142 ఓట్లకు గాను ఇక్బాల్‌కు 133 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌కు చెందిన మన్దీప్ సింగ్‌పై ఇక్బాల్ ఘన విజయం సాధించారు. ఒక ఓటును చెల్లనిదిగా అధికారులు ప్రకటించగా, బీజేపీకి చెందిన ఎంపీ మనోజ్ తివారీ గైర్హాజరయ్యారు. కాంగ్రెస్‌కు మొత్తం 8 ఓట్లు పడ్డాయి. కాగా, ఈ ఎన్నికను ఆప్ బహిష్కరించింది. నెల రోజుల్లో స్టాండింగ్ కమిటీ వేసి ఢిల్లీ ప్రభుత్వం సహకారంతో ప్రజలకు సమస్యలే లేకుండా చేస్తామని ఇక్బాల్ సింగ్ ఎన్నిక అనంతరం ప్రకటించారు. ఇక్బాల్ సింగ్ నార్త్ ఎంసీడీ మేయర్‌గా చేశారు. 2020 దాకా పార్టీ సివిల్ లైన్స్ జోన్ చీఫ్‌గా వ్యవహరించారు.

సమరయోధులపై అపహాస్యమా?
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించింది. వీర సావర్కర్‌ను మహారాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆరాధిస్తారని గుర్తు చేసింది. ‘‘మీ నానమ్మ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా సావర్కర్‌ను ప్రశంసిస్తూ లేఖ రాశారని మీకు తెలుసా? మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు తెచ్చిపెట్టిన వారిని ఇలా అవమానిస్తారా?’’ అంటూ ఆగ్రహం వెలిబు చ్చింది. ‘‘మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని సుమోటోగా తీసుకుంటాం’’ అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం శుక్రవారం హెచ్చరించింది. ‘‘ఇలాగే వదిలేస్తే మున్ముందు ‘గాంధీ బ్రిటిష్‌వారికి సేవకుడు’ అని కూడా చెబుతారు. ఎందుకంటే వైస్రాయ్ను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు గాంధీ ‘మీ నమ్మ కమైన సేవకుడు’ అంటూ మాట్లాడేవారు. స్వాతంత్య్ర యోధులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని అనుమతించబోం’’ అని స్పష్టం చేసింది. సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలను బాధ్యతారాహిత్యంగా అభివర్ణించింది. యూపీలో దాఖలైన కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై స్టే విధించింది.
ఎన్ఆర్ఐ

పిట్స్‌బర్గ్‌లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్‌కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్‌కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్‌లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్‌ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్‌లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)
క్రైమ్

తనకు తానే కాల్పులు జరుపుకున్న రిక్కీరై!
కర్ణాటక: పారిశ్రామికవేత్త రిక్కీరైపై జరిగిన కాల్పుల ఘటన మలుపు తిరిగింది. ఆయన తనంటత తానే కాల్పులు జరుపుకున్నారని కాల్పుల వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ గన్‌మెన్ మన్నప్ప విఠల్ వాంగ్మూలం ఇచ్చారు. కాల్పులకు పాల్పడ్డారనే అనుమానంతో మన్నప్పవిఠల్ను బిడది పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతన్ని రామనగర కోర్టులో హాజరుపరిచి 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు.తమదైనశైలిలో విచారణ చేపట్టగా రిక్కీరై తనంతటతానే కాల్పులు జరుపుకున్నట్లు మన్నప్ప విఠల్ వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో రిక్కీరై షూటౌట్ కాల్పుల ఘటనపై నాటకం ఆడినట్లు అనుమానం మరితం బలపడినట్లైంది. మాజీ డాన్ దివంగత ముత్తప్పరై చిన్నకుమారుడు పారిశ్రామికవేత్త రిక్కీ రైపై ఈనెల 18వ తేదీ రాత్రి 11.30 సమయంలో కారులో బెంగళూరుకు వెళ్తుండగా బిడది వద్ద ఆయనపై ఫైరింగ్ జరిగింది. రిక్కీరై ముక్కు, చేతులకు గాయాలయ్యాయి. అనంతరం అతడిని బెంగళూరు హెచ్ఏఎల్ రోడ్డులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులకు షూటౌట్ జరిగిన స్థలంలో లభించిన బుల్లెట్, విఠల్ వద్ద ఉన్న గన్లోనిదని తేలింది. పోలీసులు ఇతడి గన్ను స్వాదీనం చేసుకుని ఎప్ఎస్ఎల్ ల్యాబోరేటరీకి పంపించారు. ముత్తప్పరై వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న విఠల్.. రిక్కీ రై వద్దనే పనిచేసేవాడు. ఆరోగ్యం సరిగాలేనందున ఆ ఉద్యోగం వదిలిపెట్టి ఇంటివద్ద సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. ముత్తప్పరై చనిపోకముందు ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ రిక్కీ రై సైట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ కారణంతో మన్నప్పవిఠల్ కోపంతో ఉండవచ్చని అనుమానం వ్యక్తమైంది. రిక్కీరై గన్‌మెన్ ఇచ్చిన ఫిర్యాదులో ముగ్గురు పేర్లు ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసులో ఉన్న పాత్ర ధ్రువీకరించడానికి ఎలాంటి సాక్ష్యాలు కనబడకపోవడంతో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ముత్తప్పరై మాజీ సహచరుడు, మొదటి ఆరోపి రాకేశ్మల్లి, మూడో ఆరోపి నితీశ్శెట్టిని విచారణ చేపట్టి పోలీసులు వదిలిపెట్టారు. రెండో ఆరోపి ముత్తప్పరై రెండో భార్య అనురాధ విదేశాల్లో ఉన్నారు.

