నాకెలాంటి ఈడీ నోటీసులు రాలేదు: మల్లారెడ్డి | ED issues notice to Malla Reddy in Telangana PG medical seat blocking scam | Sakshi
Sakshi News home page

నాకెలాంటి ఈడీ నోటీసులు రాలేదు: మాజీ మంత్రి మల్లారెడ్డి

Published Thu, Nov 7 2024 1:44 PM | Last Updated on Thu, Nov 7 2024 3:11 PM

ED issues notice to Malla Reddy in Telangana PG medical seat blocking scam

సాక్షి,హైదరాబాద్‌ : మెడికల్‌ కళాశాల పీజీ సీట్ల కుంభకోణంలో  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) నోటీసులు అందాయంటూ వస్తున్న మీడియా కథనాలపై మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే సీహెచ్‌ మల్లారెడ్డి స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టత ఇచ్చారాయన

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు. నోటీసులు నా కొడుక్కి ఇచ్చారు. గతంలో ఈడీ రైడ్స్‌ జరిగాయి. విచారణకు రమ్మంటారు.. అది రెగ్యులర్‌ ప్రాసెస్‌ అని అన్నారాయన. 

కాగా, మెడికల్‌ పీజీ సీట్ల స్కాం కేసులో.. ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే.. మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డికి ఈడీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఇక నోటీసుల్లో.. అక్రమంగా సీట్లను బ్లాక్ చేశారన్న అభియోగంపై వివరణ కోరినట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో కిందటి ఏడాది మల్లారెడ్డి కాలేజీల్లో ఈడీ సోదాలు జరిపింది. అంతేకాదు మెడికల్ కళాశాలల అడ్మినిస్ట్రేషన్ అధికారి సురేందర్‌రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు కూడా. 



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement