Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Cabinet transfer of lands worth Rs 3,000 crore to anonymous company1
కేంద్ర సంస్థలకు రూ.కోట్లలో..'ఉర్సాకు ఊరికే'!

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేంద్ర సంస్థలకైతే ఎకరా రూ.4 కోట్లు.. ఆర్మీకైనా సరే కోటికి తగ్గేది లేదు..! ఉర్సాకైతే ఊరికే! ఒక్క రూపాయికి కనీసం ఓ ఇడ్లీ కూడా రాదు..! మరి 99 పైసలకు రూ.3,000 కోట్ల భూములు ఎలా..? ఊరూ పేరు లేని కంపెనీపై ఔదార్యం వెనుక గుట్టు ఏమిటి? ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలు ఏర్పాటవుతుంటే ఏ ప్రభుత్వమైనా స్వాగతించి వీలైనన్ని వెసులుబాట్లు కల్పించి భూముల కేటాయింపులో ఉదారంగా వ్యవహరిస్తుంది! కానీ.. ప్రముఖ కేంద్ర సంస్థల నుంచి ఎకరా రూ.నాలుగు కోట్ల చొప్పున వసూలు చేస్తూ.. ఊరూ పేరు లేని ఓ డొల్ల కంపెనీకి మాత్రం రూ.3,000 కోట్లకుపైగా విలువ చేసే అత్యంత విలువైన దాదాపు 60 ఎకరాలను ఎకరా 99 పైసలకే కట్టబెట్టడం నాకింత.. నీకింత లాంటి లాలూచీ వ్యవహారాలకు పరాకాష్ట! పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలకు గతంలో చంద్రబాబు సర్కారు అమరావతిలో ఎకరా రూ.4 కోట్లు చొప్పున భూములను కేటాయించింది. హడ్కో, ఎల్‌ఐసీ, గెయిల్, ఎఫ్‌సీఐ, ఆర్బీఐ, ఎస్‌బీఐ, విజయా బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్, రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, రైల్‌ ఇండియా టెక్నికల్‌ ఎకనమిక్‌ సర్వీస్‌ లాంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లు చొప్పున భూ కేటాయింపులు చేశారు. చివరకు దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్‌ ఆర్మీకి సైతం ఎకరా రూ.కోటి చొప్పున భూమిని కేటాయించడం గమనార్హం. ఇలా కేంద్ర, జాతీయ సంస్థలకు భూములిచ్చినందుకు భారీగా వసూలు చేస్తూ ఊరూ పేరు లేని అనామక ఉర్సా కంపెనీకి మాత్రం రూ.3,000 కోట్ల విలువైన 59.86 ఎకరాల ఖరీదైన భూమిని అత్యంత కారు చౌకగా కట్టబెడుతూ తన బంధువులు, బినామీలు, సన్నిహితులకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయడంలో చేతికి ఎముకే లేదని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు భూములు కేటాయించేటప్పుడు మాత్రం మార్కెట్‌ ధరను తెరపైకి తేవడం.. బంధుగణం, బినామీలకు మాత్రం కారుచౌకగా ప్రభుత్వ భూములను రాసిచ్చేయడం సీఎం చంద్రబాబుకు రివాజు అని పారిశ్రామికవేత్తలు, అధికార వర్గాలే స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తరహాలో వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. 2004లో ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ తనకు అత్యంత సన్నిహితుడైన బిల్లీ రావుకు చెందిన బోగస్‌ కంపెనీ ఐఎంజీ భారత్‌కు గచ్చిబౌలిలో 400 ఎకరాలు.. శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో 450 ఎకరాల భూమిని కేటాయించడం చంద్రబాబు భూ సంతర్పణకు పరాకాష్టగా పేర్కొంటున్నారు. విభ­జన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాను కొనసాగించారని ప్రస్తావిస్తున్నారు. భూ పందేరానికి ఆధారాలివిగో.. నారా లోకేశ్‌ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్‌ తండ్రి ఎం.పట్టాభిరామారావుకు చెందిన వీబీసీ ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌కు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏపీఐఐసీకి చెందిన 498.93 ఎకరాల భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున కేటాయిస్తూ 2015 జూలై 15న నాటి చంద్రబాబు సర్కార్‌ ఉత్తర్వులు (జీవో ఎంఎస్‌ నెంబరు 269) జారీ చేసింది. బహిరంగ మార్కెట్‌ ప్రకారం ఆ భూముల విలువ అప్పట్లోనే రూ.498 కోట్లు. ఆ తర్వాత ఆ భూములను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలోకి తెస్తూ 2015 సెపె్టంబరు 22న ఉత్తర్వులు (జీవో ఎంస్‌ నెంబరు 207) జారీ చేయడం ద్వారా వాటి విలువను మరింతగా పెంచుకున్నారు. సత్తా లేని సంస్థకు సంతర్పణ..! జనసేన, బీజేపీతో జట్టుకట్టి 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన బంధువులు, సన్ని­హి­తులు, బినామీలకు ప్రభుత్వ భూములను ఇష్టారీతిన ధారాదత్తం చేస్తున్నారు. ఊరూ పేరూ లేని ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విశాఖలోని ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు.. ఎకరం కేవలం 99 పైసలకే కేటాయించడమే అందుకు నిదర్శనం. వాస్తవంగా ఆ భూముల విలువ రూ.3 వేల కోట్లకుపైగా ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేవలం రెండు నెలల క్రితం ఏర్పాటైన కంపెనీకి రూ.5,278 కోట్ల పెట్టుబడి పెట్టి డేటా సెంటర్‌ ప్రాజెక్టును నెలకొల్పే సామర్థ్యం ఉందా.. లేదా? అన్నది పరిశీలించుకోకుండా భూ కేటాయింపులు చేశారంటే.. ఆ సంస్థ ఎవరి బినామీలదో అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కేంద్ర సంస్థలకు మార్కెట్‌ ధరకే.. విశాఖలో గతంలో టీడీపీ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మార్కెట్‌ ధరకే భూమిని కేటాయించారు. కీలకమైన నావికాదళ స్థావరం ఏర్పాటుకు ఇండియన్‌ నేవీతో పాటు ఎన్‌టీపీసీ విద్యుత్‌ ప్లాంటుకు కూడా మార్కెట్‌ ధరకే భూమి ఇచ్చారు. దీనికి భిన్నంగా ఉర్సాకు విశాఖలో అత్యంత ఖరీదైన ఐటీ పార్కులో 3.5 ఎకరాలతో పాటు కాపులుప్పాడలో ఏకంగా 56.36 ఎకరాలను కేటాయించేందుకు టీడీపీ కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఉర్సా కంపెనీ గత ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని నివాస ప్రాంతంలో ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాటు అడ్రస్‌తో ఏర్పాటు కాగా ‘ఎక్స్‌’ ఖాతాలో ఇప్పటివరకూ కేవలం ఒకే ఒక పోస్టు పెట్టింది. అది కూడా భూ కేటాయింపులపై విమర్శల నేపథ్యంలో వివరణ ఇస్తూ చేసిన పోస్టు మాత్రమే. ఇక ఈ ఖాతాను కేవలం ఒకే ఒక్కరు ఫాలో అవుతుండటం గమనార్హం. దేశాభివృద్ధిలో కీలకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు రక్షణ వ్యవస్థలో భాగ­స్వామిగా ఉన్న ఇండియన్‌ నేవీకి కూడా మార్కెట్‌ ధరకే భూమిని కేటాయించిన టీడీపీ ప్రభుత్వం.. ఉర్సాకు మాత్రం నామమాత్ర ధరకే సంతర్పణ చేయడం వెనుక భారీ వ్యవహారమే ఉందనే ఆరోపణలున్నాయి. విశాఖలోని కీలకమైన ఏపీ సెజ్‌లో ఎకరా ధర లీజు రూ.35 లక్షల మేర పలుకుతోంది. ఏ సంస్థకు భూమి కావాలన్నా ఇదే ధర చెల్లించి భూమిని లీజుకు తీసుకోవాల్సి ఉంటుంది. కమిషనర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ సంస్థ కార్యాలయం నిర్మాణం కోసం అనకాపల్లిలోని రాజుపాలెం వద్ద మార్కెట్‌ ధర మేరకు ఎకరా రూ.80 లక్షల చొప్పున సర్వే నెంబరు 75/3లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ 25 జనవరి 2016న టీడీపీ సర్కారు 326/2016 జీవోను జారీ చేసింది. నిబంధనలు ఏం చెబుతున్నాయి?2012లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు (జీవో నెంబరు 571– 14–9–2012) ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే సమయంలో.. మార్కెట్‌ విలువ మీద వార్షిక లీజు రెంటల్‌ పది శాతం కంటే తక్కువ ఉండకూడదు. లీజును ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మార్కెట్‌æ ధర ఆధారంగా సవరించాలి. విశాఖలో టీసీఎస్‌తో పాటు ఉర్సాకు ఇవ్వనున్న భూమి రిజిస్ట్రేషన్‌ ధరల మేరకే చదరపు గజం రూ. 30 వేల వరకు ఉంది. ఇక మార్కెట్‌ ధరను గనుక తీసుకుంటే రూ.లక్ష వరకూ పలుకుతోంది. ఇంత విలువైన భూమిని ఊరూ పేరు లేని ఉర్సాకు ఎకరం 99 పైసలకే ఇచ్చేందుకు టీసీఎస్‌ను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చి కథ నడిపినట్లు స్పష్టమవుతోంది.

