Priety Zinta
-
KKR Vs PBKS: రూ. 18 కోట్లు.. పైసా వసూల్ ప్రదర్శన!.. చహల్‌ను హగ్ చేసుకున్న ప్రీతి జింటా
ఐపీఎల్-2025 (IPL 2025 )లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS vs KKR) అనూహ్య విజయంతో ఆకట్టుకుంది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో సంచలన రీతిలో గెలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అతి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా ఘనత సాధించింది. ఇందుకు ప్రధాన కారణం పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal).రూ. 18 కోట్లకు కొనుగోలుఐపీఎల్-2025 మెగా వేలంలో చహల్‌ను పంజాబ్ ఏకంగా రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, సీజన్ ఆరంభం నుంచి ఇంతవరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు. తొలి ఐదు మ్యాచ్‌లలో కలిపి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.అయితే, కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్... 112 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించి తన విలువను చాటుకున్నాడు చహల్. ఈ మణికట్టు స్పిన్నర్ దెబ్బకు కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.మణికట్టు స్పిన్నర్ మాయాజాలంచహల్ ధాటికి కెప్టెన్ అజింక్య రహానే (17) సహా అంగ్క్రిష్ రఘువన్షీ (37), రింకూ సింగ్ (2), రమణ్‌దీప్ సింగ్ (0).. ఇలా కేకేఆర్‌కు చెందిన నలుగురు కీలక బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టారు. ఆ తర్వాత ఆండ్రీ రసెల్ 11 బంతుల్లో 17 పరుగులతో కేకేఆర్ శిబిరంలో ఆశలు రేపినా మార్కో యాన్సెన్ అతడి ఆట కట్టించడంతో.. పంజాబ్ గెలుపు ఖరారైంది. చహల్‌ను హగ్ చేసుకున్న ప్రీతి జింటాఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. జట్టు సహ యజమాని ప్రీతి జింటా అయితే సంతోషం పట్టలేకపోయారు. స్టాండ్స్‌లో పరిగెడుతూ సహచరులతో ఆనందం పంచుకున్నారు. Along with Kohli, Want to see Preity Zinta winning IPL trophy soon❤️Such a passionate supporter for 18 years without fail👌pic.twitter.com/viyPn107oV— Gss🇮🇳 (@Gss_Views) April 15, 2025అంతేకాదు.. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన చహల్‌ను ఆలింగనం చేసుకుని అభినందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.కేకేఆర్ చేజేతులాకాగా ముల్లన్‌పూర్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్‌సింగ్ (30) మాత్రమే ఇరవై పరుగుల మార్కు దాటగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. ఫలితంగా 15.3 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసి పంజాబ్ ఆలౌట్ అయింది.కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా మూడు, సునిల్ నరైన్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జే ఒక్కో వికెట్ తీశారు. ఇక స్వల్ప లక్ష్యాన్ని సులువుగానే ఛేదిస్తుందనుకున్న పంజాబ్ 15.1 ఓవర్లలో 95 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఫలితంగా 16 పరుగులు తేడాతో పంజాబ్ సొంత మైదానంలో జయభేరి మోగించింది. మార్కో యాన్సెన్ (3/17), చహల్ (4/28) కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేయగా.. జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. చదవండి: IPL 2025: కేకేఆర్ కొంపముంచిన రహానే.. ఆ ఒక్క తప్పు చేయకపోయింటే?𝙏𝙃𝙄𝙎. 𝙄𝙎. 𝘾𝙄𝙉𝙀𝙈𝘼 🎬#PBKS have pulled off one of the greatest thrillers in #TATAIPL history 😮Scorecard ▶️ https://t.co/sZtJIQpcbx#PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/vYY6rX8TdG— IndianPremierLeague (@IPL) April 15, 2025Preity Zinta was really happy with performance of Punjab Kings Today.congrats @PunjabKingsIPL for a thriller victory. pic.twitter.com/iNvuXm6TJB— 𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧🧛 (@hiit_man45) April 15, 2025 -
ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్- చెన్నై సూపర్ కింగ్స్ (PBKS vs CSK) మధ్య మంగళవారం నాటి మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఆరంభంలోనే వికెట్లు తీస్తూ జోష్‌లో ఉన్న రుతురాజ్ సేనకు.. ఆ తర్వాత వరుస షాకులు తగిలాయి. పంజాబ్ యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (Priyansh Arya) ఆకాశమే హద్దుగా చెలరేగి.. చెన్నై బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు.పంజాబ్ @ 219 తాను ఇచ్చిన క్యాచ్‌లను డ్రాప్ చేసి లైఫ్ ఇచ్చిన ప్రత్యర్థి జట్టుపై ఏమాత్రం కనికరం లేకుండా వీరబాదుడు బాదాడు. కేవలం 42 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఏకంగా తొమ్మిది సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు. అయితే, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో విజయ్ శంకర్ క్యాచ్ పట్టడంతో ఎట్టకేలకు ప్రియాన్ష్ ఆర్య సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.