
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరే క్రమంలో టీమిండియా మరో ముందడుగు వేసింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో శుభారంభం చేసింది. తొలి టెస్టులో గెలుపొంది.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. చెన్నైలోని చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 280 పరుగులతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
పునరాగమనంలో పంత్ అదుర్స్.. కానీ రాహుల్ మాత్రం
అయితే, బంగ్లాదేశ్ కూడా అంత తేలికగా రోహిత్ సేన ముందు తలొగ్గలేదు. ఆరంభంలో గట్టిపోటీనిచ్చింది. తమ స్థాయికి మించిన ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే, టీమిండియా సమిష్ఠిగా రాణించడంతో భారీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌తో చెపాక్ మ్యాచ్ ద్వారా ద్వారా టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, సీనియర్ కేఎల్ రాహుల్ టెస్టుల్లో పునరాగమనం చేశారు.
పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులకే పరిమితమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సెంచరీ(109)తో దుమ్ములేపాడు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం తనను తాను నిరూపించుకోవడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగులే చేసిన ఈ మిడిలార్డర్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులతో ఆడుతున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఫలితంగా రాహుల్ మైదానాన్ని వీడకతప్పలేదు.
రోహిత్‌పై విమర్శలు
అయితే, రాహుల్‌కు మరికొంత సేపు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాల్సిందని.. అలా అయితే, అతడు ఫామ్‌లోకి వచ్చేవాడంటూ అభిమానులు రోహిత్ శర్మ నిర్ణయాన్ని విమర్శించారు. ఈ విషయంపై రిషభ్ పంత్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు. ‘‘మేము భోజన విరామానికి వెళ్లినపుడే ఇన్నింగ్స్ డిక్లరేషన్ గురించి చర్చ జరిగింది.
ఎవరు ఎన్ని పరుగులు చేస్తారో చేయండి
అప్పుడు రోహిత్ భాయ్.. ‘ఇంకో గంటసేపు మనం బ్యాటింగ్ చేస్తాం. ఈలోపు ఎవరు ఎన్ని పరుగులు చేస్తారో చేయండి’ అని చెప్పాడు. దీంతో.. తిరిగి బ్యాటింగ్‌కు వెళ్లగానే వీలైనన్ని రన్స్ చేయాలని నిర్ణయించుకున్నా. ఏమో నేను ఇంకాసేపు క్రీజులో ఉంటే 150 పరుగులు కూడా చేసేవాడిని’’ అని పంత్ చెప్పుకొచ్చాడు. తద్వారా రాహుల్ విషయంలో రోహిత్‌ను విమర్శిస్తున్న వాళ్ల నోళ్లకు తాళం వేశాడు.
కాగా ఈ మ్యాచ్‌లో పంత్‌తో పాటు శుబ్‌మన్ గిల్ శతకంతో అలరించాడు. అయితే, గిల్ 119, కేఎల్ రాహుల్ 22 కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. అప్పటికి టీమిండియా 514 పరుగుల భారీ ఆధిక్యంలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్‌కు 515 పరుగుల రూపంలో ముందుంచాడు. అయితే, భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 234 పరుగులకే ఆలౌట్ కావడంతో భారీ తేడాతో విజయం టీమిండియా సొంతమైంది.
చదవండి: రోహిత్, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమే: బంగ్లాదేశ్ క్రికెటర్
Rishabh pant bodied all haters who trolled Rohit sharma for not giving enough time to kl Rahul at the crease
pic.twitter.com/MVPiWkhr4w— Gillfied⁷⁷ (@Gill_era7) September 22, 2024