
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకూ ఆడతానని సంకేతాలు ఇచ్చాడు. ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతనిథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా తన భవిష్యత్తు ప్రణాళికలకపై కోహ్లి క్లారిటీ ఇచ్చాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత మీ ముందు ఉన్న అతి పెద్ద లక్ష్యమేంటి అన్న ప్రశ్న కోహ్లికి ఎదురైంది. అందుకు కోహ్లి బదులిస్తూ.. "నా నెక్స్ట్ బిగ్ స్టెప్ ఏంటో నాకు తెలియదు. తర్వాతి వరల్డ్ కప్ గెలిచేందుకు ప్రయత్నిస్తా" అని సమాధానం ఇచ్చాడు. దీంతో 2027 వన్డే ప్రపంచకప్‌లో వరకూ ఆడతాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ టీ20లకు కోహ్లి వీడ్కోలు పలికాడు. అదేవిధంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజయం తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి.
కానీ కోహ్లి మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కోహ్లి వ్యాఖ్యలను బట్టి అతడు మరో మూడేళ్ల పాటు భారత జట్టు తరపున ఆడే అవకాశముంది. కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను భారత్ సొంతం చేసుకోవడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడి 54.50 సగటుతో 218 పరుగులు చేశాడు.
చదవండి: PAK vs NZ: పాక్‌తో రెండో వన్డే.. కివీస్‌కు భారీ షాక్! ఆరేళ్ల తర్వాత స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
Question: Seeing In The Present, Any Hints About The Next Big Step?
Virat Kohli Said: The Next Big Step? I Don't Know. Maybe Try To Win The Next World Cup 2027.🏆🤞 pic.twitter.com/aq6V9Xb7uU— virat_kohli_18_club (@KohliSensation) April 1, 2025