MI vs SRH
-
వాళ్లిద్దరి వల్లే ఈ మాత్రం.. ఇంకా కొన్ని మ్యాచ్‌లే ఉన్నాయి: కమిన్స్
ఐపీఎల్-2025 (IPL 2025)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి ఎనిమిది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న కమిన్స్ బృందం కేవలం రెండు మాత్రమే గెలిచింది. ముంబై ఇండియన్స్ (SRH vs MI)తో బుధవారం నాటి పోరులో ఓటమిపాలై ఈ సీజన్లో ఆరో ఓటమిని నమోదు చేసింది.కుప్పకూలిన టాపార్డర్సొంత మైదానం ఉప్పల్ వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. పేలవ ప్రదర్శన కనబరిచింది. ముంబై పేసర్ల ధాటికి రైజర్స్ టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (8) దారుణంగా విఫలం కాగా.. ఇషాన్ కిషన్ (1) మరోసారి చేతులెత్తేశాడు.నితీశ్ రెడ్డి (2) సైతం నిరాశపరిచాడు. ఇలాంటి దశలో వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 71) అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 43)తో కలిసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ ఏకంగా నాలుగు వికెట్లు కూల్చగా.. దీపక్ చహర్ రెండు, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక సన్‌రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ముంబై 15.4 ఓవర్లలో ఛేదించింది. రోహిత్ శర్మ (46 బంతుల్లో 70), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్) రాణించారు.వాళ్లిద్దరి వల్లే ఈ మాత్రం.. ఈ నేపథ్యంలో ముంబై చేతిలో ఓటమి అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) స్పందించాడు. బ్యాటర్ల వైఫల్యమే తమ ఓటమికి కారణమని పేర్కొన్నాడు. ఈ సీజన్లో తమకు ఇంకా కొన్ని మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయని.. వికెట్‌ను సరిగ్గా అంచనా వేయగలిగితేనే ఇకపై ముందుకు సాగే అవకాశం ఉందని కమిన్స్ వ్యాఖ్యానించాడు.‘‘అభినవ్, క్లాసీ వల్ల మేము చెప్పుకోగదగ్గ స్కోరు చేయగలిగాం. కానీ ఈ ఇన్నింగ్స్‌లో మా జట్టు ప్రదర్శన అస్సలు బాలేదు. కనీసం ఇంకొక్కరైనా పట్టుదలగా నిలబడి ఉంటే బాగుండేది.ఇంకా కొన్ని మ్యాచ్‌లే ఉన్నాయిఇదే పిచ్‌పై మా తొలి మ్యాచ్‌లో 280 పరుగులు స్కోరు చేశాం. కానీ ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీ20 మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సమయానుగుణంగా ఇన్నింగ్స్ ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటే మంచిది.లేదంటే పరిస్థితి చేజారుతుంది. మాకింకా కొన్ని మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వికెట్‌ను కచ్చితంగా అంచనా వేసి.. అందుకు అనుగుణంగా ఆడితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలము. అయితే, కొన్నిసార్లు మనం సఫలమైతే.. మరికొన్ని సార్లు ప్రత్యర్థి జట్టు పైచేయి సాధిస్తుంది’’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.కాగా గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌కు ఈ సీజన్లో ఇంకా ఆరు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఆరింటిలోనూ గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు సన్‌రైజర్స్‌పై గెలిచిన ముంబై.. తొమ్మిదింట ఐదో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి దూసుకువచ్చింది. చదవండి: IND Vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం4️⃣th consecutive win for the @mipaltan 👌They make it 2️⃣ in 2️⃣ against #SRH this season 👏Scorecard ▶ https://t.co/nZaVdtwDtv #TATAIPL | #SRHvMI pic.twitter.com/wZMMQnOEi0— IndianPremierLeague (@IPL) April 23, 2025 -
ఇషాన్ కిషన్‌పై దుమ్మెత్తిపోస్తున్న ఎస్ఆర్హెచ్ అభిమానులు.. అమ్ముడుపోయాడంటూ కామెంట్లు
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రెంట్ బౌల్ట్ (4-0-26-4), దీపక్ చాహర్ (4-0-12-2), హార్దిక్ పాండ్యా (3-0-31-1), బుమ్రా (4-0-39-1), సాంట్నర్ (4-0-19-0) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌ను క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకున్నారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయినా.. రోహిత్ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టును గెలిపించారు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వ్యవహరించిన తీరుపై సొంత అభిమానులే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇషాన్ ముంబై ఇండియన్స్‌తో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. ఇషాన్ తమను నమ్మించి వెన్నుపోటు పొడిచాడని దుయ్యబడుతున్నారు. ఇకపై సన్‌రైజర్స్ యాజమాన్యం అతనికి అవకాశాలు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు.అసలేం జరిగిందంటే.. సొంత మైదానంలో ఎస్ఆర్హెచ్ నిన్న ముంబై ఇండియన్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ అంపైర్ ఔట్ ఇవ్వకపోయినా తనంతట తానే మైదానాన్ని వీడాడు. హెడ్ ఔటయ్యాక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్.. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్ తొలి బంతిని లెగ్ సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఇషాన్ బ్యాట్‌ను మిస్సై వికెట్ కీపర్ రికెల్టన్ చేతికి వెళ్లింది. బంతికి బ్యాట్‌కు తాకిందని భావించిన ఇషాన్ అంపైర్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఔటయ్యానని అనుకుని పెవిలియన్ బాట పట్టాడు. రీ ప్లేలో బంతి బ్యాట్‌కు కానీ శరీరానికి కానీ తగల్లేదని తేలింది. దీంతో ఇషాన్‌పై ఎస్ఆర్హెచ్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పటికే హెడ్ ఔటై కష్టాల్లో ఉన్నామని తెలిసి కూడా ఇషాన్‌కు ఇంత నిర్లక్షమా అని మండిపడుతున్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్నా ఇషాన్‌కు ఏ మాత్రం పట్ట లేదని దుయ్యబడుతున్నారు. రూ. 15.25 కోట్లు పెట్టి కొనుక్కుంటే ఇలాగేనా చేసేదని దుమ్మెత్తిపోస్తున్నారు.కాగా, ఈ సీజన్లో ఇషాన్ తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సెంచరీ చేశాడు. అప్పుడు సన్‌రైజర్స్ అభిమానులు ఇషాన్‌ను ఆహా ఓహో అంటూ ఆకాశానికెత్తారు. ఆ మ్యాచ్ తర్వాత ఇషాన్ వరుసగా 7 మ్యాచ్‌ల్లో విఫలమై అభిమానులను నిరాశలో ముంచెత్తాడు. సరిగ్గా ఆడకపోతే ఫామ్‌లో లేడని భావించిన ఫ్యాన్స్, ఔట్ కాకపోయినా ఔటయ్యానని తనకు తానే ప్రకటించుకోవడంపై ఫైరవుతున్నారు. ముంబై ఇండియన్స్ నుంచి వచ్చాడు. ఆ ఫ్రాంచైజీకి అమ్ముడుపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సీజన్లోనే ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇషాన్ ఆ జట్టు ఓనర్ నీతా అంబానీతో చనువుగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇలా చేసినందుకు నీతా మేడం ఇషాన్‌కు రిలయన్స్ మార్ట్ నుండి సరుకులు పంపుతుందని జోక్ చేస్తున్నారు. ఇషాన్ ఐపీఎల్ కెరీర్ ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్‌లోనే కొనసాగిన విషయం తెలిసిందే. -
SRH VS MI: రికార్డుల్లోకెక్కిన రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మరోసారి రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో అత్యంత అరుదైన 12000 పరుగుల మైలురాయిని తాకాడు. నిన్న (ఏప్రిల్ 23) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా (443 ఇన్నింగ్స్‌ల్లో) నిలిచాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన రికార్డు క్రిస్ గేల్ (345 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉంది. గేల్ తర్వాత విరాట్ (360), వార్నర్ (368), అలెక్స్ హేల్స్ (432) అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకారు. ఓవరాల్‌గా టీ20ల్లో 12000 పరుగులు పూర్తి చేసిన 8వ ఆటగాడిగా హిట్‌మ్యాన్ రికార్డుల్లో నిలిచాడు. రోహిత్ తన టీ20 కెరీర్లో 8 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు చేశాడు.నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ మెరుపు హాఫ్ సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ముంబై బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ (4-0-26-4), దీపక్ చాహర్ (4-0-12-2), హార్దిక్ పాండ్యా (3-0-31-1), బుమ్రా (4-0-39-1), సాంట్నర్ (4-0-19-0) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌ను క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకున్నారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయింది. అయినా రోహిత్ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టును గెలిపించారు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. -
హార్దిక్ పాండ్యాతో ఫొటో..SRHvsMI మ్యాచ్‌లో నటి కుషిత కల్లపు (ఫొటోలు)
-
SRH Vs MI: లైన్లోకి వచ్చారా వార్ వన్ సైడే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ను ముంబై ఇండియన్స్ చెత్తగా ప్రారంభించి, తిరిగి గాడిలో పడింది. తొలి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పరాజయాల తర్వాత వరుసగా నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఆ జట్టుకు పడి లేవడం కొత్త కాదు. గతంలో చాలా సీజన్లలో ఇలాగే తొలుత పరాజయాలు ఎదుర్కొని ఆతర్వాత టైటిల్ రేసులో నిలిచింది. ప్రస్తుత సీజన్లోనూ ముంబై ఇండియన్స్ అదే ఒరవడిని కొనసాగిస్తుంది.ఆ జట్టు ఆటగాళ్లు ఒక్కసారి ఊపులోకి వస్తే వార్ సైడ్ అవుతుంది. ఇది మరోసారి నిరూపితమైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ విఫలం కావడం.. బ్యాటర్లలో పెద్దగా ఆత్య విశ్వాసం లేకపోవడం.. పేసర్లు లయను అందిపుచ్చుకోలేకపోవడం, బుమ్రా అందుబాటులో లేకపోవడం వంటివి జరిగాయి. ఈ కారణాల చేత ముంబై తొలి మ్యాచ్‌ల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంది.అయితే ప్రస్తుతం సీన్ మారిపోయింది. రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. బుమ్రా జట్టులో చేరడమే కాకుండా, సామర్థ్యం మేరకు సత్తా చాటుడుతున్నాడు. బ్యాటర్లు తిరిగి ఆత్మ విశ్వాసాన్ని పొందారు. బౌలర్లు, ముఖ్యంగా పేసర్లు లయను అందుకున్నారు. దీపక్ చాహర్, సూర్యకుమార్, బౌల్ట్, మిచెల్ సాంట్నర్ అత్యుత్తమంగా రాణిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవకాశం వచ్చిన ప్రతిసారి చెలరేగుతున్నాడు.నిన్న (ఏప్రిల్ 23) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పైన పేర్కొన్న ఆటగాళ్లంతా తలో చేయి వేయడంతో ముంబై ఇండియన్స్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ సీజన్లో ముంబై సన్‌రైజర్స్‌ను ఓడించడం ఇది రెండో సారి. నిన్నటి మ్యాచ్‌లో టాస్ గెలిచి సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ముంబై.. ఆ జట్టును స్వల్ప స్కోర్‌కే పరిమతం చేసింది. పేసర్లు బౌల్ట్, చాహర్ చెలరేగడంతో సన్‌రైజర్స్ 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి 100 పరుగులైనా చేస్తుందా అనిపించింది. అయితే క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకోవడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలిగింది. బౌల్ట్ 4, చాహర్ 2, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ తీసి సన్‌రైజర్స్ పుట్టి ముంచారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయినా.. రోహిత్ (46 బంతుల్లో 70).. విల్ జాక్స్‌తో (22) పాటు ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. జాక్స్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్) తన సహజ శైలిలో రెచ్చిపోయి బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి విజయానికి చేరువలో ఔటయ్యాడు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ జట్టు చివరిగా 2020 సీజన్లో నాలుగు అంతకంటే ఎక్కువ విజయాలు సాధించింది. ఆ సీజన్లో ముంబై వరుసగా 5 మ్యాచ్‌ల్లో గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అదే ముంబై ఇండియన్స్‌ను చివరి (ఐదో) టైటిల్. -
IPL 2025: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు (ఏప్రిల్ 23) ఐపీఎల్లో జరుగబోయే సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు ముందు ఓ నిమిషం మౌనం పాటించాలని నిర్ణయించింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు, మ్యాచ్ అఫీషియల్స్ నల్లటి బ్యాండ్లు ధరించాలని పిలుపునిచ్చింది. మ్యాచ్ సమయంలో బాణసంచా కాల్చకూడదని గైడ్ లైన్స్ జారీ చేసింది. మ్యాచ్ సందర్భంగా చీర్ లీడర్ల ప్రదర్శనలు ఉండవని స్పష్టం చేసింది.కాగా, కశ్మీర్‌లోని పహల్గామ్లో నిన్న (ఏప్రిల్ 22) మధ్యాహ్నం భయానమైన ఉగ్రవాద దాడి జరిగింది. పహల్గామ్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులు. 2019 పుల్వామా దాడి తర్వాత కశ్మీర్లో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడి ఇదే. ఈ విషాద ఘటనతో దేశం మొత్తం నిర్ఘాంతపోయింది. ఈ ఉగ్రదాడిని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది. బీసీసీఐ సహా భారత క్రికెటర్లు బాధితులకు నివాళులర్పించి, సంతాపం తెలియజేశారు.ఇదిలా ఉంటే, ఇవాళ (ఏప్రిల్ 23) రాత్రి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు తలపడటం ఇది రెండోసారి. ఏప్రిల్ 17న తమ హోం గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో ముంబై హైదరాబాద్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తప్పక గెలవాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే సన్‌రైజర్స్ అనధికారికంగా లీగ్ నుంచి నిష్క్రమించినట్లే. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు కూడా కీలకమే. ఆ జట్టు కూడా ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట ఓడి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ముంబై 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి ఆరో స్థానంలో కొనసాగుతుంది.నేటి మ్యాచ్ సన్‌రైజర్స్ తమ సొంత ఇలాకాలో ఆడుతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. తమ విధ్వంసకర ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో తప్పక చెలరేగుతారని సన్‌రైజర్స్ అభిమానులు ఆశిస్తున్నారు. సన్‌రైజర్స్‌కు హోం గ్రౌండ్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఇక్కడ ఆడిన మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఆటగాళ్లు పేట్రేగిపోయారు. నేటి మ్యాచ్‌లో అదే జోరు కొనసాగిస్తారో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి. తుది జట్లు (అంచనా)సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (c), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ, ఎషాన్ మలింగముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (wk), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్ -
IPL 2025: సన్‌రైజర్స్‌పై విజయం.. చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా వాంఖడే మైదానం వేదికగా నిన్న (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో మూడు సిక్సర్లు (2 ఆనికేత్, కమిన్స్ ఒకటి) సహా 22 పరుగులు, అంతకుముందు దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రావడంతో సన్‌రైజర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 40, ట్రవిస్ హెడ్ 28, ఇషాన్ కిషన్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 19, క్లాసెన్ 37, అనికేత్ 18 (నాటౌట్), కమిన్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై మరో 11 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 31, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, హార్దిక్ 21, తిలక్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, ఎషాన్ మలింగ 2, హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. తొలుత బంతితో, ఆతర్వాత బ్యాట్‌తో రాణించిన విల్ జాక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌ఎస్‌ఆర్‌హెచ్‌పై గెలుపుతో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఓ వేదికపై ఛేజింగ్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. వాంఖడే మైదానంలో ముంబై 29 సార్లు (47 మ్యాచ్‌ల్లో) లక్ష్యాలను ఛేదిస్తూ విజయాలు సాధించింది. ఈ రికార్డు సాధించే క్రమంలో ముంబై కేకేఆర్‌ను అధిగమించింది. కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్‌లో 28 సార్లు (40 మ్యాచ్‌ల్లో) లక్ష్యాలను ఛేదిస్తూ విజయాలు సాధించింది.ఐపీఎల్లో ఓ వేదికపై ఛేజింగ్ చేస్తూ అత్యధిక విజయాలు సాధించిన జట్లు..ముంబై ఇండియన్స్- వాంఖడే స్టేడియం- 29 విజయాలు (47 మ్యాచ్‌లు)కేకేఆర్- ఈడెన్ గార్డెన్స్- 28 (40)రాజస్థాన్ రాయల్స్- సువాయ్ మాన్ సింగ్ స్టేడియం- 24 (31)ఆర్సీబీ- చిన్నస్వామి స్టేడియం- 21 (41)సన్‌రైజర్స్ హైదరాబాద్- ఉప్పల్ స్టేడియం- 21 (32)సీఎస్కే- చెపాక్ స్టేడియం- 20 (31) -
MI vs SRH: వాళ్లిద్దరి తప్పేమీ లేదు!.. క్లాసెన్ కొంపముంచాడు!
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klassen) ఓ పొరపాటు చేశాడు. అతడి తప్పిదం కారణంగా ముంబై ఓపెనర్ రియాన్ రికెల్టన్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. క్లాసెన్ తప్పు వల్ల లైఫ్ పొందిన అతడు తన స్కోరుకు మరో పది పరుగులు జతచేసి.. ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.162 పరుగులుఅసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గురువారం ముంబై- హైదరాబాద్ (MI vs SRH) జట్లు తలపడ్డాయి. వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ముంబై ఇండియన్స్.. రైజర్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో కమిన్స్ బృందం 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది.సన్‌రైజర్స్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40) టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్ (28 బంతుల్లో 37) కూడా రాణించాడు. ఇక రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఓపెనర్ రోహిత్ శర్మ(16 బంతుల్లో 26) కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చిఇక మరో ఓపెనర్ రియాన్ రికెల్టన్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో అతడు అవుటయ్యాడని భావించి మైదానం వీడే సమయానికి.. హై డ్రామా చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన ఫోర్త్ అంపైర్.. రికెల్టన్ పెవిలియన్‌కు వెళ్లకుండా ఆపేశాడు. జీషన్ వేసిన బంతిని నో బాల్‌గా ప్రకటించాడు.క్లాసెన్ చేసిన తప్పు వల్లనిజానికి రికెల్టన్ను అవుట్ చేసే విషయంలో బౌలర్‌గా జీషన్ అన్సారీ.. ఫీల్డర్‌గా క్యాచ్ అందుకోవడంలో కమిన్స్ ఎలాంటి పొరపాటు చేయలేదు. కానీ వికెట్ కీపర్ క్లాసెన్ చేసిన తప్పు వల్ల రికెల్టన్కు లైఫ్ వచ్చింది.కారణం ఇదేవిషయం ఏమిటంటే.. క్యాచ్‌ను అందుకునే లేదా స్టంపింగ్ ప్రయత్నంలో వికెట్ కీపర్ గ్లవ్స్ స్టంప్స్ ముందుకు రాకూడదు. ఇది అందరికీ తెలిసిన, చాలా కాలంగా అమల్లో ఉన్న నిబంధనే. కానీ గురువారం ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అన్సారీ వేసిన బంతిని రికెల్టన్ ఆడి కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు.అయితే దీనిని ‘నోబాల్’గా ప్రకటిస్తూ అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు. రికెల్టన్ షాట్ ఆడక ముందే క్లాసెన్ గ్లవ్స్ ముందుకు రావడం ఇందుకు కారణం. ఇది ఐసీసీ నిబంధన 27.3.1కు విరుద్ధం. అందుకే అంపైర్లు నోబాల్ ఇచ్చారు. క్లాసెన్ కూడా తాను చేసిన తప్పును వెంటనే అంగీకరిస్తూ సైగ చేయడం గమనార్హం. వాంఖడేలో జయభేరిఇక ముంబై బ్యాటర్లలో రికెల్టన్ 31 పరుగులు చేయగా.. విల్ జాక్స్ (36), సూర్యకుమార్ యాదవ్ (26), తిలక్ వర్మ (21 నాటౌట్) రాణించారు. ఆఖర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ముంబై మరో పదకొండు బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. 18.1 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసి.. నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ హైదరాబాద్ స్కోర్లుహైదరాబాద్: 162/5 (20)ముంబై: 166/6 (18.1)ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ముంబై విజయం.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్! -
నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. మాజీ ఓనర్ రియాక్షన్ ఇదే!
ఐపీఎల్-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ (MI vs SRH) మ్యాచ్ సందర్భంగా గురువారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రైజర్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan).. ముంబై జట్టు యజమాని నీతా అంబానీ (Nita Ambani)ని కలిశాడు. ముంబై చేతిలో ఓటమి అనంతరం తన మాజీ ఓనర్ దగ్గరకు వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించాడు.ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్బదులుగా ఇషాన్ కిషన్ చేతిని పట్టుకుని.. తల్లి మాదిరి ప్రేమపూర్వకంగా నీతా అంబానీ అతడి చెంప నిమిరారు. ఓటమికి కుంగిపోవాల్సిన పనిలేదన్నట్లుగా ఇషాన్‌ను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకాపై మీమ్స్ పేలుతున్నాయి. ‘‘తమ జట్టుతో ప్రయాణించిన మాజీ ఆటగాడి పట్ల నీతా తల్లిలా ప్రేమను కురిపిస్తుంటే.. గోయెంకా మాత్రం ఒక్క మ్యాచ్‌లో ఓడినా తమ కెప్టెన్లను అందరి ముందే ఉతికి ఆరేస్తాడు.. ఇదే ఈ ఇద్దరికి ఉన్న తేడా’’ అంటూ ముంబై అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా 2016లో ఇషాన్ కిషన్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. గుజరాత్ లయన్స్ అతడిని రూ. 35 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయగా.. రెండేళ్ల పాటు అదే జట్టుకు ఆడి 319 పరుగులు చేశాడు.ముంబైతో సుదీర్ఘ అనుబంధంఅయితే, గుజరాత్ ఫ్రాంఛైజీ ఐపీఎల్ నుంచి కనుమరుగైన తర్వాత ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేసింది. 2018 వేలంలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ను సొంత చేసుకోగా.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆ ఏడాది 500కు పైగా పరుగులు సాధించాడు. అప్పటి నుంచి ఏడేళ్లపాటు ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2022 వేలంలో అత్యధికంగా రూ. 15.25 కోట్ల ధర పలికాడు.రూ. 11.25 కోట్లకు రైజర్స్‌కు సొంతంఅయితే, మెగా వేలం-2025కి ముందు ముంబై ఇషాన్ కిషన్‌ను వదిలేసింది. ఈ క్రమంలో వేలంపాటలోనూ అతడిని కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇక అతడి కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లకు ఇషాన్‌ను కొనుక్కుంది. ఇప్పటి వరకు ఐపీఎల్-2025లో విధ్వంసకర శతకం (106 నాటౌట్) బాదడం మినహా ఇషాన్ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఏడు మ్యాచ్‌లలో కలిపి అతడు సాధించిన పరుగులు 138. నాలుగు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఓటమిఇక ముంబై- సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ విషయానికొస్తే.. వాంఖడేలో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన కమిన్స్ బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆరు వికెట్లు నష్టపోయి 18.1 ఓవర్లలో టార్గెట్‌ను పూర్తి చేసింది. బంతితో, బ్యాట్‌తో రాణించిన ముంబై ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఫ్ స్పిన్నర్ అయిన జాక్స్ మూడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 14 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రవిస్ హెడ్ (28), ఇషాన్ కిషన్ (2) రూపంలో రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో వన్‌డౌన్‌లో వచ్చిన విల్ జాక్స్ 26 బంతుల్లో 36 పరుగులు సాధించాడు.చదవండి: ఇలాంటి వికెట్ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025 -
ఇలాంటి వికెట్ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)కు మరోసారి చేదు అనుభవమే మిగిలింది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కమిన్స్ బృందం నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమిష్టి వైఫల్యం కారణంగా ఈ సీజన్లో ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది.అంతేకాదు.. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు సొంత మైదానం వెలుపల ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ముంబై చేతిలో ఓటమి అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins)తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.ఇలాంటి వికెట్ మీద కష్టమే..‘‘వాంఖడే వికెట్‌పై పరుగులు రాబట్టడానికి కష్టపడాల్సి వచ్చింది. బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు సులువుగానే రన్స్ చేయొచ్చనే అనిపించింది. కానీ అనూహ్యంగా పిచ్ పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. ఏదేమైనా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.ఎక్కడిక్కడ మమ్మల్ని కట్టడి చేశారు. మేము కూడా బాగానే బ్యాటింగ్ చేశాం. ఇలాంటి వికెట్ మీద 160 అనేది మెరుగైన స్కోరే. కానీ మేము ఇంకాస్త బెటర్‌గా బ్యాటింగ్ చేయాల్సింది. ఈరోజు మా వాళ్లు పవర్‌ప్లేలో ఎలాంటి తొందరపాటు చర్యలకు పోలేదు.మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీనిర్లక్ష్య రీతిలో హిట్టింగ్ కూడా ఆడలేదు. కానీ ఇలా జరిగిపోయింది. మేము ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో!.. ఇక మా బౌలింగ్ విషయానికొస్తే డెత్ ఓవర్లలో మా ప్రదర్శన పర్వాలేదనిపించింది.ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన బౌలర్‌తో 1-2 ఓవర్లు మాత్రమే వేయించగలము అనిపించింది. అందుకే రాహుల్ చహర్‌ను తీసుకువచ్చాం. ఫైనల్‌కు చేరుకోవాలంటే హోం గ్రౌండ్ వెలుపల ఎక్కువగా మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.కానీ దురదృష్టవశాత్తూ ఈ సీజన్లో మేము ఇంత వరకు ఇతర వేదికలపై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాం. పొరపాట్లను సమీక్షించుకుని సానుకూలంగా ముందుకు వెళ్తాం. తదుపరి మా సొంత మైదానంలో మ్యాచ్ ఆడబోతున్నాం. మాకు అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది కాబట్టి.. అనుకున్న ఫలితం రాబట్టగలమని నమ్ముతున్నాం’’ అని ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు.శైలికి భిన్నంగాకాగా వాంఖడే వేదికగా టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. దూకుడైన తమ శైలికి భిన్నంగా రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40), ట్రవిస్ హెడ్ (29 బంతుల్లో 28) నెమ్మదిగా ఆడారు. ఇషాన్ కిషన్ (2), నితీశ్ రెడ్డి (21 బంతుల్లో 19) పూర్తిగా విఫలం కాగా.. క్లాసెన్ (28 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించాడు.ఆఖర్లో అనికేత్ వర్మ (8 బంతుల్లో 18 నాటౌట్), కమిన్స్ (4 బంతుల్లో 8 నాటౌట్) కాస్త వేగంగా ఆడగా.. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి రైజర్స్ ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీయగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ విల్ జాక్స్ రెండు వికెట్లు కూల్చాడు.పాండ్యా మెరుపులుఇక లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆరు వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (31), రోహిత్ శర్మ (26) ఫర్వాలేదనిపించగా.. విల్ జాక్స్ (36), సూర్యకుమార్ యాదవ్ (26), తిలక్ వర్మ (17 బంతుల్లో 21 నాటౌట్) రాణించారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్ (9 బంతుల్లో 21)తొ మెరిసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. రైజర్స్ కెప్టెన్ కమిన్స్‌కు మూడు, ఇషాన్ మలింగకు రెండు, హర్షల్ పటేల్‌కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్‌కు జాక్ పాట్..?Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025 -
ముంబైకి ప్రధాన సమస్య అతడే!.. సీజన్ మొత్తం ఎలా భరిస్తారో!?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఐపీఎల్-2025లో పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముంబై ఇండియన్స్ (Mumabi Indians)కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో కలిపి చేసిన పరుగులు కేవలం 56. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రోహిత్.. 12 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులే చేశాడు.మరోవైపు.. ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి కూడా దారుణంగా ఉంది. గత సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచిన హార్దిక్ సేన.. ఈసారి కూడా ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో ముంబై కేవలం రెండే గెలవడం ఇందుకు నిదర్శనం.సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఢీఇక ఐపీఎల్-2025 (IPL 2025)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన హార్దిక్ సేన.. గురువారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది. ఇందుకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వైఫల్యం ముంబైపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న అంశంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బ్యాటింగ్ ఆర్డరే ప్రధాన సమస్య‘‘ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. బ్యాటింగ్ ఆర్డర్. అవును ఇది నిజమే. ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులు సాధించలేకపోతున్నాడు. ఒకవేళ అతడి వైఫల్యం ఇలాగే కొనసాగితే ముంబై బ్యాటింగ్ ఆర్డర్ కుదేలవడం ఖాయం.రోహిత్ కుదురుకోకపోతే.. ఎవరిని ఎప్పుడు బ్యాటింగ్‌కు పంపాలో అర్థం కాని పరిస్థితి. నిజానికి ఓపెనర్‌గా రియాన్ రికెల్టన్ రాణిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ డీసెంట్‌గా బ్యాటింగ్ చేస్తున్నారు.నమన్ ధీర్ చక్కగా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా ఫామ్‌లోనే ఉన్నాడు. ఇకపోతే.. విల్ జాక్స్ తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నా.. పర్లేదనిపిస్తున్నాడు. ఎటొచ్చీ రోహిత్ శర్మ ఫామ్‌లేమి వల్లే సమస్య. అతడు ఓపెనర్ కాబట్టి నమన్ ధీర్, విల్ జాక్స్ వంటి వాళ్లను బ్యాటింగ్ ఆర్డర్లో వెనుక పంపాల్సి వస్తోంది.సీజన్ ఆసాంతం అతడిని ఎలా భరిస్తుందో?ఏదేమైనా రోహిత్ వైఫల్యాలు ఇలాగే కొనసాగితే ముంబై ఇండియన్స్ సీజన్ ఆసాంతం అతడిని ఎలా భరిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు’’ అని భారత జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. రోహిత్ శర్మ గొప్ప టీ20 ప్లేయర్ అని.. అయితే, ఆది నుంచే దూకుడు ప్రదర్శించకుండా కాస్త జాగ్రత్తగా ఆడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.చదవండి: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?: షేన్ వాట్సన్ ఫైర్