
మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. హెచ్‌సీయూలో ఆందోళనపై సీఎం చర్చించారు. ఈ భేటీకి భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క హాజరయ్యారు.
సాక్షి, హైదరాబాద్: మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. హెచ్‌సీయూలో ఆందోళనపై సీఎం చర్చించారు. ఈ భేటీకి భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క హాజరయ్యారు. హెచ్‌సీయూతో పాటు కీలక అంశాలపై మంత్రుల బృందం చర్చించినట్లు సమాచారం. కాగా, హెచ్‌సీయూలో ఉద్రికత్త నెలకొంది. యూనివర్సిటీ ముట్టడికి సీపీఎం, బీజేవైఎం నేతలు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములకు సంబంధించి మొదలైన వివాదం క్రమంగా ముదురుతోంది. భూములు తమవంటే తమవేనంటూ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) వేర్వేరు వాదనలు వినిపిస్తూ ‘ప్రకటనల యుద్ధానికి’ తెరలేపాయి. మరోవైపు వర్సిటీ భూములు కాపాడుకుంటామంటూ విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విపక్షాలు వారి పోరాటానికి మద్దతు పలకడమే కాకుండా, ప్రభుత్వ వైఖరిపై విరుచుకు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం కంచె గచ్చిబౌలి భూముల వివాదమే హాట్ టాపిక్‌గా మారింది.
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని 2004 లో చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ అకాడమీకి అ ప్పగించింది. అయితే ఆ కంపెనీకి సామర్థ్యం లేద ని, కంపెనీ బోగస్ అని ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఆ కేటాయింపుల్ని రద్దు చేసింది. ఈ రద్దుపై ఐఎంజీ కోర్టును ఆశ్రయించింది. 21 ఏళ్ల పాటు జరిగిన న్యాయపోరాటం త ర్వాత ఆ భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ భూములను ప్రభుత్వం టీజీఐఐసీకు కేటాయించింది. ఆ భూ ములను అభివృద్ధి చేసి పరిశ్రమలకు విక్రయించాల ని టీజీఐఐసీ నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆ భూములు హెచ్‌సీయూవి అంటూ విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో వివాదం మొదలైంది.
