
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 23వ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఎన్నిక షెడ్యూల్ ఇదే..
మార్చి 28న నోటిఫికేషన్
ఏప్రిల్ 4న నామినేషన్లకు చివరి తేది.
ఏప్రిల్ 23న పోలింగ్
ఏప్రిల్ 25న ఫలితాలు.
