
Photo Courtesy: BCCI
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మరోసారి రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో అత్యంత అరుదైన 12000 పరుగుల మైలురాయిని తాకాడు. నిన్న (ఏప్రిల్ 23) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. పొట్టి క్రికెట్‌లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా (443 ఇన్నింగ్స్‌ల్లో) నిలిచాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన రికార్డు క్రిస్ గేల్ (345 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉంది.
గేల్ తర్వాత విరాట్ (360), వార్నర్ (368), అలెక్స్ హేల్స్ (432) అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకారు. ఓవరాల్‌గా టీ20ల్లో 12000 పరుగులు పూర్తి చేసిన 8వ ఆటగాడిగా హిట్‌మ్యాన్ రికార్డుల్లో నిలిచాడు. రోహిత్ తన టీ20 కెరీర్‌లో 8 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు చేశాడు.
నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ మెరుపు హాఫ్ సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ముంబై బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ (4-0-26-4), దీపక్ చాహర్ (4-0-12-2), హార్దిక్ పాండ్యా (3-0-31-1), బుమ్రా (4-0-39-1), సాంట్నర్ (4-0-19-0) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌ను క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకున్నారు.
అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయింది. అయినా రోహిత్ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టును గెలిపించారు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.