China Closely Following India-Pakistan Situation2
భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు.. దాయాదితో టచ్‌లోకి చైనా

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఇందులో భాగంగా పాకిస్తాన్‌ విషయంలో భారత్‌ పలు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పొరుగు దేశం చైనా ఆచితూచి అడుగులు వేస్తోంది. తాజాగా ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌- పాకిస్థాన్‌లు సంయమనం పాటించాలని చైనా భావిస్తోంది అంటూ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి చెప్పుకొచ్చారు.తాజాగా చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యీ, పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ఈ క్రమంలో వాంగ్‌ యీ మాట్లాడుతూ..‘పాకిస్తాన్‌, భారత్‌ మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఉగ్రదాడిపై నిష్పక్షపాత దర్యాప్తునకు మద్దతు ఇస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలు సంయమనం పాటించాలని బీజింగ్‌ భావిస్తోంది. పరస్పరం ముందుకు సాగాలని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేయాలని ఆశిస్తోంది’ అని చెప్పినట్లు చైనా మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదంపై పోరాటం అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేసినట్లు వెల్లడించింది.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు వ్యవహారంలో రష్యా, చైనాలు జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్‌ కోరుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ‘ఈ ఘటన దర్యాప్తు విషయంలో రష్యా, చైనా లేదా పశ్చిమ దేశాలు సానుకూల పాత్ర పోషించగలవు. భారత్‌, మోదీ అబద్ధం చెబుతున్నారా? లేదా.. పాకిస్తాన్‌ నిజం చెబుతుందా? అనేది వెలికితీసేందుకు దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు’ అని కథనాలు వెలువడ్డాయి.China breaks its silence on the ongoing tensions between India and Pakistan.Chinese Foreign Minister Wang Yi spoke with Pakistan’s Deputy PM Ishaq Dar today and said that China supports Pakistan in safeguarding its sovereignty and security interests. pic.twitter.com/wIUt1Yz0UJ— Salt News (@SaltNews_) April 27, 2025మరోవైపు.. పహల్గాంలో ఉగ్ర దాడిని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ ఖండించారు. ఈ విషయంలో భారత్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న బెదిరింపులను ఈ దాడి గుర్తు చేసిందని పేర్కొన్నారు. దాడి అనంతరం భద్రతా దళాలు స్పందించిన తీరును ప్రశంసించారు. ‘కశ్మీర్‌లో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన వారికి ఎఫ్‌బీఐ సంతాపం తెలుపుతోంది. భారత్‌ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు.పహల్గాం ఉగ్ర దాడిని ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ ఖండించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడానికి ప్రాంతీయ సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీకి తాను ఫోన్‌ చేసి దాడిని ఖండించినట్లు ఆయన ప్రకటించారు. పహల్గాం దుర్ఘటనలను ఈ ప్రాంతంలోని దేశాలు ఉమ్మడి బాధ్యతగా తీసుకుని స్పందించాలని సూచించారు. ఇరాన్‌లో పర్యటించాలని ప్రధాని మోదీకి ఆయన ఆహ్వానం పలికారు.

Pakistan Violates Ceasefire Across Line Of Control3
LoC వెంబడి పాక్ కవ్వింపు చర్యలు.. దీటుగా బదులిచ్చిన భారత్

