
PC: BCCI/IPL.com
IPL 2025 RCB vs DC Live Updates: ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ..
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్బుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో బాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది.
26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని కృనాల్ పాండ్యా, విరాట్ కోహ్లి తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో విజయతీరాలకు చేర్చారు. కృనాల్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 పరుగులు చేయగా.. విరాట్ 46 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు.
ఆఖరిలో టిమ్ డేవిడ్(5 బంతుల్లో 19) మెరుపులు మెరిపించాడు.
విరాట్ కోహ్లి ఔట్..
విరాట్ కోహ్లి(51) రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. చమీరా బౌలింగ్‌లో కోహ్లి ఔటయ్యాడు. ఆర్సీబీ విజయానికి 12 బంతుల్లో 17 పరుగులు కావాలి.
విజయం దిశగా ఆర్సీబీ..
16 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఆర్సీబీ విజయానికి 24 బంతుల్లో 38 పరుగులు కావాలి. క్రీజులో కోహ్లి(49), కృనాల్ పాండ్యా(56) ఉన్నారు.
తిరిగి పుంజుకున్న ఆర్సీబీ..
ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ తిరిగి పుంజుకుంది. విరాట్ కోహ్లి(28), కృనాల్ పాండ్యా(17) ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 11 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.
అక్షర్ ఆన్ ఫైర్.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జాకబ్ బెతల్(12), పడిక్కల్(0) ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(8), పాటిదార్(1) ఉన్నారు.
రాణించిన ఢిల్లీ బ్యాటర్లు.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్నమ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు కాస్త తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టబ్స్(34),ఫాఫ్ డుప్లెసిస్(22), అభిషేక్ పోరెల్(28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్ రెండు, దయాల్, పాండ్యా తలా వికెట్ సాధించారు.
ఢిల్లీ నాలుగో వికెట్ డౌన్..
ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(34), స్టబ్స్(3) ఉన్నారు.
ఢిల్లీ మూడో వికెట్ డౌన్..
ఫాఫ్ డుప్లెసిస్ రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన డుప్లెసిస్.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ మూడు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(26), అక్షర్ పటేల్(15) ఉన్నారు.
9 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 69/2
9 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(21), కేఎల్ రాహుల్(14) ఉన్నారు.
ఢిల్లీ రెండో వికెట్ డౌన్..
45 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కరుణ్ నాయర్.. యశ్‌దయాల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
ఢిల్లీ తొలి వికెట్ డౌన్..
అభిషేక్ పోరెల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన పోరెల్.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 4 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది.
దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతోంది. మూడు ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్(28), ఫాఫ్ డుప్లెసిస్(4) ఉన్నారు.
ఐపీఎల్-2025లో కీలక పోరుకు రంగం సిద్దమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో జాకబ్ బెతల్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి ఫాఫ్ డుప్లెసిస్ తిరిగొచ్చాడు.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, జాకబ్ బెథెల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్