
PC: BCCI/IPL.com
రాజస్తాన్ రాయల్స్ స్టార్ పేసర్ సందీప్ శర్మ (Sandeep Sharma) అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఆఖరి ఓవర్‌లో అత్యధిక బంతులు విసిరిన బౌలర్‌గా సందీప్ నిలిచాడు. ఐపీఎల్-2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శర్మ ఈ చెత్త రికార్డును నెలకొల్పాడు.
ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన సందీప్ ఏకంగా 11 బంతులు విసిరాడు. ఆ ఓవర్‌లో సందీప్ నాలుగు వైడ్లు, ఓ నోబాల్ వేయడం గమనార్హం. ఆఖరి ఓవర్‌లో శర్మ మొత్తంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. ఓవరాల్‌గా ఈ చెత్త రికార్డు సాధించిన నాలుగో బౌలర్‌గా సందీప్ నిలిచాడు.
సందీప్ కంటే ముందు మహ్మద్ సిరాజ్, తుషార్ దేశ్ పాండే, శార్ధూల్ ఠాకూర్ 11 బంతలు ఒకే ఓవర్‌లో వేశారు. అయితే ఈ ముగ్గురు ఆఖరి ఓవర్ కాకుండా వేర్వేరు ఓవర్లల్లో 11 బంతులు విసిరారు.
ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు విసిరిన బౌలర్లు..
👉11 బంతులు మొహమ్మద్ సిరాజ్ vs ముంబై ఇండియన్స్ 2023 (ఓవర్ 19)
👉11 బంతులు తుషార్ దేశ్‌పాండే vs లక్నో సూపర్ జెయింట్స్ 2023 (ఓవర్ 4)
👉11 బంతులు శార్దూల్ ఠాకూర్ vs కేకేఆర్ 2025 (ఓవర్ 13)
👉11 బంతులు సందీప్ శర్మ vs ఢిల్లీ క్యాపిటల్స్ 2025 (ఓవర్ 20)
కాగా చివర వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్‌లో తేలింది. సూపర్ ఓవర్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. అయితే సూపర్ ఓవర్‌లో కూడా సందీప్ శర్మనే బౌలింగ్ చేయడం గమనార్హం. 12 పరుగుల టార్గెట్‌ను సందీప్ డిఫెండ్ చేసుకోలేకపోయాడు.
చదవండి: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది'