
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి లండన్ వీధుల్లో ప్రత్యక్షమయ్యాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ అనంతరం కోహ్లి తన భార్య పిల్లలను కలిసేందుకు లండన్‌కు పయనమయ్యాడు. ఈ క్రమంలో లండన్ వీధుల్లో కోహ్లి తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.
బ్లాక్ డ్రెస్ వేసుకున్న కోహ్లి రోడ్డును దాటుతున్నట్లు ఈ వీడియోలో కన్పించింది. కాగా గత కొంత కాలంగా విరాట్ భార్య అనుష్క శర్మ.. పిల్లలు వామిక, అకాయ్‌తో లండన్‌లో ఉంటుంది. కోహ్లి కూడా ఎక్కువగా ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉంటున్నాడు.
కేవలం మ్యాచ్‌లు ఉన్నప్పుడు మాత్రమే జట్టుతో కింగ్ కోహ్లి కలుస్తున్నాడు. మ్యాచ్‌లు మగిసిన వెంటనే మళ్లీ లండన్‌కు పయనవుతున్నాడు. గతకొన్నళ్లగా ఇదే జరుగుతుంది. అయితే రిటైర్మెంట్ తర్వాత విరాట్-అనుష్క లండన్‌లో స్థిరపడాలని భావిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అనుష్కతో పాటు వామిక, అకాయ్‌లు ఇంగ్లండ్ పౌరసత్వం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక లండన్‌లోనే పుట్టిన ఆకాయ్‌ను ఇప్పటివరకు కోహ్లి భారత్‌కు తీసుకురాలేదు. విరుష్క జంట లండన్‌లో ఓ లిస్టెడ్ కంపెనీ కలిగి ఉంది. మ్యాజిక్ ల్యాంప్ డైరెక్టర్లుగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు ఉన్నారు.
ఈ క్రమంలోనే విరాట్-అనుష్క లండన్‌లో స్ధిరనివాసం ఏర్పరుచుకోనున్నారని ప్రచారం జరగుతోంది. ఇక శ్రీలంతో వన్డే సిరీస్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లి.. బంగ్లాతో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి రానున్నాడు.
Virat Kohli on the London streets. 🐐pic.twitter.com/0WvBi9byXZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2024