మళ్లీ పుట్టి... ఒక్కటవుతాం..!
నెల్లూరు (క్రైమ్): వారిద్దరూ ప్రేమించుకున్నారు. కారణాలు ఏవైనా వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. వారిని ఎదిరించి ఒక్కటయ్యే ధైర్యంలేక ఊరుకాని ఊరు వచ్చారు. లాడ్జిలో గదిని అద్దెకు తీసుకుని తల్లిదండ్రులకు సూసైడ్ లేఖ రాశారు. ‘‘అమ్మ, నాన్నలు క్షమించండి. మీరు మా ప్రేమను ఎలాగూ అంగీకరించడం లేదు. మళ్లీ పుట్టి అందరి అంగీకారంతో ఒక్కటవుతాం’’ అంటూ రాసి, పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. హృదయ విదారకమైన ఈ సంఘటన నెల్లూరులోని ఒక లాడ్జిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన బాచ్చు జోసఫ్ రత్నకుమార్ (23), కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఆటపాకకు చెందిన చిల్లుముంత శ్రావణి (21) మధ్య బీటెక్ చదివే సమయంలో చిగురించిన స్నేహం, అటుపై ప్రేమగా మారింది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21వ తేదీన నెల్లూరు వచ్చారు. కళాశాలలో కౌన్సెలింగ్ ఉందని చెప్పి ఒక లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. కౌన్సెలింగ్ పూర్తికాలేదని మరో రోజు గదికి నగదు చెల్లించారు. 23వ తేదీన గదిని శుభ్రం చేసేందుకు లాడ్జి స్వీపర్ వెళ్లి తలుపుకొట్టగా లోపల నుంచి ఎలాంటి అలికిడి లేదు. బయటకు వెళ్లి ఉంటారని భావించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు అలానే జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం వారు అద్దెకు తీసుకున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో లాడ్జి సిబ్బంది సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ జి.దశరథరామయ్య, ఎస్ఐ బాలకృష్ణ తలుపులు పగులగొట్టి చూడగా, బెడ్‌పై జోసఫ్ రత్నకుమార్, నేలపై శ్రావణి మృతదేహాలు కుళ్లిపోతున్న స్థితిలో పడి ఉన్నాయి. సమీపంలో గడ్డిమందు సీసా పడి ఉంది.దీంతో వారు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వారి బ్యాగ్‌లను పరిశీలించగా అందులో మృతుల ఆధార్ కార్డులు, కళాశాలలకు సంబంధించిన సరి్టఫికెట్లు ఉన్నాయి. ఇరువురు తమ తల్లిదండ్రులకు రాసిన సూసైడ్ లేఖలను పోలీసులు గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి సంతపేట ఇన్స్పెక్టర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖలో దంపతుల దారుణహత్య
విశాఖపట్నం: విశాఖ నగరం గాజువాక సమీపంలోని రాజీవ్‌నగర్‌లో భార్యాభర్తలు దారుణహత్యకు గురయ్యారు. డాక్‌యార్డులో పనిచేసి రిటైరైన గంపాల యోగేంద్రబాబు (66), లక్ష్మి (58) దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వారు 35 ఏళ్లుగా రాజీవ్‌నగర్‌లో ఉంటున్నారు. రెండు రోజుల కిందట హైదరాబాద్ వెళ్లిన వారు గురువారం ఉదయం ఇంటికి చేరుకున్నారు.శుక్రవారం రాత్రి వరకు వారి ఇంటి తలుపులు తెరవకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానికంగా ఉన్న బంధువుల అమ్మాయి ఇంటికి వచ్చి చూసింది. ఇంటికి రెండువైపులా తాళం వేసి ఉండటాన్ని గమనించింది. అనుమానం వచ్చిన.. స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించింది. సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు అక్కడికి చేరుకుని తాళాలు పగలుగొట్టించి తలుపులు తెరిచారు. లోపలికి వెళ్లి చూస్తే హాల్లో యోగేంద్రబాబు, బెడ్రూమ్లో లక్ష్మి రక్తపుమడుగులో పడి ఉన్నారు. వారు అప్పటికే మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. యోగేంద్రబాబుది మచిలీపట్నం కాగా లక్ష్మిది శ్రీహరిపురం. 40 ఏళ్ల కిందట కులాంతర ఆదర్శ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారికి వివాహాలు జరిగి, అమెరికాలో స్థిరపడ్డారు. క్లూస్ టీం రంగంలోకి దిగి వివరాలు సేకరించింది.