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో పాక్‌ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎల్‌వోసీ వెంబడి పాక్‌ సైన్యం కాల్పులకు తెగబడింది. కుప్వారా, పూంచ్‌లో భారత భద్రతా బలగాలపై కాల్పులకు దిగింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్‌పై అంతే దీటుగా బదులిచ్చింది. మరోవైపు, పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై భారత్‌ స్పందించింది. భారత్ - పాకిస్తాన్ మధ్య జమ్మూకశ్మీర్ ప్రాంతంలోని సరిహద్దును వేరు చేసే సైనిక నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వద్ద పాక్‌ వరుసగా నాలుగు రోజుల నుంచి సీజ్‌ ఫైర్‌ నిబంధల్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతోంది. ఏప్రిల్‌ 27,28వ తేదీలలో కుప్వారా,పూంచ్‌ జిల్లాలో ఎల్‌వోసీ వద్ద పాక్‌ సైన్యం భారత సైన్యంపై కాల్పులకు తెగబడింది. భారత సైన్యం అదే రీతిలో వేగంగా బదులిచ్చింది’ అని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.ఏప్రిల్‌ 22న పహల్గాంలో పాక్‌ ఉగ్రవాదులు 26మంది టూరిస్టులపై కాల్పులు జరిపి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశారు. ఈ దాడి జరిపింది పాక్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థకు లష్కరే తోయిబా ఉగ్రవాదులేనని తేలింది. అందుకు తగ్గ ఆధారాల్ని సైతం భారత దర్యాప్తు సంస్థలు సేకరించాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎలోవోసీ వెంబడి పాక్‌ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని భారత సైన్యం వెల్లడించింది.

IPL 2025: Virat Kohli Rocks The Orange Cap, Josh Hazlewood Rules With The Purple Cap, RCB At The Top4
IPL 2025: అగ్రస్థానానికి దూసుకొచ్చిన ఆర్సీబీ.. టాప్‌ ప్లేస్‌లో కోహ్లి, హాజిల్‌వుడ్‌

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ డిమినేషన్‌ కొనసాగుతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. నిన్న (ఏప్రిల్‌ 27) ఢిల్లీ క్యాపిటల్స్‌ను వారి సొంత ఇలాకాలో ఓడించిన అనంతరం టాప్‌ ప్లేస్‌కు దూసుకొచ్చింది. ఈ గెలుపుతో కొద్ది రోజుల కిందట బెంగళూరులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్రత్యర్థి హోం గ్రౌండ్స్‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌లో గెలిచింది.నిన్నటి మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనల తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి (47 బంతుల్లో 51; 4 ఫోరు​), జోష్‌ హాజిల్‌వుడ్‌ (4-0-36-2 కూడా బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో అగ్రస్థానానికి దూసుకొచ్చారు. బ్యాటింగ్‌లో విరాట్‌ (10 మ్యాచ్‌ల్లో 443 పరుగులు) టాప్‌ రన్‌ స్కోరర్‌గా.. బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌ (10 మ్యాచ​్‌ల్లో 18 వికెట్లు) లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచారు. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయిస్తూ టైటిల్‌ దిశగా దూసుకుపోతుంది.ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు (ఆరెంజ్‌ క్యాప్‌)విరాట్‌ కోహ్లి- 443సూర్యకుమార్‌ యాదవ్‌- 427సాయి సుదర్శన్‌- 417నికోలస్‌ పూరన్‌- 404మిచెల్‌ మార్ష్‌- 378ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు (పర్పుల్‌ క్యాప్‌)జోష్‌ హాజిల్‌వుడ్‌- 18ప్రసిద్ద్‌ కృష్ణ- 16నూర్‌ అహ్మద్‌- 14ట్రెంట్‌ బౌల్ట్‌- 13కృనాల్‌ పాండ్యా- 13అత్యధిక హాఫ్‌ సెంచరీలు- విరాట్‌ (6)పాయింట్ల పట్టిక1. ఆర్సీబీ (14 పాయింట్లు, 0.521 రన్‌రేట్‌)2. గుజరాత్‌ టైటాన్స్‌ (12, 1.104)3. ముంబై ఇండియన్స్‌ (12, 0.889)4. ఢిల్లీ క్యాపిటల్స్‌ (12, 0.482)5. పంజాబ్‌ కింగ్స్‌ (11, 0.177)కాగా, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్‌వుడ్‌ 2, యశ్‌ దయాల్‌, కృనాల్‌ తలో వికెట్‌ తీసి ఢిల్లీని కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ (41), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్‌ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్‌ (51), కృనాల్‌ (47 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్‌ తీసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. టిమ్‌ డేవిడ్‌ (5 బంతుల్లో 19 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు (18.3 ఓవర్లలో). ‌ఆల్‌రౌండ్‌ షోతో సత్తా చాటిన కృనాల్‌ పాండ్యాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్‌లో (మే 3) సీఎస్‌కేతో (బెంగళూరులో) తలపడనుంది.

Pakistan Army Chief Missing in Action5
పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఎక్కడ? 

ఇస్లామాబాద్‌/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్‌ సయీద్‌ ఆసిఫ్‌ మునీర్‌ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్‌లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో ఆదివారం వార్తలొచ్చాయి. ‘‘తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. తర్వాత తానూ పాక్‌ వీడారు’’ అన్నది వాటి సారాంశం. కొద్ది రోజులుగా, ఆ మాటకొస్తే పహల్గాం దాడి జరిగినప్పటి నుంచీ మునీర్‌ బయట ఎక్కడా కని్పంచడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. మునీర్‌కు తీవ్ర భారత విద్వేషిగా పేరుంది. కొద్ది రోజులుగా భారత వ్యతిరేక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. పాక్‌కు కశ్మీర్‌ జీవనాడి అని, దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని, హిందువులు, ముస్లింలు భిన్న జాతులని ఇటీవలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తర్వాత రెండు రోజులకే పహల్గాం ఉగ్ర దాడి జరిగింది. ‘‘దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్‌ తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్‌ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడిని అవుతానని మునీర్‌ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్టు కనిపిస్తోంది’’ అని కథనాలు పేర్కొంటున్నాయి. మునీర్‌ పాక్‌లోనే ఉన్నారని, రావలి్పండి బంకర్లో తలదాచుకున్నారని మరికొందరు చెబుతున్నారు. ఈ పుకార్లలో సైన్యం మనోబలం దెబ్బ తింటుందని గ్రహించిన పాక్‌ ప్రభుత్వం నష్ట నివారణకు దిగింది. ప్రధాని షహబాజ్‌ షరీఫ్, ఉన్నత సైనికాధికారులతో శనివారం మునీర్‌ దిగిన గ్రూప్‌ ఫొటో అంటూ పాక్‌ పీఎంఓ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. దాన్ని నమ్మలేమని, శనివారం సైనిక కాలేజీ ఉత్సవాల్లో ప్రధానితో పాటు మునీర్‌ పాల్గొన్నట్టుగా వచి్చన వార్తలూ నమ్మశక్యంగా లేవని మీడియా అభిప్రాయపడింది. మరోవైపు పాక్‌ సైన్యంలోని జనరల్స్, ఉన్నతాధికారులు తమ కుటుంబాలను ఉన్నపళంగా దేశం దాటిస్తున్నట్టు చెబుతున్నారు.

Moderate Rain Forecast To AP6
ఏపీకి వర్షం అలర్ట్‌.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షసూచన

సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఏపీలో రాబోయే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ మాట్లాడుతూ.. సోమవారం.. కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందన్నారు. ఇక, మంగళవారం.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.ఇదిలా ఉండగా.. కొన్ని జిల్లాలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదివారం అనకాపల్లి జిల్లా రావికమతం, వైఎస్సార్‌ జిల్లా వేంపల్లిలో 41.4, విజయనగరం జిల్లా గుర్లలో 41.2, తూర్పుగోదావరి జిల్లా మురమండ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇక, తెలంగాణలో గత కొద్ది రోజులుగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆదివారం హైదరాబాద్‌ సహా అనేక జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై.. మోస్తరు వర్షం కురసింది. దీంతో, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లగొండ జిల్లాలో వర్షం కారణంగా కల్లాల్లో పోసిన ధాన్యం వర్షం తడిసిపోయింది. ఈ నేపథ్యంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.Gadwal right now. As expected, dangerous storms smashing the district 😱Zaheerabad - Vikarabad too on ALERTVC :- @chaitanyak19142 pic.twitter.com/S3cmnQ4UMy— Telangana Weatherman (@balaji25_t) April 27, 2025

Rasi Phalalu: Daily Horoscope On 28-04-2025 In Telugu7
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలు లాభసాటి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం; తిథి: శు.పాడ్యమి రా.10.56 వరకు, తదుపరి విదియ; నక్షత్రం: భరణి రా.11.28 వరకు, తదుపరి కృత్తిక; వర్జ్యం: ప.10.04 నుండి 11.33 వరకు; దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.15 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు; అమృత ఘడియలు: సా.6.58 నుండి 8.30 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు; యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు; సూర్యోదయం: 5.40; సూర్యాస్తమయం 6.14 మేషం...రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.వృషభం...కుటుంబంలో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తప్పవు.మిథునం...వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.కర్కాటకం...పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.సింహం...అపరిమితమైన ఖర్చులు. వివాదాలకు మరింత దూరంగా ఉండండి. శ్రమ తప్పదు. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.కన్య...రుణబాధలు ఎదుర్కొంటారు. మిత్రులతో అకారణంగా తగాదాలు. దూరప్రయాణాలు. సాహసకృత్యాలకు దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు.తుల....పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కష్టం ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు వేగవంతంగా సాగుతాయి.వృశ్చికం....సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.దనుస్సు...ఇంతకాలం పడిన శ్రమ వృథా కాగలదు. రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మానసిక ఆందోళన. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.మకరం....కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఒత్తిడులకు లోనవుతారు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.కుంభం....కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుండి పిలుపు రావచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. విందువినోదాలు. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.మీనం....కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

Director SS Rajamouli Chief Guest For Nani Hit-3 Pre Release Event8
నాని నా అంచనాలను మించిపోయాడు: దర్శకుడు రాజమౌళి

‘‘నాని ఏ సినిమా చేసినా హిట్‌ అని తెలిసిపోతుంటుంది. కానీ తన దగ్గర్నుంచి ఇంకా కావాలని ఓ ఫంక్షన్‌లో అన్నాను. అయితే నా అంచనాలను మించి నాని చాలా ముందుకెళ్లిపోయాడు. కానీ నానీ... మేం ఇంకా కోరుకుంటూనే ఉంటాం. నువ్వు ఇంకా ముందుకు వెళ్లు’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. నాని హీరోగా నటించిన చిత్రం ‘హిట్‌ 3: థర్డ్‌ కేస్‌’. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్ . శైలేష్‌ కొలను దర్శకత్వంలో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు రాజమౌళి, అతిథులుగా ‘హిట్‌ 1’లో హీరోగా నటించిన అడివి శేష్, ‘హిట్‌ 2’లో హీరోగా నటించిన విశ్వక్‌ సేన్ హాజరయ్యారు. ఈ వేదికపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ – ‘‘అ!, హిట్‌ 1, హిట్‌ 2, కోర్ట్‌’... ఆల్‌ సక్సెస్‌. వంద శాతం సక్సెస్‌ అయిన నిర్మాత ప్రశాంతి. ఇండస్ట్రీలో హిట్‌ మిషన్ అని పిలుచుకుంటుంటాం. ఇప్పుడు ‘హిట్‌ 3’ సక్సెస్‌ అవుతుందని నా గట్టి నమ్మకం. ఓ ఫ్రాంచైజీని స్టార్ట్‌ చేసినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. కానీ ‘హిట్‌ ఫస్ట్‌ కేస్, సెకండ్‌ కేస్‌... చాలా కేస్‌లు ఉండొచ్చు. శైలేష్‌ ఏడు సినిమాలే అనుకుని ఉండొచ్చు. కానీ ఈ ఫ్రాంచైజీ ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నాను. ‘హిట్‌ 3’ ప్రమోషనల్‌ కంటెంట్‌ చూశాను. సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అనే వైబ్‌ని క్రియేట్‌ చేసింది. మే1 థియేటర్స్‌లో... అబ్‌ కీ బార్‌ అర్జున్ సర్కార్‌. హిట్‌ ది థర్డ్‌ కేస్‌’’ అని రాజమౌళి అన్నారు.కాగా.. ఈ వేదికపై ‘‘మీరు తీయబోతున్నటు వంటి ‘మహాభారతం’ సినిమాలో నానీగారి క్యారెక్టర్‌ ఫిక్స్‌ అయిందని విన్నాం... నిజమేనా’’ అని యాంకర్‌ సుమ అడిగితే ‘‘నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్‌’’ అని రాజమౌళి చెప్పారు. నాని మాట్లాడుతూ– ‘‘నా ప్రతి కొత్త సినిమాకు మార్నింగ్‌ షోకి ప్రసాద్‌ ఐమ్యాక్స్‌కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా వస్తున్నారా? అని చెక్‌ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్‌ అడిగేవాడిని. ప్రేమగా హగ్‌ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. ‘చాలా బాగుంది. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్‌ చేస్తాం’ అంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్‌కి వెళ్లకపోవడంతో కాస్త బ్రేక్‌ వచ్చింది.ఈసారి ‘హిట్‌ 3’ సినిమా చూసి, ఆయన (రాజమౌళి) నాకు ఆ మార్నింగ్‌ షో ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాజమౌళిగారు ఈ మూవీని ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం ఉంది. ఒక థ్రిల్లర్, ఒక మాస్‌ కమర్షియల్‌ ఫిల్మ్‌ కలిస్తే అది ‘హిట్‌ 3’. మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్‌ థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్ ను నానిప్రామిస్‌ చేస్తున్నాడు’’ అన్నారు. ‘హిట్‌ 3’ సక్సెస్‌ అవ్వాలనే ఆకాంక్షను అడివి శేష్, విశ్వక్‌ సేన్‌ వ్యక్తం చేశారు. శైలేష్‌ కొలను, శ్రీనిధీ శెట్టి, కోమలీ ప్రసాద్‌ తదితరులు మాట్లాడారు.

