
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ కమిందు మెండిస్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. మెండిస్ అద్బుతమైన క్యాచ్‌తో సీఎస్‌కే ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌ను పెవిలియన్‌కు పంపాడు.
చెన్నై ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ ఐదో బంతిని బ్రెవిస్‌కు ఔట్ సైడ్ ఆఫ్ స్లో డెలివరీగా సంధించాడు. ఆ బంతిని బేబీ ఏబీడీ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్స్ అని భావించారు. కానీ లాంగాఫ్‌లో ఉన్న మెండిస్ అద్భుతం చేశాడు.
లాంగ్-ఆఫ్‌లో ఉన్న మెండిస్ గాలిలోకి తన ఎడమ వైపునకు దూకి సూపర్‌మ్యాన్‌లా క్యాచ్ అందుకున్నాడు. ఇది చూసిన బ్రెవిస్ ఒక్కసారిగా షాక్ పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఏడాది సీజన్‌లో అత్యుత్తమ క్యాచ్ అని నెటిజన్లు కొనియాడుతున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. చెన్నై బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్(42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మాత్రే(30), రవీంద్ర జడేజా(21) రాణించారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్యాట్ కమ్మిన్స్, జయదేవ్ ఉనద్కట్ తలా రెండు వికెట్లు సాధించారు. సీఎస్‌కే కెప్టెన్ ధోనికి ఇది 400వ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం.
Only a catch like that could’ve stopped that cameo from Brevis! 🤯
Kamindu Mendis, take a bow 🙇#CSK 119/6 after 14 overs.
Updates ▶ https://t.co/26D3UalRQi#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/NvthsQfpUj— IndianPremierLeague (@IPL) April 25, 2025