
సాక్షి, హైదరాబాద్: మహేశ్వరం నాగారంలో భుదాన్ భూములు అమ్మకాలు జరిగాయని.. నిన్న ఐదు చోట్ల సోదాలు చేపట్టామని ఈడీ ప్రకటించింది. మునావర్ ఖాన్ ఫామ్ హౌస్‌లో పార్కు చేసిన 25 కార్లు సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మునావర్ ఖాన్, లతీఫ్, అక్తర్ సుకుర్ ఇళ్లలో జరిపిన సోదాల్లో 45 వింటేజ్ కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది. విదేశీ కరెన్సీతో పాటు 23 లక్షల నగదు సీజ్ చేశాం’’ అని అధికారులు తెలిపారు
కుదురున్నీసా, మునావర్‌ఖాన్ ఇళ్లలో సోదాలు చేశాం. మునావర్‌ఖాన్ ఫామ్ హౌస్‌లోని పత్రాలను సీజ్ చేశాం. ప్రభుత్వ స్థలాలకు తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మకాలు సాగించారు. తమ వారసత్వ ఆస్తిగా పేర్కొంటూ అమ్మకాలు జరిపారు. ప్రముఖులు, రియల్టర్లు భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించాం. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి విక్రయాలు జరిపారు’’అని ఈడీ అధికారులు వెల్లడించారు.