ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసులో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ ముందు వరుసలో ఉన్నాయి. కేకేఆర్ ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రాజస్తాన్ పదింట ఎనిమిది గెలిచి ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది.
పాయింట్ల పరంగా సమంగా ఉన్నా నెట్ రన్‌రేటు విషయంలో కేకేఆర్(1.453) కంటే రన్‌రేటు పరంగా రాజస్తాన్(0.622) వెనుకబడి ఉన్నందు వల్లే స్థానాల్లో ఈ వ్యత్యాసం. ఇక ప్రస్తుతం మూడో స్థానంలో సీఎస్‌కే(12 పాయింట్లు), నాలుగో స్థానంలో సన్‌రైజర్స్(12 పాయింట్లు) కొనసాగుతున్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ సాధించని జట్లు అనగానే ముందుగా గుర్తొచ్చేవి ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్. లక్నో కూడా ఈ జాబితాలోనే ఉన్నా ఆ జట్టు ఎంట్రీ ఇచ్చింది 2022లో! ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరింది కూడా! కానీ మిగతా మూడు కనీసం ఒక్కసారి ఫైనల్ చేరినా ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డాయి.
ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్ ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో పంజాబ్ ఖాతాలో ఏడో పరాజయం చేరింది.
ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటాను ఉద్దేశించి ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ఆమె బదులిచ్చిన తీరు వైరల్‌గా మారింది. ‘మీ జట్టు ప్రదర్శన పట్ల మీ స్పందన ఏమిటి?’ అని ఓ యూజర్ ప్రీతి జింటాను ట్యాగ్ చేశారు.
ఇందుకు బదులిస్తూ.. ‘‘నేను ఏమాత్రం సంతోషంగా లేను. నాలుగు మ్యాచ్‌లలో మేమే ఆఖరి బంతికి ఓడిపోయాం. మా కెప్టెన్ గాయం బారినపడ్డాడు.
కొన్ని మ్యాచ్‌లు మాత్రం అత్యద్భుతంగా సాగాయి. కానీ మేము అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయాం. తదుపరి సొంత మైదానంలో నాలుగు మ్యాచ్‌లు గెలిస్తేనే ముందుకు వెళ్లగలం. ఏదేమైనా ఎల్లవేళలా మాకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు ధన్యవాదాలు’’ అని ప్రీతి జింటా పేర్కొంది.
Thank you all for a wonderful #pzchat . It was very nice talking to you all after so long. Kids have woken up from their nap so I have to run. Till then take care, be happy & loads of love always ❤️❤️
— Preity G Zinta (@realpreityzinta) May 6, 2024
Comments
Please login to add a commentAdd a comment