అయితే, ఈ ఆనందాన్ని శశాంక్ సింగ్, మార్కో యాన్సెన్ సీఎస్కే ఎక్కువ సేపు నిలవనీయలేదు. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసిన శశాంక్ సింగ్ 36 బంతుల్లో 52.. యాన్సెన్ 19 బంతుల్లో 34 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు సాధించింది.చిన్న పిల్లలా గెంతులేస్తూఅయితే, ఇన్నింగ్స్ రెండో బంతికే ప్రియాన్ష్ ఆర్య ఇచ్చిన క్యాచ్ మిస్ చేయడం ద్వారా.. పంజాబ్ భారీ స్కోరుకు చేజేతులా బీజం వేసిన సీఎస్కే.. ఆ తర్వాత మరో రెండుసార్లు లైఫ్ ఇచ్చింది. దీంతో అతడు మెరుపు శతకంతో దుమ్ములేపాడు. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటా చిన్న పిల్లలా గెంతులేస్తూ ప్రియాన్ష్ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నారు.This is what we pay our internet bills for... ❤️pic.twitter.com/mE38MmXFB0— Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2025 స్టాండ్స్‌లో అటూ ఇటూ పరిగెడుతూ ప్రీతి.. ధోని సీరియస్మరోవైపు.. శశాంక్ సింగ్ 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించగా.. టాప్ ఎడ్జ్‌కు తాకి బంతి గాల్లోకి లేచింది. అయితే, అతడు ఇచ్చిన క్యాచ్‌ను రచిన్ రవీంద్ర డ్రాప్ చేశాడు. అప్పటికి శశాంక్ సింగిల్ పూర్తి చేసుకున్నాడు. అయితే, మరో చెత్త విషయం ఏమిటంటే.. ఓవర్‌త్రో కారణంగా పంజాబ్‌కు మరో అదనపు పరుగు లభించింది.ఈ క్రమంలో ప్రీతి జింటా.. స్టాండ్స్‌లో అటూ ఇటూ పరిగెడుతూ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, అదే సమయంలో చెన్నై మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని కోపం పట్టలేక సీరియస్ లుక్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.Preity zinta cutie enjoying shashank’s catch drop😇😇Thankyou csk 🤣🤣 #CSKvsPBKS #pbksvscsk pic.twitter.com/xpCdtuuz6v— gαנαℓ (@Gajal_Dalmia) April 8, 2025ఇక పంజాబ్ విధించిన 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చెన్నై చతికిల పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసి.. 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సీఎస్కే బ్యాటర్లలో ఓపెనర్లు రచిన్ రవీంద్ర (36), డెవాన్ కాన్వే (69 రిటైర్డ్ అవుట్), శివం దూబే (42), ధోని (27) ఫర్వాలేదనిపించారు. కాగా ఈ సీజన్లో చెన్నైకి ఇది వరుసగా నాలుగో ఓటమి కాగా.. పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది. Back to winning ways this season ✅First home win this season ✅@PunjabKingsIPL compile a comprehensive 1⃣8⃣-run victory over #CSK ❤️Scorecard ▶ https://t.co/HzhV1VtSRq #TATAIPL | #PBKSvCSK pic.twitter.com/HtcXw4UYAK— IndianPremierLeague (@IPL) April 8, 2025చదవండి: PBKS Vs CSK: గ్లెన్ మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ! -
పెళ్లికి ముందు కీర్తి అలా.. చాన్నాళ్ల తర్వాత మెగా కోడలు ఇలా!
అందాల విందు చేసేలా శ్రీముఖి స్టిల్స్అత్తారింట్లో అడుగుపెట్టిన నటుడు జయరామ్ కోడలుడిజైనర్ వేర్లో కీర్తి సురేశ్ వయ్యారాలుమెగా కోడలు లావణ్య త్రిపాఠి క్లాస్ టచ్స్లీవ్లెస్ డ్రస్సులో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ప్రీతి జింటాలండన్లో చిల్ అవుతున్న మాళవిక మోహనన్'కిస్సిక్' పాటకు స్టెప్పులేసిన అరియానా-సౌమ్య View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Jayaram (@actorjayaram_official) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Face Magazine (@facemag.in) View this post on Instagram A post shared by Pranati Rai Prakash (@pranati_rai_prakash) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Rithu Manthra (@rithumanthra_) View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Kalidas Jayaram (@kalidas_jayaram) View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Sathya krishnan (@sathya_krishnan27) View this post on Instagram A post shared by Sowmya Rao (@sowmya.sharada) View this post on Instagram A post shared by Anju Kurian (Ju) (@anjutk10) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఇటీవల సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తమ జట్టుకు సంబంధించి అభిమానులు వేస్తున్న ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇస్తూ వారిని ఖుషీ చేస్తున్నారు.ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘‘పంజాబ్ కింగ్స్‌లో మీకిష్టమైన ఆటగాడు ఎవరు?’’ అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా.. ప్రీతి జింటా వీరేంద్ర సెహ్వాగ్, ఆడం గిల్‌క్రిస్ట్ పేర్లను చెప్పారు.ఈ మేరకు.. ‘‘డేంజరస్ వీరూగా ఉన్నందుకు వీరేంద్ర సెహ్వాగ్’’ అంటూ హార్ట్ సింబల్ జత చేసిన ప్రీతి జింటా.. ఆడం గిల్‌క్రిస్ట్ అంటే కూడా తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. నాయకుడిగా, ఆటగాడిగా అతడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.కాగా 2014, 2015 సీజన్లలో పంజాబ్ జట్టు తరఫున టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దుమ్ములేపాడు. 30 మ్యాచ్‌లలో కలిపి 660 పరుగులు సాధించాడు. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్‌తో క్వాలిఫయర్ మ్యాచ్‌లో అతడు 122 పరుగులు సాధించడం హైలైట్‌గా నిలిచింది.ఇక ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆడం గిల్‌క్రిస్ట్ సైతం 2011- 2103 మధ్య పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 34 మ్యాచ్‌లలో కలిపి 849 రన్స్ చేశాడు. నిలకడైన ఫామ్‌తో జట్టుకు విజయాలు అందించాడు. కెప్టెన్‌గానూ రాణించాడు.గిల్‌క్రిస్ట్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ 2011లో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. 2012, 2013లో ఆరో స్థానం సంపాదించింది.ఇక ఫేవరెట్ ప్లేయర్ ప్రశ్న తర్వాత.. ‘‘పంజాబ్ కింగ్స్ జట్టు కోసం మీరింకా ఆలూ పరాఠాలు చేస్తున్నారా?’’ అని ఓ నెటిజన్ అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘లేదు.. అప్పట్లో సౌతాఫ్రికాలో ఓసారి మా జట్టు గెలిచిన తర్వాత పరాఠాలు చేసిచ్చాను. ఆ తర్వాత అలాంటివేమీ చేయలేదు’’ అని ప్రీతి జింటా పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ మరోసారి పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన పదకొండు మ్యాచ్‌లలో కేవలం నాలుగు గెలిచి పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో తాను జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా లేనంటూ ప్రీతి జింటా ఇటీవల పేర్కొన్నారు. ఇక పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదన్న విషయం తెలిసిందే. కాగా టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ గతంలో పంజాబ్ జట్టుకు ఆడాడు. అదే విధంగా.. శిఖర్ ధావన్ ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, గాయం కారణంగా అతడు మ్యాచ్‌లకు దూరం కాగా సామ్ కరన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. -
IPL 2024: నేను ఏమాత్రం సంతోషంగా లేను: ప్రీతి జింటా ట్వీట్ వైరల్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసులో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ ముందు వరుసలో ఉన్నాయి. కేకేఆర్ ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రాజస్తాన్ పదింట ఎనిమిది గెలిచి ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది.పాయింట్ల పరంగా సమంగా ఉన్నా నెట్ రన్‌రేటు విషయంలో కేకేఆర్(1.453) కంటే రన్‌రేటు పరంగా రాజస్తాన్(0.622) వెనుకబడి ఉన్నందు వల్లే స్థానాల్లో ఈ వ్యత్యాసం. ఇక ప్రస్తుతం మూడో స్థానంలో సీఎస్కే(12 పాయింట్లు), నాలుగో స్థానంలో సన్‌రైజర్స్(12 పాయింట్లు) కొనసాగుతున్నాయి.లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో కొనసాగుతున్నాయి.ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ సాధించని జట్లు అనగానే ముందుగా గుర్తొచ్చేవి ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్. లక్నో కూడా ఈ జాబితాలోనే ఉన్నా ఆ జట్టు ఎంట్రీ ఇచ్చింది 2022లో! ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరింది కూడా! కానీ మిగతా మూడు కనీసం ఒక్కసారి ఫైనల్ చేరినా ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డాయి.ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్ ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో పంజాబ్ ఖాతాలో ఏడో పరాజయం చేరింది.ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటాను ఉద్దేశించి ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ఆమె బదులిచ్చిన తీరు వైరల్‌గా మారింది. ‘మీ జట్టు ప్రదర్శన పట్ల మీ స్పందన ఏమిటి?’ అని ఓ యూజర్ ప్రీతి జింటాను ట్యాగ్ చేశారు.ఇందుకు బదులిస్తూ.. ‘‘నేను ఏమాత్రం సంతోషంగా లేను. నాలుగు మ్యాచ్‌లలో మేమే ఆఖరి బంతికి ఓడిపోయాం. మా కెప్టెన్ గాయం బారినపడ్డాడు.కొన్ని మ్యాచ్‌లు మాత్రం అత్యద్భుతంగా సాగాయి. కానీ మేము అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయాం. తదుపరి సొంత మైదానంలో నాలుగు మ్యాచ్‌లు గెలిస్తేనే ముందుకు వెళ్లగలం. ఏదేమైనా ఎల్లవేళలా మాకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు ధన్యవాదాలు’’ అని ప్రీతి జింటా పేర్కొంది. Thank you all for a wonderful #pzchat . It was very nice talking to you all after so long. Kids have woken up from their nap so I have to run. Till then take care, be happy & loads of love always ❤️❤️— Preity G Zinta (@realpreityzinta) May 6, 2024 -
ఆమె అసలు ఓనర్లా ఉండదు.. ఓడినా కూడా..
