
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
చిన్నశంకరంపేట(మెదక్): రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కామారం గ్రామ శివారులో చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే పోలీస్‌ల కథనం మేరకు.. చిన్నశంకరంపేట మండలంలోని మిర్జాపల్లి–వడియారం రైల్వేస్టేషన్‌ల మధ్యలో కామారం తండా 226 రైల్వే గేట్ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు చూసి రైల్వే పోలీస్‌లకు సమాచారం అందించారు. కామారెడ్డి రైల్వే పోలీస్ ఎస్‌హెచ్‌ఓ హనుమండ్లు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని, మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిస్తే కామారెడ్డి రైల్వే పోలీస్‌లను సంప్రదించాలని కోరారు.
మూర్ఛవ్యాధితో యువకుడు..
నర్సాపూర్ రూరల్: మూర్ఛ వ్యాధితో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని రుస్తుంపేటలో సోమవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ లింగం కథనం మేరకు.. గ్రామానికి చెందిన కర్రె అనిల్ (26) 5న ఇంటి నుంచి కూలీ పనుల కోసం వెళ్లాడు. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. 6న పంట పొలాల వైపు వెళ్లిన గ్రామస్తులకు బురుదలో పడి అనిల్ మృతి చెంది కనిపించాడు. మూర్చ వ్యాధితో తన కుమారుడు చనిపోయాడని తండ్రి కిష్టయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి