
సాక్షి, హైదరాబాద్: కేంద్రం చేనేత వస్త్రాలపై వేసిన 12 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. చేనేత రంగంపై ఆధారపడినవారిలో ఎక్కువ శాతం నిరుపేదలే ఉన్నారన్నారు. జీఎస్టీ వల్ల చేనేత వస్త్రాలు అందుబాటుధరల్లో లేకపోవడంతో చేనేత వస్త్రాలకు డిమాండ్ పడిపోతుందని అన్నారు.