50 30 20 rule of money for Effective Budgeting9
నా బడ్జెట్‌కు 50-30-20 రూల్‌ సరిపోతుందా?

మూడు నుంచి ఐదేళ్ల కాలానికి.. కార్పొరేట్‌ ఫండ్స్, షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్, పీఎస్‌యూ ఫండ్స్‌లో ఏది అనుకూలం? – మంజునాథ్‌ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ 80 శాతం అధిక క్రెడిట్‌ రేటింగ్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. బ్యాంకింగ్‌ అండ్‌ పీఎస్‌యూ ఫండ్స్‌ 80 శాతం బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. వీటితోపాటు షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ అన్ని రకాల పరిస్థితుల్లోనూ అనుకూలమైనవి. దీర్ఘకాలంలో వీటిలోని రిస్క్‌–రాబడులు ఇంచుమించు ఒకే మాదిరి ఉంటాయి.ఇన్వెస్టర్లు రెండు కారణాల దృష్ట్యా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి వివిధ రకాల డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. వైవిధ్యం ఎక్కువ. మెచ్యూరిటీ కాలంపై స్పష్టత ఉంటుంది. ఏడాది కాలానికి మించిన లక్ష్యాల కోసం, డెట్‌ విభాగంలో షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ అనుకూలంగా ఉంటాయి.ఇంటి బడ్జెట్‌ విషయంలో 50–30–20 ఆర్థిక సూత్రం గురించి విన్నాను. నా ఆర్థిక అంశాలకు ఇది మంచి సూత్రమేనా? – కరణ్‌ రాథోడ్‌మీ నెలవారీ ఆదాయాలను ఏ రకంగా వర్గీకరించాలన్నది ఈ సూత్రం తెలియజేస్తుంది. ఆదాయంలో 20 శాతాన్ని అవసరాల కోసం కేటాయించాలి. అంటే ఇంటి అద్దె, గ్రోసరీ, విద్యుత్, ఈఎంఐలు, స్కూల్‌ ఫీజులు అన్నీ కలిపి 50 శాతానికే పరిమితం కావాలి. ఆదాయంలో 30 శాతాన్ని కోరికల కోసం కేటాయించుకోవచ్చు. అంటే రెస్టారెంట్లలో విందులు, ఓటీటీ చందాలు, విహార యాత్రలు, షాపింగ్, ఇతర హాబీల కోసం కేటాయింపులు 30 శాతం మించకూడదు. ఇక మిగిలిన 20 శాతాన్ని పొదుపు కోసం కేటాయించాలి.మీ ఆర్థిక అంశాలను సులభంగా నిర్వహించుకునేందుకు ఇది అనుకూలిస్తుంది. ముఖ్యంగా వేతన జీవులు, అప్పుడే కెరీర్‌ ఆరంభించిన వారికి ఇది ఎంతో సులభం. కాకపోతే ఇదొక సాధారణ సూత్రమే కానీ, అందరికీ అనుకూలమని చెప్పలేం. వ్యక్తిగత ఆదాయం, జీవన వ్యయాలు, బాధ్యతలు ఇవే ఒకరి బడ్జెట్‌ను నిర్ణయించేవి.ఉదాహరణకు ఒక నగరానికి చెందిన యువ ఉద్యోగి నెలకు రూ.40,000 సంపాదిస్తున్నాడని అనుకుందాం. పెద్ద నగరం కావడంతో అద్దెకు, రవాణా కోసమే నెల జీతంలో సగం ఖర్చు చేయాల్సి వస్తుంది. అప్పుడు కోరికలు, పొదుపు కోసం మిగిలేదేమీ ఉండదు. అదే రూ.2 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి అయితే ఆదాయంలో 30–35 శాతంతోనే అవసరాలను తీర్చుకోవడం సులభం. అప్పుడు పొదుపు చేయడానికి 30–40 శాతం మిగులు ఉంటుంది. కనీసం 20 శాతం పొదుపు ఎవరైనా సరే బడ్జెట్‌ ఆరంభించేందుకు 50–30–20 సూత్రం మంచి ఫలితమిస్తుంది. మీ జీవన అవసరాలు ఆదాయాన్ని మించకుండా చూసుకోవాలి. అలాగే, ఆదాయంలో కనీసం 20 శాతాన్ని పొదుపు చేయాలి. కోరికల విషయంలో కొంత రాజీ పడినా సరే పొదుపును కొనసాగించాలి.ఎలా ఆరంభించాలో తెలియకపోతే అప్పుడు ఆదాయంలో 20 శాతాన్ని పెట్టుబడులకు మళ్లించే విధంగా ఆటోమేట్‌ చేసుకోవాలి. అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వెళ్లేలా సిప్‌ పెట్టుకోవాలి. మొదట పొదుపు, పెట్టుబడి తర్వాతే ఖర్చులకు వెళ్లాలి. స్థిరమైన పొదుపు, వివేకంతో చేసే ఖర్చుతో మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. సమాధానాలు:: ధీరేంద్ర కుమార్‌, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

