
కూల్చేసిన రషీద్, ప్రసిధ్
కోల్‌కతాపై 39 పరుగులతో టైటాన్స్ గెలుపు
కోల్‌కతా: గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతులెత్తేసింది. దీంతో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో టైటాన్స్ 39 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిరీ్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (55 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు. బట్లర్ (23 బంతుల్లో 41 నాటౌట్; 8 ఫోర్లు) ధాటిగా ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో రసెల్, వైభవ్, హర్షిత్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ అజింక్య రహానే (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో 2 వికెట్లు తీశారు.
ఆ ఇద్దరు బాదేశారిలా...
గుజరాత్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ముందుగా సాయి సుదర్శన్ బౌండరీతో బాదుడు మొదలు పెట్టాడు. మూడో ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. కాస్త ఆలస్యమైనా... గిల్ ఐదో ఓవర్లో రెండు వరుస బౌండరీలతో దూకుడు షురూ చేశాడు. టైటాన్స్ పవర్‌ప్లే స్కోరు 45/0. అలీ వేసిన ఏడో ఓవర్లో గిల్ 6, 4, 4లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. క్రమం తప్పకుండా ఫోర్లు బాదేయడంతో సగం ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 89/0 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్లోనే గిల్ 34 బంతుల్లో, సుదర్శన్ 33 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 100 దాటింది. ఎట్టకేలకు సుదర్శన్‌ను అవుట్ చేసిన రసెల్ కోల్‌కతాకు ఊరటనిచ్చాడు. అయితే బట్లర్ రాకతో దంచుడులో ఏ మార్పులేకపోయింది. ఆఖర్లో గిల్, రాహుల్ తెవాటియా (0) వికెట్లు పడినా కూడా భారీస్కోరు సాధ్యమైంది.
కెప్టెన్ ఒంటరి పోరాటం
పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నైట్‌రైడర్స్ పవర్‌ప్లేలోనే ఓపెనర్లను కోల్పోయింది. సిరాజ్ తొలి ఓవర్లోనే రహా్మనుల్లా గుర్బాజ్ (1) పెవిలియన్ చేరగా, కెప్టెన్ రహానేతో అడపాదడపా షాట్లతో స్కోరును నడిపిస్తున్న సునీల్ నరైన్ (17)ను రషీద్ ఖాన్ బోల్తా కొట్టించాడు. వెంకటేశ్ అయ్యర్ (14) మెప్పించలేకపోయాడు. బాధ్యతగా ఆడిన రహానే 36 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, అదేస్కోరు వద్ద వాషింగ్టన్ సుందర్ అతన్ని అవుట్ చేశాడు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన రసెల్ (15 బంతుత్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) స్టంపౌట్ కావడంతో కోల్‌కతా లక్ష్యానికి దూరమైంది. రఘువంశీ (13 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు అలరించాడు.
స్కోరు వివరాలు
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) గుర్బాజ్ (బి) రసెల్ 52; శుబ్‌మన్ గిల్ (సి) రింకూ సింగ్ (బి) వైభవ్ 90; బట్లర్ (నాటౌట్) 41; తెవాటియా (సి) రమణ్‌దీప్ (బి) హర్షిత్ రాణా 0; షారుఖ్ ఖాన్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 198. వికెట్ల
పతనం: 1–114, 2–172, 3–177. బౌలింగ్:
వైభవ్ అరోరా 4–0–44–1, మొయిన్ అలీ 3–0–27–0, హర్షిత్ రాణా 4–0–45–1, వరుణ్ చక్రవర్తి 4–0–33–0, నరైన్ 4–0–36–0,
రసెల్ 1–0–13–1.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 1; నరైన్ (సి) తెవాటియా (బి) రషీద్ 17; రహానే (స్టంప్డ్) బట్లర్ (బి) సుందర్ 50; వెంకటేశ్ (సి) సుందర్ (బి) సాయి కిషోర్ 14; రింకూ సింగ్ (సి) గిల్ (బి) ఇషాంత్ 17; రసెల్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 21; రమణ్‌దీప్ (సి అండ్ బి) ప్రసిధ్ కృష్ణ 1; మొయిన్ అలీ (సి) షారుఖ్ (బి) ప్రసిధ్ కృష్ణ 0; రఘువంశీ (నాటౌట్) 27; హర్షిత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–2, 2–43, 3–84, 4–91, 5–118, 6–119, 7–119, 8–151. బౌలింగ్: సిరాజ్ 4–0–32–1, ఇషాంత్ 2–0–18–1, ప్రసిధ్ కృష్ణ 4–0–25–2, రషీద్ ఖాన్ 4–0–25–2, సుందర్ 3–0–36–1, సాయి కిషోర్ 3–0–19–1.