
పొలం గొంతులో గరళం
● రాగోలు పరిసర ప్రాంతాల్లో
ఆందోళనకర పరిస్థితి
● పట్టించుకోని అధికారులు
శ్రీకాకుళం రూరల్:
జిల్లా కేంద్రానికి సమీపంలోని రాగోలు ప్రధాన ఆస్పత్రి నుంచి సమీప పంట పొలాలకు మెడికల్ వ్యర్థాలతో కూడిన కలుషిత నీరు వెళ్తోంది. ఇది రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఆస్పత్రి చుట్టూ ఉన్న పంట పొలాల్లోకి ఈ నీరు చిన్నచిన్న పైపుల ద్వారా చేరుకుంటోంది. అక్కడి నుంచి ప్రధాన కాలువలో కలిసి స్థానికంగా ఉన్న కొర్లగండం చెరువులోకి చేరుకుంటోంది. ఈ చెరువు నీటిని పశువులు తాగడానికి, వాటికి స్నానాలు చేయించడానికి రైతులు వినియోగిస్తున్నారు. దీంతో పశువులకు అనేక రకాలైన వ్యాధులకు గురవుతున్నట్లు రాగోలు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
యాజమాన్యానికి చెప్పాం..
కలుషిత నీరు విషయంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదే విషయాన్ని పలు మార్లు ఆస్పత్రి యాజమాన్యానికి వివరించాం. వారి నుంచి స్పందన లేదు.
– తిరుమలదేవి, పంచాయతీ సెక్రటరీ
రీసైకిల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలి
రాగోలు జెమ్స్ నుంచి బయటకు వస్తున్న కలుషితమైన మురికినీరు బయ టకు పంపకుండా ఆస్పత్రి ఆవరణంలోనే రీసైక్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి. దీంతో రీసైక్లింగ్ అయిన నీరు అక్కడే గల మొక్కలకు ఉపయోగించుకోవచ్చు. – గేదెల శంగల్వరావు, రాగోలు సర్పంచ్

పొలం గొంతులో గరళం

పొలం గొంతులో గరళం