
Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విఫలమైన ప్రిన్స్ యాదవ్.. రెండో మ్యాచ్‌లో మాత్రం ప్రత్యర్ధి ముప్పు తిప్పలు పెట్టాడు. ఎస్ఆర్‌హెచ్‌ను భారీ స్కోర్ సాధించకుండా ఆపడంలో ప్రిన్స్‌ది కీలక పాత్ర. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.
ఎస్ఆర్‌హెచ్ విధ్వసంకర ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను ఈ యువ పేసరే ఔట్ చేశాడు. ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన బంతితో హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. యాదవ్ వేసిన బంతికి హెడ్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అతడి వేసిన డెలివరికి హెడ్ బిత్తర పోయాడు. హెడ్ వికెటే కాకుండా హెన్రిచ్ క్లాసెన్ రనౌట్ కావడంలో కూడా ప్రిన్స్‌దే కీకల పాత్ర. ఈ క్రమంలో ఎవరీ ప్రిన్స్‌యాదవ్ అని నెటిజన్లు తెగవేతికేస్తున్నారు.
ఎవరీ ప్రిన్స్ యాదవ్?
23 ఏళ్ల ప్రిన్స్ యాదవ్.. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరపున ఆడుతున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో పురానీ ఢిల్లీ తరపున ఆడిన ప్రిన్స్.. 10 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఢిల్లీ వైట్ బాల్ జట్టులో ప్రిన్స్ చోటు దక్కించుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో కూడా ఈ యువ బౌలర్ సత్తాచాటాడు.
ఈ టోర్నీలో ప్రిన్స్ 11 వికెట్లు పడగొట్టి.. ఢిల్లీ సెమీస్‌కు చేరడంలో ప్రధాన పాత్ర పోషించాడు. విజయ్ హజారే ట్రోఫీలో ప్రిన్స్ 11 వికెట్లు సాధించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్కౌట్స్ దృష్టిలో ఈ ప్రిన్స్ యాదవ్ పడ్డాడు. గత డిసెంబర్‌లో జరిగిన మెగా వేలంలో రూ. 30 లక్షల కనీస ధరకు అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
అతడికి అద్భుతమైన వైడ్ యార్కర్ డెలివరీలు బౌలింగ్ చేసే సత్తా ఉంది. అంతేకాకుండా గుడ్ లైన్ అండ్ లెంగ్స్‌తో కూడా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ యువ పేసర్ కచ్చితంగా ఫ్యూచర్ స్టార్‌గా మారుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై 44 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది.
చదవండి: అది ప్రపంచంలోనే బెస్ట్ వికెట్.. వాళ్లు అద్భుతంగా ఆడారు: కమిన్స్