
ఏఐ సరే.. ఇంటర్నెట్ మరి!
ఫోన్ నెట్ సాయంతో..
పక్క చిత్రంలో కనిపిస్తున్నది తొగుట మండల పరిధి.. కాన్గల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్. ఫోన్ నెట్‌తో ఏఐ క్లాస్‌లను విద్యార్థులు వింటున్నారు. ఒక్కో సారి ఫోన్ సిగ్నల్ రాకపోవడం.. ఇంటర్నెట్ లేకపోవడంతో క్లాస్‌లకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇందులో సీ గ్రేడ్‌లో 3వ తరగతిలో ఆరుగురు, నాల్గవ తరగతిలో ఇద్దరు, ఐదవ తరగతిలో నలుగురు ఉన్నారు.
విద్యార్థులకు అందని క్లాసులు
● చదువులో వెనుకబడిన వారి కోసం ఏర్పాటు
● పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా
47 పాఠశాలలో అమలు
● నెట్ సౌకర్యం లేకపోవడంతో
తప్పని ఇబ్బందులు
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కు ఇంటర్నెట్ అడ్డంకిగా మారింది. ప్రతీ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేస్తోంది. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిని ఏఐ సాయంతో మెరుగైన సాధన కోసం చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా జిల్లా పైలెట్ ప్రాజెక్ట్ కింద 47 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిలో పలు చాలా వరకు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో క్లాస్ అంతంత మాత్రంగా సాగుతున్నాయి.
వారానికి నాలుగు రోజులు..
3 నుంచి 5వ తరగతిలో వెనకబడిన విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మ్యాథ్స్, జనరల్ సైన్స్ సబ్జెక్ట్‌కు సంబంధించిన క్లాస్‌లు వారానికి నాలుగు రోజులు ఏఐ ద్వారా చెప్పిస్తున్నారు. ఒక్కో క్లాస్ 20 నిమిషాల పాటు కంప్యూటర్‌లో ఆన్‌లైన్‌లో ఏఐ క్లాస్‌లు చెబుతున్నారు. ముఖ్యంగా వెనకబడిన విద్యార్థులు ఈ టూల్స్‌ను ఉపయోగించుకొని స్వయంగా వారే తెలుగు, ఇంగ్లిష్ భాషలో అక్షరాల గుర్తించే విధంగా కృషి చేస్తుంది. సరళ పదాలు, వారి స్థాయి మేరకు పదాలను చదవడం, రాయడం, గణితంలో సంఖ్యలు రాయడం, కూడిక నుంచి మొదలుకొని భాగాహారం వరకు విద్యార్థులు స్వయంగా నేర్చుకోవడానికి ఏఐ దోహపడుతుంది. ఏఐ ద్వారా విద్యార్థులో ఆసక్తి పెరిగి ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చక్కగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.
అంతంత మాత్రంగానే..
పలు పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేని కారణంగా మొబైల్ నెట్ కనెక్షన్‌తో క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు సెల్ ఫోన్ల సిగ్నల్ లేక కొన్ని పాఠశాలలో అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. మొదటి విడతలో ఏఐ క్లాస్‌ల నిర్వహణలో ఏర్పడిన సమస్యలను అధిగమిస్తేనే సత్ఫాలితాలు వస్తాయి. అన్ని పాఠశాలలో ఏఐ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి చదువులో వెనకబడిన విద్యార్థులను ప్రోత్సహించి వారు మరింతగా చదివే విధంగా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.
స్కూల్ గ్రాంట్స్‌తో తీసుకోవాలి
ఏఐ ద్వారా బోధనకు ఎంపికై న పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను స్కూల్ గ్రాంట్ నిధులతో తీసుకోవాలని ఆదేశించాం. పాఠశాలలను పరిశీలించి అన్నింటికీ ఇంటర్నెట్ ఉండేలా కృషి చేస్తాం.
–శ్రీనివాస్ రెడ్డి, డీఈఓ
ఫోన్ డేటా సాయంతోనే..
మా పాఠశాలకు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో మా ఫోన్‌లతోనే ఇంటర్నెట్‌ను కనెక్ట్ చేసి విద్యార్థులకు ఏఐ ద్వారా బోధనను అందిస్తున్నాం. ఒక డెస్క్ టాప్, ల్యాప్‌టాప్, ట్యాబ్‌లను వినియోగిస్తున్నాం. మరో మూడు డెస్క్ టాప్‌లను వినియోగించడం లేదు. పలు ప్రైవేట్ కంపెనీల ఇంటర్నెట్ వారిని నెట్ కోసం సంప్రదించాం. చాలా దూరం ఉండటంతో ఇవ్వలే మని చెబుతున్నారు. అయినా ప్రయత్నిస్తున్నాం.
– మధు, హెచ్‌ఎం, కాన్గల్, ప్రాథమిక పాఠశాల

ఏఐ సరే.. ఇంటర్నెట్ మరి!

ఏఐ సరే.. ఇంటర్నెట్ మరి!