‘‘ఆమె ఒక అద్భుతమైన మహిళ. జట్టుతో మమేకమై పోతుంది. టీమ్ ఓడిపోయినపుడు నిరాశకు గురైనా.. తన భావోద్వేగాలను నియంత్రించుకోగల శక్తి ఆమెకు ఉంది. ఆమె గొప్ప నటి. ఎంతో అనుభవం ఉన్న, విజయవంతమైన ఆర్టిస్ట్.ప్రతి సినిమా హిట్ కాదనే విషయం ఆమెకు తెలుసు. అలాగే.. ప్రతి మ్యాచ్‌లోనూ గెలవలేమనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. మ్యాచ్‌లో ఓటమిపాలైన తర్వాత మాతో మాట్లాడుతున్నపుడు చాలా వరకు ప్రశాంతంగానే ఉంటుంది. నేను ఆ జట్టుకు మూడేళ్ల పాటు ఆడాను. నలభై కంటే ఎక్కువ మ్యాచ్‌లలో భాగమయ్యాను.అయినా.. ఓడిన సందర్భాల్లో కేవలం రెండు- మూడుసార్లు మాత్రమే ఆమె మా మీద కోపం చూపించింది. మిగతా సందర్బాల్లో అసలు ఏమీ అనలేదు’’ అని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఇర్ఫాన్ పఠాన్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.పంజాబ్ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ అంటే ఆమెకు ఎంతో ఇష్టమని.. ఓటమిపాలైనప్పుడు కూడా జట్టుకు ఆమె మద్దతుగానే ఉంటుందని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.తన చేత్తో పరాఠాలు చేసి పెట్టిందిఅదే విధంగా కీలక మ్యాచ్‌లో గెలిస్తే గనుక ప్రీతి సంతోషానికి అవధులు ఉండవని.. అలాంటి సమయంలో తానే స్వయంగా వంట చేసి అందరికీ వడ్డిస్తుందని పేర్కొన్నాడు. సౌతాఫ్రికాలో తాము చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించినపుడు ప్రీతి జింటా స్వయంగా తన చేత్తో 40 పరాఠాలు చేసి తమకు అందించిందని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు.ఫ్రాంఛైజీ జట్ల యజమానుల్లో ప్రీతి జింటా వేరే లెవల్ అంటూ ప్రశంసించాడు. ఐపీఎల్-2024లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ విధించిన 261 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి చరిత్ర సృష్టించింది.దుమ్ములేపిన బెయిర్‌స్టో, శశాంక్జానీ బెయిర్‌స్టో విధ్వంసకర శతకానికి తోడు శశాంక్ సింగ్ కూడా దంచి కొట్టడంతో ఎనిమిది వికెట్ల తేడాతో కేకేఆర్‌ను చిత్తు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ శిబిరంలో ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా గురించి గుర్తు చేసుకుంటూ ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.🎥 Ruthless Hitting 💥Will #PBKS get this over the line? 🤔83 runs required from 42 deliveries‼️Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvPBKS pic.twitter.com/MvCvQQxmoe— IndianPremierLeague (@IPL) April 26, 2024చదవండి: రోహిత్, స్కై కాదు!.. వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టేది ఇతడే: యువీ -
'ఎగతాళి చేసినోళ్లే మెచ్చుకుంటున్నారు'
ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో గెలిచి సీజన్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. పెద్దగా అనుభవం లేకపోయినప్పటికి కెప్టెన్ రోహిత్ శర్మ ఆఖరి ఓవర్లో బంతిని అర్జున్ టెండూల్కర్ చేతికి ఇచ్చాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్జున్ ఒక వికెట్ తీసుకొని నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాదు భువనేశ్వర్‌ను ఔట్ చేసిన అర్జున్ తన ఖాతాలో తొలి వికెట్‌ను వేసుకున్నాడు. అర్జున్ ప్రదర్శనపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఒకప్పుడు క్రికెటర్‌గా పనికిరాడు అని ఎగతాళి చేసినవాళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. తాజాగా పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా అర్జున్ టెండూల్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ''చాలా మంది అర్జున్ను బంధుప్రీతి అంటూ ఎగతాళి చేశారు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో అద్బుతంగా బౌలింగ్ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. పెద్దగా అనుభవం లేనప్పటికి ఆఖరి ఓవర్లో సూపర్ బౌలింగ్ చేసి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. అర్జున్‌కు అభినందనలు. అర్జున్ ప్రదర్శన పట్ల సచిన్ కచ్చితంగా గర్వించాలి.'' అని పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 40 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 60 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ 17 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఇషాన్ కిషన్ 38 పరుగులు చేశాడు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది. మయాంక్ అగర్వాల్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్లాసెన్ 36, మార్క్రమ్ 22 పరుగులు చేసి ఔటయ్యారు. Many mocked him for nepotism but tonight he has shown his spot is well earned 👏 Congrats Arjun. @sachin_rt you must be so proud #Arjuntendulkar #SRHvsMI #TATAIPL2023 — Preity G Zinta (@realpreityzinta) April 18, 2023 చదవండి: పరుగెత్తడంలో అలసత్వం.. కర్మ ఫలితం అనుభవించాల్సిందే #Tilak Varma: ఉన్నది కాసేపే.. కానీ దడదడలాడించాడు -
గిల్ దెబ్బకు ప్రీతి జింటా షాకింగ్ రియాక్షన్
-
'ఆర్యన్.. మీ నాన్నను కొనుగోలు చేశాం'
చెన్నై వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ 2021 మినీ వేలంలో ఒక విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళనాడుకు చెందిన బ్యాట్స్‌మన్ షారుక్‌ఖాన్‌ను రూ. 5.25 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కేకేఆర్ సహా యజమాని షారుఖ్ ఖాన్ పేరు పెట్టుకున్న ఈ ఆటగాడి ప్రారంభ ధర రూ.20 లక్షలు కాగా పంజాబ్ కింగ్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ ఆటగాడి కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా పోటీపడటం విశేషం. అయితే క్రికెటర్ షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకోగానే ఆర్యన్ ఖాన్ వైపు తిరిగిన ప్రీతి జింటా.. మేము మీ నాన్నను సొంతం చేసుకున్నాం ఆర్యన్ అంటూ నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఈ వీడియోపై వినూత్న రీతిలో స్పందించారు. అయ్యో షారుక్‌ఖాన్ ఇప్పుడే పంజాబ్ కింగ్స్‌కు సొంతం అయ్యాడా.. షారుఖ్ ఖాన్ ఇప్పుడు పంజాబ్ కింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా వేలం మధ్యలో దొరికిన విరామంలో నటుడు షారుఖ్ ఖాన్‌తో ప్రీతి జింటా వీడియో కాల్లో మాట్లాడారు. ఈ ఫొటోను పంజాబ్ కింగ్స్ తన ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ ఫొటోలో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కూడా ఉన్నాడు. ఆర్యన్‌తో పాటు కేకేఆర్ సహా యజమాని జూహీచావ్లా కూతురు జాహ్నవి మెహతా కూడా వేలంలో అందరి దృష్టిని ఆకర్షించారు. చదవండి: 'ఇద్దరు ఐకాన్లతో ఆడేందుకు ఎదురుచూస్తున్నా' Preity zinta to Aryan khan : we got Shah Rukh 😂😂😂😂 #IPLAuction2021 pic.twitter.com/xdvCddxrz7 — 𝐒𝐡𝐫𝐮 ʘ‿ʘ (@lostshruu) February 18, 2021 -
సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే..
(వెబ్ స్పెషల్): ప్రతి ఒక్కరి జీవితంలో కేవలం తమకు మాత్రమే సొంతమైన, ప్రత్యేకమైన వ్యక్తి ఒకరు కచ్చితంగా ఉండే ఉంటారు. వాళ్లతో మాత్రమే తమ మనసులోని భావాలను నిర్భయంగా, నిక్కచ్చిగా.. ఎలాంటి దాపరికాలు లేకుండా వ్యక్తీకరించగలుగుతారు. బాధైనా, సంతోషమైనా ఏదైనా ముందుగా వాళ్లతో పంచుకోవడానికే ఇష్టపడతారు. కేవలం వాళ్ల మీద ఉన్న నమ్మకం కారణంగానే ఇవన్నీ చేస్తారు. ఇక ఇలా అన్ని విషయాలను అర్థం చేసుకున్న ఆ వ్యక్తే జీవిత భాగస్వామిగా లభిస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. మనసుకు నచ్చిన వాళ్లు ‘‘మనవాళ్లా’’లేదా ‘‘పరాయి వాళ్లా’’ అని అస్సలు ఆలోచించరు. ‘‘ప్రణయంలోనూ.. ప్రణయంతోనే.. పరిచయమడిగే.. మనసూ.. అది నువ్వనీ.. నీకే తెలుసూ..’’ అంటూ సప్త సముద్రాల ఆవల ఉన్నా వారిని చేరుకుంటారు. ప్రేమతో జీవితాంతం కట్టిపడేసేలా బంధం బలపరచుకుంటారు. సినీ ఇండస్ట్రీలోనూ ఇలాంటి వాళ్లు చాలామందే ఉన్నారు. వారిలో విదేశీయులను పెళ్లాడిన కొంత మంది నటీమణుల గురించి తెలుసుకుందాం.. ప్రీతి జింటా క్రిమినల్ సైకాలజీ చదివిన సొట్టల బుగ్గల సుందరి ప్రీతి జింటా(45)‘దిల్ సే’ సినిమాతో 1998లో తెరంగేట్రం చేసింది. చోరీ చోరీ చుప్కే చుప్కే, క్యా కహ్నా, దిల్ చాహ్తా హై, కల్ హో నహో వంటి సినిమాలతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసి.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. కేవలం నటనకే పరిమితం గాకుండా సోషల్ ఆక్టివిస్టుగా, టీవీ ప్రజెంటర్‌గా, కాలమిస్టుగా తనలోని భిన్న కోణాలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. అంతేగాక కొత్త నటులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ కూడా మొదలుపెట్టిందీ భామ. అదే విధంగా క్యాష్ రిచ్‌లీగ్ ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీకి సహ యజమానిగా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా సత్తా చాటుతోంది. ఇక కెరీర్ పరంగా ఎత్తుపల్లాలను చవిచూసిన ప్రీతి జింటా.. తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో మాత్రం ఆచితూచి అడుగులు వేసింది. నాలుగు పదుల వయస్సులో.. తన చిరకాల స్నేహితుడు, అమెరికాకు చెందిన జీన్ గుడ్ఎనఫ్ను ప్రేమించి, పెళ్లాడింది. లాస్ ఏంజెల్స్‌లో అత్యంత సన్నిహితుల మధ్య 2016లో ఫిబ్రవరి 29న వీరి వివాహం జరిగింది. భర్తతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎప్పటికప్పుడు కపుల్ గోల్స్ సెట్ చేస్తూ ఉంటుందీ షిమ్లా భామ. అన్నట్టు.. రాజకుమారుడు, ప్రేమంటే ఇదేరా సినిమాలతో ప్రీతి తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. (చదవండి:వయస్సులో చిన్నవాళ్లను పెళ్లాడిన సెలబ్రిటీలు) రాధికా ఆప్టే బోల్డ్ నటి రాధికా ఆప్టే(35) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. థియేటర్ ఆరిస్టుగా కెరీర్ మొదలు పెట్టి హిందీ, మరాఠి, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్ సినిమాల్లోనూ నటించింది. బద్లాపూర్, హంటర్, మాంఝీ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన రాధిక.. లెజెండ్, లయన్, రక్త చరిత్ర వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఓటీటీలోనూ అడుగుపెట్టిన ఈ హాట్‌భామ, లస్ట్‌స్టోరీస్, సాక్రెడ్ గేమ్స్ వంటి బోల్డ్ వెబ్‌సిరీస్‌లతో సంచలన నటిగా వార్తల్లోకెక్కింది. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే రాధిక.. కెరీర్ పీక్‌స్టేజ్‌లో ఉన్న సమయంలోనే బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్‌ను పెళ్లాడింది. 2012లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. భౌతికదూరంగా ఉన్నప్పటికీ తమ మనసులు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయని, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఒకరినొకరం కలిసే వీలుంటుందని చెప్పుకొచ్చింది.(చదవండి: రియల్‌గా వివాహం చేసుకున్న హీరో-హీరోయిన్లు ) శ్రియా సరన్ ‘ఇష్టం’ సినిమాతో వెండితెరపై అడుగపెట్టి నేటికీ తన అందచందాలు, నటనా కౌశలంతో అభిమానులను కట్టి పడేస్తోంది డెహ్రాడూన్ సుందరి శ్రియా సరన్(38). స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన ఆమె.. దక్షిణాదిన యువ హీరోలు మొదలు సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్‌తో పాటు ఒకటీ రెండూ ఇంగ్లిష్ సినిమాల్లోనూ తళుక్కుమన్న శ్రియ, రెండేళ్ల క్రితం రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడింది. ఆ తర్వాత కొన్నిరోజులకు ఈ జంట ఉదయ్‌పూర్‌లో ఇండస్ట్రీల ప్రముఖులకు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చి తమ పెళ్లి గురించి మీడియాకు వెల్లడించారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రియా.. లాక్డౌన్లో భర్తతో కలిసి అనేక వీడియోలు రూపొందించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా పలు చారిటీ షోలు కూడా చేసి కష్టాల్లో ఉన్న వారికి తన వంతు చేసి మంచి మనసు చాటుకుంది.(చదవండి: మంచి తరుణం మించిన దొరకదు ప్రియతమా!) ప్రియాంక చోప్రా 2018లో ఇండియాలో జరిగిన అత్యంత వైభవోపేతమైన పెళ్లిళ్లలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పరిణయం కూడా ఒకటి. అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమించిన పిగ్గీచాప్స్ ఇరు కుటుంబాలను ఒప్పించి హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో అతడిని పెళ్లాడారు. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట.. ఆ తర్వాత సన్నిహితుల కోసం పలు రిసెప్షన్ పార్టీలు చేసింది. కేవలం నటిగానే గాకుండా సామాజిక కార్యకర్తగా, మాజీ ప్రపంచ సుందరిగా గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైనా, తనను బాగా అర్థం చేసుకోగలడనే నమ్మకంతోనే నిక్‌ను జీవిత భాగస్వామిగా ఎంచుకున్నట్లు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చింది. సెలీనా జైట్లీ ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన షిమ్లా భామ సెలీనా జైట్లీ(38) 2001లో మిస్ ఇండియాగా అందాల రాణి కిరీటం దక్కించుకుంది. అంతేకాదు మిస్ యూనివర్స్ పోటీల్లోనూ నాలుగో రన్నరప్‌గా నిలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ క్వీన్. మోడల్‌గా రాణిస్తున్న తరుణంలోనే 2003లో జనాషీన్ అనే థ్రిల్లర్(హిందీ)మూవీతో సిల్వర్ స్ర్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించి 2011లో పీటర్ హాగ్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఈ జంటకు 2017లో కవలలు జన్మించారు. అయితే వారిలో ఒకరు గుండెలోపంతో మృతి చెందారు. ప్రస్తుతం వీరికి మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు. అన్నట్లు సెలీనా తల్లిదండ్రులది కూడా ప్రేమ వివాహమే. ఆమె తండ్రిది ఇండియా కాగా, తల్లి ఆఫ్గానిస్తాన్‌కు చెందినవారు. సుచిత్రా పిళ్లై దిల్ చాహ్తా హై గర్ల్‌గా సినీ అభిమానులకు సుపరిచితమైన సుచిత్ర(50).. ‘బేతాళ్’అనే వెబ్‌సిరీస్‌తో ఇటీవలే ఓటీటీ ప్లాట్‌ఫాంలో అడుగుపెట్టింది. కెరీర్లో ఎత్తుపల్లాలు చవిచూసిన సుచిత్ర.. వ్యక్తిగత జీవితంలోనూ ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. మొదటి భర్తతో విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్న ఆమె.. 2005లో లార్స్ జేల్డ్సేన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ముద్దులొలికే ఓ కూతురు ఉంది. శ్వేతా కేశ్వాని డాన్సర్‌గా, మోడల్‌గా రాణించిన శ్వేతా కేశ్వాని(40) హిందీ సీరియళ్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆమె బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2012లో, న్యూయార్క్‌కు చెందిన కెన్ ఆండినోను పెళ్లాడింది. ఈ జంటకు ఓ కూతురు ఉంది. కాగా శ్వేతాకిది రెండో వివాహం. ఇక వీళ్లతో పాటు కల్కి కొచ్లిన్, తాప్సీ వంటి నటీమణులు విదేశీయులతో ప్రేమలో ఉండగా, ఇలియానా, శృతి హాసన్ ప్రేమలో విఫలమై ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి సారించారు. -
ఒత్తిడికి గురైనా.. ముఖంపై చిరునవ్వు: ప్రీతి జింటా
లాస్ ఎంజిల్స్: లాక్డౌన్ వేళ సినీ సెలబ్రిటీలు హోం కార్వంటైన్‌కు పరిమితమైన విషయం తెలిసిందే. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తమ వ్యక్తిగత, వృత్తిగత విషయాలు పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. తరచు సోషల్ మీడియా వేదికగా పలు విషయాలను పంచుకునే బాలీవుడ్ నటి ప్రీతి జింటా తాజాగా ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘హోం కార్వంటైన్ వల్ల కలిగే దుష్ప్రభావాలు చెప్పాలి. లాక్డౌన్ అంతా ముగిసిపోవాలని ఆశిస్తున్నాను. మీరు ఇంట్లో ఉంటూ ఒత్తిడికి గురై ఆందోళన చెందతున్న సమయంలో ఈ వీడియో మీ ముఖంపై చిరు నవ్వు కలిగిస్తుందని ఆశిస్తున్నాను’ అని ప్రీతి జింటా కామెంట్ చేశారు. (నటుడిని రైల్వే స్టేషన్లోకి వెళ్లనివ్వని పోలీసులు) View this post on Instagram Side effects of home quarantine 😂 Need I say more 🤩 Hope when it’s all over we are still Sane 🙈 and I hope this brings a SMILE to your face if you are stressed and worried at home 😘 #Day82 #Patiparmeshwar #Bruno #homeentertainment #ting A post shared by Preity G Zinta (@realpz) on Jun 8, 2020 at 10:48pm PDT ఈ వీడియోలో ఆమె భర్త జెనె గుడ్ ఎనెఫ్.. ఇంట్లో కూర్చోని పెంపుడు కుక్కతో సరదా ఆడుకుంటున్నారు. ఆ కుక్క తన తలను ఎలా తిప్పుతే అలానే జెనె గుడ్ ఎనెఫ్ తిప్పుతారు. ప్రస్తుతం ప్రీతి జింటా అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో తన భర్తతో ఇంటికే పరిమితమయ్యారు. గత నెలలో తన తల్లి, భర్త జెనె గుడ్ ఎనెఫ్ ముఖానికి మాస్క్‌లు ధరించిన ఫొటోను ప్రీతి జింటా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ‘కరోనా కాలంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ముఖానికి మాస్క్ పెట్టుకోవాలి’ అని కామెంట్ కూడా చేశారు. ప్రీతి జింటా చివరగా 2018లో తెరకెక్కిన ‘బయ్యాజీ సూపర్ హిట్’ అనే మూవీలో కనిపించిన విషయం తెలిసిందే. (షూటింగ్‌లకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్: చిరు) View this post on Instagram Life Aaj Kal 👀 Hope everyone is wearing masks ? It’s the only way we can fight this virus and lockdown together and make a difference 🙏 #patiparmeshwar #Beresponsible #Ma #Ting A post shared by Preity G Zinta (@realpz) on May 17, 2020 at 12:51am PDT -
‘భారత్‌కు వస్తున్నా.. పంజాబీ స్టైల్లో అలరిస్తా’
-
'స్పాట్ ఫిక్సింగ్ తో మాకు సంబంధం లేదు'
న్యూఢిల్లీ : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో హస్తం ఉందని తనపై వచ్చిన ఆరోపణలను కింగ్స్ ఎలెవన్ జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఖండించారు. ఐపీఎల్ గ్రూప్ మీటింగ్ తర్వాత ఆగస్టు 8న బీసీసీఐ అధికారులకు కొన్ని విషయాలను వెల్లడించినట్లు కథనాలు వచ్చాయి. కింగ్స్ ఎలెవన్ జట్టు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ చేశారని బీసీసీఐ సమావేశంలో ప్రీతి అనుమానాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలపై ఆమె మండిపడింది. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, కోశాధికారి అనిరుద్ చౌదరి, భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ సభ్యులు ఉన్న వర్కింగ్ గ్రూపు సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇదిలాఉండగా, తాను బీసీసీఐ అధికారులకు చెప్పిన విషయాలను మీడియా వక్రీకరించిందని, వీటిపై మండిపడుతూ సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అవసరమైతే మా జట్టు ఆటగాళ్లను లై డిటెక్టర్ తో పరీక్షించండి. నేనైతే ఎవరూ ఫిక్సింగ్ చేశారని భావించడం లేదంటూ జట్టు ఆటగాళ్లపై తన నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఆ కథనాలు పూర్తిగా బాధ్యతా రాహిత్యమైనవని, తప్పుడు వార్తలని ఆమె ట్వీట్ చేశారు. Dear All, This piece of article is completely false, libel per say, inaccurate and an irresponsible piece of... http://t.co/x0pURYfKVw — Preity zinta (@realpreityzinta) August 19, 2015 I suggested RANDOM POLYGRAPH ( LIE DETECTOR) Tests to Bcci for players so no can even think about match fixing. The theory was that ... 1/1 — Preity zinta (@realpreityzinta) August 19, 2015 -
ప్రీతి జింటా, వాడియా.. మధ్యలో మాఫియా
ముంబై: మాజీ ప్రేమికులు, కింగ్స్ లెవెన్ పంజాబ్ సహ భాగస్వాములు ప్రీతి జింటా, నెస్ వాడియాల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. నెస్ వాడియా తనను దుర్భాషలాడి, చేయి చేసుకున్నాడని బాలీవుడ్ భామ ప్రీతి చేసిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరుపుతుండగా.. తాజాగా నెస్ వాడియా కుటుంబం తమకు మాఫియా నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెస్ వాడియా తనను లైంగికంగా వేధించాడని ప్రీతి ఫిర్యాదు చేసినట్టు తొలుత వార్తలు రాగా, ఆ తర్వాత ఆమె వీటిని ఖండించారు. వీరిద్దరూ గొడవపడిన సమయంలో ఓ క్రికెటర్ కొడుకు ఉన్నాడని, ఈ కేసులో అతడిని సాక్షిగా చేర్చే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసు విచారణ సాగుతుండగానే.. నెస్ వాడియా కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. -
ప్రీతి జింతా లవ్ స్టోరీ.. హేట్ స్టోరీగా మారింది
ముంబై: బాలీవుడ్ సుందరి ప్రీతి జింతా, వ్యాపార వేత్త నెస్ వాడియాల ప్రేమ బంధం ముగియడం దురదృష్టకరమని దర్శకుడు మహేష్ భట్ అన్నారు. ప్రీతి, నెస్ వాడియాల లవ్ స్టోరీ.. హేట్ స్టోరీగా మారిందని ట్వీట్ చేశారు. ప్రీతి జింతా తన మాజీ ప్రియుడు నెస్ వాడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మే 30న వాంఖేడ్ స్టేడియంలో పంజాబ్-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తనపై చేయి చేసుకున్నాడని ప్రీతి జింతా ఆరోపించింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రీతి సహ భాగస్వామి. నెస్ వాడియా, ప్రీతి జింతాల మధ్య గతంలో నాలుగేళ్ల పాటు ప్రేమ వ్యవహారం నడిచింది. 2009లో వీరిద్దరూ విడిపోయారు. నెస్ వాడియా కూడా ఐపీఎల్ పంజాబ్ టీంకు భాగస్వామిగా వ్యవహరించారు.