
ఉచిత కరెంట్‌తో ఇటుక బట్టీలు
ట్రాన్స్‌కో ఆదాయానికి భారీగా గండి
తూప్రాన్: రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరెంట్ అక్రమ ఇటుకల వ్యాపారులకు వరంగా మారింది. పంటల సాగు కోసం వినియోగించాల్సి న ఉచిత విద్యుత్‌ను తమ వ్యాపారానికి వినియోగిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఇటుకల తయారీ కోసం అవసరమయ్యే నీటి కోసం విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ఓ పక్కా రైతులు వేసిన పంటలకు విద్యుత్ సరఫరా సక్రమంగా అందించలేక, లో వోల్టేజీ కారణంగా బోరుమోటార్లు కాలిపోతున్నా యి. ఫలితంగా రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లను అరికట్టినట్‌లైతే విద్యుత్ సరఫరా మారింత మెరుగుపడనుందని పలువురు రైతులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ట్రాన్స్‌కో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఉమ్మడి మండలంలో 16 బట్టీలు
ఉమ్మడి మండలంలో తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో తదితర గ్రామల్లో కొంతమంది ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. నిత్యం లారీలు, ట్రాక్ట ర్లలో ఇతర ప్రాంతాలకు సరఫరా తరలిస్తున్నారు. వ్యవసాయ పొలాల్లోని ఉచిత కరెంటు వినియోగిస్తూ జోరుగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. వేసవి కాలం కావడంతో ప్రజలు నూతన ఇళ్ల నిర్మా ణాలను అధికంగా చేపడుతున్నారు. దీంతో ఇటు కల అవసరం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జోరుగా ఇటుక బట్టీలు వెలుస్తున్నాయి. సుమా రు ఉమ్మడి మండలంలో 16 బట్టీలకు పైగా మండలంలో కొనసాగుతున్నాయి. వీటికి నిర్వాహకులు ఉచిత కరెంట్‌ను వినియోగిస్తున్నారు. బావుల దగ్గర నడవని మోటార్ల నుంచి కరెంట్ తీసుకొని వాడుకుంటున్నారు.వ్యాపారులు ఇటుక బట్టీలకు తప్పనిసరిగా కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలి. కానీ ఎలాంటిది ఏదీ తీసుకోవడం లేదు. దీంతో రూ.లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ విషయం ట్రాన్స్‌కో అధికారులకు తెలిసినా నామ మాత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటూ... పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు విసిపిస్తున్నాయి.
ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకం
ఇటుకల తయారీకి అవసరమైన మట్టిని ప్రభుత్వ భూముల్లోంచి లారీలు, ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. అర్థరాత్రి నుంచి తెల్లవారు జామువరకు ముడి సరుకును గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఇలా ప్రభుత్వ భూముల్లో, చెరువులు, కుంటలు ఎక్కడబడితే అక్కడ వీరి అక్రమ వ్యాపా రానికి అడ్డుకట్ట లేకుండా పోతుంది. ఇప్పటికై నా పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలపై దృష్టి సారించి వ్యాపారులను ను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వ్యవసాయ బావుల నుంచి అక్రమంగా తీసుకుంటున్న నిర్వాహకులు
ప్రభుత్వ భూముల్లో నుంచి మట్టి తవ్వకం
చోద్యం చూస్తున్న అధికారులు
చర్యలు తీసుకుంటాం
ఇటుక బట్టీలకు ఉచిత విద్యుత్‌ను వినియోగిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదు చేశాం. వ్యాపారులు ఇటుక బట్టీలకు తప్పనిసరిగా కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలి. లేని పక్షంలో వారిని గుర్తించి చట్టరీత్యా కేసులు నమోదు చేస్తాం.
– వెంకటేశ్వర్లు, ట్రాన్స్‌కో ఏఈ, తూప్రాన్

ఉచిత కరెంట్‌తో ఇటుక బట్టీలు