537 Pakistani nationals left India through Attari in past 4 days, exit deadline ends10
పాక్‌ వెళ్లేందుకు ముగిసిన గడువు 

చండీగఢ్‌/న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశం వీడేందుకు పాకిస్తానీలకు భారత్‌ నిర్దేశించిన గడువు ఆదివారంతో ముగిసింది. వారికి అన్ని రకాల వీసాలనూ రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. దాంతో గత నాలుగు రోజుల్లో అటారీ–వాఘా సరిహద్దు గుండా తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 537 మంది పాకిస్తానీలు తిరుగుముఖం పట్టినట్టు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 14 మంది భారత దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారత్‌కు తిరిగి వచ్చినట్టు పేర్కొన్నారు. కొందరు పాకిస్తానీలు తిరిగి వెళ్లేందుకు వాయుమార్గాన్ని ఎంచుకున్నారు. వ్యాపారం, సినిమాలు, జర్నలిజం, రవాణా, సదస్సులు, ట్రెక్కింగ్, విద్య, బృంద పర్యాటకం, పుణ్యక్షేత్రాల సందర్శన ఇలా పాకిస్తానీలకు మంజూరుచేసిన 12 రకాల వీసాల గడువును భారత్‌ రద్దుచేయడం తెల్సిందే. దాంతో కొద్ది రోజులుగా పాకిస్తానీలు అటారీ–వాఘా బోర్డర్‌ వద్ద వందలాదిగా బారులు తీరుతున్నారు. ఆ దారంతా వాహనాలు కని్పంచాయి. వారిని సాగనంపేందుకు వచ్చిన భారత బంధువులు ఉద్వేగంతో వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలు కనిపించాయి. మెడికల్‌ వీసాపై వచ్చిన వారికి మాత్రం భారత్‌ వీడేందుకు మంగళవారం దాకా గడువుంది. కాగా, గడువు తీరిన నేపథ్యంలో ఇంకా భారత్‌లోనే ఉన్న పాకిస్తానీలను అరెస్టు చేస్తామని కేంద్రం తెలిపింది. వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తారు. ఈ నెల 4న అమల్లోకి వచ్చిన వలసలు, విదేశీయుల చట్టం ప్రకారం చర్యలు తప్పవని కేంద్రం పేర్కొంది. ఢిల్లీలో 5,000 మంది ఢిల్లీలో 5,000 మంది పాకిస్తానీలున్నట్లు ఇంటెలిజెన్స్‌ బ్యూరో గుర్తించింది. ఆ జాబితాను పోలీసులకు అందజేసింది. అక్రమంగా ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి సమాచారమివ్వాలని ఢిల్లీ హోం మంత్రి ఆశిష్‌ సూద్‌ ప్రజలను కోరారు. వారిని తిప్పి పంపేలా కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. దీర్ఘకాల వీసాలతో వచ్చిన పాకిస్తానీలు మహారాష్ట్రలోనూ 5,050 దాకా ఉంటారని అధికారులు తెలిపారు. తమ రాష్ట్రంలోని పాకిస్తానీలంతా వెళ్లిపోయారని బిహార్‌ ప్రకటించింది. కేరళలో 104 మంది ఉన్నట్లు గణాంకాల వెల్లడిస్తున్నాయి. తమ రాష్ట్రం నుంచి 228 మంది వెళ్లిపోయారని మధ్యప్రదేశ్‌ సర్కార్‌ తెలిపింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement