
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025 (IPL 2025 )లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS vs KKR) అనూహ్య విజయంతో ఆకట్టుకుంది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో సంచలన రీతిలో గెలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అతి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా ఘనత సాధించింది. ఇందుకు ప్రధాన కారణం పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal).
రూ. 18 కోట్లకు కొనుగోలు
ఐపీఎల్-2025 మెగా వేలంలో చహల్‌ను పంజాబ్ ఏకంగా రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, సీజన్ ఆరంభం నుంచి ఇంతవరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు. తొలి ఐదు మ్యాచ్‌లలో కలిపి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.
అయితే, కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్... 112 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించి తన విలువను చాటుకున్నాడు చహల్. ఈ మణికట్టు స్పిన్నర్ దెబ్బకు కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.
మణికట్టు స్పిన్నర్ మాయాజాలం
చహల్ ధాటికి కెప్టెన్ అజింక్య రహానే (17) సహా అంగ్‌క్రిష్ రఘువన్షీ (37), రింకూ సింగ్ (2), రమణ్‌దీప్ సింగ్ (0).. ఇలా కేకేఆర్‌కు చెందిన నలుగురు కీలక బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టారు. ఆ తర్వాత ఆండ్రీ రసెల్ 11 బంతుల్లో 17 పరుగులతో కేకేఆర్ శిబిరంలో ఆశలు రేపినా మార్కో యాన్సెన్ అతడి ఆట కట్టించడంతో.. పంజాబ్ గెలుపు ఖరారైంది.
చహల్‌ను హగ్ చేసుకున్న ప్రీతి జింటా
ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. జట్టు సహ యజమాని ప్రీతి జింటా అయితే సంతోషం పట్టలేకపోయారు. స్టాండ్స్‌లో పరిగెడుతూ సహచరులతో ఆనందం పంచుకున్నారు.
Along with Kohli, Want to see Preity Zinta winning IPL trophy soon❤️
Such a passionate supporter for 18 years without fail👌
pic.twitter.com/viyPn107oV— Gss🇮🇳 (@Gss_Views) April 15, 2025
అంతేకాదు.. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన చహల్‌ను ఆలింగనం చేసుకుని అభినందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కేకేఆర్ చేజేతులా
కాగా ముల్లన్‌పూర్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్‌సింగ్ (30) మాత్రమే ఇరవై పరుగుల మార్కు దాటగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. ఫలితంగా 15.3 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసి పంజాబ్ ఆలౌట్ అయింది.
కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా మూడు, సునిల్ నరైన్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జే ఒక్కో వికెట్ తీశారు. ఇక స్వల్ప లక్ష్యాన్ని సులువుగానే ఛేదిస్తుందనుకున్న పంజాబ్ 15.1 ఓవర్లలో 95 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.
ఫలితంగా 16 పరుగులు తేడాతో పంజాబ్ సొంత మైదానంలో జయభేరి మోగించింది. మార్కో యాన్సెన్ (3/17), చహల్ (4/28) కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేయగా.. జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
చదవండి: IPL 2025: కేకేఆర్ కొంపముంచిన రహానే.. ఆ ఒక్క తప్పు చేయకపోయింటే?
𝙏𝙃𝙄𝙎. 𝙄𝙎. 𝘾𝙄𝙉𝙀𝙈𝘼 🎬#PBKS have pulled off one of the greatest thrillers in #TATAIPL history 😮
Scorecard ▶️ https://t.co/sZtJIQpcbx#PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/vYY6rX8TdG— IndianPremierLeague (@IPL) April 15, 2025
Preity Zinta was really happy with performance of Punjab Kings Today.
congrats @PunjabKingsIPL for a thriller victory. pic.twitter.com/iNvuXm6TJB— 𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧🧛 (@hiit_man45) April 15, 2025