బిడ్డను చంపి తల్లిపై గ్యాంగ్‌రేప్!
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం.. సగటున రోజుకి వందకి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వెలుగులోకి రానివి మరెన్నో?. తాజాగా.. హర్యానాలోని జింద్‌లో ఘోరమైన ఘటన జరిగింది. నలుగురు దుండగులు అయిదేళ్ల చిన్నారిని హత్య చేసి, ఆమె తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాత గొడవల కారణాంగానే నిందితులు ఈ దారుణానికి తెగబడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత కుటుంబం చెత్త ఏరుకుంటూ జింద్ జిల్లా(Jind) శివారులోని గుడిసెల్లో నివసిస్తోంది. కొన్నిరోజుల కిందట అమిత్ అనే వ్యక్తికి, బాధిత మహిళ భర్తకి గొడవ జరిగింది. ఈ గొడవలో ఆమె భర్త తలకు గాయం కాగా పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు నిందితుడు అమిత్‌పై చర్యలు తీసుకోకుండా.. గొడవను సర్దిచెప్పి పంపించారు. ఇది మనసులో పెట్టుకున్న అమిత్, అతని మైనర్ సోదరుడు కోపంతో రగిలిపోయారు. మంగళవారం రాత్రి ఆమె భర్త లేని సమయం చూసి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గుడిసెలోకి చొరబడ్డారు. ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రపోతున్న బాధితురాలిపై దాడి చేశారు. ఆమె స్పృహ కోల్పోయాక.. ఆమెతోపాటు అయిదేళ్ల చిన్నారిని పక్కనే ఉన్న ఖాళీ ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ చిన్నారి గొంతునులిమి హత్య చేసి, బాధితురాలిపై నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు. చిన్నారి మృతదేహం రాత్రంతా చెత్తకుప్పలోనే ఉంది. శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళ వాళ్లను గుర్తించి స్థానికులకు సమాచారం అందించింది. చిన్నారిని ఖననం చేశాక.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనతో పాటు తన ఐదేళ్ల వయసున్న బిడ్డపైనా నిందితులు అత్యాచారానికి ఒడిగొట్టారని చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక ఎస్సై యశ్వీర్, సమాధి నుంచి పసికందు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకి తరలించారు. మరోవైపు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు అమిత్‌తో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.
వీడియోలు


విష్ణుకుమార్ రాజు పై గంటా శ్రీనివాసరావు ఫైర్


బెలూచిస్థాన్ లో పాకిస్థాన్ ఆర్మీపై దాడి


పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సిన రచ్చబండ కార్యక్రమం అర్ధాంతరంగా రద్దు


కాకినాడలో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వర్సెస్ జనసేన


సాక్షితో KTR మనసులో మాట


టీడీపీ నేత అరెస్ట్


భారత్ సైనిక ముందు పాక్ ఎంత..!


LOC వద్ద పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు


నేషనల్ హెరాల్డ్ కేసులో.. సోనియా, రాహుల్ లకు గుడ్ న్యూస్


పాక్ పౌరులకు వీసా సేవలు నిలిపివేత