
కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఆదివారం(ఫిబ్రవరి 9) మధ్యహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే కటక్‌కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో నిలబడాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
జగన్నాథుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు..
ఈ క్రమంలో భారత క్రికెటర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ పూరి జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. పోలీసులు భారీ భద్రత మధ్య భారత క్రికెటర్లను ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన వీరికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
రోహిత్ ఫామ్‌ను అందుకుంటాడా?
ఇక ఇది ఇలా ఉండగా.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబరిచిన రోహిత్.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కూడా అదే తీరును కనబరిచాడు.
నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో హిట్‌మ్యాన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకప్పుడు షార్ట్ పిచ్ బంతులను అలోవకగా సిక్సర్లగా మలిచిన రోహిత్.. ఇప్పుడు అదే బంతులకు తన వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. కనీసం రెండో వన్డేతోనైనా రోహిత్ తన ఫామ్‌లను అందుకోవాలని భావిస్తున్నారు.
విరాట్ కోహ్లి ఇన్..!
ఇక తొలి వన్డేకు గాయం కారంణంగా దూరమైన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తిరిగి తన ఫిట్‌నెస్‌ను సాధించాడు. దీంతో అతడు రెండో వన్డేలో జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నాడు. కింగ్ కోహ్లి జట్టులోకి వస్తే.. ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌పై వేటు పడే అవకాశముంది.
నాగ్‌పూర్ వన్డేతో అరంగేట్రం చేసిన జైశ్వాల్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండో వన్డేలో భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ డౌన్‌లో కోహ్లి బ్యాటింగ్‌కు రానున్నాడు.
చదవండి: నాయకుడే ఇలా ఉంటే ఎలా?: రోహిత్‌పై కపిల్ దేవ్ వ్యాఖ్యలు
Odisha: Indian cricket team players visited the Jagannath Temple in Puri to seek blessings pic.twitter.com/fXtNjbJSuP
— IANS (@ians_india) February 8, 2025