ఒత్తిడికి గురైనా.. ముఖంపై చిరునవ్వు: ప్రీతి జింటా | Preity Zinta Says Side Effects Of Home Quarantine | Sakshi
Sakshi News home page

ఒత్తిడికి గురైనా.. ముఖంపై చిరునవ్వు: ప్రీతి జింటా

Published Tue, Jun 9 2020 6:37 PM | Last Updated on Tue, Jun 9 2020 6:50 PM

Preity Zinta Says Side Effects Of Home Quarantine - Sakshi

లాస్‌ ఎంజిల్స్: లాక్‌డౌన్‌ వేళ సినీ సెలబ్రిటీలు హోం కార్వంటైన్‌కు పరిమితమైన విషయం తెలిసిందే. అయినప్పటికీ సోషల్‌ మీడియా ద్వారా తమ వ్యక్తిగత, వృత్తిగత విషయాలు పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. తరచు సోషల్‌ మీడియా వేదికగా పలు విషయాలను పంచుకునే బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా తాజాగా ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘హోం కార్వంటైన్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలు చెప్పాలి. లాక్‌డౌన్‌ అంతా ముగిసిపోవాలని ఆశిస్తున్నాను. మీరు ఇంట్లో ఉంటూ ఒత్తిడికి గురై ఆందోళన చెందతున్న సమయంలో ఈ వీడియో మీ ముఖంపై చిరు నవ్వు కలిగిస్తుందని ఆశిస్తున్నాను’ అని ప్రీతి జింటా కామెంట్‌ చేశారు. (న‌టుడిని రైల్వే స్టేష‌న్‌లోకి వెళ్ల‌నివ్వ‌ని పోలీసులు)

ఈ వీడియోలో ఆమె భర్త జెనె గుడ్ ఎనెఫ్‌.. ఇంట్లో కూర్చోని పెంపుడు కుక్కతో సరదా ఆడుకుంటున్నారు. ఆ కుక్క తన తలను ఎలా తిప్పుతే అలానే జెనె గుడ్‌ ఎనెఫ్‌ తిప్పుతారు. ప్రస్తుతం ప్రీతి జింటా అమెరికాలోని లాస్‌ ఎంజిల్స్‌లో తన భర్తతో ఇంటికే పరిమితమయ్యారు. గత నెలలో తన తల్లి, భర్త జెనె గుడ్ ఎనెఫ్‌ ముఖానికి మాస్క్‌లు ధరించిన ఫొటోను ప్రీతి జింటా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ‘కరోనా కాలంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ముఖానికి మాస్క్‌ పెట్టుకోవాలి’ అని కామెంట్‌ కూడా  చేశారు. ప్రీతి జింటా చివరగా 2018లో తెరకెక్కిన ‘బయ్యాజీ సూపర్ హిట్’ అనే మూవీలో కనిపించిన విషయం తెలిసిందే. (షూటింగ్‌లకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌: చిరు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement